6, మే 2015, బుధవారం

సమస్యా పూరణము - 1667 (వేదాంగము లీ జగతికి విషతుల్యమ్ముల్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
వేదాంగము లీ జగతికి విషతుల్యమ్ముల్.

26 కామెంట్‌లు:

 1. ఆదిని గురుకుల ములనుచు
  వేదములను నేర్పు చుండె ప్రీతిని గురువుల్
  కాదనుట కాంగ్ల యుగమిది
  వేదాంగము లీజగతికి విషతుల్యమ్ముల్

  రిప్లయితొలగించండి
 2. వాదంబేల విషమనిన
  మోదముఁ గూర్చెడి జలంబు! ముఖ్యము కాదే?
  సోదాహరణముగఁ బలుక
  వేదాంగము లీ జగతికి విషతుల్యమ్ముల్!!

  రిప్లయితొలగించండి
 3. రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  జిగురు సత్యనారాయణ గారూ,
  విషశబ్దానికి ఉన్న జల మనే అర్థంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 4. మోదంబును కలిగించును
  వేదాంగము లీ జగతికి; విషతుల్యమ్ముల్
  సాధారణ గ్రంధమ్ము ప్ర
  మాదమ్ముల హేతువగును మరిమరి చదువన్

  రిప్లయితొలగించండి
 5. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 6. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 7. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 8. భాగవతుల కృష్ణారావు గారి పూరణ

  వేదాధ్యయనము సలుపక
  వేదవిధిని హోమ జపము విలువ లెరుగకన్
  వాదించు నాస్తికులనిరి
  వేదాంగము లీ జగతికి విషతుల్యమ్ముల్.

  రిప్లయితొలగించండి
 9. సోదనలకతన యిలలో
  ప్రాధాన్యతలన్నిమార ప్రగతిని కొనగా
  నాదరణకోలుపోయిన
  వేదాంగములీజగతికి విషతుల్యమ్ముల్

  రిప్లయితొలగించండి
 10. గోదారి గలిసి పోయెను
  యాదరణకు దూరమాయె నప్పటి వారున్
  వేదము నేర్చిన వేదనె!
  వేదాంగము లీ జగతికి విషతుల్యమ్ముల్.

  రిప్లయితొలగించండి
 11. వేదము భాగము లేమఱి
  వేదాంగము లీ జగతికి విష తుల్యమ్ము
  ల్లాదరణ లేని గ్రంధము
  లేదయినను నెంచి జూడ నెందును సామీ !

  రిప్లయితొలగించండి
 12. సోదాహరణముగ ప్రజకు
  వేదార్ధములను దెలుపును వేదాంగములే!
  వాదిడు వారందు రిటుల
  వేదాంగములీ జగతికి విషతుల్యమ్ముల్!!!

  రిప్లయితొలగించండి
 13. ఈ దేశ ధర్మ సూచిక
  వేదాంగము, లీజగతికి విషతుల్యంబుల్
  క్రోధము, మోహము, లోభము
  ఏదానముజేయకునికి లీర్ష్యలసూయల్ !!!

  రిప్లయితొలగించండి
 14. ఆదాయమొక్కటుండిన?
  వేదాంగములీజగతికి విషతుల్యమ్ముల్
  మొదంబెంచే వ్యసనము
  కాదనరీ జనులు నేడు కలియుగ మందున్|
  2.నాదను నాదమునందున
  నీదను పలుకేది వినక నీతినివీడే
  జూదము లంతట నెగడగ?
  వేదాంగము లీజగతికి విషతుల్యమ్ముల్

  రిప్లయితొలగించండి
 15. రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  భాగవతుల కృష్ణారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘పోయెను+ఆదరణ’ అన్నప్పుడు యడాగమం రాదు.
  *****
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  శైలజ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ******
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  మంద పీతాంబర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘లోభ| మ్మేదానము...’ అనండి.
  *****
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  ‘మోదం బెంచే’ అన్నదానిని ‘మోదం బెంచెడి’ అనండి.

  రిప్లయితొలగించండి
 16. వేదము చీకటి రంగము
  వేదాంగము లైనవారు విగతపు జీవుల్
  చేదగు పనులను జేయగ
  వేదాంగము లీ జగతికి విషతుల్యమ్ముల్
  కొరుప్రోలు రాధా కృష్ణ రావు

  రిప్లయితొలగించండి
 17. కొరుప్రోలు రాధాకృష్ణరావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 18. మోదమున జర్మనీయులు
  వేదము, సంస్కృతము నేర్పు విద్యాలయముల్
  సాదరమునఁ దెరువగ నే
  వేదాంగములీ జగతికి విషతుల్యముల్?

  రిప్లయితొలగించండి
 19. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 20. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 21. మాజేటి సుమలత గారూ,
  మీ పూరణ బాగున్నది.
  కాని మూడవపాదంలో ప్రాస తప్పింది.

  రిప్లయితొలగించండి
 22. ధన్యవాదములు మాష్టారు! సవరించాను అని అనుకుంటున్నాను.

  వేదాంత బుధుల్, వృథయగు
  వాదంబులు సలుపుచు గడు వైషమ్యమునౌ
  రా! దాంతులు కానిచొ యా
  వేదాంగము లీజగతికి, విషతుల్యమ్ముల్

  రిప్లయితొలగించండి
 23. చేదయె జ్యోతిష శాస్త్రము
  బాధయె ఛందస్సు శిక్ష;...వ్యాకరణమహా
  గోదారి కలిసి పోయెగ!
  వేదాంగము లీ జగతికి విషతుల్యమ్ముల్

  రిప్లయితొలగించండి


 24. గోదారి గట్టు సైయను
  జాదరలాడెడు జిలేబి సరసము వలయు న్
  సోదర! అంతే కానీ
  వేదాంగము లీ జగతికి విషతుల్యమ్ముల్ :)

  జిలేబి

  రిప్లయితొలగించండి
 25. దాదా రాహులు సోనియ
  మోదపు నగవుల ప్రియంక మోదియు దీదీ
  వాదమ్ములతో లేనివి
  వేదాంగము లీ జగతికి విషతుల్యమ్ముల్

  రిప్లయితొలగించండి