23, జనవరి 2013, బుధవారం

సమస్యాపూరణం – 946 (ఉత్తరమ్మున జరిగె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
ఉత్తరమ్మున జరిగె సూర్యోదయమ్ము

27 కామెంట్‌లు:

 1. పండు వెన్నెల హృదయాల పరవశింప
  జేసె మిథునమ్ములకు నతి చిత్ర గతుల
  హాయిగా గడచిపోయె నా రేయియును త
  దుత్తరమ్మున జరిగె సూర్యోదయమ్ము

  రిప్లయితొలగించండి
 2. నేమాని గారు తమ పద్యంలో మూడవ పాదమును ఒకసారి సరి చూసుకోండి

  రిప్లయితొలగించండి
 3. అజ్ఞాత గారూ,
  ధన్యవాదాలు.
  "హాయిగ" అనేది టైపాటు వలన దీర్ఘాంతమైనట్లుంది.

  రిప్లయితొలగించండి
 4. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మబుధవారం, జనవరి 23, 2013 9:37:00 AM

  కూతు పెండ్లి సంబంధము కుదరగాను
  సత్వరమున వివాహ నిశ్చయ ముహూర్త
  ముత్తరమ్మున జరిగె సూర్యోదయమ్ము
  తోడ పెండ్లియనుచు పండితులుతెలుపగ.

  రిప్లయితొలగించండి
 5. అత్తకూతురు లేఖల నందమొప్ప
  వ్రాయుచుండు నెపుడు. నాదు ప్రాణసఖియు,
  వర్ణనమ్ము జేయుచు నొక్క ప్రభవిలు రవి
  ను,త్తరమ్మున జరిగె సూర్యోదయమ్ము

  రిప్లయితొలగించండి
 6. అత్తకూతురు లేఖల నందమొప్ప
  వ్రాయుచుండు నెపుడు. నాదు ప్రాణసఖియు,
  వర్ణనమ్ము జేయగ నొక్క ప్రభవిలు రవి
  ను,త్తరమ్మున జరిగె సూర్యోదయమ్ము

  రిప్లయితొలగించండి
 7. మిత్రులారా! శుభాశీస్సులు.

  ఈ బ్లాగులో ఎందరో మిత్రులున్నారు. అందరూ నా శ్రేయోభిలాషులే అనుటలో సందేహము లేదు. సమోహం సర్వ భూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియః అనే గీతా వాక్యము నాకు ఎన్నటికీ అనుసరణీయమే. అందరూ నాకు సములే సన్నిహితులే హితులే. అజ్ఞాత అనే పేరుతో కూడా నన్ను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తున్న శ్రేయోభిలాషికి అనేక కృతజ్ఞతలు. స్వస్తి.
  సన్యాసిరావు

  రిప్లయితొలగించండి
 8. (ఉత్తరాయణ కాలారంభమున తూర్పుదక్షిణమున సూర్యోదయమగుచుండి అటునుండి సూర్యభగవానుని గమనము ఉత్తరదిశకు మల్లుచు ఉత్తరాయణ కాలాంతమునకు ఊరికి తూర్పు ఉత్తరమున సూర్యోదయమౌతుందన్న భావంతో:

  భూమి సూర్యునిఁ జుట్టగఁ ముగియు కాల
  మునదె యుత్తర దక్షిణాయణముఁగలసి
  యుత్తరాయణమ్ము ముగియ నూరి తూర్పు
  యుత్తరమ్మున జరిగె సూర్యోదయమ్ము

  రిప్లయితొలగించండి
 9. అయ్యా గాలి అటు ఇటు తిరిగి నా వైపు మళ్లినట్టున్నది. నేను ఎవరినీ ప్రోత్సహించడము లేదు మరెవరినీ నిరుత్సాహపరచడము లేదు అని సవినయముగా విన్నవించుకొనుచున్నాను. పై నేమాని గారి పద్యములో గణభంగము టైపాటో మరొకటో కావచ్చును , గమనించి వెల్లడించినాను . అంతకన్నను మించి మరేమియును లేదని తెలియజేయుచున్నాను.

  రిప్లయితొలగించండి
 10. ఐంద్రజాలికు డొక్కరు డద్భుతములు
  చూపుచుండంగ నవ్వేళ చోద్యమేమొ
  చిమ్మచీకట్లు దిశలందు కమ్ముకొనగ
  నుత్తరమ్మున జరిగె సూర్యోదయమ్ము.

