గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, ' హనుమ యేమియిత్తు నాలింగనము తప్ప' అన్న మీ పద్యం బాగుంది. అభినందనలు. * పండిత నేమాని వారూ, రామ పరిష్వంగ భాగ్యాన్ని సామీరి పొందిన విధానాన్ని మనోహరంగా వర్ణించారు. ధన్యవాదాలు. * తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారూ, నేమాని వారిపై మీ ప్రశంసాపద్యం బాగుంది. ధన్యవాదాలు. మొదటి పాదంలో గణదోషం. ' భళిభళియనిపించె కనగ భాగ్యమగుచు' అందాం.
శ్రీపండితులవారి ఆశీఃప్రసూనములకు సహస్రాభివందనములు. శ్రీ గురువుగారికి తప్పు సరిజేసి ముందుకు మమ్ము నడిపించుచున్నందులకు ధన్యవాదములు. పెద్దలు శ్రీ సుబ్బారావు గారు 3వ పాద ప్రథమార్ధ పద ప్రయోగం ఒక్కసారి చూడ మనవి.
డా. ప్రభల రామలక్ష్మి గారూ, మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు. * నాగరాజు రవీందర్ గారూ, బాగుంది మీ పద్యం. అభినందనలు. * తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారూ, చక్కని పద్యం వ్రాసారు. అభినందనలు. కాకుంటే మొదటి పాదంలో యతి తప్పింది. * సుబ్బారావు గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. * రాజేశ్వరి అక్కయ్య గారూ, పద్యం బాగుంది. అభినందనలు. 'వస్తి' అని గ్రామ్యపదాన్ని వాడారు.
మేలు చేసి తీవు మేలైన గుణ ధామ
రిప్లయితొలగించండిసీత జాడ దెలిపి శివము నిడిన
హనుమ యేమియిత్తు నాలింగనము తప్ప
భరతు తో సముడవు భవ్య చరిత.
కాంచితి సీతా మాత న
రిప్లయితొలగించండిటంచును ప్రణతులను సలిపి సాష్టాంగముగా
నంచిత గతి రాముని కెరి
గించెను సామీరి సేమ మెంతయు వేడ్కన్
రాక్షసేంద్రు పుత్రు నక్షుని గూల్చి ద
శాస్యు తోడ మాటలాడి లంక
నెల్ల గాల్చి వచ్చితేనని పల్కగా
రామచంద్రుడు విని ప్రమదమంది
బళి బళి ఆంజనేయ! శుభవాగ్విభవా! ప్రభుకార్య తత్పరా!
బళి బళి వాయుపుత్ర! రిపువర్గ భయంకర! శూరశేఖరా!
బళి బళి నాదు శోకమును బాపి సుఖమ్మును గూర్చినట్టి యు
జ్జ్వల బల ధైర్యశాలి! విలసద్గుణ భూషణ! ధీవిచక్షణా!
అనుచు గౌగిట జేర్చి వీరాంజనేయ!
యెటుల జేయుదు ప్రత్యుపకృతిని నీకు
ననుచు నాతని గుండెకు హత్తుకొనుచు
భద్రమగు గాక! యనుచు దీవనలొసంగె
ఏ దేవదేవ గొలుచుచు
పాదరజము సురలు మునులు వాంఛించెదరో
యా దేవు పరిష్వంగము
సాదరమున పొందగలిగె సామీరి బళా!
శ్రీ నేమాని పండితుల వారికి, శివకేశవులకభేదము తెల్పు ( హనుమ శివాంశ సంభూతండురు గనుక) చిత్ర ముచిన శ్రీ గురువుగారికి నమస్సులతో
రిప్లయితొలగించండిభళిభళియనిపించె చూడగ భాగ్యమగుచు
హృద్య పద్య రామచరిత హృదిని తట్టి
కనుల మూయుచు ధ్యానింప కాంచి తయ్య
పండిత గురువర్యా! మీదు భావ మహిమ.
