కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
బండపైన జొన్నపైరు పండె.
బండపైన జొన్నపైరు పండె.
నా పూరణ....
బండ ప్రక్క నున్న పైరుపై దొంగలు
పడుచునుంద్రు, వారి భయము మెండు,
కొడుక! కావలికయి కూరుచుండవలెను
బండపైన; జొన్నపైరు పండె.
బండపైన; జొన్నపైరు పండె.
జమ్మి కొయ్య దెచ్చి చక్కగా మధియించ
రిప్లయితొలగించండిజ్వాల పుట్టు నంట జగతి వింత
రవిని గాంచి నంత భువికెంత పులకింత
బండ పైన జొన్న పైరు పండె
పంట చేల లోన పక్షిగణ ములుజేరె
రిప్లయితొలగించండికాపు గాయ వలెను కంచె చుట్టు
మంచె కాడ బిడ్డ మంచమే యుటమాని
బండ పైన , జొన్న పైరు పండె
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమాస్టరు గారూ ! .బండ పైన కాపలా...బాగుంది.....
రిప్లయితొలగించండిధాన్యమింక మనము దాచగా వలయును
గాదె కట్ట వలెను కలసి మనము
తగిన వస్తువులను త్వరగానె జేర్చుమా
బండపైన - జొన్నపైరు పండె.
చిన్న సవరణ తో...
రిప్లయితొలగించండిధాన్యమిటకు జేర్చి దాచుటకు మనము
గాదె కట్ట వలెను కలసి, తగిన
వస్తువులను దెమ్ము పరచి కట్టుదమింక
బండపైన - జొన్నపైరు పండె.
పగలు రేయి వెదుక మిగులదు మనకిటు
రిప్లయితొలగించండివెదకి వెదకి యలసి,తుద కిట్లు
నిదుర పోయెదేల నిర్భాగ్యు పోలిక,
బండ! పైన జొన్న పైరు పండె
ఒక దొంగ మరొక దొంగతో అన్న సందర్భం;
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిరాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
*****
అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటిపాదం తేటగీతి అయింది. ‘ఓపిక గొని యొకండె యూసరక్షేత్రాన’ అందామా?
*****
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
ధన్యవాదాలు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవపాదం చివర గణదోషం. ‘తుద కిటులను’ అనండి.
సవరణకు ధన్యవాదములు,
రిప్లయితొలగించండిమరియొక పూరణ;
కొండక్రింది పంట యెండి పోవుచు నుండ
కొండపైన కురిసె వెండివాన
దైవ సృష్టి కిది నిదర్శనమగు గదా!
బండపైన జొన్నపైరు పండె!
ఊసరస్థలినొక డోపిక జేకొని
రిప్లయితొలగించండివాలు భూమి రెండు భాగ ములుగ
పొసగ, నీర మంది పూర్వసు కృతములు
బండ, పైన జొన్న పైరు పండె
రాతినేలలనధునాతన పద్ధతి
రిప్లయితొలగించండిపందిరులనువేసి పైన మట్టి
నింపి పంటవేసి నీరు జల్లగ, క్రింద
బండ - పైన జొన్నపైరు పండె.
అన్య మనస్కంగా నుండి అలా జరిగింది.మీరు కాపు కాస్తుండగా
రిప్లయితొలగించండిమాకు భయము లేదు.
మీరు సూచించిన సవరణలు అత్యుత్తమ మైనవి. గత్యంతరం లేనప్పుడు మీ పదసంపద వాడుకుంటూ, అంతవరకూ నావద్ద నున్నది వాడుకుంటాను. క్షమించండి, అన్యధా భావించకండి.
బట్ట తలకు బూయ బహుమంచి తైలంబు
రిప్లయితొలగించండిపట్టు కుచ్చు వోలె జుట్టు మొలువ
జూచు వార లనిరి సుందరమును జూచి
బండ పైన జొన్న పైరు పండె !!!
బట్ట శిరము పైన జుట్టు మొలిచెనంట
రిప్లయితొలగించండిమంచు లోన బుట్టె మంట లంట
బండపైన జొన్న పైరు పండె నహహ!
కలుగు వింత లెన్నొ కలియుగమున!!!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగోసి యెండ బెట్టుకో కొమరయ మంచి
రిప్లయితొలగించండిబండపైన, జొన్నపైరు పండె
వాన వలన తడసి పాడయి పోవును
పడిన పాటులన్ని వ్యర్థ మౌను.
