27, మే 2015, బుధవారం

సమస్యా పూరణము - 1685 (పామర కవిత్వమును మెచ్చెఁ బండితుండు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
పామర కవిత్వమును మెచ్చెఁ బండితుండు.

34 కామెంట్‌లు:

 1. "ముఖ్య యతిథిగ వచ్చితి బుద్ధిలేక
  భాషయందుననింతైన పట్టులేని
  కవుల పొగడవలసి వచ్చె కర్మ!" యనుచు
  పామర కవిత్వమును మెచ్చెఁ బండితుండు

  రిప్లయితొలగించండి
 2. పల్లె లందము గాంచగ పరవ శించి
  మధుర భావము లందున పొదిగి యున్న
  ఛంద మేలేని పాటల చక్క దనము
  పామర కవిత్వమును మెచ్చెఁ బండి తుండు

  రిప్లయితొలగించండి
 3. పండితుడొకండు తనదైన పక్వ ఫలము
  నెల్ల విదళించి తరలించి నింట జేర్చు
  సమయమున, కర్షకుల్ పాడు జాన పదపు
  పామర కవిత్వమును మెచ్చెఁ బండితుండు

  రిప్లయితొలగించండి
 4. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  రెండవపాదంలో ద-ధ ప్రాసయతి వేశారు.
  *****
  అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘జానపదఁపు’ అనే ఉండాలి. కాని ఈకాలంలో ఎవ్వరూ అరసున్నాలను వాడడం లేదు కదా!

  రిప్లయితొలగించండి
 5. భోజు దరిజేరి యనెనొక రోజు నొకడు
  రాభణుండని దానినే యా " భ " కార
  కవిత జెప్పుచు మెప్పించె కాళిదాసు
  పామర కవిత్వమును మెచ్చెఁ బండితుండు.

  రిప్లయితొలగించండి
 6. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 7. కమ్రతరమయి యజ్ఞాత కర్తృకమయి
  'చంద్రశేఖర శతకమ్ము' సాంద్ర కీర్తిఁ
  గనియెఁ గద - జానపద భాష నొనరు నట్టి
  పామర కవిత్వమును మెచ్చెఁ బండితుండు !

  (చంద్రశేఖర శతకము దొరకడం ప్రస్తుతం దుర్లభం కానీ దొరికితే తప్పక చదువదగినది . పొగబండి గురించి వర్ణిస్తూ : 'గుడగుడ నీళ్ళు తాగుతది , గుప్పున ఊత్తది దాని పొట్టలో
  మడుసులు గూకుతారు బహు మందది బేగి లగెత్తుతాది ... ' అంటూ సాగే ఈ శతకం పంతొమ్మిదవ శతాబ్దం చివరి నాళ్లలో అజ్ఞాత కవి కర్తృకమని ఒక ఊహ ! )

  రిప్లయితొలగించండి
 8. (ఒక పండితుఁడు బ్రహ్మదేవునిం గోరిన సందర్భము)


  "హే విధీ! నా నుదుట కీళు లెన్నియేని
  వ్రాసినను నోర్తు నో యయ్య! వలచి వలచి
  పామర కవిత్వమును మెచ్చెఁ బండితుఁ’డను
  వ్రాఁత మాత్రము వద్దయ్య బ్రహ్మదేవ!!"

  రిప్లయితొలగించండి
 9. అరసికేషు కవిత్వ నివేదనమ్ శిరసి మా లిఖ మా లిఖ మా లిఖ ను కాస్త అటుయిటు చేసి వ్రాసిన శ్రీ గుండు మధుసూదన్ గారి పూరణ బాగుంది . వారికి అభినందనలు .

  రిప్లయితొలగించండి
 10. చిన్న వాడను కీర్తించు చేవ లేదు
  వర్ణ మాలతోఁ గూర్చు నే పద సమూహ
  మాదరించెదవో గొను పరమాత్మ! యనెడు
  పామర కవిత్వమును మెచ్చెఁ బండితుండు!

