అయ్యా! శ్రీ తోపెల్ల .... శర్మ గారూ! శుభాశీస్సులు. మీ పద్యములో కొన్ని మార్పులు చేసేను. మీ 2వ పాదములో బిందువగు స్వామి అనుచోట ట గురువు కాదు. అందుచేత గణభంగము. కొంతవరకు అన్వయమును సరిచేయ వలసి యున్నది. ఈ విధముగా వ్రాసితిని చూడండి:
హైందవ జాతికి నమృతపు బిందువయిన స్వామి శ్రీవివేకానందున్ డెందమున దలచి సాదృతి వందనము లొనర్తు ప్రజ్ఞ వర్ధిల్లుటకై
అయ్యా! శ్రీ హ.వె.స.నా.మూర్తి గారు! శుభాశీస్సులు. మీ పద్యము ఎత్తుగడ బాగున్నది. భావ పరిపుష్టి యున్నది. సీసము 4 పాదములు "ఎవ్వాని" అనే పదముతో ప్రారంభము అయితే ఇంకా వన్నె వస్తుంది. కొన్ని పదములను మార్చి సరిచేయండి. అభినందనలు. స్వస్తి.
పండితశ్రీనేమానిగురువులకు ధన్యవాదనమస్సులు. రేఫ కారమునకు మాత్రమే తత్పూర్వాక్షరం గురువుగాదనుకుంటిని. వ వత్తుకుగూడ అదే సూత్రం వర్తిసుందా. సందేహం తీర్ప మనవి. మీ మార్పుచేర్పులతో పద్యం రమణీయత సంతరించుకున్నది.ప్రణామములు.
శ్రీ తోపెల్ల శర్మ గారి మంగళమహాశ్రీ వృత్తమునకు కొన్ని చిన్న చిన్న సవరణలు చేసేను:
రిప్లయితొలగించండిసప్తగిరులన్ వెలసె సర్వజన నేత శుక
శౌనక ముఖర్షులకు నత్యం
తాప్తుడగు వేలుపు దయాహృదయ సాగరుడు
యజ్ఞ పురుషుండు సతి పద్మన్
సప్తపదిగా గిరుల సాగె కయిపట్టి భృగు
శాపమున నీ జగతి బ్రోవన్
దృప్తిమెయి పల్కెదభిధేయమును నేను నిన
దించి పరమార్థమును బొందన్
స్వస్తి
జ్ఞానానంద రస ప్రపూర్ణుడన విఖ్యాతుండు స్వప్రజ్ఞతో
రిప్లయితొలగించండినానాదేశ మహాసభాస్థలి నమందస్ఫూర్తి హిందుత్వ వి
జ్ఞానాభ్యున్నతి చాటిచెప్పె ఘనుడా స్వామిన్ మహర్షిన్ వివే
కానందున్ దలతున్ సమాదరముతో నర్పింతు పుష్పాంజలిన్
దేశ దేశాలు దిరిగిన ధీ యుతుండు
రిప్లయితొలగించండిహిందు ధర్మము జాటిన హైంద వుండు
నాతడే వివేకా నంద యతి వరుండు
వంద నంబులు నతనికి వరుస నిడుదు .
నిర్భయత్వమే బలమని నేర్పె నతడు
రిప్లయితొలగించండిభయమన మరణంబంచునుభాష్యమిడెను
హిందువుననిగర్వించుముహిందువుగనె
జీవనమను నరేంద్రుని శిరము దాల్తు
హిందువు, హైందవ జాతికి
రిప్లయితొలగించండిబిందువగు” స్వామిశ్రీవివేకానందుం”
డందరి ప్రజ్ఞా సింధువు,
డెందము నేకొ ల్తు దేశ డింబము దొలగన్
పూజ్య పండితశ్రీ వారి మార్పుచేర్పులతో నా నిన్నటి పద్యానికి సజీవ రూపమిచ్చినందులకు మిక్కిలి ధన్యవాదములు.
రిప్లయితొలగించండిఅయ్యా! శ్రీ తోపెల్ల .... శర్మ గారూ!
రిప్లయితొలగించండిశుభాశీస్సులు.
మీ పద్యములో కొన్ని మార్పులు చేసేను. మీ 2వ పాదములో బిందువగు స్వామి అనుచోట ట గురువు కాదు. అందుచేత గణభంగము. కొంతవరకు అన్వయమును సరిచేయ వలసి యున్నది. ఈ విధముగా వ్రాసితిని చూడండి:
హైందవ జాతికి నమృతపు
బిందువయిన స్వామి శ్రీవివేకానందున్
డెందమున దలచి సాదృతి
వందనము లొనర్తు ప్రజ్ఞ వర్ధిల్లుటకై
ఎవ్వాని గళములో నిహపరసౌఖ్యంబు
రిప్లయితొలగించండిలందించు సూక్తంబు లనవరతము
వినిపించు, హృదయంబు విశ్వశాంతిని గోరు
భావజాలంబుతో పరిఢవిల్లు
ఎవ్వాని మనములో నీజగజ్జనులంద
రొక కుటుంబముగాగ నుత్సవంబు
పరమపావనమైన భారతీయత జూతు
మెవ్వాని తనువున నింపులొలుక
ఉపనిషత్తుల గంధంబు లుర్విజనుల
కందజేసిన సర్వాంగసుందరుండు
వేదవేదాన్తవేత్తయై విశ్వమందు
హైందవంబును చాటు మహర్షి యతడు.
