13, జనవరి 2013, ఆదివారం

సమస్యాపూరణం - 936 (సంకటంబుల సంక్రాంతి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
సంకటంబుల  సంక్రాంతి! స్వాగతంబు.
ఈ సమస్యను పంపిన సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

19 కామెంట్‌లు:

  1. అమిత పుణ్యదమగు నుత్తరాయణమ్ము
    వచ్చె నూతన శోభలు తెచ్చె నదిగొ
    శాంతి గూర్చుము వేగ నాశమ్మొనర్చి
    సంకటంబుల సంక్రాంతి స్వాగతంబు

    రిప్లయితొలగించండి
  2. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మఆదివారం, జనవరి 13, 2013 8:32:00 AM

    క్రొత్త బట్టలింకను దర్జి కుట్ట లేదు
    బస్సు రైలు టిక్కెట్టులు తుస్సు మనగ
    చేర నెట్లు పుట్టింటికి సెలవు లేక
    సంకటంబుల, సంక్రాంతి! స్వాగతంబు.

    రిప్లయితొలగించండి
  3. వావి వరుసలు గనకుండ వయసు గూడ
    ఆడువారిని హింసించు యధములకును
    తెచ్చి పెట్టమ్మ తప్పక కుప్పలుగను
    సంకటంబుల సంక్రాంతి! స్వాగతంబు

    రిప్లయితొలగించండి
  4. శ్రీ హనుమఛ్ఛాస్త్రి గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యములో హింసించు అను పదము తరువాత నుగాగమము వచ్చును. యడాగమము కాదు. స్వస్తి.

    రిప్లయితొలగించండి

  5. అంకటంబుల భాంతి క్రాంతీ స్వాగతంబు
    ఇరకటంబుల భ్రాంతీ క్రాంతీ స్వాగతంబు
    చురకటంబుల భోగీ క్రాంతీ స్వాగతంబు
    సంకటంబుల సంక్రాంతీ స్వాగతంబు !

    స్వాగతీ
    జిలేబి.

    రిప్లయితొలగించండి
  6. అమ్మా! లక్ష్మీ దేవి గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యము తొలి పాదములో గణభంగమున్నది. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  7. మకరరాశికి సూర్యుండు మహిత తేజు
    డరుగుదెంచుచు నుండంగ నమితభక్తి
    మెలగు చుందుము రమ్మింక తొలగద్రోచి
    సంకటంబుల, సంక్రాంతి! స్వాగతంబు.

    రిప్లయితొలగించండి
  8. కాయకష్టముఁజేసినకర్షకులకు
    ధాన్యరాశులనిచ్చిన ధరణి మాత
    ముగ్గులేయుచుమ్రొక్కేము ముదముఁదీర్చు
    సంకటంబుల,సంక్రాంతి స్వాగతమ్ము

    రిప్లయితొలగించండి
  9. శ్రీ నేమాని గారూ ! ధన్యవాదములు.
    సవరణ తో...


    వావి వరుసలు గనకుండ వయసు గూడ
    ఆడువారిని హింసించు నధములకును
    తెచ్చి పెట్టమ్మ తప్పక కుప్పలుగను
    సంకటంబుల సంక్రాంతి! స్వాగతంబు

    రిప్లయితొలగించండి
  10. అయ్యా, ధన్యవాదములు.
    సవరణ

    చలి పులిగ మారి వణికించు సమయమందు
    ముగ్గులను బెట్టు మగువల ముచ్చటగని
    వారి కరుణించి తగ్గించు పల్లెలందు సంకటంబుల;
    సంక్రాంతి! స్వాగతంబు.

    రిప్లయితొలగించండి
  11. దక్షిణాయన కాలము తరలిపోయె
    నుత్తరాయన పుణ్యకాలోత్తరమున
    వలసి నట్టి వాంఛల దీర్చు, పారద్రోలు
    సంకటంబుల సంక్రాంతి! స్వాగతంబు.

    రిప్లయితొలగించండి

  12. పాడి పంటల దులదూగు పావ నాంగి !
    అలుపు సొలుపులు లేకుండు నట్లు జేయు
    జీవితంబును నీయగ జీ వులకును
    సంక టం బుల సంక్రాంతి ! స్వాగ తంబు

    రిప్లయితొలగించండి
  13. ప్రియ మైన సోదరులకు సోదరి శ్రీమతి లక్ష్మీ దేవి గారికీ సంక్రాంతి శుభా కాంక్షలు

    రంగ వల్లుల ముంగిళ్ళు రమ్య ముగను
    యెదను బాధలు నగవుల నదిమి కొనుచు
    జగతి నిండిన యసురుల ప్రగతి యందు
    సంక టంబుల సంక్రాంతి స్వాగతమ్ము

    రిప్లయితొలగించండి
  14. అక్బరాఖ్యుని ప్రేలుడు కడ్డు దగుల
    మేత నేతలు చెఱసాల మేరఁ జిక్క
    దుర్జనావళి కీనాడు దుర్దశ యిడు
    సంకటంబుల,సంక్రాంతి స్వాగతమ్ము !

    రిప్లయితొలగించండి
  15. పాపముల నెల్ల తొలగించు పౌష్యలక్ష్మి
    బాధలను దీర్చు మాయమ్మ పౌష్యలక్ష్మి
    కోవిడును నీవు వేవేగ కూల్చివేయ
    సంకటంబుల,సంక్రాంతి! స్వాగతంబు !!

    రిప్లయితొలగించండి