కుతుబు షా తన భార్యకు కూర్మితోడ భాగ్య నగరము నొసగెను భాగమతికి తాజమహలును గట్టె నా షాజహాను రాజు లిద్దరు ప్రేమ సామ్రాజ్యమునకు వన్నె దెచ్చిరి చరితకు వసుధ యందు!!!
కవిమిత్రులకు నమస్కృతులు. పెళ్ళికి వెళ్ళి ఇప్పుడే తిరిగి వచ్చాను. ఈ మూడు రోజులు మీ పూరణలను సెల్‍ఫోన్‍లో చదువుతూనే ఉన్నాను. మొదటిరోజు పూరణలను సమీక్షించిన డా. విష్ణునందన్ గారికి, మిగిలిన రోజుల్లో అప్పుడప్పుడు సమీక్షించిన గుండు మధుసూదన్ తదితర మిత్రులకు ధన్యవాదాలు. పూరణలు చేసిన అందరికీ అభినందనలు. ***** గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, ‘శ్రద్ధ, సాబూరి’లము భక్తి సామ్రాజ్యానికి రాజులను చేసిన మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, యువరాజు లిద్దరిని ప్రేమసామ్రాజ్యాధిపతుల్ని చేసిన మీ పూరణ బాగున్నది. అభినందనలు. ప్రేమతో వడ్డించిన ఆహారాన్ని గురించిన నిన్నటి సమస్యకు మీ పూరణ బాగున్నది. అయినా ప్రేమతో వడ్డించినపుడు రుచి, శుచి లెక్కకు రావుకదా! ***** భాగవతుల కృష్ణారావు గారూ, షాజహాను, నల మహారాజుల గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘అమృతుడు’ అంటే ధన్వంతరి, చావు లేనివాడు అనే అర్థాలున్నాయి. మీరు ఏ అర్థంలో ప్రయోగించారు? ***** రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ, ఇంద్రగణాల ప్రస్తావనతో మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** గన్నవరపు నరసింహ మూర్తి గారూ, బహుకాల దర్శనం. సంతోషం! ఒక్క నెలరాజునే బింబప్రతిబింబాల రూపాలుగా ఇద్దరు రాజులను చేసిన మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** మల్లెల సోమనాథ శాస్త్రి గారూ, నిన్నటి పూరణకు మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు. ***** శైలజ గారూ, కుతుబ్‍షా, షాజహానుల గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** నాగరాజు రవీందర్ గారూ, నెలరాజు, దినరాజుల గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘చెప్పిరి+ఆర్యులు’అన్నప్పుడు యడాగమం రాదు. ‘చెప్పినా రార్యులు’ అనండి. ***** గుండు మధుసూదన్ గారూ, ప్రేమకోసం శాపగ్రస్తులైన నెలరాలు, సురరాలుల గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** మల్లెల సోమనాథ శాస్త్రి గారూ, మీ నాలుగు పూరణలు వైవిధ్యంగా, చక్కగా ఉన్నాయి. అభినందనలు. ‘గుండెలో నిల్పె విష్ణుండు...’ అంటే బాగుంటుందేమో?
కె.యస్.గురుమూర్తి ఆచారి గారి పూరణ ప్రేయసి వలపు దొడిగించు ప్రేమరాణి రాగసుద చిందు ప్రియుడేమొ రాజు గాగ రాగిలుదు రిరువురు వల రాజు చేత రాజులిద్దరు ప్రేమసామ్రాజ్యమునకు
తోటి వారల ప్రేమించు బాట లోన
రిప్లయితొలగించండికర్మఫలియించ నడిపించు నిర్మలముగ
'శ్రద్ధయున్ సబూరి'లనుచు సాయి పలుకు
రాజు లిద్దరు ప్రేమసామ్రాజ్యమునకు
రిప్లయితొలగించండిరాచకన్నెలు ప్రేమించె రాజ సుతుల
పెద్దవారల సమ్మతి పేర్మి మీర
భర్త లయ్యిరి ముదమున వలచిన యువ
రాజు లిద్దఱు ప్రేమ, సామ్రాజ్యమునకు.
