చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** రాజేశ్వరి అక్కయ్యా, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ‘కడుపులు నింపున్’ అనండి. అన్వయం కుదురుతుంది. ***** అశ్వత్థ నారాయణ మూర్తి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** అశ్వత్థ నారాయణ మూర్తి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
గుండు మధుసూదన్ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ‘కండలు+ఎండిన’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘కండలు సడలిన’ అనండి. ***** కె. ఈశ్వరప్ప గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ‘మానసంబుకున్’ అనరాదు... ‘మానసంబునకున్’ అనడం సరియైనది. ***** శైలజ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఇష్టమ్ముగ కష్టించును
రిప్లయితొలగించండికష్టమ్మని తలపదెపుడు కష్టించక సం
తుష్టి పడదు ముదుసలి తన
దృష్టి మరల్చకనె పనిని దీక్షగ చేయున్
మండెడి ఎండన ముదుసలి
రిప్లయితొలగించండియెండిన కట్టెలను గొట్టి యేకాంత మునన్
తిండిని వండుట కొఱకని
కండలు కరిగించి సంతు కడుపులు నింపన్
అకట, యెంత కష్ట మత్యంత నీచము
రిప్లయితొలగించండికన్న బిడ్డ లిటుల కర్కశమున
తల్లి నొంటి వదలి తగని పనులు సేయ
కలి యుగాన సుతులు కాల యములు
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘కడుపులు నింపున్’ అనండి. అన్వయం కుదురుతుంది.
*****
అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికాకాటికి కాళ్లను జాపిన
రిప్లయితొలగించండినేటికి నీ కష్టమనిన, నేడ్చుచు నవ్వెన్!
కూటికొరకు, నీ పలికిన
కాటికొరకుఁ గన్న వారు కాదనిరనియెన్!
వడలిన సడలిన జడలను
రిప్లయితొలగించండికడు ముదిమి తనయొడ లెల్ల గడగడ వడకన్
ఎడనెడ నుసురుసు రనుచును
గడసరి ముదుసలి పరశువు కరముల నెత్తెన్
మొదటి పాదంలో టైపాటు సవరణతో :
రిప్లయితొలగించండికాటికి కాళ్లను జాపిన
నేటికి నీ కష్టమనిన, నేడ్చుచు నవ్వెన్!
కూటికొరకు, నీ పలికిన
కాటికొరకు, కన్నవారు కాదనిరనియెన్!
వంట చెరుకు కొరకు వంగిన నడుముతో
రిప్లయితొలగించండిపండు ముసలి తల్లి యెండ లోన
కరము తృష్టి తోడ కండలఁగరిగించి
కష్ట పడుచు నుండె కడుపు నిండ
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు నమస్కారములతో....
రిప్లయితొలగించండి(భూకంపమున సర్వస్వముం గోలుపోయి దిక్కులేక దేవునితో మొఱపెట్టుకొనుచున్న నొక వృద్ధురాలి వేదనము)
"అక్కట! కొడుకులు కోడం
డ్రొక్కట భూకంపమునను రూపఱి నన్నీ
యిక్కటులఁ ద్రోసిరయ్యా!
దిక్కేదయ నాకు నిపుడు దేవుఁడ చెపుమా!!"
రిప్లయితొలగించండికండలు యెండిన ముదుసలి
తిండి కొరకు కట్టె కొట్టు దీక్షను జూడన్
దుండగులకు కనువిప్పగు
గుండాగిరి మాని బ్రతుకు కుదురుగ సేయన్
ముదుసలి మొద్దు జీల్చుటన?మోదముగాదది కాని ఆకలే
రిప్లయితొలగించండిపదునును బెట్టగొడ్డలికి పట్టుగగొట్టెడి మానసంబుకున్
వదలని నిష్ట పుష్టి నిడ?వద్దననున్న వయస్సు దూరమై|
అదురును మాని ఆకలిని ఆవల ద్రోసెను నంతరంగమే|
కుదురుగ పరశువు బట్టుకు
రిప్లయితొలగించండిమొదలిడె గట్టెలనుగొట్ట ముదుసలి యచటన్
నదునుకవి వంట చెఱకుగ
నొదవుననుచు గొట్ట సాగె నోరిమి తోడన్!!!
గుండు మధుసూదన్ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘కండలు+ఎండిన’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘కండలు సడలిన’ అనండి.
*****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘మానసంబుకున్’ అనరాదు... ‘మానసంబునకున్’ అనడం సరియైనది.
*****
శైలజ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.