21, మే 2015, గురువారం

సమస్యా పూరణము - 1681 (కోర్కె తీఱిన భక్తుఁడు గొల్లుమనెను)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
కోర్కె తీఱిన భక్తుఁడు గొల్లుమనెను.

40 కామెంట్‌లు:

 1. ఏమి యనుకున్న మససులోనెదుటివారు
  తెలియునట్లుగ వరమును దేవుడిడగ
  జనుల అసలు స్వరూపంబు తనకు తెలిసి
  కోర్కె తీఱిన భక్తుఁడు గొల్లుమనెను

  రిప్లయితొలగించండి
 2. గురువుగారు , క్షమించండి మీరు నన్ను సరిగా అర్ధం చేసుకోలేదు.పైన నా వివరణ లో నేను తప్పులు ఎంచడానికి రాలేదు అని.నేను ఎంచినది తప్పుకాదు వారినుండి వివరణ అని చెప్పియున్నాను. ఇకపోతే పాండిత్యము ,కవిత్వము రెండు వేరు వేరు కవిగా మంచి పట్టువున్నవారు పండితులనడానికి వీలులేదు.ఇది నేను చదువుకున్న పాటం .వారు ఉద్దందపందితులే కావచ్చు నేను మిణుగురు పురుగునే కావచ్చు లేదా ఇంకా అంతకంటే నీచమైన దేదైనా కావచ్చు.కాని సభామర్యాద ఏమిటంటే ఒక సభలో మనం కలిసి వున్నప్పుడు సందేహం అడగడం తప్పని ఇక్కడే తెలుసుకున్నాను.పర్వాలేదు ఇకనుంచి నేను నా సందేహాలకు ,సూచనలకు అడ్డుకట్ట వేస్తాను.ఎందరో మహానుభావులు పుట్టిన భారత దేశం మనది ఇందులో ఒకరినిమించిన వారొకరు ఎప్పుడూ పుడుతూనే వున్నారు.మరి ఎందుకో జ్ఞానం ,పాండిత్యం ఇత్యాది సంస్కారాలు ఒక్కరితో నే అంతమౌతాయని అది ఒక్కరికే పరిమితం అని దానిని ప్రశ్నించే హక్కు మనకి లేదని మీరు ఎందుకు అంటున్నారో అర్ధంకావడం లేదు.మహా మహా పండితులు కూడా తప్పులు చేసిన దాఖలాలు మెండుగ వున్నవి .సరే ఏదైనప్పటికీ కవిపండి తులని అడగకూడదు అన్న కనీస సామాన్య జ్ఞానం నాకు లేనందుకు చాలా బాధపడుతున్నాను.మీరు చెప్పినట్టే ఇకనుంచి అడగను.ఒకవేళ అడగాలని తీవ్రమైన ఇచ్చ కలుగుతే ఈ బ్లాగ్ నుండి నిష్క్రమిస్తాను. ఎందుకంటె మిణుగురు పురుగులు సూర్యరశ్మి లో అందులో మాధ్యందిన మార్తాండుని ధాటికి తట్టుకోలేవు.

  సెలవు
  ధన్యోస్మి.

  రిప్లయితొలగించండి
 3. రసవత్తరంగా సాగుతున్న సరస్వతీ ఆరాధనలో
  ఇచ్ఛామార్గము, స్వోత్కర్ష చేరడంవల్ల రసభంగమయింది
  ఎంతో కష్టపడి నిర్వహిస్తూ మాలాంటివాళ్ళకు శిక్షణాలయంలా ఉన్న ఈ వేదిక సాక్షిగా
  భక్తులు ఏమాత్రమూ కోరని
  కోర్కె తీరిన భక్తులు గొల్లు మనిరి

  రిప్లయితొలగించండి
 4. సహా సభ్యులను నిందించడం కుడా ఇచ్చామర్గమే .శిక్షణాలయం అన్నారు ఇక్కడ సందేహాలు అడిగితే తప్పని అంటున్నప్పుడు మీకు శిక్షణ ఎక్కడ జరిగిందో అర్ధంకావడంలేదు మిత్రమా.

  రిప్లయితొలగించండి
 5. మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు నమస్కారములతో...


  ఎన్ని నాళుల నుండియో యింత తపము
  చేసి, పూజించి, వేడినం జిత్తమలరఁ
  దనదు కోరిక తీఱక, తనరఁ బరుని
  కోర్కె తీఱిన, భక్తుఁడు గొల్లుమనెను!