భాగవతుల కృష్ణారావు గారి పూరణ
రిప్లయితొలగించండిసర్వ'భారత'మేలిన షాజహాను
రాణి దమయంతి జేరిన రాజునలుడు
రాజు లిద్దఱు ప్రేమసామ్రాజ్యమునకు.
మరువరా చంద్ర తారార్క మందు జనులు
నిన్నటి సమస్యకు నా పూరణ
రిప్లయితొలగించండిఏబి సీ విటమిను లైరను కూరల
శుచియు శుభ్రత గల చోట రుచిగ
వండి ప్రేమ తోడ వడ్డించు నట్టియా
హార మొసఁగు శుభము లందఱకును.
మంచపై జంటనమృతుడు మరులు కొలుప
రిప్లయితొలగించండిపడతి హృదిలోన కోర్కులు పరిఢవిల్ల
తలచె వెన్నెల రేతిరి తన్వి తోడ
రాజులిద్దరు ప్రేమ సాంబ్రాజ్యమునకు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితేటగీతికి నెన్నగా తెలియుము సుర
రిప్లయితొలగించండిరాజు లిద్దరు; ప్రేమ సామ్రాజ్యమునకు
మాత్రమొక్కతె రాణియౌ మనిషి కెపుడు
నందచందాల నలరించి హాయి గొలుప.
"సూర్యుడొక్కరుండు సురరాజు లిద్దరు"అని తేటగీతి ప్రారంభం..
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినింగి దారల మధ్యలో నెగడు నొకడు
రిప్లయితొలగించండిబింబ రూపము గలువల జుంబనమ్ము
చేసి యొక్కండు సరసిలో జెలువు గొలుపు
రాజు లిద్దఱు ప్రేమసామ్రాజ్యమునకు!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినిన్నటి సమస్యకు నాపూరణలు;
రిప్లయితొలగించండిదుష్ట హరము మాని,దూరమై యుండిన,
దోష మగును,హింస దురిత మనిన,
శిష్ట రక్షణెట్లు,చేయగా దుష్టసం
హార,మొసగు శుభము లందరకును
భూమికంపమొంద పొందెను నేపాలు
పాట్లు,జనుల కష్టమట్లు వీడ
మనము సాయపడగ మహిత రీతిని పరి
హారమొసగు శుభము లందరకును
విష్ణువతడు దాల్చు వెలిగేటి యా కౌస్తు
భంబు,శివుడు దాల్చు భవ్యమైన
ట్టి,రుదురాక మాల ఠీవిగా మెడలోన
హారమొసగు శుభము లందరకును
లలితనామ పఠన లాలిత్యమౌ రీతి
నిచ్చు,శుభము లెన్నొ,యిడును ముక్తి
నిత్య పఠన జేయ,నియతి నా నామాల
హారమొసగు శుభము లందరకును
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికుతుబు షా తన భార్యకు కూర్మితోడ
రిప్లయితొలగించండిభాగ్య నగరము నొసగెను భాగమతికి
తాజమహలును గట్టె నా షాజహాను
రాజు లిద్దరు ప్రేమ సామ్రాజ్యమునకు
వన్నె దెచ్చిరి చరితకు వసుధ యందు!!!
రాజు లిద్దరు ప్రేమ సామ్రాజ్యమునకు
రిప్లయితొలగించండిసరిగ జెప్పిరి యార్యులు మఱి దె లియుము
ఒకరు పెనిమిటి మన్మధుం డిం కొకరగు
వీరి వలననే బెంపొందు వారి ప్రేమ
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమిత్రులు శ్రీకంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు నమస్సులతో...
రిప్లయితొలగించండితారకై క్షయ శాపమ్ముఁ దాల్చె! నిఁక, న
హల్యకై వే కనుల్ దేహమందుఁ దాల్చి
వరలె! రేరాజు సురరాజు వరుసగాను
రాజు లిద్దఱు ప్రేమసామ్రాజ్యమునకు!!
షాజహానుడు కట్టించె తాజమహలు
రిప్లయితొలగించండిభాగమతికౌచు నిర్మించె భాగ్యనగర
మొకడు,ప్రేమకు ఋజువులై యొప్పెగాదె
రాజులిద్దరు ప్రేమసామ్రాజ్యమునకు
గుండె నిలిపెను విష్ణుండు గోప్యముగను,
సగము దేహంబు శివుడిచ్చె శాశ్వతముగ
వారి ప్రేమకు నెనయగు వార లెవరు?
