గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ****** గుండు మధుసూదన్ గారూ, నిన్నటి ఖండికను మీ ‘మధురకవనం’లో పోస్ట్ చేశారా? ఈనాటి చిత్రానికి మీ పద్యం బాగుంది. అభినందనలు.
పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
ముక్కలు నూనె వేపుడన?మూర్ఖుడివా?గమనంబులేకనే ప్రక్కన పేకముక్కలను పట్టియువేయుచు కాగునూనెలో అక్కరకొచ్చునాతినగ ఆశగ దెల్పగ భర్తవంచు నీ కెక్కడి నుండి యీతెలివి?యెవ్వరునేర్పిరి మొద్దు బుద్ధికిన్
సతి జెప్పిన పని చేయగ
రిప్లయితొలగించండిమతిమాలిన మగడు గాక మరువక జేతున్
గతిలేని పేక ముక్కలు
మితిమీరిన కార మేసి మెండుగ వేపన్
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
బాపూకే సాధ్యమిది :
01)
_______________________________
"ముక్కల వేచుడు" సతి యన
ముక్కల బదులుగను పేక - ముక్కల జేర్చన్ ,
గ్రక్కున నెవరికి సాధ్యము
పక్కున నవ్వంగ జనులు ? - బాపూ నీకే !
_______________________________
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
వసంత కిశోర్ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
వెలబోయె నాసు రాజులు
రిప్లయితొలగించండినలనల్లగ మాడ ముఖము నల రాణులకున్ !
పొలిమేర గేక విన్నదొ
నెలతుక వేవేగ వచ్చి నిప్పులు గురిసెన్
గన్నవరపు నరసింహమూర్తి గారూ,
రిప్లయితొలగించండిహస్యస్ఫోరకమైన మీ పద్యం బాగున్నది. అభినందనలు.
వెల ఆమ్రేడితమైనపుడే అది సమర్థమౌతుంది. అక్కడ ‘వెలవెలబోయెను రాజులు’ అందామా?
గురువుగారికి ధన్యవాదములు !
రిప్లయితొలగించండిరాజూ రాణీ జోకరు
రిప్లయితొలగించండిరోజూ నామాట వినక రోతయె బుట్టెన్
మోజులు దీరెను మది, నా
రాజే గలిగెనుగ నాకు రాణీ ! కనవే !
మిత్రులందఱకు నమస్సులతో...
రిప్లయితొలగించండినిన్నటి పద్యరచనలో...
నా పద్యములను నే నాలస్యముగ నుంచిన కారణమున మఱల (శ్రీ శంకరయ్యగారు సూచించిన సవరణములతో) నిట నిడుచుంటిని...
-:అధికులతో స్పర్థఁబూనుట యనర్థదాయకము:-
కం.
అనఁగనఁగ నొక సరస్సునఁ
గన నగుఁ బలు హంస లెపుడు కలకల నగుచున్
వనరుహ కాండములఁ దినుచు
దినమంతయుఁ గడపుచుండు దివ్యగతులతోన్!
ఆ.వె.
ఆ సరస్సు ప్రాంతమందలి కుజముల
పై వసించుచుండెఁ పలు ద్వికములు!
దినదినమ్ము నవియు దివి విహారులునైన
హంసగమనములను నఱయుచుండు!
తే.గీ.
వాని తెల్లందనమ్ములు వాని పలుకు
లెంత హృదయంగమములంచు వింతఁ గనునొ,
దమ కురూపముల్ కూఁత లంతగను రోఁతఁ
బుట్టఁ జేయునని విసుగు పుట్టఁ దెగడు!
కం.
హంసల గర్వము నణచఁగ
హింసనుఁ బూనియును నైన హేయమొనర్పన్
గంసారి నలుపు గల యా
హంసారులుఁ దలఁచుచుండె నవగుణ కుమతుల్!
తే.గీ.
ఒక్క దినమున నొక యంచ తెక్కరముగ
నడచి వచ్చుట నా పిశునములు గాంచి,
“యేమి మీగొప్ప? మావలె నెగురఁ గలరె?
పందెమునుఁ గాచి, గెలుపొంద వలయు”ననియె!
తే.గీ.
“నాకు నీతోడఁ బందెమా?” నగుచు నంచ
యనఁగ, “భయపడుచుంటివా?” యంచుఁ గాకి
వంకరగ, టింకరగఁ దాను పల్టికొట్టి,
“నన్ను గెలుతువే?”యన హంస నగి యొడఁబడె!
తే.గీ.
కాకి ముందుగా నాకాశ గమన యయ్యు
వెనుక వచ్చెడి యంచను వెక్కిరించె!
హంస మేఘమండలమును నందుకొనఁగఁ
జనుచు నుండఁగఁ గాకియుఁ జనెను పైకి!
