28, మే 2015, గురువారం

సమస్యా పూరణము - 1686 (జగద్వ్యాప్తము లయ్యె నిరులు ఖరకరుఁ డుండన్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
జగద్వ్యాప్తము లయ్యె నిరులు ఖరకరుఁ డుండన్.
(ఛందోగోపనం, దుష్కరప్రాస)

61 కామెంట్‌లు:

 1. దినకరునస్తమయమ్మవ
  కనుమరుగయ్యె వెలుతురు జగద్వ్యాప్తము ల
  య్యె నిరులు - ఖరకరుఁ డుండన్
  తనరునవని యంతయు ధగధగ కాంతులతో
  (హమ్మయ్య...మాష్టారూ! ఉత్తీర్ణుడనయ్యానా?)

  రిప్లయితొలగించండి
 2. చిద్వ్యావృతి స్మరణ విల
  సద్వ్యసన మనస్కుడైతి ఛాయా సువిగా
  హద్వ్యస్తాహంబున జ
  గద్వ్యాప్తములయ్యెనిరులు ఖరఖరుడుండన్

  పగలు,( గ్రహణ) ఛాయవలన మునిగి పోగా చీకట్లు కమ్ముకొని ఉండగా మనసు లో ఓంకార స్మరణ లో నిమగ్నుడయ్యాను.
  ఇదీ నా భావము. 'కర్మణ్యేవాధికారస్తే' వ్రాయడం నావంతు

  రిప్లయితొలగించండి
 3. జగదీశు నాగ్రహం బున
  జగద్వ్యాప్తము లయ్యె నిరులు ఖరఖరుఁ డుండన్
  నగములు తరువులు గగనము
  భుగభుగ మనిమండి విరిగి భువిలో దాగెన్
  --------------------------------
  తమ్ముడూ ! మీరెలాగో కిట్టించారు ఇక నా సంగతి ? ? ?
  [గు...రు....వా....... ధీ....నం ]

  రిప్లయితొలగించండి
 4. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  దారి చూపినందులకు ధన్యవాదములు.

  వినిచిరి గురుదేవులు చ
  క్కనికధను,హరి మహిమనుజగద్వ్యాప్తము ల
  య్యె నిరులు ఖరకరుఁ డుండన్

  దునిమె కిరీటియె జయద్రతుని తత్క్షణమున్

  రిప్లయితొలగించండి
 5. మనమున యోచన జేయక
  కనుగొన సోదరుల రచన జగద్వ్యాప్తముల
  య్యె నిరులు ఖరఖరు డుండన్
  తనరుచు వ్రాసితి నటంచు తలమున్కలుగా

  రిప్లయితొలగించండి
 6. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  సెబాసో సెబాసు! దుష్కరప్రాసను సుకరప్రాసగా మార్చుకున్న తీరు, పూరణ ప్రశంసనీయంగా ఉన్నాయి. అభినందనలు.
  ‘అస్తంగతు డవ’ అన్నచోట ‘అస్తంగతు డయె’ అనండి.
  *****
  అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
  మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
  *****
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ మొదటి పూరణ రెండవ పాదంలో గణదోషం. మీరు ఛందోగోపనం అన్న మాటను గమనించినట్టు లేదు. ఇక రెండవ పూరణ (పూరణగానే స్వీకరించాను) బాగున్నది. అభినందనలు.
  రెండవ పూరణలోనూ రెండవపాదంలో గణదోషం. ‘కనుగొన సోదరుని కృతి జగద్వ్యాప్తము ల|య్యె...’ అనండి.
  *****
  ‘ఊకదంపుడు’ గారూ,
  సైంధవసంహార ఘట్టాన్ని ప్రస్తావించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 7. అశ్వత్థ నారాయణ మూర్తి గారూ దుష్కరప్రాసతో చాలా చక్కగా వ్రాశారు..మాలాంటివారికి మార్గదర్శకము మీ పూరణ

  రిప్లయితొలగించండి
 8. మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు నమస్కారములతో...

  *మిత్రులు చంద్రమౌళి సూర్యనారాయణగారూ! దుష్కరప్రాసనుండి విముక్తులగుటకుం జక్కని మార్గము నెన్నుకొన్నారు. అభినందనలు.
  *మిత్రులు అశ్వత్థనారాయణమూర్తిగారూ! చక్కని పూరణము నందించినారు. అభినందనలు.

