హితమతి అనే పదం సరియేనా? నిఘంటువులో హితమరి ఉన్నది గానీ హితమతి అని కనిపించలేదు. అయితే హితమతి కి వ్యుత్పత్తి అర్థం (హిత+మతి = హితమైన మతి గలవాడు) అనుకోవచ్చా?
గురువుగారికి నమస్కారములు, నిన్నటి నాచే పూరింపబడిన చిత్ర కవిత్వం పొరపాటున పూర్తిగా ప్రచురింపబడలేదు. ఈ రోజు పరిశీలించగలరు. మీ సూచనకు నా ధన్యవాదములు. సదా మీ ఆశీఃపూర్వక ప్రొత్సాహాన్ని ఆశిస్తూ.....
అజ్ఞాత గారూ, 'హితమతి' క్రొత్త ప్రయోగం కాదు. భాగవతం తృతీయస్కంధం 457 వ పద్యం చూడండి.... దితి యీగతిఁగామవిమో హితమతి బహువచనముల హృదీశునిఁబలుకన్ ధృతిఁగృపణఁబతివ్రత నిజ సతిఁగని కశ్యపుఁడు పలికె సల్లాపమునన్.
సుబ్బారావు గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. నాల్గవ పాదంలో యతి తప్పింది. హిందువునకు' అంటే సరి. * లక్ష్మీదేవి గారూ, ఒకే పూరణను రెండు విధాలుగా చెప్పిన తీరు బాగుంది. అభినందనలు. 'రాజ గద్దియ' అన్నదానిని 'రాచ గద్దియ' అనండి. * కమనీయం గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. * తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారూ, బాగుంది మీ పూరణ. అభినందనలు. చె అని హ్రస్వంగా ప్రయోగించరాదు కదా... 'సంగతమున' అందాం. * హ.వేం.స.నా.మూర్తి గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. రెండవ పాదంలో గణదోషం... హరి గారి సవరణను గమనించారు కదా... * హరి గారూ, శంకరాభరణం బ్లాగు మీకు ఆనందంగా స్వాగతం పలుకుతున్నది. ధన్యవాదాలు.
ఆర్యా! నమస్కారములు. హ.వేం.స.నా.మూర్తి మరియు vsnmhari ఇద్దరూ వేర్వేరు కాదు. ఒక్కనిగానే భావించప్రార్థన. ధన్యవాదములు. విధేయుడు హ.వేం.స.నా.మూర్తి(vsnmhari)
హిత మతిని గూ ల్చితే ? దేవ ! శ్రిత హితైషి !
రిప్లయితొలగించండియెంత పని చేసి తీ వయ ! యింత లోనె !
శ్రితుల గాపాడ ధర్మము హితుల కౌర !
ఇదియ బాధ్యత ప్రతి యొక్క హైంద వునకు .
రాజ గద్దియ నెల్ల వేళలను గాచు
రిప్లయితొలగించండిభీష్ముని, మహారథియగు నా వీరవరుని,
ఘనత పార్థుతో గూడి; యా కౌరవకుల
హితమతిని గూల్చితే? దేవ! శ్రితహితైషి!
రాజ గద్దియ నెల్ల వేళలను గాచు
రిప్లయితొలగించండిభీష్ముని, మహారథియగు నా వీరవరుని,
ఘనత పార్థుతో గూడి; యా కౌరవకుల
హితమతిని గూల్చితే? దేవ! శ్రితహితైషి!
పార్థుతో గూడి రణమున పరమపురుష!
రిప్లయితొలగించండిభీష్ముని, మహారథియగు నా వీరవరుని,
గంగ పుత్రుని , వృద్ధుని, కౌరవకుల
హితమతిని గూల్చితే? దేవ! శ్రితహితైషి!
రిప్లయితొలగించండిఅతులవరగర్వితుండైన యసురవరుడు
అమరలోకమ్మును జయించి యాక్రమింప
యర్థినింద్రుండు నినువేడ నా సురల క
హితమతిని గూల్చితే దేవ శ్రితహితైషి.
రిప్లయితొలగించండిఅతులవరగర్వితుండైన యసురవరుడు
అమరలోకమ్మును జయించి యాక్రమింప
యర్థినింద్రుండు నినువేడ నా సురల క
హితమతిని గూల్చితే దేవ శ్రితహితైషి.
రిప్లయితొలగించండిఅతులవరగర్వితుండైన యసురవరుడు
అమరలోకమ్మును జయించి యాక్రమింప
యర్థినింద్రుండు నినువేడ నా సురల క
హితమతిని గూల్చితే దేవ శ్రితహితైషి.
జగతినెంత వారలయినన్ సంగతముచె
రిప్లయితొలగించండిహితవరులయినన్ దుష్టుల హతము చేయు
తరిని ఫలితమనుభవింప తప్ప దనుచు
హితమతిని గూల్చితే? దేవ! శ్రితహితైషి!
హితమతి అనే పదం సరియేనా? నిఘంటువులో హితమరి ఉన్నది గానీ హితమతి అని కనిపించలేదు. అయితే హితమతి కి వ్యుత్పత్తి అర్థం (హిత+మతి = హితమైన మతి గలవాడు) అనుకోవచ్చా?