  రిప్లయితొలగించండి
 6. కోటి నోముల నోముచు కోరిి గొలువ
  పుట్టె నొక్కడు పుత్రుండు పుండు వోలె
  దినదినము వాని దుస్థితి తీరు గనుచు
  కోర్కె తీరిన భక్తుడు గొల్లుమనెను

  రిప్లయితొలగించండి
 7. పొరుగు గంటెను రెట్టింపు - పొసగఁ దనకు
  వరము కోరిన భక్తుని - బరుఁడు గనుచు
  చీఁకు నడిగెను నొక కంట - చెడిన కండ్లఁ
  గోర్కె తీఱిన భక్తుఁడు - గొల్లు మనెను.

  రిప్లయితొలగించండి
 8. పిరాట్ల ప్రసాద్ గారూ,
  సందేహం అడగడంలో ఏమాత్రం తప్పు లేదు. కాని అడగడానికి ముందే ఆ ప్రశ్నలోని యుక్తాయుక్తాలు ఒకసారి బేరీజు వేసుకోవాలి. సందేహానికి సమాధానం ఇచ్చిన తర్వాత కూడా దానిని సాగదీయడం సరియైన పద్ధతి కాదు. ఈచర్చను దయచేసి ఇక్కడితో ఆపివేయండి.

  రిప్లయితొలగించండి
 9. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  గుండు మధుసూదన్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  ఎదుటి వాని కిచ్చిన వరానికి రెట్టింపు తనకు ఇవ్వాలని కోరుకున్న భక్తుని కథను మూడుపాదాల్లో నిక్షిప్తం చేసి చక్కని పూరణ చేశారు. అభినందనలు.
  నిజానికి ఇదే కథతో నేను పూరణ చెప్పాలనుకున్నాను. రాత్రినుండి ఆలోచిస్తున్నాను. ఏడెనిమిది పాదాల తేటగీతిక తప్ప మరోమార్గం లేదనుకున్నాను. సంక్షిప్తంగా చెప్పవచ్చని మీరు నిరూపించారు. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 10. నేనూ గన్నవరపు వారి బాటలోనే...


  తపసు జేయగ నిర్వురు తమ్ముడపుడు
  అన్నకిచ్చినదానికే యధిక మడిగె
  అన్నకోరగ పొవగా కన్నుయొకటి
  కోర్కె తీరిన భక్తుడు గొల్లుమనెను

  రిప్లయితొలగించండి
 11. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘కన్ను+ఒకటి’ అన్నప్పుడు సంధి నిత్యం, యడాగమం రాదు. అక్కడ ‘కన్నొకండు’ అనండి. (ఒకండు = ఒకటి, ఒక్కడు)

  రిప్లయితొలగించండి
 12. కవిమిత్రులకు మనవి...
  ఈరోజు మా తమ్ముని మామగారి దశదినకర్మకు వెళ్తున్నాను. రాత్రి వరకు బ్లాగుకు అందుబాటులో ఉండనని గమనించగలరు.

  రిప్లయితొలగించండి
 13. ఏది ముట్టిన నద్దియు హేమముగను
  మార వలెననెడి వరము కోరి బడసి
  పుత్రికను ముట్ట నామెయు పుత్తడవగ
  కోర్కె తీఱిన భక్తుడు గొల్లుమనెను!

  రిప్లయితొలగించండి
 14. చల్లని గదిలో, డబ్బుల సవ్వడుండు
  కొలువుఁ గోరుచుఁ బరమాత్మఁ గొల్చి నంత
  రక్షక భటుడై యేటియం రక్షఁ జేయ!
  కోర్కె తీఱిన భక్తుఁడు గొల్లుమనెను!!

  రిప్లయితొలగించండి
 15. మాన్యులు శ్రీ కంది శంకరయ్య గారూ , మీ సుహృద్భావానికి అయిదు పది చేసి కృతజ్ఞతాంజలి నర్పించడం కన్నా వేరేమి చేయగలను?

  సరస సాహిత్య విశాలాబ్ధి పారగ !
  .......సన్నుతింతును కంది శంకరయ్య !
  నిత్య నూత్న కవిత్వ నిర్మాణ నిపుణ ! ప్ర
  .......శంసింతునో కంది శంకరయ్య !
  ప్రియ శిష్య పద్య పరిష్కార సంధాత !
  .......స్తవమిదే శ్రీ కంది శంకరయ్య !
  'శంకరాభరణ' సభాంకిత జీవన !
  ........సాధువాదము కంది శంకరయ్య !