  నా పూరణము:

  సద్వ్యసనులు పాండవుల న
  సద్వ్యసనపరుండు దుష్ట సైంధవుఁ డడ్డన్
  దద్వ్యక్తిఁ జంపఁ దివుర జ
  గద్వ్యాప్తములయ్యె నిరులు ఖరకరుఁ డుండన్!
  (యుద్ధవిరమణ సమయమైనదని సైంధవుని నమ్మించుటకు శ్రీకృష్ణుఁడు తన చక్రమును సూర్యున కడ్డుగ నుంచిన సందర్భము ననుసంధానించుకొనునది)

  రిప్లయితొలగించండి
 9. నా మఱొక పూరణము:


  (పతివ్రతా మతల్లి సతీసుమతి ప్రస్తావనము నిట ననుసంధానించుకొనునది)

  సద్వ్యసన విముఖు నపటు వి
  యద్వ్యాపిత పదము లంట, యతి శాప మిడన్,
  తద్వ్యపగతి నిడ సుమతి, జ
  గద్వ్యాప్తములయ్యె నిరులు ఖరకరుఁ డుండన్!

  రిప్లయితొలగించండి
 10. గుండు మధుసూదన్ గారూ,
  సైంధవ వధ, సుమతీ పాతివ్రత్య ప్రస్తావనలతో మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 11. అందరి పూరణలు అలరించు చున్నవి ! అలరింప నున్నవి !

  జిలేబి

  రిప్లయితొలగించండి
 12. కం: ఖద్యో మండలమున రవి
  సద్యస్ఫూర్తిని వెలుగుచు చకచక సాగన్
  మధ్యన మబ్బులు ముసర జ
  గద్వ్యాప్తములయ్యె నిరులు ఖరకరు డుండన్

  రిప్లయితొలగించండి
 13. ధన్యవాదములు శంకరయ్యగారూ!

  నా మూఁడవ పూరణము:

  (వర్షఋతువర్ణనము)

  ఘనకాలమందుఁ జినుకఁగ
  ఘనబృందము క్రమ్ముకొనె; జగద్వ్యాప్తముల
  య్యె నిరులు ఖరకరుఁ డుండన్;
  జినుకులు దట్టమ్ములయ్యె జేజేవీథిన్!

  రిప్లయితొలగించండి
 14. అద్వానీ సూక్తు లట జ
  గ ద్వ్యాప్తము లయ్యె ,నిరులు ఖర కరు డుం డన్
  ఖద్యోతము సరి జూడగ
  నాద్యంతము మాయమగుచు నహము న్వెలిగెన్

  రిప్లయితొలగించండి
 15. సద్వ్యాయతమై 'వింధ్య' బృ
  హద్వ్యోమాక్రమణమూనె నతి గర్వముతోఁ ;
  దద్వ్యాప్తితో సమస్త జ
  గద్వ్యాప్తములయ్యె నిరులు ఖరకరుఁడుండన్ !

  రిప్లయితొలగించండి
 16. శ్రీ చంద్రమౌళి సూర్య నారాయణ గారు దుష్కరాన్ని సుకరం చేసిన విధానం అభినందనీయం
  అలాగే విద్వత్కవి వతంసులు శ్రీ గుండు మధుసూదన్ గారు క్లిష్ట ప్రాసను అవలీలగా సాధించిన వైనం బహధా ప్రశంసనీయం.

  రిప్లయితొలగించండి
 17. ఎందరో మహానుభావులు! అందరికీ వందనాలు.

  రిప్లయితొలగించండి
 18. ఘన రాహుగ్రహ బంధం
  బున జిక్కగ నహమువోఁ జగద్వ్యాప్తముల
  య్యెనిరులు ఖరఖరు డుండన్
  మనమున నోంకార మనన మగ్నుడనైతిన్

  చంద్రమౌళి గారూ నిజానికి నేనే మీకు అభినందనలు చెప్పాలి.
  నా భావము పద్యవ్యక్తానుభవం పొందే లోపు మీరుమార్గం వేసేశారు. ఇక నాకు దుర్గమ దుష్కర ప్రాస వైపుసాహసం చేయాల్సి వచ్చివచ్చింది.
  మహామహులు విష్ణునన్దన్ గారి పపూరణ చాలా బాగుంది.
  మిత్రులు మధుసూధన్ గారూ మీ మెచ్చుగోలు నన్ను చాలా ఉత్సాహ పరచింది. కృతజ్ఞతలు.
  శంకరయ్య గురువుగారు pass చేసినందుకు కృతజ్ఞతలు.
  ధన్యోస్మి

  రిప్లయితొలగించండి
 19. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
  మీ ప్రయత్నం బాగున్నది. కానీ ప్రాసాక్షరం ‘ద్వ్య’, మీరు ‘ద్య’ వేశారు.
  *****
  గుండు మధుసూదన్ గారూ,
  మీ కత్తికి రెండువైపులా పదునే అన్న విషయాన్ని మీ మూడవ పూరణ ఋజువు చేస్తున్నది. చాలా బాగున్నది. అభినందనలు.
  *****
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ ప్రయత్నం బాగున్నది. కానీ ‘ద్వ్య’ ప్రాసాక్షరం కాగా మీరు ‘ద్వ, ద్య’ వేశారు.
  *****
  డా. విష్ణునందన్ గారూ,
  సూర్యగమనాన్ని అడ్డుకున్న వింధ్యపర్వతం విషయం మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
  *****
  అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
  మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
  రెండవపాదంలో యతి తప్పింది. ‘ఘన రాహుబంధమున న|క్కట చిక్కగ నహము వో జగద్వ్యాప్తము...’ అందామా?

  రిప్లయితొలగించండి
 20. ఒక నల్లడబ్బు వ్యాపారి తన ఖాతాదారుతో అన్నట్లుగా ఊహ:

  సద్వ్యాపారము మాకును
  సద్వ్యసనము మీకు నల్ల సంపద యిదియౌ
  సద్వ్యవహారంబు విను జ-
  గద్వ్యాప్తంబయ్యె నిరులు ఖరఖరు డుండన్.

  రిప్లయితొలగించండి
 21. చిద్వ్యధతో సతిచన కరి
  భిద్వ్యంజిత రౌద్ర భద్ర వీరత్వముతో
  తద్వ్యోమకేశుడడ్డ జ
  గద్వ్యాప్తములయ్యెనిరులు ఖరకరుఁడుండన్!

  రిప్లయితొలగించండి
 22. సద్వ్యాపారత రాత్రి,జ
  గద్వ్యాప్తములయ్యె నిరులు,ఖరకరుడుండన్
  తద్వ్యాపారము పగటిని
  కృద్వ్యాపారము రగిల్చికీడును సలుపన్

  కృద్వ్యాపారత జనులిల
  తద్వ్యర్ధాలను విడువగ,ధారుణి ప్రాణుల్
  హృద్వ్యాపారము వీడ,జ
  గద్వ్యాప్తములయ్యె నిరులు,ఖరకరుడుండన్

  హృద్వ్యాకులమౌ వేడి,జ
  గద్వ్యాప్తములయ్యె నిరులు ఖరకరుడుండన్
  తద్వ్యాపారము మానియు
  చిద్వ్యాకులమౌచు నిండ్ల చీకటి మసలన్

  రిప్లయితొలగించండి
 23. క్షుద్వ్యాధిగ్రస్త మనుజులు
  పృధ్వ్యాపోరాకసముల భేదింపంగా
  సద్వ్యాపారములు విడి,జ
  గద్వ్యాప్తములయ్యెనిరులు,ఖరకరుడుండన్

  రిప్లయితొలగించండి
 24. రామ కృష్ణమూర్తి గారు, వ్యాధిగ్రస్త అన్నప్పుడు ధి గురువు అవుతుంది కదా