శ్రీశంకరయ్యగురువుగారికి
రిప్లయితొలగించండిమీసందేహము థీర్చుటకు వాలి సుగ్రీవులజననము వివరించుచున్నాను
In the Thai version of the Ramayana, the Ramakien, Vali and Sugriva are described as Ahalya's children from her liaisons with Indra and Surya. Although Ahalya initially passes them off as sons of Gautama, her daughter by Gautama – Anjani – reveals her mother's secret to her father. He consequently drives the brothers away and curses them to become monkeys. Enraged, Ahalya curses Anjani to give birth to a monkey too. Anjani bears Hanuman, the monkey-god and helper of Rama.Similar tales are also found in the Malay adaptation, Hikayat Seri Rama, and Punjabi and Gujarati folk tales. However, Anjani is cursed by Gautama in these versions, generally for aiding Indra and Ahalya in concealing the secret.
రైతు కూలి వాడు ప్రీతితో శయనించె
రిప్లయితొలగించండిబండపైన, జొన్న పైరుపండె
పక్షి జాతినుండి పంటపొలమ్మును
కాపుకాయు మంచు కాపుచెప్ప
జొన్న సాల్ల మధ్యఁ జొప్పించి నట్లుగన్
రిప్లయితొలగించండిపెసర పంట కనుల విందుఁ జేసె!
సారమున్న నేలఁ జక్కనౌచు పెసలున్
బండ! పైన జొన్న పైరు పండె!
గ్రామ పెద్ద తీర్పు గారవ మొప్పునా
రిప్లయితొలగించండిబండ పైన , జొన్న పైరు పండె
బాగు గాను మాకు పరమేశు ని దయను
జొన్న కంకి సౌరు జూడ తరమె !
రిప్లయితొలగించండితెలుపు,పసుపు,నీలి,కలువ లన్నియు కెళి
జలములందు చంద్రు సరస పండె
చేలు కోయగా విశాల మైన గరుకు
బండ పైన జొన్న పైరు పండె
చలికి పంటరాగ?సర్వులు మెచ్చంగ
రిప్లయితొలగించండిరైతు రాజ్య మేలు కోతరాగ?
కల్ల మున్న బండ కనుపించు ధాన్యమే?
బండఫైన జొన్న ఫైరుబండె|
2,పత్తికొండ పొలము పత్తియు మెండుగా
ఉరువకొండపొలము ఉలువబండ
బోడు బండపొలము భుక్తికి సరిపడు
బండఫైన జొన్న ఫైరు బండె|
నేల యెట్టిదైన నీరున్నచో బండు
రిప్లయితొలగించండిజొన్నలింపుగాను మిన్నుజూచి
జోరు వాన గురిసి జొన్నలే చల్లగా
బండపైన జొన్నపైరు బండె
పండు కొండనేల పంటది జొన్నయే
వాన నీటి తోడ బాగుగాను
తొలకరించి నంత పులకించియును తాను
బండపైన జొన్నపైరు బండె
గిరిజనాళి కిలను గింజలు జొన్నలే
మేలునైన హారమింపుగాను
జల్లు పడిన యంత చల్లగా జొన్నలు
బండపైన జొన్నపైరు బండె
జొన్నలన్నమదియె చొక్కంపు బలమిచ్చు
జొన్న మొండి పంట చూడగాను
వరపు వానగురియ వర్షమాధారమై
బండపైన జొన్నపైరు బండె
పంట కోసి ఆరు బయలున యెండలో
రిప్లయితొలగించండిబండ మీద వేసి బఱచు చుండ
కనుల పంట వోలె కానవచ్చెమనకు
బండపైన జొన్నపైరు పండె
భాగవతుల కృష్ణారావు గారి పూరణ
రిప్లయితొలగించండి1) పంట భూములందు పండెడు పంటలు
బండలందు గూడ పండు ననగ
రాజధాని లోన రాజిల్లు నా ''బోరు
బండ ''పైన జొన్న పైరు పండె
2) ''బందముండ''నుండి పలు రైళ్ళు పరుగెత్తు
రూర్కెలాకు దగ్గరున్న దదియె
బందముండ దరిని పచ్చగ దనరారు
బండ ''పైన జొన్న పైరు పండె
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిరెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
రిప్లయితొలగించండిమీ రెండవ పూరణ బాగుంది. అభినందనలు.