  అన్నిటికి మించి సౌజన్యమనిననేమొ
  తెలియవచ్చును మీతోడ మెలఁగినపుడు
  భారతీ చరణార్చన భాగధేయ !
  సార సద్గుణగణ్య! శ్రీ శంకరయ్య !

  ఇతి నతయః

  రిప్లయితొలగించండి
 16. ఈ కథను ఏదో సినిమాలో కూడా చూపెట్టారు మూర్తి మిత్రమా!
  అందులో పద్మనాభం ది ఒకపాత్ర. రెండవవాడు సరిగా గుర్తు లేదు.
  రమణారెడ్డి కావచ్చును. పద్మనాభం ఒక కన్ను తనకి పోవాలని కోరుకొంటాడు. రెండవ వాడికి రెండు కళ్ళూ పోతాయి ముందు వాడి కన్నా రెట్టింపు ఫలితం కోరేడు కనుక.
  చక్కని పూరణ చేశారు.

  రిప్లయితొలగించండి
 17. సంత సంబున మునిగెను సంతు జూచి
  కోర్కె తీ రిన భక్తుడు, గొల్లు మనెను
  జన్మ నొందిన బాలుడు చనుట వలన
  చనుట యనగను నర్ధమ్ము చచ్చు ట గద

  రిప్లయితొలగించండి
 18. బొడ్డు శంకరయ్యగారూ,
  పట్టిందల్లా బంగారమయ్యే వరం కోరి, తాను తాకిన తన కుమార్తె గూడా బంగారంగా మారి గొల్లుమన్నవాని కథను వివరిస్తూ చేసిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *******
  గుండా వారూ,
  ఏసీగదిలో డబ్బుల సవ్వడిగల ఉద్యోగం (బాంకు ఉద్యోగిగా) రావాలనే ఉద్దేశ్యంతో వరం కోరితే, ఏటీఎం రక్షక భటుని ఉద్యోగాన్ని వరంగా పొంది గొల్లుమన్నవాని కథతో చమత్కార జనకంగా చేసిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ********
  డా.విష్ణునందన్ గారూ,
  శ్రీ శంకరయ్యగారి సౌజన్యాన్ని అన్ని కోణాల్లో స్పృశించిన మీ సీసపద్యం మీ పాండిత్యాన్నీ, సుజనత్వాన్నీ ప్రకటిస్తున్నది. అభినందనలు.
  *******
  ధన్యవాదాలు మిస్సన్నగారూ!
  ******

  రిప్లయితొలగించండి
 19. ఆది పత్యము కోరుచు, ఆంధ్ర కొరకు ;
  తపము చేసి గెలిచె బాబు, తక్తు నొకటి ;
  సొత్తు లేక, నగరి లేక, చిత్తు కాగ;
  కోర్కె తీఱిన భక్తుఁడు గొల్లుమనెను.
  ( తక్తు = సింహాసనము )

  రిప్లయితొలగించండి
 20. పోచిరాజు సుబ్బారావుగారూ,
  విరుపుతో మీరు చేసిన పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 21. కవిశ్రీ సత్తిబాబుగారూ,
  పదవి కావాలని వరము పొంది, రెంటికిం జెడిన చంద్రబాబు దీనస్థితిని వర్ణిస్తూ చేసిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 22. ఒకటి పాండిత్యపరిమళం.
  మరొకటి సౌజన్యసౌరభం.
  రెండూ దివ్యకుసుమాలే.

  రిప్లయితొలగించండి
 23. నాగరాజు రవీందర్‍గారూ,
  వారణాసికి వెళ్ళాలనే కోరిక తీరినా, భార్య నగల్ని దొంగ దోచుకొన్నందుకు భక్తుడు గొల్లుమన్నాడంటున్న మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 24. నాగరాజు రవీందర్‍గారూ,
  మీ పూరణలో రెండవపాదం...
  ’పిసినిగొట్టు యొకడు వేగ వెడలె నటకు’ అనుదానిని...గొట్టు+ఒకఁడు..ఉత్వసంధి జరగాలి కాబట్టి...
  ’పిసినిగొ ట్టొకండును వేగ వెడలె నటకు’ అని సవరించగలరు. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 25. నిన్ను విడనాడి బ్రతుకుట సున్నయనుచు
  ప్రేమ భక్తికి నేనని పెదవివిప్పి
  తెలిపి వేరొక మగనితో కలసిరాగ?
  కోర్కె తీరిన భక్తుడు గొల్లుమనెను
  2.ఆశ నత్యాస గామార?ఆశయాలు
  ‘”పెరుగుట విరుగు టను నీతి జరుగునట్లు|
  వరము లంది రావణుడట కరుణ లేక
  కోర్కె తీరిన భక్తుడు గొల్లు మనెను

