17, మే 2015, ఆదివారం

సమస్యా పూరణము - 1677 (జందెమ్మును విడిచి యజ్వ జన్నముఁ జేసెన్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
జందెమ్మును విడిచి యజ్వ జన్నముఁ జేసెన్.

41 కామెంట్‌లు:

 1. చిందింల్లక రక్తమ్మును
  పొందగ స్వాతంత్ర్యఫలము పోరును సలుపన్
  గాంధీ పొందెను మెప్పును
  "జందెమ్మును విడిచి యజ్వ జన్నముఁ జేసెన్!"

  రిప్లయితొలగించండి
 2. పొందగ రాజ్యము ధర్మజు
  డందముగా ద్యూత మాడి యాలిని సైతం
  బంధము వీడక గెలువగ
  జందెమ్మును విడిచి యజ్వ జన్నముఁ జేసెన్

  రిప్లయితొలగించండి
 3. శ్రీ కంది శంకరయ్య గారికి వందనములతో ;
  ఇందొక పలకయు లేదయె
  సుందరముగ రాయ సుద్ద శూన్యము , గురులున్
  వందల కైతలుఁ గఱపరె !
  జందెమ్మును విడిచి యజ్వ జన్నముఁ జేసెన్.

  రిప్లయితొలగించండి
 4. బంధనము కలుగు బ్లాగిది
  వందనముల నిడగ నభి వందన ములనన్
  బంధించె గురువు నేర్పుగ
  జందెమ్మును విడచి యజ్వ జన్నముఁ జేసెన్
  -----------------------------

  తప్పులుంటే అందరు మన్నించాలి మరి

  రిప్లయితొలగించండి
 5. కందుకూరి వీరేశలింగం

  http://te.wikipedia.org/wiki/%E0%B0%95%E0%B0%82%E0%B0%A6%E0%B1%81%E0%B0%95%E0%B1%82%E0%B0%B0%E0%B0%BF_%E0%B0%B5%E0%B1%80%E0%B0%B0%E0%B1%87%E0%B0%B6%E0%B0%B2%E0%B0%BF%E0%B0%82%E0%B0%97%E0%B0%82_%E0%B0%AA%E0%B0%82%E0%B0%A4%E0%B1%81%E0%B0%B2%E0%B1%81

  రిప్లయితొలగించండి
 6. కందుకూరి వీరేశలింగం
  ఒక్క జంధ్యమే కాదు - ఆయన చాలా వదిలేసాడు - స్త్రీ అభ్యుదయమనే యఙ్ఞం కోసం :

  అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  01)
  __________________________________

  అందించగ స్త్రీ విద్యను
  బంధనముల ద్రెంచి, విధవ - పాణౌకృతులన్
  పొందింప సమాజంబున
  జందెమ్మును విడిచి యజ్వ - జన్నముఁ జేసెన్ !
  __________________________________
  పాణౌకృతి = పెండ్లి
  పొందించు = అనుకూలపఱచు

  రిప్లయితొలగించండి
 7. బంధము లన్నియుఁ బాసియు
  పొందుగ నమ యపరకర్మ పొనరుచె శ్రద్ధన్
  వందిత శంకర గురువులు ;
  జందెమ్మును విడిచి యజ్వ జన్నముఁ జేసెన్ !

  అమ = అమ్మ

  రిప్లయితొలగించండి
 8. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  మూడవపూరణలో ‘పొనరుచె’ అర్థం కాలేదు. ఆ పాదాన్ని ‘పొందుగ నమ యపరకర్మమును చేసెఁ గదా’ అంటే సరిపోతుందనుకుంటాను.
  *****
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ ప్రయత్నం ప్రశంసార్హం. మొదటి పూరణలో అన్వయం లోపించినట్లుంది. రెండవపూరణ రెండవపాదంలో గణదోషం. ‘వందనముల నొసఁగగ నభివందనము లనన్’ అనండి.
  *****
  వసంత కిశోర్ గారూ,
  వీరేశలింగం పంతులు విషయంగా మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 9. గురువుగారూ ! పిజ్జాలు, సుషీలు , సాండివిచ్చుల నెంచుకోమని రోబాటును కానని నిరూపించుకోమంటే నాకు సాధ్యము కాదు ,పెసరట్టు ,దోసె వంటి పాత తినుబండారలయితే పోల్చుకోగలను !