రాజులిద్దరు ప్రేమసామ్రాజ్యమునకు
రాముపై ప్రేమ వెలిగిన రాజులౌచు
గుడులు కట్టించె కంచెర్ల గోపరాజు
కీర్తనంబుల త్యాగయ్య కీర్తినందె
రాజులిద్దరు ప్రేమసామ్రాజ్యమునకు
భాషలందున ప్రేమచే భవ్యులైరి
భోజుడొక్కడు నవరత్న పోషణమున
రాయలష్టదిగ్గజముల రమ్యరీతి
రాజులిద్దరు ప్రేమసామ్రాజ్యమునకు
సోమనాధశాస్రిగారి
రిప్లయితొలగించండి'గుండె నిలిపెను విష్ణుండు గోప్యమగను'
పద్యం చాలా బాగుంది.
కవిమిత్రులకు నమస్కృతులు.
రిప్లయితొలగించండిపెళ్ళికి వెళ్ళి ఇప్పుడే తిరిగి వచ్చాను. ఈ మూడు రోజులు మీ పూరణలను సెల్‍ఫోన్‍లో చదువుతూనే ఉన్నాను. మొదటిరోజు పూరణలను సమీక్షించిన డా. విష్ణునందన్ గారికి, మిగిలిన రోజుల్లో అప్పుడప్పుడు సమీక్షించిన గుండు మధుసూదన్ తదితర మిత్రులకు ధన్యవాదాలు. పూరణలు చేసిన అందరికీ అభినందనలు.
*****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
‘శ్రద్ధ, సాబూరి’లము భక్తి సామ్రాజ్యానికి రాజులను చేసిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
యువరాజు లిద్దరిని ప్రేమసామ్రాజ్యాధిపతుల్ని చేసిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ప్రేమతో వడ్డించిన ఆహారాన్ని గురించిన నిన్నటి సమస్యకు మీ పూరణ బాగున్నది. అయినా ప్రేమతో వడ్డించినపుడు రుచి, శుచి లెక్కకు రావుకదా!
*****
భాగవతుల కృష్ణారావు గారూ,
షాజహాను, నల మహారాజుల గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘అమృతుడు’ అంటే ధన్వంతరి, చావు లేనివాడు అనే అర్థాలున్నాయి. మీరు ఏ అర్థంలో ప్రయోగించారు?
*****
రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
ఇంద్రగణాల ప్రస్తావనతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
బహుకాల దర్శనం. సంతోషం!
ఒక్క నెలరాజునే బింబప్రతిబింబాల రూపాలుగా ఇద్దరు రాజులను చేసిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
నిన్నటి పూరణకు మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
*****
శైలజ గారూ,
కుతుబ్‍షా, షాజహానుల గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
నాగరాజు రవీందర్ గారూ,
నెలరాజు, దినరాజుల గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘చెప్పిరి+ఆర్యులు’అన్నప్పుడు యడాగమం రాదు. ‘చెప్పినా రార్యులు’ అనండి.
*****
గుండు మధుసూదన్ గారూ,
ప్రేమకోసం శాపగ్రస్తులైన నెలరాలు, సురరాలుల గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ నాలుగు పూరణలు వైవిధ్యంగా, చక్కగా ఉన్నాయి. అభినందనలు.
‘గుండెలో నిల్పె విష్ణుండు...’ అంటే బాగుంటుందేమో?
కనగ దినమణి వలరాజు కమలములకు
రిప్లయితొలగించండికూర్మి వలరాజు నెలరాజు కుముదములకు
రాజు లిద్దఱు ప్రేమసామ్రాజ్యమునకు
గగనమొక్కటి తారకల్ గంపెడన్ని!!!
ఎడదఁ బ్రేమాంకురము మొలిపించునట్టి
రిప్లయితొలగించండివాడు వలరాజు; దానికి వన్నెలిడుచు
పెంచి పోషించు నెలరాజు; పేర్కొనంగ
రాజు లిద్దఱు ప్రేమసామ్రాజ్యమునకు.
