చంద్రమౌళి గారు సముద్రం నుంచి వచ్చిన లక్ష్మీ దేవిని హరించి తీసుకుపోయారు శ్రీమహావిష్ణు,పోనీ అమెదగ్గరనుండి కొంత డబ్బు మనకేమైనా ఇస్తాడా అంటే మనం హుండిలో వేసినవి కుడా తీసుకొని కుబేరునికి కలియుగాంతం వరకు ఇస్తారట.ఇంకా మనకి ఎలా వస్తాయి చెప్పండి.
కవిమిత్రులకు నమస్కృతులు. ఈరోజు విశ్రాంత ఉపాధ్యాయులైన మా తమ్ముని మామగారు మరణించడంతో అటువెళ్ళి రావడం వల్ల మీ పూరణలపై వెంటవెంట స్పందించలేకపోయాను. మన్నించండి. ***** చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** పిరాట్ల వెంకట శివరామకృష్ణ ప్రసాద్ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. శ్రీహరి సిరిని హరించినవాడు కాదు, సిరిని వరించినవాడు. మొక్కులను తీర్చుకున్న భక్తులకు ఆయన నేరుగా ఇచ్చే సిరులు లేవు కాని భక్తులకు శ్రీమంతులయ్యే తెరువు చూపించే ఆపదమొక్కులవాడు. ***** వసంత కిశోర్ గారూ, మీ బాగ్దాద్ గజదొంగ పూరణ బాగున్నది. అభినందనలు. ***** రాజేశ్వరి అక్కయ్యా, దొంగలోను సర్వాంతర్యామిని చూపిన మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** అశ్వత్థ నారాయణ మూర్తి గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. ***** శైలజ గారూ, కృష్ణుని పర్యాయపదాలను ఒకచో చేర్చిన మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** గన్నవరపు నరసింహ మూర్తి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** పోచిరాజు సుబ్బారావు గారూ, విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** నాగరాజు రవీందర్ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** డా. ఆచార్య ఫణీంద్ర గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** డా. బల్లూరి ఉమాదేవి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘విష్ణుమూర్తిని’ అనండి. ***** కె. యస్. గురుమూర్తి ఆచారి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** గుండు మధుసూదన్ గారూ, మీ అచ్చతెనుగు పూరణతో పాటు ‘దొర’ను ప్రస్తావించిన రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. ***** కె. ఈశ్వరప్ప గారూ, మీ మొదటి పూరణలో భావం అవగతం కాలేదు. రెండవ పూరణ బాగున్నది. అభినందనలు. ***** కందుల వరప్రసాద్ గారూ, మీ పూరణ వైవిధ్యంగా ఉంది. బాగుంది. అభినందనలు.
ద్వాపరమునందవతరించె వాసుదేవు
రిప్లయితొలగించండిడిలను ధర్మమ్ము గాచెడి తలపుతోడ
సిరికి పతిదేవుడైనట్టి హరికి, వెన్న
దొంగకు నమస్కరించిన దొరకు సిరులు
తే.గీ.శ్రీహరియనసిరిహరించు, చిన్ని వెన్న
రిప్లయితొలగించండిదొంగకు నమస్కరించిన దొరకు సిరులు
లదియెటులనొప్పునుకుబేరుడప్పుదీర్ప
రాదుసిరియేదిపైనుండి రాదురాదు
చంద్రమౌళి గారు సముద్రం నుంచి వచ్చిన లక్ష్మీ దేవిని హరించి తీసుకుపోయారు శ్రీమహావిష్ణు,పోనీ అమెదగ్గరనుండి కొంత డబ్బు మనకేమైనా ఇస్తాడా అంటే మనం హుండిలో వేసినవి కుడా తీసుకొని కుబేరునికి కలియుగాంతం వరకు ఇస్తారట.ఇంకా మనకి ఎలా వస్తాయి చెప్పండి.
