దారి దప్పితి నోయమ్మ! దారి దెలుపు సంధ్య వార్చగ నయ్యెను సమయ మిపుడు తల్లి దండ్రులు ముదుసలి వారు కూడ సేవ జేయగా బోవలె శీ ఘ్రముగను ననుచు నావరూ ధినిగోరే నాప్ర వరుడు
టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. మూడవ పాదంలో యతి తప్పింది. సవరించండి. ***** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** మిస్సన్న గారూ, ‘ఇంతలు కన్నులుండ...’ పద్యానికి మీ పునఃకథనం చాలా బాగున్నది. అభినందనలు. ***** మంద పీతాంబర్ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** కె. ఈశ్వరప్ప గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
శైలజ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. ‘సోయగమ్ములను+ఇచ్చను’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘సోయగమ్ములను నిచ్చను...’ అనండి. ***** గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
దారిని మరచిన ప్రవరుడు
రిప్లయితొలగించండికోరెవ రూధినిని త్రోవ కోమలి జెపుమా
యూరికి బోవగ నేటికి
మారుడనిను మరులు గొంటి మన్నించు మయా
విప్రవర! నీ ప్రవర యేమి? వివరమేమి?
రిప్లయితొలగించండివరస జూడగ వరహాల పలుకు నీది
ఇంత సొగసు నేను కనలేదింతవరకు
వరమునిచ్చి తోడగుము చివర వరకును!!
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
జిగురు సత్యనారాయణ గారూ,
‘వర’ శబ్ద ఆవృత్తితో మీ పద్యం బాగున్నది. అభినందనలు.
మత్తు గొలిపెడి యందము మదన బాల!
రిప్లయితొలగించండిపేరు వూరును జెప్పుమ! పేర్మి తోడ!
నాన్న తోడుత వచ్చెద నన్ను నమ్ము
అన్యు లెవ్వరు చేపట్ట, నాత్మ హత్యె!
దారి దప్పితి నోయమ్మ! దారి దెలుపు
రిప్లయితొలగించండిసంధ్య వార్చగ నయ్యెను సమయ మిపుడు
తల్లి దండ్రులు ముదుసలి వారు కూడ
సేవ జేయగా బోవలె శీ ఘ్రముగను
ననుచు నావరూ ధినిగోరే నాప్ర వరుడు
దారి తప్పిన ప్రవరుడు తరుణి గాంచి
రిప్లయితొలగించండివేడె త్రోవఁ జూప మటంచు వినయముగను
సుందరుడగు నా విప్రునిఁ జూడ గానె
మరుని తాపుకు గురియయ్యె మచ్చ కంటి
కన్నులు చూడ నింతలవి కాంచవె భూసుర నీదు బాట నౌ
రిప్లయితొలగించండినన్నులమిన్న నొంటిగ గనంగను మాటల గల్ప బూనెదో
యెన్నగ పల్కులేల నిక యింత యెరుంగవె వచ్చు దారి? నే
నన్నను లోకువై యిటుల నందువు కాక మరేమి చాలులే.
పిడికెడు నడుమును గలిగిన
రిప్లయితొలగించండిపడచునుగని విప్రవరుడు పడిపోయెనుగా
గడుసరి చూపుల వలలో,
గుడికరగుటమరిచె ప్రేమగుణమధికమ్మై !!!
ప్రవర ప్రవర్త నావళి వివాదమునందున రక్తిగట్టగా|
రిప్లయితొలగించండిసవరణచే వరూధిని ప్రశాంతత లేకను ప్రేమ మోజులో
దివివరు లట్లు గోరుటన?దిక్కులుజూచుచు విప్రవర్యుడే
వివరణ నీయకే వెడలె విన్నప మేదియు లెక్కజేయకన్\
టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
మూడవ పాదంలో యతి తప్పింది. సవరించండి.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
మిస్సన్న గారూ,
‘ఇంతలు కన్నులుండ...’ పద్యానికి మీ పునఃకథనం చాలా బాగున్నది. అభినందనలు.
*****
మంద పీతాంబర్ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
Guruvugaariki dhanyavaadaalu
రిప్లయితొలగించండితెరువును మరచిన ప్రవరుని
రిప్లయితొలగించండితరుణి వరూధినియె గాంచి తాపము తోడన్
మరులు గొని మనసుదెలుపగ
పరివర్జించుచు వెడలెను ప్రవరుండామెన్!!!
హిమగిరి సోయగమ్ములను యిచ్ఛను జూడగ నేగుదెంఛి యీ
రిప్లయితొలగించండిసుమ సుకుమారి సోయగము చూడగ నోపరు భూసురేంద్ర మీ
గమనమె యింటివైపునకు కాదన బోనులె, కోర్కె దీర్చినన్
సుమముల బాణ ఘాతముల సొక్కులు దీరగ సంతసింతురా.
పసరును సోకినఁ బాదము
రిప్లయితొలగించండివిసరగ నీ కొండ కోన వీక్షించితివా?
సిసలైన కొండ కోనల
కసితో చూపింతు రార! కౌగిటఁ జేరన్!
శైలజ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘సోయగమ్ములను+ఇచ్చను’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘సోయగమ్ములను నిచ్చను...’ అనండి.
*****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
మాస్టరు గారూ ! ధన్యవాదములు...మీరు చూపిన సవరణ తో...
రిప్లయితొలగించండిహిమగిరి సోయగమ్ములను నిచ్ఛను జూడగ నేగుదెంఛి యీ
సుమ సుకుమారి సోయగము చూడగ నోపరు భూసురేంద్ర మీ
గమనమె యింటివైపునకు కాదన బోనులె, కోర్కె దీర్చినన్
సుమముల బాణ ఘాతముల సొక్కులు దీరగ సంతసింతురా.