  రిప్లయితొలగించండి
 25. మిస్సన్న గారూ,
  నల్లడబ్బు మీద మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  ‘అష్టావధాని’ రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారూ,
  బహుకాల దర్శనం... సంతోషం!
  దక్షాధ్వరవిధ్వంసం విషయంగా మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  కరిభిత్(గజాసురసంహారియైన శివుడు), వ్యోమకేశుడు... పునరుక్తి అయిందేమో అని అనుమానం!
  *****
  మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ పూరణలన్నీ బాగున్నవి. అభినందనలు.
  *****
  రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  కొన్ని సందర్భాలలో రేఫసంయుక్తాక్షరం ముందున్న అక్షరం గురువవుతుందని కొందరంటారు. ఎందుకో నాకిది నచ్చదు (ఇది నా వ్యక్తిగత అభిప్రాయమే. అఖండయతిని నేను ప్రయోగించను. ఎవరైనా ప్రయోగిస్తే వద్దనను. ఇదీ అటువంటిదే!). అక్కడ ‘క్షుద్వ్యాధిగ్రస్త నరులు’ అంటే బాగుంటుందని నా సూచన.

  రిప్లయితొలగించండి
 26. గురువుగారూ రేఫతో కూడిన ప బ లకు మాత్రమే అవసరాన్ని బట్టి ముందు అక్షరాన్ని గురువు లేదా లఘువు గా వాడుకోవచ్చునని కీ.శే. నేమాని పండితార్యులు చెప్పినట్లు గుర్తు.

  రిప్లయితొలగించండి
 27. ఘనమేఘమ్ములకతన గ
  గనమున దివసమ్మునను జగత్వ్యాప్తముల
  య్యెనిరులు ఖరకరుడుండన్
  దినపతికనుపించె మరల తెమలజలదముల్

  రిప్లయితొలగించండి
 28. మద్వ్యాఖ్యానమ్మది 'జ
  గద్వ్యాప్తములయ్యె సిరులు ఖరకరు డుండన్'
  తద్వ్యాఖ్య ప్రచురితమయె 'జ
  గద్వ్యాప్తములయ్యె నిరులు ఖరకరు డుండన్ '!

  రిప్లయితొలగించండి
 29. శ్రీ శంకరయ్య గారు , రేఫతో కూడిన సంయుక్తాక్షరం ముందు అక్షరం లఘువా గురువా అనే విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. తదక్షరం గురువవుతుందనని స్వీయాభిప్రాయమైనా , అది గురువు కాదు ఊనికను బట్టి లఘువు కూడా అవుతుందని , 'ధిషణాహంకార సంభార దోహల బ్రాహ్మీమయ మూర్తి ' లో ల కారమును లఘువు గానే ప్రయోగించిన కవి సమ్రాట్టుల శాసనం తిరుగులేనిది కూడా !

  రిప్లయితొలగించండి
 30. ఇకపోతే శ్రీ రామకృష్ణ మూర్తి గారి పృథ్వ్యాపోరాకస ప్రయోగం కూడదు. ఆకసం ఇక్కడ సమసించదు.

  రిప్లయితొలగించండి
 31. నమస్కారములు
  సమస్య అర్ధమైనా ఎలా రాయాలో తోచలేదు నిజానికి నాకంత నాలెడ్జికుడా లేదు చంద్ర మౌళి గారి పూరణ చదివాక ఎలాగో కిట్టించాను సవరణ జేసినందులకు గురువులకు ధన్య వాదములు

  రిప్లయితొలగించండి
 32. ఘన రాహుగ్రహ బంధ గ
  గనమ్మునను నహము వోఁ జగద్వ్యాప్తముల
  య్యెనిరులు ఖరఖరు డుండన్
  మనమున నోంకార జపనిమగ్నుడ నైతిన్

  రిప్లయితొలగించండి
 33. నమస్సులు.
  శంకరయ్య గారూ... కేశజాలంతో సూర్యుడిని కనపడకుండాచేసాడని వ్యోమకేశుడు అని పదౌచిత్యప్రయోగం. ఇక కరిభిత్ సాధారణ సంజ్ఞగా స్వీకరింఛాను.
  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 34. సద్వ్యవసాయము మానుచు
  తద్వ్యోమము విడి యినుండు దాటుటహల్యన్
  తద్వ్యసనమసహ్యమని జ
  గద్వ్యాప్తము లయ్యె నిరులు ఖర కరు డుండన్

  రిప్లయితొలగించండి
 35. దుష్కర ప్రాసతోకూడిన సమస్యాపూరణము చేసిన కవి పండితులందరికి నమస్కారములు, అభనందనలు.
  నేను కూడ చంద్రమౌళి సూర్యనారాయణ గారి పంథాలోనే....

