10, జనవరి 2013, గురువారం

సమస్యాపూరణం - 933 (రమణి విల్లు విఱిచె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
రమణి విల్లు విఱిచె ప్రమద మెసఁగ.
సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదములు.

16 కామెంట్‌లు:

 1. గురువు దలచి మదిని హరునికి తామ్రొక్కి
  జనక సభను నాడు జనులు పొగడ
  రమణి జూచు చుండ రవికుల శూర వీ
  రమణి విల్లు విరిచె ప్రమదమెసఁగ.

  రిప్లయితొలగించండి
 2. లలన, కాంత, మగువ లావణ్యవతి యన-
  రాముడేమి జేసె రమణి జేర?
  రమణి యెట్లు జేరె రాముని చెంతకు?
  రమణి; విల్లు విఱిచె; ప్రమద మెసఁగ.

  రిప్లయితొలగించండి
 3. లలిత గుణగణ మణి రాజ చూడామణి
  దాసజన హృదబ్జ తస్కరమణి
  బహు పరాక్రమ మణి పంక్తిరథ సుకుమా
  రమణి విల్లు విఱిచె ప్రమద మెసగ

  రిప్లయితొలగించండి
 4. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మగురువారం, జనవరి 10, 2013 11:42:00 AM

  రామునిగనిమదిని రచ్చపట్టున రమా
  రమణి, విల్లు విఱిచె ప్రమద మెసఁగ.
  రఘు రాముడంత రాయసమొప్పగ
  ఝల్లు మనెనెద లవ కాల మందు.

  రిప్లయితొలగించండి
 5. రాజ రాజులెల్ల రహిచెడి కూర్చుండ
  బాధ జెందు జనక ప్రభువు గాంచి
  గురువు వంక జూచి గురిపెట్టి రాముడు
  రమణి! విల్లు విరిచె ప్రమద మొసగ.

  రిప్లయితొలగించండి
 6. వీ ర నారి ఝాన్సి విమతుల వధియింప
  అశ్వ మెక్కి యేగె యాత్ర తనన
  యుద్ధ రంగ మందు యోధురాలుగ మారి
  రమణి విల్లు విఱి చె ప్రమద మెసగ


  రిప్లయితొలగించండి
 7. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మగురువారం, జనవరి 10, 2013 4:27:00 PM

  ఏదో విషయమై వెదుకు చుండగా ఒక మిత్రుడు చెప్పగా వ్రాసి ఉంచుకున్న పద్యం కనిపించింది. ఇది చాల విలువైనదిగా భావించి ఇందుంచుచున్నాను. ఇలా ఉంచవచ్చునో లేదో తెలియదు. బ్లాగు వ్యవహారం నాకు క్రొత్త.
  “నీవును నీవునున్ మరియు నీవును నీవును నీవు నీవునున్”.
  జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి సన్మాన సభకు అధ్యక్షులైన బ్రహ్మశీ కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారిచ్చిన సమస్య కు జంధ్యాల వారి పూరణ.

  నీవు గజాస్యు చంక దిగనీయవు, నన్నసలెత్తుకోవు, నీ
  కావెనకయ్య ముద్దు కొడుకయ్యె నటంచు నేడ్చు షణ్ముఖున్
  దేవి భవాని కౌగిట గదించి కుమారుని తోడ నిట్లనెన్
  నీవును నీవునున్ మరియు నీవును నీవును నీవు నీవునున్.

  రిప్లయితొలగించండి
 8. కరమున వరమాల ధరియించి నిలుచుండ
  రమణి - విల్లు విరిచె ప్రమద మెసగ
  జానకీ రమణుడు శ్యామ సుందరుడె ; సీ
  తమ్మ నపుడు బెండ్లి యాడె నటుల

  రిప్లయితొలగించండి
 9. జనకరాజుభూమిజాస్వయంవరమందు
  చాపమెక్కుపెట్టు శౌర్యనిధికి
  కూతునిత్తునంచు కోర; శ్రీ రామ శూ
  ర మణి - విల్లు విరిచె ప్రమద మెసగ !

  రిప్లయితొలగించండి
 10. రక్కసులను జంప రమణి యేగు దెంచె
  నరకు జంప నెంచి నారి సత్య
  వీర నారి నంచు విల్లు నెక్కు బెట్టి
  రమణి విల్లు విఱిచె ప్రమద మెసఁ గ

  రిప్లయితొలగించండి
 11. విబుధవరులగణమువేంచేసియున్నట్టి
  జనకసభనుజొచ్చి సాహసమున
  రాక్షసాధములకరాతియై వెల్గు ధీ
  రమణి విల్లు విఱిచె ప్రమద మెసఁగ

  రిప్లయితొలగించండి
 12. రక్తలోచనియగుచు నరకునిగనియె
  పతికి విశ్రాంతి గల్పింప సతియె పూనె
  నాయుధము;తీవ్రమైన శరాళి తోడ
  రమణి,విల్లువిరిచె నంత ప్రమదమెసగ.

  (సత్యభామా పరముగా,అప్రయత్నముగా ఆ.వె. బదులు తే.గీ.వచ్చినది.)

  రిప్లయితొలగించండి
 13. రక్తలోచనియగుచు నరకునిగనియె
  పతికి విశ్రాంతి గల్పింప సతియె పూనె
  నాయుధము;తీవ్రమైన శరాళి తోడ
  రమణి,విల్లువిరిచె నంత ప్రమదమెసగ.

  (సత్యభామా పరముగా,అప్రయత్నముగా ఆ.వె. బదులు తే.గీ.వచ్చినది.)

  రిప్లయితొలగించండి
 14. వృద్ధ రమణి యొకతి "విల్లు" వ్రాసెను తన
  ఆస్తి గుడికి చేర! ఆమె సుతుడు
  దుష్టుడౌటఁ జేసి దొంగ తనంబున
  రమణి విల్లు విఱిచె ప్రమద మెసఁగ!!

  విఱిచె = చింపె

  రిప్లయితొలగించండి
 15. జిగురు వారూ! బహుకాలదర్శనం..'విల్లును' ఇరగ దీశారండీ..

  రిప్లయితొలగించండి
 16. శివుని ఛాప మెత్త చిన్నారి సీతమ్మ
  తండ్రి గాంచి తలచె తరుణి శక్తి
  ధీరు డైన వాని తేగనెంచ రఘువ
  ర మణి విల్లు విఱచె ప్రమద మెసఁగ

  రిప్లయితొలగించండి