రిప్లయితొలగించండిఅందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
బాగ్దాదు గజదొంగ సినిమాలో బాగ్దాదు గజదొంగ :
01)
_______________________________
పేదవారిని పీడించి - విత్తమంత
దోచుకొనినట్టి దుర్మార్గ - దొరల దోచి
ప్రజకు పంచెడు బాగ్దాదు - వాసి యైన
దొంగకు నమస్కరించిన - దొరకు సిరులు !
_______________________________
చోరు నెదనైన దొరలోన శూలి యుండు
రిప్లయితొలగించండిసాటి మనిషిని ప్రేమించ మేటి యనగ
మంచి తనమును కీర్తించ మించు నేది
దొంగకు నమస్క రించిన దొరకు సిరులు
జేబు లందున మిగిలిన చిల్లరంత
రిప్లయితొలగించండిప్రతి దినమ్మును సతి తీసి భద్ర పరచె
అది యెరిగిన పతి తలచె నంత జేబు
దొంగకు నమస్కరించిన దొరకు సిరులు
కృష్ణ! మల్లారి! యవనారి !వృష్ణి !సూరి
రిప్లయితొలగించండినల్లదేవర! శకటారి! నగధరుండు
పీత వాసుడు! కంసారి!నేత! వెన్న
దొంగకు నమస్కరించిన దొరకు సిరులు!!!
జేబుదొంగలఁ దగవులఁ జిల్లిగవ్వ
రిప్లయితొలగించండిదక్కియుండమి వారికి దక్కు శిక్ష !
దొంగ దొఱయైన మేలంచు చొంగ లొలికి
దొంగకు నమస్కరించిన , దొఱకు సిరులు !
దయతలచి విడుచున ప్రీతి తాళములిడి
రిప్లయితొలగించండిదొంగకు నమస్కరించిన, దొరకు సిరులు
రక్షకభటుల కెప్పుడు రయముగాను(తక్షణమ్ము)
కోరి దొంగల కేసులఁ గొట్టివేయ
తగిన శిక్షను వేయంగ దగును సుమ్ము
రిప్లయితొలగించండిదొంగకు, నమస్కరించిన దొరకు సిరులు
సకల శుభములు గలిగించు శంక రునిల
నిజము నామాట నమ్ముడు నెలతు లార !
ఆమె ఇంట 'శమంతక ' మందజేయు
రిప్లయితొలగించండికోరినపుడు బంగారమ్ము కోరినంత !
వేచి, ఆ భామ హృదయమ్ము దోచినట్టి
దొంగకు నమస్కరించిన దొరకు సిరులు !!
రణముఁ జేయగ లేవను గుణముఁ జూప
రిప్లయితొలగించండిపార్థుఁ గర్తవ్య పాలనా పరుని జేసి
గీతఁ జెప్పుచు నజ్ఞాన భీతి దోచు
దొంగకు నమస్కరించ దొరకు సిరులు!
తే.గీ:రవికులతిలకు శ్రీరాము రమ్య రూపు
రిప్లయితొలగించండివిష్ణుమూరుతి నగధరు వేదసారు
పార్థసారథి గోపాలుఁ పాలు వెన్న
దొంగకు నమస్కరించిన దొరకు సిరులు.
కె.యస్.గురుమూర్తి ఆచారి గారి పూరణ
రిప్లయితొలగించండిక్షీరసాగరసుతను లక్ష్మిని వరించి
వక్షమున చక్కగ పదిలపరచుకొన్న
దొంగకునమస్కరించిన దొరకు సిరులు
సర్వ శుభములు భాగ్యముల్ సౌఖ్యమగును
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినందునింటను గోకుల మందు పెరిగి
రిప్లయితొలగించండిగొల్లెతల మానధనమును గొనిన వాడు
వారి యింటను దోచిన పాలు వెన్న
దొంగకు నమస్కరించిన దొరకు సిరులు
మ్రొక్కు దొరకు నొకవిధము మ్రుచ్చిలించు
రిప్లయితొలగించండివాని కొకరీతి జోస్యుడు పల్కు గాని
తమతమ నొసటి వ్రాత విధముగ యబ్బు
దొంగకు, నమస్కరించిన దొరకు, సిరులు
మొదటి పాదంలో టైపాటు సవరణతో :
రిప్లయితొలగించండిరణముఁ జేయగ లేనను గుణముఁ జూప
పార్థుఁ గర్తవ్య పాలనా పరుని జేసి
గీతఁ జెప్పుచు నజ్ఞాన భీతి దోచు
దొంగకు నమస్కరించ దొరకు సిరులు!
మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు నమస్సులతో...
రిప్లయితొలగించండిఆలకాపరి, నల్లనయ్య, మరునయ్య,
గట్టుతాలుపు, వెన్నుండు, గవుడిరవుతు,
కఱ్ఱినెచ్చెలి, తామరకంటి, వెన్న
దొంగకు నమస్కరించిన దొఱకు సిరులు!!
(సమస్య పాదమును "దొంగకును దండమిడినచో దొరకు సిరులు!" అనినచో నంతయు నచ్చతెనుఁగున నిటుల నుండఁ గలదు)
ఆలకాపరి, నల్లనయ్య, మరునయ్య,
గట్టుతాలుపు, వెన్నుండు, గవుడిరవుతు,
కఱ్ఱినెచ్చెలి, తామరకంటి, వెన్న
దొంగకును దండమిడినచో దొఱకు సిరులు!
నా రెండవ పూరణము:
రిప్లయితొలగించండిపరుల సొమ్మును దొంగిలింపంగఁ గోరు
"దొంగ"కు నమస్కరించిన "దొర"కు సిరులు
తొలఁగిపోవును, తొలఁగు సంతోషములవి!
యెపుడు దొంగలఁ దరిఁ జేరనీయవలదు!!
నా మూఁడవ పూరణము:
రాజసూయమ్ము తుదిని ధర్మజుఁడు కోరి
యగ్రతాంబూల మిడెనయ్య హరికి! వెన్న
దొంగకు నమస్కరించిన "దొర"కు సిరులు
హరియు సమకూర్చె తోడునీ డయ్యుఁ దానె!!
కళ్ళు మాట్లాడ?నవ్వులు కలసిపోగ
రిప్లయితొలగించండిలంచవంచన సిద్దుని –కంచదాటి
వనిత వరియించి పెళ్ళాడి పనితనాన
దొంగకు నమస్కరించిన దొరకుసిరులు
2.బాల్య మిత్ర కుచేలుడ మూల్యమైన
అటుకులందించి కృష్ణుని ఆశ్రయించి
వెన్నదొంగను వెతికియు విలువగలుగు
దొంగకు నమస్క రించిన దొరకు సిరులు|
శ్రీ శంకరయ్య గురుదేవులకు వినమ్రవందనములతో.....
రిప్లయితొలగించండిఅందరికీ అభివందనములు ...పెద్దల పూరణలు అలరించుచున్నవి...
ఎవ్వరి మనస్సును నొప్పించుటకు కాదు, పెద్దలు వెన్న దొంగకు నమస్కరించిరి వారి పద్యము లందు, నేను వారికి నమస్కరిస్తూ ...
=============*=====================
కలియుగపు వింత యిది గాదె కందివారు
దొంగకు నమస్కరించిన దొరకు సిరుల
నంగ సుకవి మిత్రులు జేరి అంద మైన
దొంగకు నమస్కరించిరి, దొరకుననుచు.
సిరుల దొంతరల కొరకు సేరి కొలుతు..!
కవిమిత్రులకు నమస్కృతులు.
రిప్లయితొలగించండిఈరోజు విశ్రాంత ఉపాధ్యాయులైన మా తమ్ముని మామగారు మరణించడంతో అటువెళ్ళి రావడం వల్ల మీ పూరణలపై వెంటవెంట స్పందించలేకపోయాను. మన్నించండి.