  విను వీధిని రాహువుయే
  కనుగొని మ్రింగగ రవిని జగద్వ్యాప్తము ల
  య్యె నిరులు, ఖరకరుడుండన్
  మనుజులు పశుపక్షు లెల్ల మనునీ జగతిన్!

  రిప్లయితొలగించండి
 36. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ అచ్చుతప్పు పూరణ బాగుంది. అభినందనలు.
  *****
  డా. విష్ణునందన్ గారూ,
  ధన్యవాదాలు.
  *****
  అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
  మీ సవరణ బాగుంది. సంతోషం!
  *****
  ‘అష్టావధాని’ రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారూ,
  మీ వివరణ సముచితంగా ఉంది. సంతోషం!
  *****
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  కాని సూర్యునకు, అహల్యకు సంబంధ మేమిటి?
  *****
  బొడ్డు శంకరయ్య గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘రాహువు+ఏ’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘వినువీధిని నా రాహువె’ అనండి.

  రిప్లయితొలగించండి
 37. సద్వ్యసనమ్మనుకొనెనొ? బృ
  హద్వ్యాధినిఁ బీడితుడగునప్పతి కొఱకై
  హృద్వాకుల సతి నుడువ, జ
  గద్వ్యాప్తము లయ్యె నిరులు ఖరకరుఁ డుండన్.

  రిప్లయితొలగించండి
 38. భాగవతుల కృష్ణారావు గారి పూరణ

  మద్వ్యాపారమ్మున హను
  మద్వ్యానము జేర యెగసి మరుక్షణమున కిం
  చిద్వ్యాప్తపు గ్రహణమున జ
  గద్వ్యాప్తము లయ్యె నిరులు ఖరకరుఁ డుండన్.

  రిప్లయితొలగించండి
 39. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 40. లక్ష్మీదేవి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  భాగవతుల కృష్ణారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘మరుక్షణమున’ అన్నప్పుడు ‘రు’ గురువై గణభంగం. అక్కడ ‘మరుక్షణమే కిం...’ అనండి.

  రిప్లయితొలగించండి
 41. కవిమిత్రుల సూచనలు ఆనందంగా స్వీకరిస్తున్నాను

  రిప్లయితొలగించండి
 42. శంకరయ్యగారు 'నరులకు'అవకాశం ఇచ్చారు,విష్ణునందన్ గారు సమాసం మార్చమన్నారు, సవరణ తో నాపూరణ;

  క్షుద్వ్యాధిగ్రస్త నరులు
  పృద్వ్యాపోనభములెల్ల భేదింపంగా
  సద్వ్యాపారములు విడి,జ
  గద్వ్యాప్తము లయ్యెనిరులు ఖరకరుడుండన్

  రిప్లయితొలగించండి
 43. శంకరయ్యగారు 'నరులకు'అవకాశం ఇచ్చారు,విష్ణునందన్ గారు సమాసం మార్చమన్నారు, సవరణ తో నాపూరణ;

  క్షుద్వ్యాధిగ్రస్త నరులు
  పృద్వ్యాపోనభములెల్ల భేదింపంగా
  సద్వ్యాపారములు విడి,జ
  గద్వ్యాప్తము లయ్యెనిరులు ఖరకరుడుండన్

  రిప్లయితొలగించండి
 44. మునుపొక దినమున గ్రహణము
  కనపడు లోకులకు పగలు జగద్వ్యాప్తముల
  య్యె|నిరులు ఖర కరు డుండన్
  పనిలో నుండగ?అదియొక భావన మదిలో|

  రిప్లయితొలగించండి
 45. రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
  మీ సవరణ బాగుంది. సంతోషం!
  *****
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  రెండవపాదంలో గణదోషం. ‘కనపడు జనులకు పగలు జగద్వ్యాప్తము...’ అనండి.