రిప్లయితొలగించండిమాయాబజార్ సినిమాలో ఘటోత్కచుడు " ఎవరూ పుట్టించకుండా మాటలు ఎక్కడనుండి వస్తాయ్? వెయ్యరా వీడికి రెండు డింగిడీలు".
రిప్లయితొలగించండిమరొక అజ్ఙాత.
గురువుగారికి నమస్కారములు,
రిప్లయితొలగించండినిన్నటి నాచే పూరింపబడిన చిత్ర కవిత్వం పొరపాటున పూర్తిగా ప్రచురింపబడలేదు.
ఈ రోజు పరిశీలించగలరు. మీ సూచనకు నా ధన్యవాదములు. సదా మీ ఆశీఃపూర్వక ప్రొత్సాహాన్ని ఆశిస్తూ.....
స్నేహధర్మంబు పాటించి వ్యూహమూని
రిప్లయితొలగించండిరమ్యగుణధామ! రఘువంశసోమ! నీవు
వానరాధిపుడైనట్టి వాలి నఘస
హితమతిని గూల్చితే దేవ! శ్రితహితైషి
ఆర్యా!
రిప్లయితొలగించండినమస్కారములు.
రెండవపాదాన్ని
"రమ్యగుణధామ! శ్రీరఘురామ! నీవు"
అని సవరించవలసినదిగా ప్రార్థన.
అజ్ఞాత గారూ,
రిప్లయితొలగించండి'హితమతి' క్రొత్త ప్రయోగం కాదు.
భాగవతం తృతీయస్కంధం 457 వ పద్యం చూడండి....
దితి యీగతిఁగామవిమో
హితమతి బహువచనముల హృదీశునిఁబలుకన్
ధృతిఁగృపణఁబతివ్రత నిజ
సతిఁగని కశ్యపుఁడు పలికె సల్లాపమునన్.
కూచిమంచి జగ్గకవి చంద్రరేఖావిలాసములో....
రతిచింత చేత నిప్పుడు
మతివోయిన రీతినుండు మాకున్ సుద్దుల్
హితమతి చెప్పెదు పోపో
పతిచిత్త మెరుంగలేవు బాపడవయ్యున్.
శ్రీవిష్ణుధర్మోత్తరం, ద్వితీయఖండం, ధనుర్వేద విద్యాకథనంలో....
బింబోయం విధిసహితో హితః సుముక్తః |
శిష్యాణాం హితమతి కుర్వతా మయా తే |.
వాహానాం శ్రమహరణ ప్రధారణార్థమ్ |
యోగ్యార్హం ప్రథమతరం బుధేన వధ్యమ్.
చ. హితమతి వేంకటాద్రి విభు*డేలెడు నయ్యమరావతీపురిన్
గ్రతుభుజులన్నవస్త్రములు * గాంచరొకప్పుడు బూర్వదేవతా
హితమతి; వేంకటాద్రి నృపు*డేలెడు నీయమరావతీపురిన్
సతత సమస్తవర్ణులును * జక్కగ గాంచుదురన్న వస్త్రముల్ 28
అన్నమయ్య పదం 'ఇటుగన సకలోపాయము లుడిగిన....' లో
హితమతి స్వతంత్రముడిగినయోగికి యీశ్వరుడే రక్షకుడు
'నాగుల చవితి' చలనచిత్రంలోని 'పాహి మాం పాహి...' పాటలో...
పతిపాదయె గతినాతికి హితమతి కులసతి మొర మహాదేవ వినవా
పైన పేర్కొన్నవన్నీ 'హితమతి' అని గూగుల్‌లో వెదికితే దొరికినవే...
..... ఇన్ని పూర్వప్రయోగా లుండగా క్రొత్తగా 'వీరతాడు' వేయవలసిన అవసరం ఏముంది?
సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
నాల్గవ పాదంలో యతి తప్పింది. హిందువునకు' అంటే సరి.
*
లక్ష్మీదేవి గారూ,
ఒకే పూరణను రెండు విధాలుగా చెప్పిన తీరు బాగుంది. అభినందనలు.
'రాజ గద్దియ' అన్నదానిని 'రాచ గద్దియ' అనండి.
*
కమనీయం గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
చె అని హ్రస్వంగా ప్రయోగించరాదు కదా... 'సంగతమున' అందాం.
*
హ.వేం.స.నా.మూర్తి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
రెండవ పాదంలో గణదోషం... హరి గారి సవరణను గమనించారు కదా...
*
హరి గారూ,
శంకరాభరణం బ్లాగు మీకు ఆనందంగా స్వాగతం పలుకుతున్నది. ధన్యవాదాలు.
ఆర్యా!
రిప్లయితొలగించండినమస్కారములు.
హ.వేం.స.నా.మూర్తి మరియు vsnmhari ఇద్దరూ వేర్వేరు కాదు. ఒక్కనిగానే భావించప్రార్థన.
ధన్యవాదములు.
విధేయుడు
హ.వేం.స.నా.మూర్తి(vsnmhari)