6, జనవరి 2013, ఆదివారం

పద్య రచన - 213

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

14 కామెంట్‌లు:

  1. రంగని దానుగా మఱియు రంగడు గా తననే దలంచుచున్
    మంగయు నిట్లు సంతసిలు; మానిని గాంచిన తండ్రి యెట్టులీ
    భంగిని కూతుకున్ తగిన భర్తగ రమ్మని నిన్నుఁ గోరుదున్?
    రంగ! యటంచు యోచనములందు మునుంగుచు నిల్చెనక్కడే!

    రిప్లయితొలగించండి
  2. అమ్మా! లక్ష్మీ దేవి గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యము 3వ పాదములో కూతుకున్ అనే పదమునకు బదులుగా "పుత్రికిన్" అని మార్చితే బాగుంటుంది. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  3. మురహరుడగు గోవిందుడు
    సరసుడు వంశీధరుండు శ్యామాంగుడు నా
    వరుడని గోదా దేవియు
    పరవశయై చేరి గాంచె పరమాత్మునటన్.

    రిప్లయితొలగించండి
  4. తరుణీరత్నము విష్ణుచిత్త సుత గోదాదేవి సద్భక్తితో
    నరవిందాక్షుని నందనందనుని స్వాంతంబందు సేవించుచున్
    విరులన్ మాలగ గ్రుచ్చి దాల్చి మెడలో ప్రేమాతిరేకమ్ముతో
    హరికిన్ గానుక చేయుచుండు విధ మత్యానందమున్ గూర్చెడిన్

    రిప్లయితొలగించండి
  5. పూజ కొఱకు సిద్ధ పఱుచ మొదట తానె
    దాల్చు వకుళమాలల నామె తన్మయమున
    అద్దమున గాంచు కృష్ణుని నంతలోన
    చకితు డగుచుండు తండ్రియె వకుళ జూచి

    రిప్లయితొలగించండి
  6. గోదాదేవిని జూడుడు
    పాదాలకు జేరు దండ పాణిని తోడన్
    వేదాల మూల పురుషున
    కాదరముగ వేయ దలచి నట నిల బడియెన్ .

    రిప్లయితొలగించండి
  7. గోదాదేవి చిత్రాన్ని చూచి స్పందించి చక్కని పద్యాలు చెప్పిన కవిమిత్రులు....
    లక్ష్మీదేవి గారికి,
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
    పండిత నేమాని వారికి,
    నాగరాజు రవీందర్ గారికి,
    సుబ్బారావు గారికి
    అభినందనలు, ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  8. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మఆదివారం, జనవరి 06, 2013 6:21:00 PM

    నీదయతోడనామనము నిబ్బరమైనదియబ్బురంపు నీ
    యాదరమొప్పు పల్కు విన నద్దము నందున నందనందనుం
    గాదిలి కానగన్ నిజము కాదె!వి వాహము మాకనం గ నో
    వేదవి దోత్తమా! శుభము వేడెద నీకృప బ్రాహ్మణో త్తమా!

    రిప్లయితొలగించండి
  9. విగ్రహమ్మున తనస్వామి వెన్నుడిఁ గని
    తరుణి యాముక్తమాల్యదై మురిసిపోయె
    పాశురమ్ముల పాడుచు బంధ మేయ
    ముదిత యాండాలు ప్రభువుచే మోక్ష మందె!

    రిప్లయితొలగించండి
  10. శ్రీ తోపెల్ల....శర్మ గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యములో వేదవిదోత్తములు అను ప్రయోగము సరికాదు. వేదవిత్ + ఉత్తములు = వేదవిదుత్తములు అగును. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  11. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    నేమాని వారి సూచన గమనించారా?
    *
    సహదేవుడు గారూ,
    చక్కని పద్యం చెప్పారు. అభినందనలు.
    బంధము ‘వేయ’ను ఏయ గా వ్రాసారు. ‘బంధము నిడ’ అందామా?

    రిప్లయితొలగించండి
  12. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మఆదివారం, జనవరి 06, 2013 10:22:00 PM

    శ్రీ పండితులవారికి, గురువుగార్కి నమస్సులు.తప్పు తెలినందులకు ధన్యవాదములు. సవరించినతరువాత

    నీదయతోడనామనము నిబ్బరమైనదియబ్బురంపు నీ
    యాదరమొప్పుపల్కువిన నద్దము నందున నందనందనుం
    గాదిలి కానగన్ నిజము కాదె!వివాహము మాకనం గ నో
    వేదవిదుత్తమా!శుభము వేడెద నీకృప బ్రాహ్మణో త్తమా!

    రిప్లయితొలగించండి
  13. శ్రీగురుభ్యోనమః
    గురువుగారికి ధన్యవాదములు.తమరి సూచన మేరకు సవరణ:

    విగ్రహమునందు తనస్వామి వెన్నుడిఁగన
    తరుణియాముక్తమాల్యదైమురిసి పోయె
    పాశురమ్ములఁబాడుచు భక్తి తోడ
    ముదిత యాండాలు ప్రభువుతో మోక్ష మందె!

    రిప్లయితొలగించండి



  14. 1.
    తనకు రంగనాథునికి భేదమ్ము లేద
    టంచు మురియుచు ,ముగ్ధమోహనలతాంగి
    అలరుమాలల దాల్చి వయ్యారమొలుక
    యాళవారు తనయ గాంచె నక్కజముగ.

    (అద్దములో రంగనాథునికి బదులు శ్రీ కృష్ణుని బింబము కనిపిస్తున్నది కాబట్టి ,రుక్మిణీదేవి పరముగా )
    2.
    ఏమి యాశ్చర్యమో కాని యిఛటదోచె
    యచ్యుతుని రూపసౌందర్య మద్దమందు ,
    వేచియున్నట్టి భూసురు వేగబంప
    వలెను ద్వారకాపతికి నా వార్త జెప్ప.



    రిప్లయితొలగించండి