రాజేశ్వరి అక్కయ్యా, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** అశ్వత్థ నారాయణ మూర్తి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. మూడవపాదంలో గణదోషం. ‘బో|వంగను జలధారల కర...’ అనండి. ***** వసంత కిశోర్ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
నాగరాజు రవీందర్ గారూ, మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు. ***** గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** శైలజ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘సంగమ తావులు’ అని సమాసం చేయరాదు. అక్కడ ‘సంగమము జరుగు తావుల’ అనండి.
నింగిని నిలచిన దేవత
రిప్లయితొలగించండిలింగని శిరమందు నుండి లీలగ భువిపై
సంగమ ముకోరి సింధువు
గంగా నదియుప్పు నీరు గలదై పాఱెన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
గంగానదిని సింగారింప బూనిన చెత్తంతా పోటీపడి దానిలో కలుస్తుంటే :
01)
_________________________________
గంగానది కిరు వైపుల
పొంగారెడు కశ్మలంబు - పోటీ పడుచున్
సింగారింపగ గలసిన
గంగానది యుప్పునీరు - గలదై పాఱెన్ !
_________________________________
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవపాదంలో గణదోషం. ‘బో|వంగను జలధారల కర...’ అనండి.
*****
వసంత కిశోర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తింగర వర్తకుడొకడా
రిప్లయితొలగించండినింగిని జూడక లవణము నింపి విపణి బో
వంగను జలధారల కర
గంగా, నది యుప్పు నీరు గలదై పారెన్
గురువుగారికి కృతజ్ఞతలు.
భంగ పరచ భూకంపము!
రిప్లయితొలగించండిక్రుంగగ జనజీవనమ్ము! ఘోరమటంచున్
నింగి వగచి విలపించగ!
గంగానది యుప్పునీరు గలదై పాఱెన్ !!
తుంగుని సిగనుండి తెరలి
రిప్లయితొలగించండిచెంగున మరి పొంగి పొర్లి చెన్నుగ తానే
సంగమ తావుల యందున
గంగానది యుప్పునీరు గలదై పారున్!!!
నాగరాజు రవీందర్ గారూ,
రిప్లయితొలగించండిమీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
*****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘సంగమ తావులు’ అని సమాసం చేయరాదు. అక్కడ ‘సంగమము జరుగు తావుల’ అనండి.
భంగమయి ప్రకృతి, తిమి జరు
రిప్లయితొలగించండిగంగా నదిఉప్పునీరు గలదై పాఱెన్
సంగమపు ప్రదేశమునను
రంగని యాలయముగూడ లవణమయమయెన్
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
డంగైపోతిని కలలో
రిప్లయితొలగించండినింగియె వర్షించుచుండెనిలపై యుప్పున్
పొంగుచు పొరలుచు రయమున
గంగానది యుప్పునీరు గలదై పాఱెన్
గంగా సంగమమునను క-
రిప్లయితొలగించండివుంగిలిలో జేర్చ నుదధి యుల్లాసముతో
పొంగుచు మమేక మయ్యెను
గంగానది యుప్పునీరు గలదై పారెన్.
కాన్పూరులో తోళ్ళ పరిశ్రమ కాలుష్యంతో ఉప్పగా మారుతుంది.
రిప్లయితొలగించండితుంగముల నుండి పాఱుచు
భంగము చేయగను తోళ్ళ పరుషము నరవన్
జంగమ దేవర ప్రియసఖి
గంగానదియుప్పునీరు గలదై పాఱెన్
రిప్లయితొలగించండితొంగలి గొను కశ్మలములు
అంగుళ మంగుళమున నిండి యలజడి రేపన్
పొంగిన యశ్రుజలమ్ముల
గంగానది యుప్పు నీరు గలదై పారెన్
అంగజు పితసుత వీవట
రిప్లయితొలగించండిభంగముఁలజనుల యఘములు భంగమొనర్చన్
సంగము గోరుచు సంద్రుని
గంగానది యుప్పు నీరు గలదై పాఱెన
భాగవతుల కృష్ణారావు గారి పూరణ
రిప్లయితొలగించండిసంగమమందు త్రివేణిని
గంగను మునుగంగ జనుల ఘర్మజలంబుల్
గంగను కలియగ నటు పై
గంగానది యుప్పునీరు గలదై పాఱెన్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదంలో గణదోషం. ‘అంగుళ మంగుళము నిండి...’ అనండి.
*****
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
రెండవపూరణ మూడవపాదంలో గణదోషం. ‘పొంగారుచు/గ కల్మషమై’ అందామా?
గంగను గలియుట సంద్రము
రిప్లయితొలగించండిగంగానది యుప్పు నీరు గలదై పారెన్
మంగా !తెలియుము విషయము
భంగము లుం బెక్కు గలిగి భయమును గొల్పన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమంగళకరుడు హిమాలయ
రిప్లయితొలగించండిశృంగిసముడు గాంధి దాస్య శృంఖల ద్రెంపన్
సంగరమొనర్ప "దండి"న
గంగానది యుప్పునీరు గలదైపాఱెన్ !!!
పోచిరాజు సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
మంద పీతాంబర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
గంగానది కల్మష మే
రిప్లయితొలగించండిపొంగిన సమయాన గట్టు పూర్తిగ నింపన్?
రంగేమారిన నీరే
గంగానదియుప్పు నీరు గలదై పాఱెన్|
2.అంగాంగము లే నిధియై
సింగారపు,శిరులుబంచి-సిరి వెన్నెలలో
పొంగరుచుగ కల్మషమై|
గంగానది యుప్పునీరు గలదై పాఱెన్|
మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు నమశ్శతములతో....
రిప్లయితొలగించండినింగినిఁ జీల్చి నిదాఘము
పొంగుచు నేలకునుఁ దాకఁ బొగిలి జనులుఁ బో
రంగ దొరువుఁ ద్రవ్వఁగఁ బరఁ
గంగా నది యుప్పునీరు గలదై పాఱెన్!
(పరఁగన్+గాన్+అది...అని విఱచి పఠించునది)
కె. ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
రెండవపూరణ మూడవపాదాన్ని ‘పొంగారుచు కల్మషమై’ అనండి.
*****
గుండు మధుసూదన్ గారూ,
వైవిధ్యమైన విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
గంగ |పొంగంగ చెత్త వేగంగ జేర?
రిప్లయితొలగించండినీటి వడబోతయుసుకల పోటిదరుగ?
శుబ్రబరచేటి సిబ్బంది చూడకున్న?
గంగానది యుప్పునీరు గలదై పాఱెన్గంగానది కల్మష మే
చెంగున మోడీ చేరగ
రిప్లయితొలగించండిప్రాంగణమా వారణాసి ప్రజలందరివౌ
పొంగిన కన్నీరు కలిసి
గంగానది యుప్పునీరు గలదై పాఱెన్
రిప్లయితొలగించండిఅంగజహరు కొప్పువిడిచి
గంగానది యుప్పునీరు గలదై పాఱెన్
బంగాళాఖాతములో,
చెంగలి శివుని విడువంగ చింతయె సుదతీ !
జిలేబి
రంగములోనోడి ఘనుడు
రిప్లయితొలగించండిహంగులతో మోడిఁ జూచి హర హర యనుచున్
చెంగున దూకుచు నేడ్వగ
గంగానది యుప్పునీరు గలదై పాఱెన్