  రిప్లయితొలగించండి
 26. మిస్సన్న మహాశయా ! ధన్యవాదములు . శ్రీ గోలి హనుమచ్ఛాస్త్రి గారికి కృతజ్ఞతలు.

  రిప్లయితొలగించండి
 27. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 28. ఏనెవరి తలఫై హస్త మిడినగాని
  వాడు భస్మ మై రాలిపోవలయునంచు
  దానవుడు వరమందెను కానితుదకు
  కోర్కె తీరినభక్తుడు గొల్లు మనియె|
  sri*k*s*gurumurtigaari
  puranam

  రిప్లయితొలగించండి
 29. సుకవివర్యులు శ్రీ గుండుమధుసూదన్ గారికి ధన్యవాదములు. శ్రీ శంకరయ్య గారన్నట్టు అల్పాక్షరములలో అనల్పార్థమును సాధించిన శ్రీ గన్నవరపు నరసింహ మూర్తిగారు ప్రత్యేక ప్రశంసార్హులు !

  రిప్లయితొలగించండి
 30. జాంబవంతుడు కృష్ణుని సమరమందు
  శిధిలమై మేను దీనుడై చిన్నవోయి
  రామమూర్తిగ గ్రహియించి రక్షగోరె
  కోర్కె తీఱిన భక్తుఁడు గొల్లుమనెను.

  రిప్లయితొలగించండి
 31. మొక్కు చెల్లించు కొనుచుండె ముడుపులొసగి
  కోర్కె దీరిన భక్తుడు, గొల్లుమనెను
  తీర్ధ యాత్రలు జేయగ తెచ్చుకున్న
  పైక మంతయు బోవగ భక్తుడొకరు!!!

  రిప్లయితొలగించండి
 32. మాస్టరు గారూ ! ధన్యవాదములు...చిన్న సవరణ చేశాను..


  తపసు జేయగ నిర్వురు తమ్ముడపుడు
  అన్నకిచ్చినదానికే యధిక మడిగె
  అన్నకోరగ నొక్కటి కన్ను పోగ
  కోర్కె తీరిన భక్తుడు గొల్లుమనెను

  రిప్లయితొలగించండి
 33. కవిమిత్రులకు నమస్కృతులు.
  ఈరోజు నేను బ్లాగుకు అందుబాటులో లేని కారణంగా గుండు మధుసూదన్ గారూ మిత్రుల పూరణల గుణదోష విచారణ చేశారు. వారికి ధన్యవాదాలు. పూరణలు చేసిన మిత్రులకు అభినందనలు. వారు సృశించని పూరణలను నేను సమీక్షిస్తున్నాను.
  ******
  డా. విష్ణునందన్ గారూ,
  అల్పుడనైన నన్ను అనల్పంగా ప్రశంసిస్తూ నాకు బహూకరించిన మీ పద్యం నన్ను అమితంగా ఆనందింపజేసింది. ధన్యవాదాలు.
  *****
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  కొద్దిగా అన్వయం లోపం ఉంది.
  *****
  కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘మదిని’ అనండి.
  *****
  మిస్సన్న గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  శైలజ గారూ,
  విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 34. కోరి చేరెను తిరుమల కొండ పైకి
  వేంకటేశుని దర్శించ వీడె నహము,
  మదిని నిజరూప మానంద మల్లుకొనగ,
  కోర్కె తీరిన భక్తుడు గొల్లు మనెను
  కొరుప్రోలు రాధా కృష్ణ రావు

  రిప్లయితొలగించండి
 35. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 36. డా. శ్రీ విష్ణునందన్ గారికి ధన్యవాదములు. మా నాన్నగారు చెప్పిన నీతి కథ ప్రభావము వలన మీ వంటి విద్వద్వరేణ్యులను గాంచినప్పుడు నాకు సంతసమే గాని అసూయ జనించదు . పెద్దలకు , మిత్రులకు ధన్యవాదములు !

  రిప్లయితొలగించండి