  రిప్లయితొలగించండి
 10. గాంధీ కైదువు బట్టక
  నందించె స్వేచ్చ గాదె హైమవతముకున్
  పొందుగ నహింస తోడన్
  జందెమ్మును విడిచి యజ్వ జన్నము జేసెన్!!!

  రిప్లయితొలగించండి
 11. శైలజ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  రెండవపాదంలో గణదోషం. ‘అందించెను...’ అంటే సరి!

  రిప్లయితొలగించండి
 12. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  ‘నేను రోబోట్‍ని కాను’ అనీ, reCAPCHA ను నేను ఏర్పాటు చేయలేదు. Blogger నుండి వచ్చింది. మొదట్లో వ్యాఖ్యలు పెట్టినప్పుడల్లా నేనూ ఇబ్బంది పడ్డాను. దానిజోలికి వెళ్ళకుండా నేరుగా వ్యాఖ్యను ప్రచురించవచ్చు.

  రిప్లయితొలగించండి
 13. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 14. ధన్యవాదములు గురువుగారు...

  గాంధీ కైదువు బట్టక
  నందించెను స్వేచ్చ గాదె హైమవతముకున్
  పొందుగ నహింస తోడన్
  జందెమ్మును విడిచి యజ్వ జన్నము జేసెన్!!!

  రిప్లయితొలగించండి
 15. మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు వందనములతో...

  (పితృ అమావాస్యనాఁ డొక బ్రాహ్మణుఁ డొనర్చిన శ్రాద్ధకర్మ మిటులుండెను)


  అందఱు పితృదేవతలకు
  విందగు తర్పణము నిడెడి విధిఁ, దాలిచియున్
  ముందుగఁ గ్రొత్తది, చివికిన
  జందెమ్మును విడిచి! యజ్వ జన్నముఁ జేసెన్!!

  రిప్లయితొలగించండి
 16. శైలజ గారికి నమస్సులు. హైమవతముకు అనరాదు. హైమవతమునకు అనాలి. శ్రీ రామజోగి సన్యాసిరావు గారలా సవరించేవారు.

  రిప్లయితొలగించండి

 17. అందున గురువే యొసగగ
  డెందమ్మున మెచ్చియప్పుడే క్రొత్తదియౌ
  జందెమ్ము దాల్చి, జీర్ణపు
  జందెమ్మును విడిచి, యజ్వ జన్నము జేసెన్!!

  రిప్లయితొలగించండి
 18. సాహితీ మిత్రులు శ్రీ గన్నవరపు నరసింహమూర్తిగారు శైలజగారికి సలహానిడు నెపమున మన గురుదేవులు కీ.శే. శ్రీ నేమాని రామజోగి సన్యాసి రావు గారి స్మృతులను జ్ఞప్తికిఁ దెచ్చినందులకు ధన్యవాదములు. నేమానివారు లేని లోటు మన బ్లాగునందుఁ బ్రతిదినమును స్పష్టముగఁ దెలియుచున్నది. వారు జీవించి యున్నపుడు వారి ధ్యాసయంతయు మన యీ బ్లాగులోననే యుండెడిది. వారు జ్ఞప్తికి వచ్చినప్పు డెల్లను నా హృదయము ద్రవించుచునేయుండును. శ్రీ గురువుగా రే లోకమున నున్నను వారి యాత్మకు శాంతినిఁ బ్రసాదించవలెనని యీ సందర్భమున నా భగవంతుని వేడుకొనుచున్నాను. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 19. శైలజ గారూ,
  గన్నవరపు వారి తెల్పినట్లుగా ‘హైమవతముకున్’ అనడం దోషమే. నేను గమనించలేదు. అక్కడ ‘హైమవతమునన్’ షష్ఠ్యర్థంలో సప్తమి వాడవచ్చు.
  *****
  గుండు మధుసూదన్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  నేమాని గురుదేవుల గురించి మీరు వెలిబుచ్చిన అభిప్రాయం సార్థకమైనది. ధన్యవాదాలు.
  *****
  గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  ధన్యవాదాలు.
  *****
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 20. కందుల వారల యింటను
  జందె మ్మును విడిచి యజ్వ జన్నము జేసెన్
  జందెపు విలువలు దెలియని
  కొంద ఱు మఱి జేటుర టుల కువలయ మందున్

  రిప్లయితొలగించండి
 21. మిత్రులు మధుసూదన్ గారి పూరణ చాలా బాగుంది.

