27, జనవరి 2013, ఆదివారం

సమస్యాపూరణం – 949 (రాహుకేతువు లిరువురు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
రాహుకేతువు లిరువురు రవి తనయులు.
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదములు.

14 కామెంట్‌లు:

 1. రాహు కేతువు లిరువురు రవి తనయులు
  అనుట సరి కాదు వారిని నార్య !మీ రు
  మృత్యు దేవత కొమరుండు కేతు వయ్య !
  రాహు వగు నట వరుసకు రవికి బావ .

  రిప్లయితొలగించండి
 2. మోహిని యమృతముఁ బంచగ మోసగించి
  వరుసన అమృత మందిన వారలందు
  రాహుకేతువు లిరువురు; రవి తనయులు
  శనియములను భావింతురు శత్రువులుగ
  జాతకఫల నిర్ణయమందు జనుల తృప్తి
  కొఱకు, మరి వారు నల్వురు గొప్పవారె!

  రిప్లయితొలగించండి
 3. సుబ్బారావు గారూ,
  'తనయులు + అనుట' అన్నప్పుడు సంధి తప్పనిసరి. విసంధిగా వ్రాయరాదు కదా!
  'తనయు ల/టంచు పలుకుట సరియౌనె యార్య మీరు..' అని నా సవరణ.

  రిప్లయితొలగించండి
 4. తలయు మొండెంపు గ్రహముల తరచి జూడ
  శనిని యముదల్ప బెదరును జనులు భువిని
  భవుని గొల్చెడు వారికి భయమునిడరు
  రాహుకేతువు లిరువురు రవి తనయులు.

  రిప్లయితొలగించండి
 5. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మఆదివారం, జనవరి 27, 2013 9:11:00 AM

  రాహు కేతువు లిరివురు రవి, తనయులు
  తండ్రి జాతక మున్ జూప తరచి జూచి
  చెప్పె నీచ పడిరి గాన చేయు జపము
  ఫలిత ముండు తప్పక యనె పండి తుండు

  రిప్లయితొలగించండి
 6. పుత్రు లిద్దరు రవికి నా మిత్రు డతడు
  రాహులు మరియు కేతను లనెడు వారు
  హాస్య మాడుచునుందు నే నపుడు యిపుడు
  “రాహుకేతువు లిరువురు రవి తనయులు"

  రిప్లయితొలగించండి
 7. సూర్యచంద్రుల కవనికి చుట్టఱికము
  కుముదబాంధవ వైరులు కుటిలు రైన
  రాహుకేతు లిరువురు ; రవి తనయులు
  శనియు కర్ణ సుగ్రీవులు శైలగేహ !

  రిప్లయితొలగించండి
 8. మేషమందున శని యుండ మేలు దప్పి
  కాల సర్ప యోగము నొంది కాలుఁ జిక్కె
  వాని మృత్యువెవ్వాడన వరుసగనగు
  రాహుకేతువు లిరువురు రవి తనయులు!!

  రిప్లయితొలగించండి
 9. సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  అయితే పద్యంలో మీరు చెప్పిన 'వరసలు' అర్థం కాలేదు.
  *
  చంద్రశేఖర్ గారూ,
  మీ షట్పది పూరణ బాగుంది. అభినందనలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  *
  తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారూ,
  కాస్త డొంకతిరుగుడుగా చెప్పినా బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ పూరణ చమత్కారభరితమై అలరించింది.
  రెండవ పూరణ కూడా బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 10. జిగురు సత్యనారాయణ గారూ,
  బహుకాల దర్శనం అనుకుంటాను.
  క్రమాలంకార పద్ధతిలో మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 11. డా. ప్రభల రామలక్ష్మిఆదివారం, జనవరి 27, 2013 9:52:00 PM

  ఒక తండ్రి చెడిపోతున్న తన కుమారుల జాతకములు చూసి, జ్యోతిష్కుని సలహా చెప్పమని అడిగిన సందర్భంలో........
  రాహుకేతువులిరువురు, రవి, తనయులు
  చెడ్డ బాలురతో చేరి చెదరిపోవ
  కారణంబై కనపడు కారణాన
  శాంతి చేయుడు వారికి శక్తి కొలది

  రిప్లయితొలగించండి
 12. రవి సుధాకర గ్రహణ కారకులుఁజూడ
  రాహు కేతువు లిరువురు, రవి తనయులు
  నరక విభులు యమ ప్రభువు ధరణి మీది
  ప్రాణ హరణ కారక ధర్మ రాజు గాదె?

  రిప్లయితొలగించండి
 13. ప్రభల రామలక్ష్మి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  సహదేవుడు గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.

  రిప్లయితొలగించండి