  రిప్లయితొలగించండి

 11. దుర్గమ ప్రాస యతులతో దురవగాహ
  మైన సంస్కృతభాషాసమాసములకు
  యర్థ మెరుగుట దుష్కర మనుచు,సుగమ
  పామర కవిత్వము మెచ్చె పండితుండు

  రిప్లయితొలగించండి
 12. పరి హసిం చ కూడదు మఱి పామరుణ్ణి
  పామర కవిత్వమును ,మెచ్చె బండి తుండు
  పామర కవిత్వ మైనను భావ మరసి
  శిష్ట పదములు జోడించి పుష్టి జేసి

  రిప్లయితొలగించండి
 13. ఆట పాటల తోడుత ననవరతము
  ప్రజలనాల్కలపైనను పలుకునట్టి
  పామర కవిత్వమును మెచ్చెఁబండితుండు
  ప్రజలు మెచ్చని కవితతో ఫలము సున్న.

  రిప్లయితొలగించండి
 14. ధన్యవాదములు డా.విష్ణు నందన్‍గారూ! నీ నీశ్లోకమునే మనస్సునందిడుకొని పూరణము చేసితిని. నే నీ పూరణముచే మీ మెప్పును పొందినందులకు ధన్యుఁడను. కృతజ్ఞతలతో....భవదీయుఁడు...గుండు మధుసూదన్

  రిప్లయితొలగించండి
 15. హరి హరుల మహిమల నత్యద్భుతముగ
  వ్రాసి ప్రవచించి ప్రజలలో భక్తి పెంచ
  దలచు కవివరేన్యుల కృషి, దైవ సత్క్రు
  పామర కవిత్వమును మెచ్చెఁ బండితుండు.

  రిప్లయితొలగించండి
 16. డా. విష్ణునందన్ గారూ,
  నాకు తెలియని చంద్రశేఖర శతకాన్ని పరిచయం చేశారు. ధన్యవాదాలు. దాని ప్రస్తావనతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  గుండు మధుసూదన్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  మీ పూరణ చదవగానే ఏదో ప్రఖ్యాతశ్లోకం ఉండాలి అనుకున్నాను. జ్ఞాపకం రాలేదు. శంకరాభరణం సినిమాలో అల్లు రామలింగయ్య సోమయాజులుతో అన్న మాటలు మాత్రం గుర్తుకు వచ్చాయి. డా. విష్ణునందన్ గారు ఆ శ్లోకాన్ని గుర్తుకు తెచ్చారు.
  *****
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ******
  అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  రెండవపాదంలో గణదోషం. ‘గురువరుండు’ అనండి.
  *****
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘పామరుణ్ణి’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. ‘పామరులను’ అనండి.
  *****
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  గండూరి లక్ష్మినారాయణ గారూ,
  వైవిధ్యమైన మీ పూరణ బాగుంది. అభినందనలు.
  మొదటిపాదంలో గణదోషం. ‘హరిహరాదుల మహిమల నద్భుతముగ’ అనండి.
  *****
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 17. కృష్ణ రాయల నాటకం కృషియులేక
  ఆడబూనగ?నపశబ్ద జాడలున్న
  అల్లసానియు పద్యముల్ వల్లెవేయ?
  పామర కవిత్వమును మెచ్చె బండి తుండు|
  2.తెలిసి,తెలియని తెలివున్న విలువలున్న
  పలుకు పలుకున నపశబ్ద పలుకులున్న
  పామర కవిత్వమును మెచ్చె పండితుండు
  సభకుగౌరవమెంచియు సాత్వికాన

  రిప్లయితొలగించండి
 18. నాదు పద్య రచన నాణ్యతన్ దెలిసియు
  కంది గురు వృషభులు కమ్మ గున్న
  దనుట గాంచి మదిని యనియెద నెప్పుడు
  పామర కవిత్వమును మెచ్చెఁ బండితుండు

  గురువరుండు, ఏకవచన మైనందున వృషభులు అన్నాను.
  అన్యధా భవించవలదని మనవి

  రిప్లయితొలగించండి
 19. పంటపొలములో శ్రమకోర్చి పనుల జేయు
  పల్లె వారల గొంతులో పల్లవించి
  పాట రూపము నెత్తిన పదములఁ విని
  పామర కవిత్వమును మెచ్చెఁ బండితుండు!