  రిప్లయితొలగించండి
 22. పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 23. అందమ్ముగ చంధమ్మున
  విందౌ 'శ్రీశ్రీ' పదమ్ము, విప్లవ గీతాల్
  చిందులఁ ద్రొక్కించగ నా
  జందెమ్మును విడచి యజ్వ జన్నముఁ జేసెన్!

  రిప్లయితొలగించండి
 24. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 25. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 26. పందెమువేసి హితులతో
  నందరుమెచ్చిన ద్విజుండ నంచును, నాకీ
  జందెమువలదని తానే
  జందెమ్మును విడిచి యజ్వ జన్నముఁజేసెన్

  రిప్లయితొలగించండి
 27. అందున బ్రహ్మానందము
  జందెమ్మును విడిచి యజ్వ జన్నము వేసేన్
  అందరుజూడగ సినిమా
  నిందలతో హాస్యమాడు నియమము నందున్.

  రిప్లయితొలగించండి
 28. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పూరణ బాగున్నది అభినందనలు.

  రిప్లయితొలగించండి
 29. మల్లెలవారి పూరణలు
  1జందెము నొక్కటి తండ్రియు
  జందెంబా శ్వశురుడిడిన సవనార్హుండౌ
  అందిన యప్పటి బంగరు
  జందెమ్మును విడిచి యజ్వ జన్నము జేసెన్
  2.జందెము నందిన నాడే
  అందంబుగజేయు జన్నమగ్నిముఖంబై
  పొందుచు కొత్తది, చివికిన
  జందెమ్మును విడిచి యజ్వ జన్నము జేసెన్
  3.జందెము వీడియు యతియై
  పొందిక నాశ్రమము నందు పొలుపగు జన్నం
  బందము జేయింప,తెగిన
  జందెమ్మును విడిచి యజ్వ జన్నము జేసెన్  రిప్లయితొలగించండి
 30. డెందము సంతసమందెను
  నందను డుదయించె ననగ నాన్నయితి ననన్
  పొందిన జాతాశౌచపు
  జందెమ్మును విడిచి యజ్వ జన్నము జేసెన్

  రిప్లయితొలగించండి
 31. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *****
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 32. మందమ్ము లేని కతమున
  జందెమ్ముల రెంటి దాల్చి, చయ్యన నెరుకన్
  పొందుగ నందున హెచ్చగు
  జందెమ్ము విడిచి యజ్వ జన్నము జేసెన్

  రిప్లయితొలగించండి
 33. భాగవతుల కృష్ణారావు గారి పూరణ

  సందెను పరిణయ మందున
  జందెమునకు తోడు రజిత జందెము నిడి రా
  నందముతో వరుడు రజిత
  జందెమ్మును విడిచి యజ్వ జన్నముఁ జేసెన్.

  రిప్లయితొలగించండి
 34. అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  భాగవతుల కృష్ణారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘రజిత’ కాదు ‘రజత’ సాధురూపం. అలాగే ‘రజతజందెము’ అన్నది దుష్టసమాసం అవుతుంది.

  రిప్లయితొలగించండి
 35. సాహితీ మిత్రులు శ్రీ మిస్సన్నగారికి ధన్యవాదములు!

  రిప్లయితొలగించండి
 36. జందెము తెగినది యని చూ
  పందినభార్య యన?సంధ్య వందనమపుడే
  నందించక మొదటిదచట
  జందెమ్మును విడిచి యజ్వ జన్నము వేసేన్

  రిప్లయితొలగించండి
 37. కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 38. వందల హోతలు తునిలో
  పందెమ్ములు కాసి ముష్టి భండనమొగ్గన్
  దందడిలో గెల్చి తెగిన
  జందెమ్మును విడిచి యజ్వ జన్నముఁ జేసెన్

  రిప్లయితొలగించండి
 39. జందెమ్మక్కర లేదని
  నందముతో తెల్పి తాను నలుబది వరహాల్
  పందెమ్మున గెల్చుకొనుచు
  జందెమ్మును విడిచి యజ్వ జన్నముఁ జేసెన్

  రిప్లయితొలగించండి