లోకోత్తర యశమందు వి
వేకానందునకు నతులు విమలాంగునకున్
శ్రీకరమగు హైందవమును
ప్రాకటముగ జూపినట్టి భవ్యాత్మునకున్.
అయ్యా! శ్రీ హ.వె.స.నా.మూర్తి గారు! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ పద్యము ఎత్తుగడ బాగున్నది. భావ పరిపుష్టి యున్నది. సీసము 4 పాదములు "ఎవ్వాని" అనే పదముతో ప్రారంభము అయితే ఇంకా వన్నె వస్తుంది. కొన్ని పదములను మార్చి సరిచేయండి. అభినందనలు. స్వస్తి.
ఆర్యా!
రిప్లయితొలగించండినమస్కారములు,
మీ సూచన ప్రకారము నా సీసపద్యాన్ని క్రింది విధంగా సరిచేస్తున్నాను. పరిశీలించగలరు.
ఎవ్వాని గళములో నిహపరసౌఖ్యంబు
లందించు సూక్తంబు లాడుచుండు,
ఎవ్వాని హృదయాన నిమ్మహీస్థలిపైన
శాంతి గోరెడి భావజాలముండు,
ఎవ్వాని మనములో నీజగజ్జనులంద
రొక కుటుంబముగాగ నుత్సవంబు,
ఎవ్వాని తనువున నెందెందు జూచిన
భారతీయత నిండి పరిఢవిల్లు
ఉపనిషత్తుల గంధంబు లుర్విజనుల
కందజేసిన సర్వాంగసుందరుండు
వేదవేదాన్తవేత్తయై విశ్వమందు
హైందవంబును చాటు మహర్షి యతడు.
ధన్యవాదములు.
యువ నాయకుడెల్లపుడు
రిప్లయితొలగించండిజవ సత్వంబుల నిచ్చెను జాగృతి గరిపెన్
స్తవనీయుడు గద మనహైం
దవజాతికి మన నరేంద్ర దారిని జూపెన్.
పండితశ్రీనేమానిగురువులకు ధన్యవాదనమస్సులు. రేఫ కారమునకు మాత్రమే తత్పూర్వాక్షరం గురువుగాదనుకుంటిని. వ వత్తుకుగూడ అదే సూత్రం వర్తిసుందా. సందేహం తీర్ప మనవి. మీ మార్పుచేర్పులతో పద్యం రమణీయత సంతరించుకున్నది.ప్రణామములు.
రిప్లయితొలగించండిమిత్రులు గోలి శాస్త్రి గారికి నమస్సులు. ప్రథమ పాదాంతం, ద్వితీయ పాద 6వ గణం సరిజూడ మనవి.
రిప్లయితొలగించండిబాల సుబ్రహ్మణ్యం గారికి ధన్యవాదములు.నా పొరపాటును సవరించుచున్నాను.
రిప్లయితొలగించండియువ నాయకుడెల్లప్పుడు
జవ సత్వంబుల నిడుచును జాగృతి గరిపెన్
స్తవనీయుడు గద మనహైం
దవజాతికి మన నరేంద్ర దారిని జూపెన్.
మిత్రులారా! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిశ్రీ తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారి కోరిక మేరకు:
సంయుక్తాక్షరములకు ముందున నున్న అక్షరము ఎప్పుడు గురువు అగును ఎప్పుడు కాదు అనే విషయమై నా వివరణ.
1. సంస్కృతములో ద్విత్వ సంయుక్తాక్షరములకు ముందునున్న అక్షరము ఎల్ల చోటులా గురువే యగును. సమాసములలో ఉత్తరపదము రేఫ సంయుక్తాక్షరము అయినచో ఐఛ్ఛికముగా నగును - వీలును బట్టి గురువుగా కాని లేక లఘువుగా గాని వాడుకొనవచ్చును.
2. తెలుగులో ఏ పదమునకు ఆ పదము విడి విడిగానే ఉచ్చరింపబడును - ఉత్తర పదము యొక్క ద్విత్త్వ / సంయుక్త అక్షర ప్రభావము పూర్వ పదము పై నుండదు.
స్వస్తి.
స్ఫూర్తిదాయకుడు వివేకానందునకు మనోహరమైన పద్యరత్నాలను సమర్పించిన కవిమిత్రులు....
రిప్లయితొలగించండిపండిత నేమాని వారికి,
సుబ్బారావు గారికి,
సహదేవుడు గారికి,
తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి,
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
అభినందనలు, ధన్యవాదాలు...
పండితశ్రీనేమాని గురువర్యులకు ధన్యవాదము, ప్రణతులు.
రిప్లయితొలగించండి