  రిప్లయితొలగించండి
 46. మరునాడు or మర్నాడు (మరుసటినాడు) అన్నదాంట్లో మరు దేశ్యం కనుక రు గురువు కాదేమో

  రిప్లయితొలగించండి
 47. విద్వత్కవిమిత్రులు డా.విష్ణునందన్‍గారూ! వింధ్యపర్వత గర్వాతిశయమున ఖరకరుని ఖర్వత్వము బహిర్గతపఱచినట్టి మీ పూరణ మసాధారణముగనున్నది. అభినందనలు. అటులనే నేఁడు నా పూరణములు మీ మెప్పునుం బడయగలిగినందుల కెంతయు నానందముగ నున్నది. మీకు మన్మనఃపూర్వక కృతజ్ఞతలు. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 48. రాంభట్ల వారూ,
  నిజమే! నాదే పొరపాటు. ధన్యవాదాలు.
  *****
  భాగవతుల కృష్ణారావు గారూ,
  మీ పద్యంలో సవరించవలిసిన అవసరం లేదు. మీ ప్రయోగం సరియైనదే. దోషారోపణ చేసినందుకు మన్నించండి.

  రిప్లయితొలగించండి
 49. లంకను జేరగా హనుమ?లక్షణ శోభితు లైన కాంతలున్
  శంకయు లేక నిద్రజని శాంతముకై సురసేవనంబు-నా
  టంకములేక త్రాగిరని టక్కున జూచిన లంక చిత్రమున్\
  గొంకని రాక్షసుల్ నిదుర గుట్టును పట్టును జూసె వింతగా

  రిప్లయితొలగించండి
 50. గురువు గారూ,
  గణములు కిట్టించినట్లే ఉన్నాను కానీయండి, ఎన్ని దోషాలు ఉన్నాయో తెలియదు..

  సద్వ్యాపారాభ్యంతర
  మద్వ్యూహాసంచయ విషమచికిత్సాభృత్
  చిద్వ్యాహృతమిది, నిన్న జ
  గద్వ్యాప్తము లయ్యెనిరులు ఖరకరుడుండన్.

  రిప్లయితొలగించండి
 51. ఊకదంపుడు గారూ,
  చిద్వ్యాహృతమైనపుడు అన్నీ తలక్రిందులే కదా! మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 52. పూజ్యులు విష్ణునందన్ గారు. గుండు మధుసూదన్ గారు నా పూరణావిధానాన్ని మెచ్చుకోవడం చాలా సంతోషాన్ని ప్రోత్సాహాన్ని ఇచ్చింది.
  ధన్యవాదములు.. ఊకదంపుడు గారు, అక్కయ్యగారు, అశ్వత్థనారాయణమూర్తిగారు , బొడ్దు శంకరయ్యగార్లకు ధన్యవాదములు

  రిప్లయితొలగించండి
 53. దుష్కర ప్రాసతో సుకర పూరణలు చేసిన మిత్రులందరికీ అభినందనలు...


  మద్వ్యాపారపు వేళల
  తద్వ్యక్తం బైన రాహు ధాటిగ మూయన్
  తద్వ్యోమమునందునను, జ
  గద్వ్యాప్తము లయ్యెనిరులు ఖరకరుడుండన్

  రిప్లయితొలగించండి
 54. గురుదేవుల సూచనకు ధన్యవాదములు. సవరణతో...

  వినువీధిని నా రాహువె
  కనుగొని మ్రింగగ రవిని జగద్వ్యాప్తము ల
  య్యె నిరులు, ఖరకరుడుండన్
  మనుజులు పశుపక్షు లెల్ల మనునీ జగతిన్

  రిప్లయితొలగించండి
 55. ఏదో ప్రయత్నించినాను, తప్పులుంటే క్షమించండి గురువు గారు.
  అర్జునుడు యుద్దరంగమును చూసినప్పుడు, అంతరంగములో చీకట్లు వ్యాపించాయని....
  తద్వ్యూఢము బొడగనగ మ
  హద్వ్యాకుల చిత్తుడై జయము వలదని సం
  యద్వ్యాసంగము వీడ జ
  గద్వ్యాప్తంబయ్యె నిరులు ఖరఖరు డుండన్.

  రిప్లయితొలగించండి
 56. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  మాజేటి సుమలత గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి