23, జనవరి 2013, బుధవారం

పద్య రచన - 230




కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

13 కామెంట్‌లు:


  1. ఏ కాలమైనా తన కాలం కాని స్త్రీ
    నాడు రామాయణం లో అగ్ని ప్రవేశం
    మొన్న ఇంద్రప్రస్థం లో అగ్గి బరాటా
    రేపు మరి ఎక్కడో ఈ ప్రకృతి కి బుగ్గి ?

    జిలేబి.

    రిప్లయితొలగించండి
  2. దశరథ సుతుండు రాముడు ధర్మమూర్తి
    రాము నిల్లాలు సీత సాధ్వీమతల్లి
    వారి గాత్రాలు హృదయాలు వేరు కావు
    వారి లీలలు కళ్యాణ కారకములు

    అగ్నిహోత్రునిలో దాగె నవనిజాత
    అపహరించె మాయాసీత నసురనేత
    అసుర సంహార మొనరించి నట్టి పిదప
    అగ్ని జేరె మాయాసీత యవనివీడి

    అగ్నిలో నుండి సీత మహాద్భుతముగ
    వచ్చి చేరెను ప్రేమతో స్వామి రాము
    కురిసిరంతట పూజల్లు సురలు మునులు
    ప్రస్తుతించుచు జానకీ రాఘవులను

    జయము సీతారాములారా!
    జయము చిన్మయ మూర్తులారా!
    జయము లాలిత హృదయులారా!
    జయము మంగళము

    రిప్లయితొలగించండి
  3. కవి మిత్రులకు శుభాశీస్సులు.
    శ్రీమద్రాయణము పరమ పవిత్రమైన గ్రంథము. అది సాక్షాత్తు వేదమే. దానిని కించపరచుచూ రచనలు చేయవద్దని నా మనవి. శ్రీరాముడు ధర్మమూర్తి. ఆ దేవుని నిర్ణయములు శిరోధార్యములు. దయచేసి ఎవ్వరునూ అపహాస్యము పాలు చేయకండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  4. శ్రీ నేమాని వారి అభిప్రాయాన్ని బాలపరుస్తూ, నా మాటగా: మనలో చాలామంది శ్రీ రామాయణ భారత భాగవతాలు తెలుసుననుకొంటూ తేలికగా కొన్నిటి గురించి మాట్లాడతాము. అది కూడదు. ఆ మహాకావ్యాలు అర్థం చేసుకోనటానికి ఒక జీవితం చాలదు అన్న కవిసామ్రాట్ విశ్వనాథ వారి మాటలు అక్షర సత్యం. గౌరవిద్దాం, తెలియక పోతే తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం, కువిమర్శలకు త్వరపడి దిగవద్దని సవినయ మనవి.

    రిప్లయితొలగించండి
  5. అగ్ని ప్రవేశం సందర్భాన్ని ఏమీ అర్థం చేసుకోడానికి ప్రయత్నించకనే
    తగుదునమ్మా అంటూ విమర్శ చేసే వారిని జూసినపుడు ......

    తండ్రి తాతలు పాటించు ధర్మమేమొ
    దాని యర్థమేమొ తెలియ తరము కాక,
    యెఱుగలేక చతికిలబడెదరు నేటి
    యుగము నందలి నరులిక నొక్క తీరు.

    ధర్మమూర్తులు సీతమ్మ, తనదు భర్త
    వారి నాక్షేపణము జేసి పలుకదగునె?
    తీర్పు చెప్పమనుచు కోరు తెలివి హీను
    లమును గాము పొమ్ము మరలి రాకుమికను.

    అని అనాలనిపిస్తున్నది.

    రిప్లయితొలగించండి
  6. సూర్యచంద్రులె ప్రత్యక్ష సురలు నవనిఁ
    వారు మాత్రమే నెరిగిన పచ్చి నిజము
    చెప్ప దూకె నగ్ని పునీత సీత మాత
    రామ మూర్తిని ధర ధర్మ రాజు జేయ

    రిప్లయితొలగించండి
  7. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మబుధవారం, జనవరి 23, 2013 3:38:00 PM

    భావ ప్రకటన యనుచు భావ్యమగునె?
    కాదె? యనెడి భావములేక కారు కూత
    కూయుచున్ వివే కముచూపకుండ యుండ
    వారణన్ చేయు వారేరి? వసుధ నిపుడు.

    రిప్లయితొలగించండి
  8. aarulaaraa ! adi seetamma vaari agni pravesam kaadani anipistunnadi. vaaru kireetamu raaja dustulalO unnaaru. raama lakashmanulu kaaru.chitramu vivaraNa sarigaa avagatamavalEdu.

    రిప్లయితొలగించండి



  9. ఈ చ్చిత్రంలో తప్పులు ఉన్నవి.అందుచే పద్యరచన చెయ్యలేదు.

    రిప్లయితొలగించండి
  10. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మబుధవారం, జనవరి 23, 2013 9:18:00 PM

    కరణ కారణ సంబంధ కరణి నెరిగి
    మనసిజుని మనమెరిగియు మనము నందు
    రాక ముగియగ పోకకు రంగ మనుచు
    సీత చేరె నగ్నిని నిజ సీమ చేర.

    రిప్లయితొలగించండి
  11. యగ మేదైనను నెలతకు
    గగ మంటిన యిడుము లన్ని గాదిలి చెలికిన్ !
    వగ పేల నిది ధర్మ మనుచును
    పగతురె తనవార మనుచు ప్రాణము దీయన్ !

    రిప్లయితొలగించండి
  12. "ఏ కాలమైనా తన కాలం కాని స్త్రీ "

    "న ప్రమాణీకృతః పాణిర్బాల్యే బాలేన పీడితః
    మమ భక్తిశ్చ శీలం చ సర్వం తే పృష్టతః కృతం "

    (వాల్మీకి రామాయణం:6:116:16)

    కొంత భావావేశం తప్పించి సద్భావమే. తప్పుగా అనిపించిన క్షంతవ్యురాలిని.


    జిలేబి.

    రిప్లయితొలగించండి
  13. హనుమచ్ఛస్త్రి గారూ,
    అది సీతమ్మ అగ్నిప్రవేశమే... ఔత్తరాహిక చిత్రకారుని సృష్టి. ఆహార్యం మనకూ వాళ్ళకూ తేడా ఉంటుంది.
    *
    ఈనాటి చిత్రానికి స్పందించిన మిత్రులు....
    జితేబీ గారికి,
    పండిత నేమాని వారికి,
    చంద్రశేఖర్ గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    సహదేవుడు గారికి,
    తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి