శ్రీ పండితులవారికి, మన తెలుగు వారికి నమస్సులు. చిత్రకూటము చేరుటకు భరద్వాజమహర్షి ఆశ్రమ సంసర్శన దృశ్యము. వారు భరద్వాజమహర్షులు, ధర్మమూర్తులు రామయ తండ్రి సీతమ్మ తల్లి లక్ష్మ్య్యలే. ఈ బ్లాగును పరిశీలింప మనవి. smilemakerkrishna.blogspot.com
Lord Rama, Mother Sita and Lakshman were now walking About sage Bharadhvaja’s wisdom and love, they were talking From the confluence of rivers, along Yamuna, they proceeded east The sight of the river upstream to the eyes was a feast
గూగుల్‌లో దొరికిన చిత్రాన్ని నిద్రకళ్ళతో చూచి వారు కుశలవులే అనుకొని ఫైల్‌నేమ్ ఇచ్చాను. మన్నించండి. చక్కని పద్యాలు రచించిన కవిమిత్రులు.... పండిత నేమాని వారికి, సహదేవుడు గారికి, హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి, తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి, కమనీయం గారికి, అభినందనలు, ధన్యవాదాలు. * చిత్రాన్న గురించి వివరాలు అందజేసిన తోపెల్ల వారికి, అజ్ఞాత గారికి ధన్యవాదాలు.
సీతా రామ లక్ష్మణులు వనవాస సమయములో ననేక ఆశ్రమములకు జనిరి. ఈ చిత్రము వాల్మీకి ఆశ్రమము అనుకొని రచించిన పద్యములు (నా కృతి శ్రీమదధ్యాత్మ రామాయణము నుండి):
రిప్లయితొలగించండికనె వాల్మీకి మహర్షి సుందర శుభాకారున్ ప్రసన్నాననున్
వనజాతాయత లోచనున్ సహజుతో భద్రాంగియౌ సీతతో
జన సంస్తుత్య యశోభిరాము జలదశ్యామున్ సుధీధామునిన్
వనజాతాప్త కులాబ్ధి సోము గుణశోభారామునిన్ రామునిన్
అమితాశ్చర్యముతో సమాదరముతో నవ్వారలంగాంచి య
ర్ఘ్యము పాద్యమ్ము నొసంగి పక్వ ఫల మూలాదుల్ సమర్పించి పా
దములన్ గొల్చి పవిత్ర తీర్థము తలన్ దాల్చెన్ మునీంద్రుండు డెం
దమునన్ బొంగె శుభోదయమ్మున మహానందంబు వెల్గొందగా
Picture file name చూస్తే kusha+lava.jpg అని కనిపిస్తోంది. కావున అది వాల్మీకి ఆశ్రమమే అనుకోవచ్చు. అయితే వారు కుశ, లవులు, సీతాదేవి అనుకోవాలేమో!
రిప్లయితొలగించండిశ్రీ పండితులవారికి, మన తెలుగు వారికి నమస్సులు. చిత్రకూటము చేరుటకు భరద్వాజమహర్షి ఆశ్రమ సంసర్శన దృశ్యము. వారు భరద్వాజమహర్షులు, ధర్మమూర్తులు రామయ తండ్రి సీతమ్మ తల్లి లక్ష్మ్య్యలే. ఈ బ్లాగును పరిశీలింప మనవి.
రిప్లయితొలగించండిsmilemakerkrishna.blogspot.com
శ్రీ పండితులవారికి నమస్సులు. మీ కృతి శ్రీమదధ్యాత్మ రామాయణము నుండి ఆఘట్టము గూడ మేము చూచి చదివి తరించే భాగ్యము కల్గించ ప్రార్థన.
రిప్లయితొలగించండివాల్మీకి ఆశ్రమంలో లవకుశులతో సీతమ్మ మునివర్యులకు నమస్కరించెడు చిత్రమను భావంతో:
రిప్లయితొలగించండిపరమ పావన రాముని చరిత పాడి
రాము సంతాన మైనట్టి లవకుశులును
తల్లి సీతమ్మ తోడుగ దండమిడగ
నాదరించిన వాల్మీకి మోద మందె
Lord Rama, Mother Sita and Lakshman were now walking
రిప్లయితొలగించండిAbout sage Bharadhvaja’s wisdom and love, they were talking
From the confluence of rivers, along Yamuna, they proceeded east
The sight of the river upstream to the eyes was a feast
సోదరులౌ రాఘవులట
రిప్లయితొలగించండిమోదంబున సీతతోడ మ్రొక్కగ నపుడున్
సాదరముగ మునివర్యుడు
వేదోక్తాశీస్సులొసగె వినయాత్ములకున్.
పితృవాక్య పాలనన్ ప్రియసఖి సీతతో
రిప్లయితొలగించండిఅనుజుండు లక్ష్మణుండనుస రింప
వనవాస దీక్షకై వదలెనయోధ్యను
నారచీరలుకట్టి నడచి రంత
కానంబులనెన్నొ కాంచుచు కొల్చుచు
మునివాటికలయందు మునుల ముందు
రామభద్రుడట భరద్వాజ మున్యాశ్ర
మంబున వందనం బాచరించి
వేడె నామౌని నొక దారి వేగ చూప
చిత్ర కూటమ్ము మీకును చింత దీర్చు
సకల మెరిగిన నీకు నెరుక గదయ్య!
యనుచు దీవించె మౌని రాముని ముదమున.
రిప్లయితొలగించండిఅనుజ సౌమిత్రి వెంటరా యనుగు సతిని
జానకినిగూడి దశరథ జాని యంత
ముని భరద్వాజు నాశ్రమము కడకుజని
ప్రణతి గావించె నెంతయు భక్తిమీర.
గూగుల్‌లో దొరికిన చిత్రాన్ని నిద్రకళ్ళతో చూచి వారు కుశలవులే అనుకొని ఫైల్‌నేమ్ ఇచ్చాను. మన్నించండి.
రిప్లయితొలగించండిచక్కని పద్యాలు రచించిన కవిమిత్రులు....
పండిత నేమాని వారికి,
సహదేవుడు గారికి,
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి,
కమనీయం గారికి,
అభినందనలు, ధన్యవాదాలు.
*
చిత్రాన్న గురించి వివరాలు అందజేసిన తోపెల్ల వారికి, అజ్ఞాత గారికి ధన్యవాదాలు.
రాజ కులావతంసుఁ డగు రాముఁడు తమ్ముఁడుఁ దాను నా భర
రిప్లయితొలగించండిద్వాజ మహా మునీంద్రు పద వారిజముల్ గని మ్రొక్క నాతఁడం
భోజ హితాన్వ యాబ్ధి పరిపూర్ణ సుధాకరుఁడైన రామునిం
బూజ లొనర్చి కంద ఫల మూలములం బరితృప్తుఁ జేసినన్
సాహిత్యాభిమాని గారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు.