ఓ కృషీవలుఁడు తన భార్య 'సీత ' ముచ్చటగా వాహనమును కొనమని కోరగా బేరమాడి ' మారుతి ' కారుని కొని యిచ్చాడు. ఆమె కొత్త కారుని వెనువెంటనే కన్నవారికి చూపించడానికి తీసుకుపోయింది !
రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ, నటులు విషయంగా మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** అశ్వత్థ నారాయణ మూర్తి గారూ, చక్కని విరుపులతో మారుతి శబ్దాన్ని సంబోధనగా మార్చి చెప్పిన మీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు. ***** ‘మారుతి’ కారుతో సహా మాయమైన సీత పూరణ బాగున్నది. అభినందనలు.
లంకా గిరిధర్ గారూ, వివిధ్యమైన విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** బొడ్డు శంకరయ్య గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** నాగరాజు రవీందర్ గారూ, విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** అశ్వత్థ నారాయణ మూర్తి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘మా యంబ+అయ్యెన్’ అన్నప్పుడు సంధి లేదు, యడాగమం వస్తుంది. మొదటి పాదంలో గణదోషం. ‘వారాశిని లీల నెగసి’ అందామా?
శ్రీ శంకరయ్య గురుదేవులకు వినమ్రవందనములతో..... అందరికీ అభివందనములు ...గురువు గారి మరియు పెద్దల పూరణలు అలరించుచున్నవి... సమస్యల వల్ల మనసు ఏమియు బాగా లేదు, కానీ బ్లాగునకు దూరంగా ఉండ లేక సరదా గా పూరించు చున్నాను. తప్పులున్న యడల మన్నించ ప్రార్థన.. పెళ్ళి చూపుల సందర్భము.. ===============*================== ఆరు పదులు దాటిన యా మారుతి యేతెంచె,సీత మాయం బయ్యెన్ కోరిన రాముని తోడను కారణము దెలుపక తెల్ల కాగితము పయిన్!
పోచిరాజు సుబ్బారావు గారూ, రామాయణంలో మీరు చెప్పిన ఘట్టం లేకున్నా, పూరణ బాగున్నది. అభినందనలు. ‘మారుతి గాడని యనుకొని’ అనండి. ***** కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. చివరి వాక్యంలో క్రియాపదం లోపించింది. ‘ప్రీతిగఁ బంపెన్’ అనండి. ****** కందుల వరప్రసాద్ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ సమస్యలు తొందరగా పరిష్కారమై మీకు మనశ్శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. (బెంగుళూరులో ఉన్నప్పుడే బాగున్నట్టున్నారు).
కవిశ్రీ సత్తిబాబు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘వెదుకన్+ఆ’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘వెదుక| న్నారావణ...’ అనండి. ఈ సంప్రదాయం పోతనపద్యాల్లో ఎక్కువగా కనిపిస్తుంది.
ఓరిమి నికడలి దాటిన
రిప్లయితొలగించండిమారుతి యేతెంచె , సీత మాయం బయ్యె
న్నారావణు బారిన బడి
యారాణి తనువు విడచె నౌరా యనుచున్
మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు నమోవాకములతో...
రిప్లయితొలగించండి(జనాపవాద భీతిచే శ్రీరాముఁడు సీత నరణ్యమునకుఁ బంపఁగా నచటఁ బ్రాణత్యాగ మొనర్పఁబోవు సీతను వాల్మీకి తన యాశ్రమమునకుం గొంపోయిన సందర్భము)
చేరంబిల్చియు, దుఃఖవి
దూరుఁడు వాల్మీకిముని బ్రతుకు నిడ, నచటన్
ధీరు లొదవి, యశ్వముఁ గొన,
మారుతి యేతెంచె! సీత మాయం బయ్యెన్!!
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండివిరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కాని చివరి పాదం అన్వయం/అర్థం?
*****
గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మారుతి,సీతా పాత్రల
రిప్లయితొలగించండిధారణ చేయుచును నొకడు తన్మయ పరుపన్
వేరొక రంగము నందున
మారుతి యేతెంచె,సీత మాయంబయ్యెన్
రావణ వధానంతరము సీతాదర్శన మైనపుడు
రిప్లయితొలగించండిరాముడు మారుతితో
ధీరుడ, సఖుడా గనుమా
మారుతి, యేతెంచె సీత, మాయంబయ్యెన్
దారుణ విరహోత్కంఠత,
నీరజ ముఖినిగని మనము నిమ్మళ మయ్యెన్
ఓ కృషీవలుఁడు తన భార్య 'సీత ' ముచ్చటగా వాహనమును కొనమని కోరగా బేరమాడి ' మారుతి ' కారుని కొని యిచ్చాడు. ఆమె కొత్త కారుని వెనువెంటనే కన్నవారికి చూపించడానికి తీసుకుపోయింది !
రిప్లయితొలగించండికారును కోరగ సీతయు,
సీరముతో సిరిని గనిన సీతాపతికిన్
బేరము పడె ! సంభ్రమమున
మారుతి యేతెంచె - సీత మాయంబయ్యెన్ !
రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
రిప్లయితొలగించండినటులు విషయంగా మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
చక్కని విరుపులతో మారుతి శబ్దాన్ని సంబోధనగా మార్చి చెప్పిన మీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు.
*****
‘మారుతి’ కారుతో సహా మాయమైన సీత పూరణ బాగున్నది. అభినందనలు.
గురువు గారూ
తొలగించండిమీ మెచ్చుగోలుకు బహుధా కృతజ్ఞుణ్ణి
సీత మాయమ్మయ్యెన్ అని మీరు అడిగి ఉంటే మరిన్ని విరుపులు సాధ్యమయ్యేవి.
రిప్లయితొలగించండినా పూరణ ఇదిగోనండీ
కం. ధారుణి కూతును తమ లం
కా రాణిగ జూచెదమను కలలను గను నా
పౌరుల దహించి వైచుచు
మారుతియే తెంచె సీత మాయం బయ్యెన్
ప్రేమికురాలు సీత తన ప్రియుడు మారుతిని తన కుటుంబమునకు పరిచయము చేయుదునని పిలిచి మాయమైన సందర్భములో....
రిప్లయితొలగించండికోరియు సీతయె తన పరి
వారమునకు పరిచయంబు పఱపుట కొరకై
బీరముతో రమ్మనగా
మారుతి యేతెంచె, సీత మాయంబయ్యెన్!
వారాశి నవలీల నెగసి
రిప్లయితొలగించండిమారుతి యేతెంచె, సీత, మా యంబ(+అ)య్యెన్
దారుణ విశీర్ణ పూర్ణగ
నీరీతి యనుచు దలంచి నేగెన్ త్వరన్
లంకా గిరిధర్ గారూ,
రిప్లయితొలగించండివివిధ్యమైన విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
బొడ్డు శంకరయ్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
నాగరాజు రవీందర్ గారూ,
విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘మా యంబ+అయ్యెన్’ అన్నప్పుడు సంధి లేదు, యడాగమం వస్తుంది.
మొదటి పాదంలో గణదోషం. ‘వారాశిని లీల నెగసి’ అందామా?
గురువుగారు
తొలగించండివారాశి నవలీల కన్నా
వారాశిని లీల గణ పరంగానే కాక భావన పరంగానూ
చాలా బాగుంది, కృతజ్ఞతలు గురువుగారు.
ఆ రామా మణి గాంచను
రిప్లయితొలగించండిమారుతి యే తెంచె,సీత మాయం బయ్యెన్
మారుతి గాడని ననుకొని
ఆ రావణు మాయ దలచి నార్తిని దోడన్
వీరులు జడ దారుల గని
రిప్లయితొలగించండిమారుతి యేతెంచె,సీత మాయం బయ్యెన్
ఆరసి రమ్మని జాడను
శ్రి రాముదు ముద్రిక నిడి ప్రీతిగ హనుమన్
ఇది తిమ్మాజిరావు గారి పూరణ
శ్రీ శంకరయ్య గురుదేవులకు వినమ్రవందనములతో.....