  రిప్లయితొలగించండి
 20. పల్లె లందము గాంచగ పరవ శించి
  మధుర భావము లెన్నెన్నొ పొదిగి యున్న
  ఛంద మేలేని పాటల చక్క దనము
  పామర కవిత్వమును మెచ్చెఁ పండి తుండు
  ----------------------------
  ఇప్పుడు సరిపోతుందేమో అని
  గురువులకు ధన్య వాదములు

  రిప్లయితొలగించండి
 21. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పద్యం :
  చిన్న వాడను కీర్తించు చేవ లేదు
  వర్ణ మాలతోఁ గూర్చు నే పద సమూహ
  మాదరింతువో గొను పరమాత్మ! యనెడు
  పామర కవిత్వమును మెచ్చెఁ బండితుండు!

  రిప్లయితొలగించండి
 22. కవిత యన్నది మొదటగా కదనుతొక్కె
  జనపదంబుల పాటల,సరగు నదియె
  పండితాళిని జేరెను,బహుళ గతిని,
  పామర కవిత్వమును మెచ్చె పండితుండు

  పండితుల మాట,పామరు పలుకులవియె
  పదము లౌచును రాజిల్లె,పద్య,గీత
  ఛందమందున ఘనమౌట చక్కగాను
  పామర కవిత్వమును మెచ్చె పండితుండు

  వేమనయ్యయు వ్రాసెను పెద్ద శతులు
  తెలుగు నాటవెలదులనె తేట పరచె
  నీతులెన్నియొ వానిని నెమ్మిజూచి
  పామర కవిత్వమును మెచ్చె పండితుండు

  జనపదంబుల చిందులె ఛందమయ్యె
  వరుస నవియయ్యె గీతాలు పాడుకొనగ
  గీతపద్యాలు వెలుగొంది కీర్తినంద
  పామరకవిత్వమును మెచ్చె పండితుండు

  రిప్లయితొలగించండి
 23. నా నిన్నటి కోటా ...

  కమ్మని వీణా నాదము
  అమ్మహదేవుని కీర్తన లాహా మధురం
  బిమ్ముగ సంగీతమున స్వ
  రమ్ము జనాళికిఁ గడు మధురమ్మగును గదా!

  రిప్లయితొలగించండి
 24. అక్షరంబైన రానట్టి యజ్ఞుడొకడు
  నలతి పదముల నల్లుచు నద్భుతముగ
  జానపదములు పాడంగ సంతసించి
  పామరకవిత్వమును మెచ్చె పండితుండు!!!

  రిప్లయితొలగించండి
 25. మొన్నటి కోటా...


  కుంతి శ్రీ కృష్ణునితో....

  కార ముఖ్యులు నా సుతుల్, కనగ వీడి
  పోరు రేపులు మాపులు పుణ్య చరిత
  నమ్మితీ పుడమి నిగాచు నాథుడేడి
  ఆదుకొనవయ్య వారినే చేదుకొనుము

  రిప్లయితొలగించండి
 26. రీ కంది శంకరయ్య గురువరులకు నమస్కారములు
  గణదోషము దోష సవరణ తెలిపిన మీకు ధన్యవాదములు

  రిప్లయితొలగించండి
 27. కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
  ‘నాటకం’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు.
  *****
  అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
  మీ సవరణ బాగుంది. సంతోషం.
  *****
  బొడ్డు శంకరయ్య గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ పూరణలన్నీ బాగున్నవి. అభినందనలు.
  *****
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  నిన్నటి, మొన్నటి పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *****
  శైలజ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 28. మొదటి పూరణలో ముఖ్య యతిథి అన్న చోట సవర్ణదీర్ఘం విధి

  రిప్లయితొలగించండి
 29. రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారూ,
  నిజమే... నేను గమనించలేదు. ధన్యవాదాలు.
  *****
  చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పూరణ మొదటి పాదాన్ని ‘పూని యతిథిగ వచ్చితి...’ అనండి.

  రిప్లయితొలగించండి
 30. ఒకడు వ్రాయంగ కావ్యమ్ము నొకటి పూని
  చాల దూషించుచు కుకవి జాలరచిత
  పామరకవిత్వమును - మెచ్చె పండితుండు
  పోలె రచనల జేసిన పుణ్య తతిని

  రిప్లయితొలగించండి
 31. ‘అష్టావధాని’ రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి