22, జనవరి 2013, మంగళవారం

మన భావ్యము"శంకరాభరణము" బ్లాగు మిత్రులకు శుభాశీస్సులు!

మన భావ్యము

సీ.
మనము సరస్వతీ మాతృకృపారస
         
పానమ్ము నొనరించు వారమనియు
విద్యయనఁగ బ్రహ్మవిద్యయే యనెడు స
         
ద్భావమ్ము గలిగిన వారమనియు
ద్వేష రాగమ్ములెంతేనియు లేనట్టి
         
పరమ సంస్కృతి గల వారమనియు
శంకర గురుకృత శంకరాభరణపు
         
బ్లాగు హితముఁ గోరు వార మనియు
తే.గీ.
నిత్య మెల్లరి యెడ సాన్నిహిత్య మలర
నొండురుల జ్ఞానసంపద లొప్పుమీర
కలసి మెలసి పెంపొందింప కంకణమ్ము
దాల్చి పాటించుటే మన ధర్మ మగును 

నేమాని రామజోగి సన్యాసి రావు

5 కామెంట్‌లు:

 1. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మమంగళవారం, జనవరి 22, 2013 6:57:00 PM

  శ్రీపండితులవారికి పాదాభివందనములతో

  పండు వయసున నేమాని పండితు లిట
  నిండు మనసున పలికిన నిజములవియె
  అందు కొనుచును పాటింప నంద రిందు
  పద్య సుమముల నలరింప బ్లాగు నందు.

  రిప్లయితొలగించండి
 2. మనభావ్యం బందరకును
  ఘనముగ వివరించినారు కమనీయవచో
  ధనులౌ పండితవర్యులు
  మనమందర మనుసరించ మాన్యతగలుగున్.

  రిప్లయితొలగించండి
 3. బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి,
  వియెస్సెన్నెమ్ హరి గారికి,
  ధన్యవాదాలు. మీ అందరి ఆదరాభిమా లున్నప్పుడే శంకరాభరణం బ్లాగు పురోగమిస్తుంది.

  రిప్లయితొలగించండి
 4. డా. ప్రభల రామలక్ష్మిమంగళవారం, జనవరి 22, 2013 11:35:00 PM

  వ్యాపకమ్ము లేక యాతన చెందెడు
  వారికమితముగను హాయినిచ్చు
  కవిత వ్రాయగోరు కామితులందరి
  ఇచ్ఛతీర్చు భాగ్యమిదియె కాదె

  రిప్లయితొలగించండి
 5. నిక్కము గురువులుఁ బల్కిన
  వాక్కులు, పాటింప మిత్ర వర్యులుఁబూనన్
  మిక్కుట మై కీర్తి పథము
  చక్కగ రాణించు బ్లాగు శంకరు కృపతో

  రిప్లయితొలగించండి