  రిప్లయితొలగించండి
 11. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 12. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 13. వేగుజామున పొడసూపె వేగుచుక్క
  యుత్తరమ్మున ; జరిగె సూర్యోదయమ్ము
  తూర్పు దిక్కున భువినెల్ల ద్యుతులు నిండె
  నిదుర నుండి లేచె జగము నిశలు తొలగె

  రిప్లయితొలగించండి
 14. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 15. వెలసి యొకవైపు కనుపించె వలినగమ్ము
  లుత్తరమ్మున ; జరిగె సూర్యోదయమ్ము
  తూర్పుకొండల కావల ; తోచె కాంతు
  లంత మంచుపొగలు గ్రమ్మె నవని యందు

  రిప్లయితొలగించండి
 16. maastarugaaroo! naa system repair lo unnaMduna taragatulaku haajaru kaaleka povuchunnaanu.twaralo mitrulato kalavagalanu. dhanyavaadamulu.

  రిప్లయితొలగించండి
 17. జగతి వేటాడి సూరీడు చాయ దరిని
  చలువ వెదజల్లు సోముని సౌరు లందు
  మత్తుగా పవళించ గమ్మత్తు గాను
  ఉత్తరమ్మున జరిగె సూర్యొ దయమ్ము !

  రిప్లయితొలగించండి
 18. డా.ప్రభల రామలక్ష్మి.బుధవారం, జనవరి 23, 2013 9:24:00 PM

  కంసుబారి నుంచి సుతుని కాపాడుటకు
  అరిగె వసుదేవుడారాత్రి యమున వెంట
  కార్యము సఫలమై చేరి కాలిడగత
  దుత్తరమ్మున జరిగె సూర్యోదయమ్ము.

  రిప్లయితొలగించండి
 19. అది ధృవప్రాంతమగుటచే యారునెలలు
  చీకటిగనుండి పిమ్మట నాకసమున
  అర్ధరాత్రి యందుగన మహాద్భుతముగ
  ఉత్తరమ్మున జరిగె సూర్యోదయమ్ము.

  రిప్లయితొలగించండి 20. నా పై పద్యంలో' ధృవ 'ను ' ధ్రువ 'గా సరిదిద్దుతున్నాను.

  రిప్లయితొలగించండి
 21. కమనీయంగారూ మంచి scientific fact చెప్పారు. బ్రెజిల్, కెనడాలలోని కొన్ని ప్రాంతాల్లో చూడొచ్చు.

  రిప్లయితొలగించండి
 22. మనోహరమైన పూరణలను అందించిన కవిమిత్రులు...
  పండిత నేమాని వారికి,
  తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి,
  లక్ష్మీదేని గారికి,
  సహదేవుడు గారికి,
  హరి వేంకటి సత్యనారాయణ మూర్తి గారికి,
  నాగరాజు రవీందర్ గారికి,
  రాజేశ్వరి అక్కయ్య గారికి,
  డా. ప్రభల రామలక్ష్మి గారికి,
  కమనీయం గారికి,
  అభినందనలు, ధన్యవాదాలు.
  *
  డా. ప్రభల రామలక్ష్మి గారూ,
  కాపాడుటకు... అన్నప్పుడు గణదోషం. 'కావదలచి' అందామా...

  రిప్లయితొలగించండి 23. 'మన తెలుగు గారూ,కెనడా విషయం సరే; కాని బ్రెజిల్ కాదు.అది tropical and semi tropical country . అంటార్కిటికా ,సైబీరియా, నార్వేలను ఉదహరించవచ్చును.

  రిప్లయితొలగించండి
 24. ఎడ్లనరకకు గట్టితి నేగవలయు
  చద్ది మూటను గట్టుము చచక మని
  పొలము యూరికి దవ్వున కలదు చూడ
  నుత్తరమ్మున, జరిగె సూర్యోదయమ్ము

  రిప్లయితొలగించండి
 25. పేరి వారింట జరిగిన పెండ్లి కొఱకు
  నేను వెళ్ళితి నచటకు మాన కుండ
  వప్ప గింతలు పూర్తి యై యొప్పు సరికి
  ఉత్తర మ్మున జరిగె సూ ర్యో ద య మ్ము

  రిప్లయితొలగించండి
 26. తాగు బోతులు రేయంత తాగి తాగి
  'సోడ' యన్నదే లేకుండ జుర్రి తాగి
  రమ్ము నీటిలో కలుపక 'రా' ను తాగ
  ఉత్త 'రమ్ము'న జరిగె సూర్యోదయమ్ము

  రిప్లయితొలగించండి
 27. సిరాశ్రీ గారూ,
  మీ సోడా కలుపని ఉత్త 'రమ్ము' పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి