11, మే 2015, సోమవారం

పద్య రచన - 902

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

16 కామెంట్‌లు:

  1. మోజట వనితల కెప్పుడు
    గాజులు ధరియించి నంత కళకళ లాడన్
    జాజులు మల్లెలు మొల్లలు
    నాజడను తురుము కొనిన నైదవ తనమౌ

    రిప్లయితొలగించండి
  2. గాజులు చేతికి దొడుగగ
    మోజులుగా జూతు రెపుడు ముదితలు, నేడీ
    రోజులు మారిన గానీ
    బూజులు మరి పట్టలేదు మోదము హెచ్చెన్.

    రిప్లయితొలగించండి
  3. బెట్టుగ చేతికి గాజులు
    మెట్టెలు పదముల ధరించి మెలతుగ దృతితో
    నట్టింట తిరుగు చుండిన
    తట్టును శ్రీ లక్ష్మి వారి తలుపుల నెపుడున్

    రిప్లయితొలగించండి
  4. చేతికి రంగుల గాజులు
    ఖ్యాతిని పెంచును మహిళల కనవరతమ్మున్
    నాతులు శ్రీకరమగునని
    ప్రీతిగ ధరియింతురెపుడు పేరంటములన్

    రిప్లయితొలగించండి
  5. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    చివరిపాదంలో గణదోషం. ‘నాజడలో...’ అంటే సరి!
    *****
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    ఒకటి రెండు టైపాట్లున్నాయి.

    రిప్లయితొలగించండి
  6. నట్టింటను ముత్తైదువ
    మెట్టెల సవ్వడికి తోడు మేలగు గాజుల్
    పెట్టినవే రకమైనను
    మట్టివి ధరియించ మగువ మంగళమమ్మా!

    రిప్లయితొలగించండి
  7. రమణీ మణులందరు నట
    కమనీయము లైనవర్ణ కంకణ ప్రోవుల్
    గమనించు కౌతుకమ్మున
    గమకము లాయెను కలకల గలగల స్వనముల్

    రిప్లయితొలగించండి
  8. చిత్ర మయ్యది జూడుము చిత్ర ! నీవు
    రంగు రంగుల గాజులు రమ్య మలరె
    చూచు చుండిరి భామలు చుట్టు గూడి
    వేసి కొనగను గాజులు విడివి డిగను

    రిప్లయితొలగించండి
  9. గాజులన్న మోజు కాంతామణులకెల్ల
    మట్టి గాజులన్న మగువ మెచ్చు
    ముదితలెల్ల కోరు ముత్యాల గాజులు
    దాల్చ రండు మీరు తరుణు లార.

    రిప్లయితొలగించండి
  10. గాజులన్న మోజు కాంతామణులకెల్ల
    మట్టి గాజులన్న మగువ మెచ్చు
    ముదితలెల్ల కోరు ముత్యాల గాజులు
    దాల్చ రండు మీరు తరుణు లార.

    రిప్లయితొలగించండి
  11. బంగారు గాజులున్నను
    రంగుల గాజులను కొనుచు ప్రహ్లాదముతో
    సింగారించుచు చేతుల
    మంగళకరముగ దలతురు మహిళామణులే!!!

    రిప్లయితొలగించండి
  12. ముత్తైదు గాజులు-మురిపాల మోజులు
    --------ఆడవారికిజూడ?అందమొసగు|
    చేతికి గాజులే సిరిసంపదలగుర్తు
    ---------వనితలకవి మంచి మనసునింపు|
    చిన్నారి-హృదయాన-చిలిపితనమునింపు|
    ---------వన్నెల గాజులే-పలుకజేయు
    కన్నెల కరకాంతి-వెన్నెల వెలుగులా?
    -----------యువకులమదిలోన యూహలుంచు|
    నగల కంటెను మగువలసొగసునింపు
    నగవు నంటిన అందమేబిగువుగాదు
    నాణ్యమైనట్టి వనిత ధనాశకంటె
    చేతిగాజులే ముఖ్యమౌ చెలియ కెపుడు|
    2.ముగ్గురు అమ్మ లక్కలకుముచ్చట గొల్పెడి గాజులన్నచో?
    సిగ్గులు కానరావచట చేరెడి ప్రేమకు మూల మౌనుగా|
    తగ్గదు గాజు మోజుగన?తన్వికిచేతులకంద మద్దియే
    పెగ్గులు వేయుభర్తలన?భీతిలు గాజులుకాలమంతటన్|----

    రిప్లయితొలగించండి
  13. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘కంకణప్రోవుల్’ అని సమాసం చేయరాదు కదా! ‘కంకణరాశుల్’ అనండి.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    శైలజ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. అవును గురు గారూ
    దుష్టసమాసమవుతుంది. కృతజ్ఞతలు,

    రిప్లయితొలగించండి