మంద పీతాంబర్ గారూ,
రిప్లయితొలగించండిదినరాజు నెలరాజుల మీ పూరణ బాగున్నది. అభినందనలు.
చంద్రుడు : తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
రిప్లయితొలగించండిఅభిరూపుడు, అమతి, అమృతకరుడు, అమృతకిరణుడు, అమృతదీధితి, అమృతసువు, అమృతసూతి, అమృతాంశుడు, అమృతుడు,
చంద్రుడు అనే అర్థంలో వాడాను.మంచపైనున్న మగడొకరాజైతే వెన్నల నొసంగి కనుచున్ననెలరాజొక రాజు.
మరులు విరితూపులతొ పెంచు మారుడొకడు
రిప్లయితొలగించండిమరుని కవ్వించునబ్ధీకుమారుడొకడు
ఒకడు వలరాజు నెలరాజునొకడు చూడ
రాజులిద్దరు ప్రేమ సామ్రాజ్యమునకు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅన్నపరెడ్డి వారూ,
రిప్లయితొలగించండివివరణకు ధన్యవాదాలు.
*****
శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
మారుడు, అబ్ధికుమారులతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘తూపులతొ’ అని ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించారు. అక్కడ ‘తూపులను’ అని తృతీయార్థంలో ద్వితీయను ప్రయోగించవచ్చు.
*****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘అర్హు లగుటయె’ అనండి.
వాలి,సుగ్రీవసోదరుల్|భార్యనొకతె
రిప్లయితొలగించండిరాజు లిద్దఱు ప్రేమ సామ్రాజ్యమునకు
అన్యకాంతను నూహించి హాయి యనుచు
వాలి యేలుట ధర్మమా?జాలిలేక|
రాజు లిద్దఱు| ప్రేమ---సామ్రాజ్యమునకు అర్హు లగుటయె సహజము లంతె గాని
రిప్లయితొలగించండిరెండుకత్తులు నొరయందు నుండగలవ?
మనిషి వేరైన మనసులు మారుగాదె?
షాజహాను వలచెను ముంతాజు నతిగ
రిప్లయితొలగించండియువ సలీమనార్ఖలి కోస మోడిపోయె
మొగలు వంశమునందు వ్యామోహపడిన
రాజులిద్దరు ప్రేమ సామ్రాజ్యమునకు!
కె. ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
*****
బొడ్డు శంకరయ్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కె.యస్.గురుమూర్తి ఆచారి గారి పూరణ
రిప్లయితొలగించండిప్రేయసి వలపు దొడిగించు ప్రేమరాణి
రాగసుద చిందు ప్రియుడేమొ రాజు గాగ
రాగిలుదు రిరువురు వల రాజు చేత
రాజులిద్దరు ప్రేమసామ్రాజ్యమునకు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసవరణతో.....
రిప్లయితొలగించండిషాజహాను వలచెను ముంతాజు నతిగ
యువ సలీ మనార్ఖలి కోస మోడె; మొగలు
రాజ వంశమున బ్రతీక రాజుయు, యువ
రాజు లిద్దరు ప్రేమ సామ్రాజ్యమునకు!
1665 సమస్యాపూరణము.
రిప్లయితొలగించండిరోడ్లపైన నమ్ము రుచికర మైనట్టి
వంటకాల దిన్న వ్యాధులమరు
వంట జేసి శుచిగ వండిన నింటి యా
హార మొసగు శుభము లందరకును!
1664 సమస్యాపూరణము.
దూరక నొండొరులు ప్రగతి
దారులు వెదకుచు నొనర్చి తమపర్యటనల్
కూరిమితో గడిపినది
భారత దేశాధిపతి, ఒబామాయే సుమీ!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిరైతుపండించు పంటచే రాజుగాగ|
రిప్లయితొలగించండిరాజ రాజుగ చంద్రుడు రాజ్య మేల?
రాజు లిద్దఱు ప్రేమ సామ్రాజ్యమునకు
ప్రజల బాగోగుకై నిలువ?ప్రతిభ గాధ|
కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
బొడ్డు శంకరయ్య గారూ,
నిన్నటి మొన్నటి సమస్యలకు మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
*****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.