ఆ.వె.
హంసవేగమపుడు నందుకొనంగను
వాయసమ్ము విఫలమాయె, నటులె
కనులు బైర్లు గ్రమ్మెఁ, గనుమూసితెఱచిన
యంతలోనఁ గ్రింద నబ్ధిఁ గూలె!
కం.
సాగరమందునఁ గూలియు
“వాగితి నే బుద్ధిలేక వక్రపుఁగూఁతల్,
నా గర్వము ఖర్వమయెన్
వేగముగా శరధినుండి విడిపింపు”మనన్.
తే.గీ.
జాలిపడి హంస కాకిని సంద్రము వెడ
లింపఁ జేసి, వీపున మోసి, కొంపఁ జేర్చె!
కాకి “గొప్పవారలతోడ కయ్యము వల
దంచుఁ దెలిసెను! నన్నుమన్నించు”మనియె!!
*** *** *** ***
(ఇది ’యధికులతో స్పర్థించుట యనర్థదాయకమను కథ” సమాప్తము)
*** *** ***
నేఁటి పద్యరచన...
చక్కఁగ మీరల నిప్పుడు
ముక్కలు వేయింపుఁ డనఁగ ముదముగ నిటు లీ
ముక్కల వేయింతురె? కట!
నిక్కమె! మీ "పేకముక్క"నే "ముక్క" గదా!!
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
******
గుండు మధుసూదన్ గారూ,
నిన్నటి ఖండికను మీ ‘మధురకవనం’లో పోస్ట్ చేశారా?
ఈనాటి చిత్రానికి మీ పద్యం బాగుంది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినేఁటి "మధుర కవనం (http://www.madhurakavanam.blogspot.in)"లో టపా పెట్టవలెననుకొనుచుంటిని. మీరు గ్రహించి యడిగితిరి. నిజమే! ధన్యవాదములు. స్వస్తి.
రిప్లయితొలగించండిభార్య కోరిక మన్నించి భర్త మరిని
రిప్లయితొలగించండిముక్క లనగను సరి పేక ముక్క లనట
వేచు చుండెను నె ఱ్ఱ గా విడివి డిగను
నాసు రాజులు మొదలగు నట్ట లన్ని
పేకలఁగొని యాటకుఁ పోవు పెనిమిటిఁగని
రిప్లయితొలగించండిపూజలోనున్న సతి కూర ముక్కలన్ని
వేపిపెట్టమనుచుకోర, వేగముగను
పేకముక్కల వేయించె వెర్రిమగడు
విస్తుబోయెను శ్రీమతి వింతఁజూసి
పేకాట లో అప్పుల పాలై చింతించే మొగుడి నిర్వాకం:
రిప్లయితొలగించండి'ముక్కలుఁ' దిరుగక నప్పులఁ
జిక్కినఁ దిప్పల మగండు, శ్రీమతి వాక్కుల్
తిక్కను రేపంగ నెగసి
'ముక్కల' వేయించె కసెగ ముగ్ధుండగుచున్!
పోచిరాజు సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
ముక్కలు వేయించమనుచు
రిప్లయితొలగించండిచక్కగ సతి కోరగానె సరెయని పతియే!
నిక్కముగ పేక ముక్కలు
చిక్కగ వేగించె నవియె జేతుల నుండన్!!!
శైలజ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
గురుదేవులకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండిముక్కలు నూనె వేపుడన?మూర్ఖుడివా?గమనంబులేకనే
రిప్లయితొలగించండిప్రక్కన పేకముక్కలను పట్టియువేయుచు కాగునూనెలో
అక్కరకొచ్చునాతినగ ఆశగ దెల్పగ భర్తవంచు నీ
కెక్కడి నుండి యీతెలివి?యెవ్వరునేర్పిరి మొద్దు బుద్ధికిన్
కె. ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
నాగరాజు రవీందర్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'బాపు' 'పక్కింటి పిన్ని' సభావతి గను
రిప్లయితొలగించండి(సభాపత్ని అంటే బాగోదు)
పెద్ద దండను చేబట్టి వేడ్కమీర
ముకుపుటమ్ములు నదరగ ముక్కలుండ
నానతినిజేసి జనుచుండె నరద గమన
మగడు పగ (పొగ) తోడ, వగలాడి మరల జూసి
వెలికి నికిలించి మదిలోన వెక్కియేడ్చి
కాయ గాదు నీ కాయము గాల్తు, కూర
ముక్కల కనుచు రోదించె మూగి వోలె
అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండివంట' భీముని సతి తన యింట దుంప
ముక్కలను వేచ మనగను ముగ్ధుడగుచు
నూనె నంతయు తీసెను బాణలందు
పోసి వేయించ గయ్యాళి బొబ్బలిదెను