రిప్లయితొలగించండిఅందరికీ అభివందనములు ...గురువు గారి మరియు పెద్దల పూరణలు అలరించుచున్నవి...
సమస్యల వల్ల మనసు ఏమియు బాగా లేదు, కానీ బ్లాగునకు దూరంగా ఉండ లేక సరదా గా పూరించు చున్నాను. తప్పులున్న యడల మన్నించ ప్రార్థన..
పెళ్ళి చూపుల సందర్భము..
===============*==================
ఆరు పదులు దాటిన యా
మారుతి యేతెంచె,సీత మాయం బయ్యెన్
కోరిన రాముని తోడను
కారణము దెలుపక తెల్ల కాగితము పయిన్!
పోచిరాజు సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిరామాయణంలో మీరు చెప్పిన ఘట్టం లేకున్నా, పూరణ బాగున్నది. అభినందనలు.
‘మారుతి గాడని యనుకొని’ అనండి.
*****
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
చివరి వాక్యంలో క్రియాపదం లోపించింది. ‘ప్రీతిగఁ బంపెన్’ అనండి.
******
కందుల వరప్రసాద్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మీ సమస్యలు తొందరగా పరిష్కారమై మీకు మనశ్శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. (బెంగుళూరులో ఉన్నప్పుడే బాగున్నట్టున్నారు).
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికవిశ్రీ సత్తిబాబు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘వెదుకన్+ఆ’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘వెదుక| న్నారావణ...’ అనండి. ఈ సంప్రదాయం పోతనపద్యాల్లో ఎక్కువగా కనిపిస్తుంది.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపోర లవునితో రాముడు
రిప్లయితొలగించండిమారుతి యేతెంచె. సీత మాయంబయ్యెన్
చేరగ ధారుణి.ముగిసెను
శ్రీరాముని గాధ నిలిచె చెన్నుగ వసుధన్
ఇది తిమ్మాజిరావు గారి పూరణ
ఓరిమిని కడలి దాటిన
రిప్లయితొలగించండిమారుతి యేతెంచె , సీత మాయం బయ్యె
న్నారావణు బారిన బడి
యారాముని తలచి దివికి నౌరా యనగా
----------------------------------------
మారుతి కొంటిని క్రొత్తది
సారధి నేనంటి నీకు సరసపు మగడౌ
మారని ద్రైవరు పాతనె
మారుతి యేతెంచె సీత మాయం బయ్యెన్
తేరున బొమ్మల యాటట
రిప్లయితొలగించండిజోరుగ రఘురామ,సీత చోద్యము వెడలన్
"ఆడుచు నందరు జూడగ?
మారుతి యేతెంచె,సీత మాయంబాయెన్|
పారావారము దాటిన
రిప్లయితొలగించండిమారుతి లంకను కనుగొని మాతను వెదుక !
న్నారావణ మాయ వలన
మారుతి యేతెంచె, సీత మాయంబయ్యెన్!!
ధన్యవాదములు
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపారావరము నా వ్యథ
రిప్లయితొలగించండితీరనిదీ శోకమంచు తెగ కృంగితినే
వారాశి దాటి నినుగని
మారుతి యేతెంచె సీత! మాయం బయ్యెన్.
కడుపునొప్పి కారణంగా సాయంత్రం తరువాత వచ్చిన పూరణలు, పద్యాలను సమీక్షించలేకపోతున్నాను. మన్నించండి.
రిప్లయితొలగించండిలక్ష్మణ స్వామి రామాజ్ఞతో సీతామాతను అడవిలో విడచి వెళ్లిన కాసేపటికి
రిప్లయితొలగించండిచేరగ వచ్చెడిదది మృగ
మా? రుతి యేతెంచె? సీత మాయంబయ్యెన్
తారాడుచు రాముఁ దలచి
యారాటము తోడ మరది నగుపడఁ జూచెన్!
బారుల కోతులయోధ్యకు
రిప్లయితొలగించండిచేరుటకై గంతులిడగ చెన్నుగ నాథున్
కోరిన పుష్పకము బదులు
మారుతి యేతెంచె! సీత మాయం బయ్యెన్