మారుతి చేసిన సేవలె
రిప్లయితొలగించండికారణ మారాము ప్రేమ కౌగిళి నందన్
శ్రీరామ నామ జపమా
ధారము పాపము నశించి ధన్యులమవగన్
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండి' హనుమ యేమియిత్తు నాలింగనము తప్ప' అన్న మీ పద్యం బాగుంది. అభినందనలు.
*
పండిత నేమాని వారూ,
రామ పరిష్వంగ భాగ్యాన్ని సామీరి పొందిన విధానాన్ని మనోహరంగా వర్ణించారు. ధన్యవాదాలు.
*
తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారూ,
నేమాని వారిపై మీ ప్రశంసాపద్యం బాగుంది. ధన్యవాదాలు.
మొదటి పాదంలో గణదోషం.
' భళిభళియనిపించె కనగ భాగ్యమగుచు' అందాం.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితోపెల్ల శర్మ గారికి
రిప్లయితొలగించండినా పద్యము లింపుగూర్చె నా మది తోషం
బేపారె స్వస్తిరస్తని
యా పావనమతికి గూర్తు నాశీస్సుమముల్
Sree Samkarayya gaaroo!
రిప్లయితొలగించండిsamtoshamu.
తన సతియునికిని తెల్పిన
రిప్లయితొలగించండిహనుమంతుని జూచి రాముదచ్చెరువొందెన్
కొనుమా బహుమతి నీవని
తన కౌగిట జేర్చుకొనియె తమకము తోడన్
శ్రీపండితులవారి ఆశీఃప్రసూనములకు సహస్రాభివందనములు. శ్రీ గురువుగారికి తప్పు సరిజేసి ముందుకు మమ్ము నడిపించుచున్నందులకు ధన్యవాదములు. పెద్దలు శ్రీ సుబ్బారావు గారు 3వ పాద ప్రథమార్ధ పద ప్రయోగం ఒక్కసారి చూడ మనవి.
రిప్లయితొలగించండితన సీత బ్రతికి యున్నద
రిప్లయితొలగించండిను నిజమెఱిగి రాఘవుండు నొకపరి హనుమన్
ఘనుడవు నీవె యనుచు ముద
మున నాతని కౌగిలించె మురియుచు నాత్మన్
రాముడుప్పొంగె రామమయిన పలుకులు
రిప్లయితొలగించండి“జనని జాడ యిదియె” యని హనుమ పలుక
తానె యుండిన డెందము తనదరికిని
సర్వమున్ తానె యగువాడు స్వాగతించె.
చిన్మయ రూపుడు రాముడు
రిప్లయితొలగించండితన్మయమున నాంజనేయు దనువును దాకెన్
ఉన్మత్తుల వలె వారలు
తన్మయులై యొకరి నొకరు దనువులు గలిపెన్ .
రాముని యాలింగనమున
రిప్లయితొలగించండిప్రేమగ మైమరచి హనుమ పెన్నిధి యనుచున్ !
నీమహిమ వలన మాతను
సేమముగా గాంచి వస్తి సేవించగ నిన్ !
డా. ప్రభల రామలక్ష్మి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
*
నాగరాజు రవీందర్ గారూ,
బాగుంది మీ పద్యం. అభినందనలు.
*
తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారూ,
చక్కని పద్యం వ్రాసారు. అభినందనలు.
కాకుంటే మొదటి పాదంలో యతి తప్పింది.
*
సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*
రాజేశ్వరి అక్కయ్య గారూ,
పద్యం బాగుంది. అభినందనలు.
'వస్తి' అని గ్రామ్యపదాన్ని వాడారు.
గురువు గారికి నమస్సులు.ముసాయిదాలో వ్రాసినదానిని బ్లాగులో ఉంచేసమయంలో రాముడు చేర్చి మతిలేక యతిని పోగొట్టినాను.దోషం తెల్పి నన్ను సవరించుచున్నందులకు ధన్యవాదములు. సవరణానంతరం
రిప్లయితొలగించండిహృదయ ముప్పొంగి రామమయిన పలుకులు
“జనని జాడ యిదియె” యని హనుమ పలుక
తానె యుండిన డెందము తనదరికిని
సర్వమున్ తానె యగువాడు స్వాగతించె.