అశ్వత్థ నారాయణ మూర్తి గారూ, మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు. ***** పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. ***** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. ***** గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** కె. ఈశ్వరప్ప గారూ, మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు. ***** శైలజ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
హరికధ లుబుఱ్ఱ కధలవి
రిప్లయితొలగించండిపరికింపగ దొరక వంట పల్లెల యందున్
సరిలేవట వొగ్గు కధలకు
దరిరావి కధరను చెల్లు దౌర్భాగ్యమనన్
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
మూడవపాదంలో గణదోషం. ఒగ్గుకథలను వొగ్గుకథ లన్నారు. ‘సరియుండ వొగ్గుకథలకు’ అనండి.
జాన పదము లందు జాతిమూ లములుండు
రిప్లయితొలగించండిబుర్రకథల విలువ పూర్ణ తరము
ఉల్లముల్లసిల్ల నుర్రూతలూగించు
యెన్ని మార్లు విన్న నింపు చెడదు
సరస పికముల కాకలీ స్వనములెచట
కుక్కనక్కల యూళల కూతలెచట
శిష్ట గాంభీర్య సాహిత్య శ్రేష్ఠమెచట
అన్య భాషల యంగడి హంగు లెచట
(అంగడి హంగులు : కొని తెచ్చిన సోకులు)
హృద్యమైనట్టి పద్యముల్ మృగ్యమయ్యె
వింత యశ్లీల కూతలు వికటమయ్యె
బుర్రకథలవంటి కళలు పూర్ణమయ్యె
తెలుగు భాషకు కష్టముల్ తీరుటెపుడొ
బుర్ర కధలను బేరున పూర్వ గాధ
రిప్లయితొలగించండిలెన్ని యోచెప్పు చుండిరి మిన్న గాను
బుర్ర కధలకు బే రొం దె పూసపాటి
వేంక టేశ్వర రావార్య ! వింటె మీరు ?
పూర్వ కాలమందు బుర్ర కథలఁగాంచి
రిప్లయితొలగించండిపూడులందు ప్రజలు పొంద తృప్తి
నేడు పాత కళలు నీరసించెను సుమ్మ
కాంచు వారులేక గ్రామములను
పూడిః చిన్న గ్రామము
జడుఁడైన మేల్కొను నతడి
రిప్లయితొలగించండిచిడతలు మ్రోగంగఁ గథలఁ జెప్పెడు వేళన్!
సడిజేయుచు గుమ్మెటలన్
దడదడ లాడించ జంట తంబుర మ్రోగన్!
కవియువిత్తగ అక్షరాల్కలముచేత?
రిప్లయితొలగించండినీరు,గాలిగవాద్యముల్చేరుకొనగ|
గళమునందున బండించు గానమమర
బుర్రకథ విన?వెంటనే బుర్రజేరు|
2}మనసున జేరు మంత్రముగ మౌనము నందున విన్నవారికిన్
ఘనతను గూర్చు భావనలు గాంచకనీచెవిజేరిపోవగా|
అనువుగ బుర్ర జేర్చుకథ అందరి యందున సామరస్యమే
మనుగడ మాటపాటలను మాకడబంచను వాధ్యకారులే|.
ఊరి వారికి నుత్చహ మొసగు నట్టి
రిప్లయితొలగించండిపగలు రాత్రిళ్ళు కథకులు పట్టు బట్టి
ఊరు వాడలు కథ లెన్నొగోర?జెప్పి
బుర్ర జేర్తురు ప్రజలకు బుర్ర కథగ|
పిట్ట కధలతోడ వీరగాధలు దెల్పి
రిప్లయితొలగించండిజాగృతంబు జేసె జనుల నాడు
పల్లె సీమలందు ప్రాభవమ్మొలికించు
బుర్రకధలు నేడు పూజ్యమాయె !!!
అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
*****
శైలజ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
మిత్రులందఱకు నమస్సులతో...
రిప్లయితొలగించండిహరికథయె యాంధ్రలోపల;
మఱి బుఱ్ఱకథ తెలగాణ మందున మిగులన్
బరమ ప్రచారము నందియు
సరసుల మన మలరఁ జేసెఁ జక్కని వేడ్కై!!
గుండు మధుసూదన్ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.