9, జనవరి 2013, బుధవారం

సమస్యాపూరణం - 932 (పెద్ద మనస్సులంచు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
పెద్ద మనస్సులంచు మన పెద్దలతో పరిహాస మేలనో?
సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదములు.

14 కామెంట్‌లు:

  1. పెద్దలు మేతలందు గడు బెద్దలు వేషము భాషణమ్ములం
    దద్దిర చూడనెంచరట యన్య జనమ్ముల వంక నెన్నడున్
    గొద్దిగ గాక సంపదల గుట్టల గూర్తు రివేమి చాలవా?
    పెద్ద మనస్సులంచు మన పెద్దలతో పరిహాస మేలనో?

    రిప్లయితొలగించండి
  2. వద్దని యెన్ని మార్లు మరి వాదన జేసిన చిత్ర సీమలో
    హద్దులుదాటి హేయమయు హాస్యపు "సీనులు" పెట్టు టేలనో
    సుద్దులు జెప్పు గుర్వులును చూడగ బ్రాహ్మణ వేషగాండ్లపై
    పెద్ద మనస్సులంచు మన పెద్దలతో పరిహాస మేలనో?

    రిప్లయితొలగించండి
  3. విద్దెల నెన్నొ నేర్చితిని విత్తము నెంతయు కూడబెట్టితిన్
    అద్దిర బన్న! నేను గద యందరి కన్నను మిన్న యంచు నా
    సుద్దుల నెన్నియో బలికి చోద్యము గాంచును పెద్ద లందునన్
    పెద్ద మనస్సులంచు మన పెద్దలతో పరిహాస మేలనో?

    రిప్లయితొలగించండి
  4. వద్దని చెప్పియున్ వినక పశ్చిమ దేశపు పద్ధతిన్ భలే
    ముద్దుగ నేర్చు చిన్నలకు మోహము తీరుటదెన్నడోగదా!
    "హద్దులు నేర్పరెప్పుడిక నవ్వలి దేశపు వారి(ర)వే మహా
    పెద్ద మనస్సులం"చు మన పెద్దలతో పరిహాస మేలనో?

    రిప్లయితొలగించండి
  5. హద్దులుమీఱి మీరిటవిహారములంచు కుబుద్ధిబద్ధులై
    వద్దని హెచ్చరించిన చివాలున లేతురు, మోసపోయి మా
    యొద్దకువచ్చి మమ్ములసయోధ్యకుఁ బిల్వుటదెట్లునోపునో?
    పెద్ద మనస్సులంచు మన పెద్దలతో పరిహాసమేలనో.

    రిప్లయితొలగించండి
  6. మొద్దను జూపుచున్ మిగుల బుద్ధిమతుండన హేళనంబగున్!
    శ్రద్ధయె లేని వాని గని జాతికి రత్నమటన్న ప్రేళనౌ!
    బుద్ధులు మృగ్యమై ధనము ప్రోగిడి నంతనె వృద్ధులైనయున్
    పెద్దమనస్సులంచు మన పెద్దలతో పరి హాసమేలనో?

    రిప్లయితొలగించండి
  7. శ్రీగురుభ్యోనమః
    మూడవపాదమునకు సవరణ:

    'బుద్ధులు మృగ్యమై ధనము ప్రోగిడి నంతనె వృద్ధులన్ యహో'
    స్వస్తి .

    రిప్లయితొలగించండి
  8. అయ్యా! శ్రీ సహదేవుడు గారూ!
    శుభాశీస్సులు
    మీ సవరణలో కూడా మరొక సవరణ కావాలి. వృద్ధులన్ తరువాత యడాగమము రాకూడదు. మీరు యడాగమము చేసేరు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  9. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మబుధవారం, జనవరి 09, 2013 7:42:00 PM

    ముద్దులు తప్పుకా వనుచు మోహవి కారము బెంచుచున్ సినీ
    హద్దులు దాటుచున్ కథకు హాస్యర సంబను బుర్కమా టునన్
    జిద్దుల కాలవా లముగ చిత్రము లుండగ, లేదటంచు మా
    పెద్ద మనస్సులంచు మన పెద్దలతో పరిహాస మేలనో?
    ( జిద్దు = కలహము)

    రిప్లయితొలగించండి
  10. శ్రీనేమని గురువులకు నమస్సులు. తమరి సూచనకు సవరణ:
    మూడవ పాదం చివర

    'వృద్దులన్ భళా'
    అంటే సరిపోతుందా గురువుగారూ పరిశీలించ ప్రార్థన స్వస్తి .

    రిప్లయితొలగించండి
  11. కవిమిత్రులకు నమస్కృతులు.
    మళ్ళీ తీవ్రమైన అస్వస్థత (జ్వరమూ, కీళ్ళనొప్పులు). అందువల్ల నిన్నటి పూరణలను, పద్యాలను వ్యాఖ్యానించలేకపోయాను. మన్నించండి.
    మంచి మంచి పూరణలను పంపిన కవిమిత్రులు....
    పండిత నేమాని వారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    నాగరాజు రవీందర్ గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
    సహదేవుడు గారికి,
    తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి,
    అభినందనలు, ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి




  12. విద్దెలు నేర్చి చక్కగను ,విజ్ఞత సూక్ష్మవివేకబుద్ధులై
    పెద్దలుకావలెన్ వయసు పిన్నలె యైనను జ్ఞానవృద్ధులై
    సుద్దులుకొన్నినేర్చివయసున్ననె పెద్దమనుష్యులౌదురే?
    పెద్దమనస్సులంచు మన పెద్దలతో పరిహాసమేలనో.

    రిప్లయితొలగించండి
  13. దద్దమ వోలె డింభకుడ! దంభము మీరగ కౌగిలించి వే
    హద్దులు దాటుచున్ నగుచు హాయిని దేలుచు కన్నుగొట్టితే!
    గ్రుద్దులు పెట్టెదన్ భడవ! గ్రుడ్డులు పీకెద! పార్లమెంటులో
    పెద్ద మనస్సులంచు మన పెద్దలతో పరిహాస మేలనో?

    రిప్లయితొలగించండి