*****
అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
నేను సూచించినదానికన్నా మీ సవరణ బాగుంది. సంతోషం! అభినందనలు.
*****
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
శైలజ గారూ,
మీ పూరణ వైవిధ్యంగా చక్కగా ఉంది. అభినందనలు.
*****
గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘కోసి’ని ‘గోసి’ అన్నారు.
*****
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
నేను ఎప్పుడు ఏ సందేహం వెలిబుచ్చానో, మీరిచ్చిన వివరణ దేనికొరకో నాకైతే జ్ఞాపకం రావడం లేదు. మీరు చెప్పిన కథమాత్రం తెలిసిందే.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
*****
కవిశ్రీ సత్తిబాబు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
భాగవతుల కృష్ణారావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
శ్రీ కంది శంకరయ్య గురువరులకు నమస్కారము జొన్న పైరు పండె (ను).... గోసి వస్తుందనుకున్నాను
రిప్లయితొలగించండివివరించండి
రేయి పగలు బాపురే చెమట కురువ
రిప్లయితొలగించండిమెట్ట సాగు దిట్ట మెరక దున్ని
కనుల కలల పంట కదలగ కల్లము
బండ పైన, జొన్న పైరు పండె
మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు నమస్సులతో...
రిప్లయితొలగించండి(ఒక పిచ్చివాని మాటలు)
"నభము నెక్కి వేగ నావ ప్రయాణించె;
నీటిలోన రైలు నిగిడి సాగె;
నేలపైన చేప లీలగాఁ బరువెత్తె;
బండపైన జొన్నపైరు పండె!"(1)
"నాకుఁ బిచ్చి కుదిరె నా తలకు ఱోఁకలిం
జుట్టుఁ డయ్య వేగ చోద్యముగను!
బండపైన జొన్నపైరు పండెను; కోసి
వంట వండిపెట్టుఁ డింట నాకు!!"(2)
గండూరి లక్ష్మినారాయణ గారూ,
రిప్లయితొలగించండి‘గోసి’... అర్థం కాలేదు.
*****
పల్లా నరేంద్ర గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
గుండు మధుసూదన్ గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
రెండవపూరణ మొదటిపాదంలో గణదోషం. ‘నా తలన్ ఱోఁకలిం’ అంటే ఎలా ఉంటుంది?
శంకరయ్యగారూ! నిన్న నా కంప్యూటరు సతాయించుటచే దినమంతా రిపేరుతోనే గడచినది. సరిచేసిన సమయమునకు నోపిక నశించినది. ఎటులనో యోపిక చేసికొని పూరణములు చేసితిని. రెండవ పద్యము మొదటి పాదమున గణభంగమును గమనింపనైతిని. సవరణము సూచించినందులకు ధన్యవాదములు. సరిపోయినది. కాని, తొందరలో నేను మఱొక దోషముం (’రోఁకలి’లో సాధురేఫమునకు బదులుగా శకటరేఫము"ఱో"ను) జేసితిని. సవరించిన పద్యమునిట నిచ్చుచుంటిని. పరిశీలించఁగలరు. నమస్కారములతో... స్వస్తి.
రిప్లయితొలగించండి"నాకుఁ బిచ్చి కుదిరె నా తలన్ రోఁకలిఁ
జుట్టుఁ డయ్య వేగ చోద్యముగను!
బండపైన జొన్నపైరు పండెను; కోసి
వంట వండిపెట్టుఁ డింట నాకు!!"(2)
మొదటి పాదము సరసముగ లేనిచో...
రిప్లయితొలగించండి"పిచ్చి కుదిరెఁ దలకు వేగమే రోఁకలిం
జుట్టుఁ డయ్య మీరు చోద్యముగను!
బండపైన జొన్నపైరు పండెను; కోసి
వంట వండిపెట్టుఁ డింట నాకు!!"(2)
అనిన నెట్లుండును? పరిశీలించఁగలరు.
స్వస్తి.
పల్ల మైన తలము బండతో నుండగా
రిప్లయితొలగించండివరద మట్టి చేరె వాన కురిసి
రైతు పంట వేయ రయమున పెరుగుచు
బండ పైన జొన్న పైరు పండె!