*****
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
పిరాట్ల వెంకట శివరామకృష్ణ ప్రసాద్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
శ్రీహరి సిరిని హరించినవాడు కాదు, సిరిని వరించినవాడు. మొక్కులను తీర్చుకున్న భక్తులకు ఆయన నేరుగా ఇచ్చే సిరులు లేవు కాని భక్తులకు శ్రీమంతులయ్యే తెరువు చూపించే ఆపదమొక్కులవాడు.
*****
వసంత కిశోర్ గారూ,
మీ బాగ్దాద్ గజదొంగ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
రాజేశ్వరి అక్కయ్యా,
దొంగలోను సర్వాంతర్యామిని చూపిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
*****
శైలజ గారూ,
కృష్ణుని పర్యాయపదాలను ఒకచో చేర్చిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
నాగరాజు రవీందర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
డా. ఆచార్య ఫణీంద్ర గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘విష్ణుమూర్తిని’ అనండి.
*****
కె. యస్. గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
గుండు మధుసూదన్ గారూ,
మీ అచ్చతెనుగు పూరణతో పాటు ‘దొర’ను ప్రస్తావించిన రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
*****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ మొదటి పూరణలో భావం అవగతం కాలేదు. రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
కందుల వరప్రసాద్ గారూ,
మీ పూరణ వైవిధ్యంగా ఉంది. బాగుంది. అభినందనలు.
దొంగయి యఘములెల్లను దోచుకొనుచు
రిప్లయితొలగించండిజనులకిడు గద శుభములు జగతియందు
దొరలకిడుగద కీర్తిని దోసముడిపి,
దొంగకు నమస్కరించిన దొరకు సిరులు
దొంగలౌచును కొందరు దుష్టరీతి
సిరులనందగ,వానిని చెలువు తెలియు
వారికిత్తురు లంచాలు బాగుగాను
దొంగకు నమస్కరింఛిన దొరకు సిరులు
బీదతనము కుచేలుని వీడజేసె,
కొలిచినంతన కృష్ణుడు గొప్పగాను
హితుడు నౌచును మెలిగిన నింపు,వెన్న
దొంగకు నమస్కరించిన దొరకు సిరులు
దొరయు నౌచును సిరినటు దూర్చె గుండె
నిలుపు,వాసవుడే సిరినిచ్చు విభుడు
భక్తులెల్లరి మనముల బాగు దోచు
దొంగకు నమస్కరించిన దొరకు సిరులు
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
గురువుగారు మీరు చెప్పినది నాకు తెలుసు నేను కేవలం చమత్కారం కోసం అలా చెప్పాను.శ్రీ అంటే లక్ష్మి హరి అంటే హరించినవాడు అని .
రిప్లయితొలగించండిఅందఱూ కృష్ణ స్తుతి చేస్తున్నారు ! ఆ నల్లనయ్యకు నా స్తుతి !
రిప్లయితొలగించండిగొల్లభామల యిళ్ళలో గుట్టు గాను
నెయ్యు లందఱు మెట్టులై నేర్పు నిలువ
నుట్టి కెక్కుచు పెరుగుల నూడ్చు , వెన్న
దొంగకు నమస్కరించిన , దొఱకు సిరులు !
ఊడ్చు = అపహరించు
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
రిప్లయితొలగించండిమీ కృష్ణస్తుతి పూరణ బాగున్నది. అభినందనలు.
మిత్రులకు నమస్కృతులతో...
రిప్లయితొలగించండిfacebook యందు నొక మిత్రుఁడు శివపరముగ దీనినిఁ బూరింపుమనఁగా నిట్లు పూరించితిని:
దేవదానవుల్ శ్రమియించి తివుర మొదట
హాలహల ముద్భవించి జగాలఁ గాల్ప,
దానిఁ ద్రావి, జనుల వ్యథఁ ద్వరఁగ దోచు
దొంగకు, నమస్కరించిన, దొరకు సిరులు!
గుండు మధుసూదన్ గారూ,
రిప్లయితొలగించండిమీ రెండవ పూరణ శివపరంగా ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
ధన్యవాదాలు శంకరయ్యగారూ!
రిప్లయితొలగించండి