26, జనవరి 2013, శనివారం

సమస్యాపూరణం – 948

కవిమిత్రులారా,
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు! 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
అయినను పోయి చూడవలె హస్తినలో గణతంత్ర పర్వమున్.

24 కామెంట్‌లు:

  1. రయమున జూడ గోరె చనిరాగను నేడట సోయగంబులే
    భయమది వేయుచుండె మరి బాంబుల దాడులు జర్గునో నుషో
    దయమున మేను వణ్కు నటు మీదట మంచులు గుర్సి ముంచునో
    అయినను పోయి చూడవలె హస్తినలో గణతంత్ర పర్వమున్.

    రిప్లయితొలగించండి
  2. జయ జయ దేశమాత! యని సన్మతి పూని పతాకమొండు స
    న్నయముగ జూచుటొప్పు నయనమ్ముల విందగు సంబరమ్ములన్
    రయముగ జేరుదామనిన ప్రఖ్య విమానమె దిక్కు బాపురే
    అయినను పోయి చూడవలె హస్తినలో గణతంత్ర పర్వమున్

    రిప్లయితొలగించండి
  3. గోలివారి పూరణలో కుర్సి (కురిసి ?) , నేమాని గారి పూరణలో చేరుదాము (చేరుదము?) అనునవి మంచి ప్రయోగాలేనా ? చేరుదాము అనునది గ్రామ్యము వలెనున్నది అనిపించుచున్నది.

    రిప్లయితొలగించండి
  4. అజ్ఞాత గారికి శుభాశీస్సులు.
    మీ పూరణలు ఎన్నడు కానరావేల? మీరు పద్యరచనలు చేస్తున్నపుడే అందరికీ ఆనందము. కేవలము ఇతరుల పద్యములను చూస్తూ మీ ప్రతిభలను చూపక పోతే ఏమి బాగుంటుంది? ఆ దిశలో ఒక అడుగు ముందునకు వేయండి. ఆకాశ రామన్న పేరుతో సరిపెట్టుకొనక మీ అసలు పేరుతో బయట పడండి. తెర వెనుక భాగవతములు మంచి పద్ధతులు కావు కదా. శుభం భూయాత్. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  5. అయ్యా నేమానిగారు , తెర ముందు నడిచే భారతములను తెర వెనుక నుండే సరిదిద్దెదను అది కూడ తెలిసి తెలిసి గ్రామ్యములు వాడిన సందర్భాలలో మాత్రమని విన్నవించుకొనుచున్నాను. నేను చెప్పినదాని గురించి మీరు శ్రద్ధ చూపించెదరని ఆశించుచున్నాను . మీరేమో అది తప్ప తక్కినవన్నీ చెప్పుచున్నారు.

    అయ్యా శంకరయ్యగారు, అక్కడ మంచు కురిసి అంటే కురవడం వలన అని కవి భావమనుకొనుచున్నాను . ఆసనం అని కాదేమో అనిపించుచున్నది , మీరు దయతో మరొక్కమారు పరిశీలించగలరని విన్నపం.

    రిప్లయితొలగించండి
  6. అజ్ఞాత గారూ,
    మన్నించండి. నేను గోలి వారి పూరణ చూడక వ్యాఖ్యానించాను. దోషమే....

    రిప్లయితొలగించండి
  7. ట్రెయిను టికెట్ లభించుటన ఢిల్లికి నేడును కష్టమే సుమా !
    రయమున బోవనెంచిన సరాసరి ఫ్లైటున లేదు విత్తమున్
    పయనము జేయ బస్సున నపాయము గల్గునొ ? చేరు టెప్పుడో !?
    అయినను పోయి చూడవలె హస్తినలో గణతంత్ర పర్వమున్

    రిప్లయితొలగించండి
  8. క్షయమయె దేశ సంపద, విశాల ధరిత్రి విభాజితంబయెన్
    "స్వయ"మను పాలనాభిహితచట్టములన్, ప్రజ భీతి నొందు ని
    ర్ణయముల భారతీయతయు నాశము నొందుచు నుండె; నేది యే
    మయినను పోయి చూడవలె హస్తినలో గణతంత్ర పర్వమున్

    రిప్లయితొలగించండి
  9. ఓ మహిళ ఆలోచన:
    భయమగు బస్సులోనఁజన భంగము జేసెడు దూర్తులుండ ని
    ర్భయ గతి పట్టు నేమొనని,రైలున బోవ ప్రమాద ముండునో? విమా
    నయతనమన్న ప్రేలుడులె నామతి తోచును, గోర్కెతీరగా
    నయినను పోయి చూడవలె హస్తినలో గణతంత్ర పర్వమున్

    రిప్లయితొలగించండి
  10. అజ్ఞాత గారూ ! దోషమును తెలిపినందులకు ధన్యవాదములు. సవరించుచున్నాను.
    శంకరార్యా ! అది ' మంచు' కురిసి అనియే.. ధన్యవాదములు.

    రయమున జూడ గోరె చనిరాగను నామది సోయగంబులే
    భయమది వేయుచుండె మరి 'బాంబుల' దాడులు గల్గునో నుషో
    దయమున మేను వణ్కు నటు మీదట మంచుయె తాకి ముంచునో
    అయినను పోయి చూడవలె హస్తినలో గణతంత్ర పర్వమున్.

    రిప్లయితొలగించండి
  11. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మశనివారం, జనవరి 26, 2013 3:07:00 PM

    ప్రియముగ నయ్యె నిత్యమొకరీతిని పెంచగ నిత్య వస్తువుల్
    భయమగు చుండె జీవితపు భారము హెచ్చ జనాళి కంతటన్
    నయమగు రీతి రాష్ట్రపతి న్యాయము చేయుదురేమొ యంచుమే
    మయినను పోయి చూడవలె హస్తినలో గణతంత్ర పర్వమున్.

    రిప్లయితొలగించండి
  12. ఈనాటి సమస్యకు చక్కని పూరణలు చెప్పి అలరించిన కవిమిత్రులు....
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    పండిత నేమాని వారికి,
    నాగరాజు రవీందర్ గారికి,
    రాంభట్ల వారికి,
    సహదేవుడు గారికి,
    తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి
    అభినందనలు, ధన్యవాదాలు.
    *
    సహదేవుడు గారూ,
    'ఏమొ + అని' అన్నప్పుడు యడాగమం వచ్చి 'ఏమొయని' అవుతుంది.

    రిప్లయితొలగించండి
  13. తెలదొరసాని పాలనయు తేరగ మ్రింగిన దొంగలచ్చటన్
    వెలవెలబోవు రాష్ట్రపతి వేడుక మాటల గారడీలతో
    అలసిన భారతాంబకును హారతి పట్టెడి వైనమేమిటో!
    అయినను పోయి చూడవలె హస్తినలో గణతంత్ర పర్వమున్.

    రిప్లయితొలగించండి




  14. జయజయ భారతీ ధ్వనుల జాతి సగర్వముగా రిపబ్లిక
    క్షయమగు గాక యని చక్కగ కోట్ల జనాళి వేడుకన్
    భయరహితమ్ముగా జరుపు పర్వవిశేషము కష్ట సాధ్యమే
    యయినను పోయి చూడవలె హస్తినలో గణతంత్ర పర్వమున్.

    రిప్లయితొలగించండి
  15. గురువుగారికి తప్పు తెలియ జేసినందులకు ధన్యవాదములు

    మిత్రులు చంద్రశేఖర్ గారు మీ పద్యం బాగుంది. కాని ప్రాస పొరపడ్డారు.

    రిప్లయితొలగించండి
  16. శ్రీసహదేవుడుగారూ, మంచిపట్టే పట్టారు. గమనించనేలేదు. భావంకోసం ఇప్పటికి ఇలా కానిచ్చేద్దాం. సమయానుకూలంగా ఇంకో పూరణ ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  17. గురువు గారు,
    శంకరాభరణం సామరస్యంగా ఉండగలదని ఆశిస్తున్నాను.
    మాబోటి (అ)జ్ఙానులకు కూడా కొంత తావు కల్పించగలరని ఆశించడం అత్యాశ కాబోదని అభిప్రాయపడుతున్నాను.

    రిప్లయితొలగించండి
  18. "చట్టము" అన్నచోట శాశన మన్న సవరణతో

    క్షయమయె దేశ సంపద, విశాల ధరిత్రి విభాజితంబయెన్
    "స్వయ"మను పాలనాభిహితశాశనమున్, ప్రజ భీతి నొందు ని
    ర్ణయముల భారతీయతయు నాశము నొందుచు నుండె; నేది యే
    మయినను పోయి చూడవలె హస్తినలో గణతంత్ర పర్వమున్!!

    రిప్లయితొలగించండి
  19. చంద్రశేఖర్ గారూ,
    ప్రాస తప్పినా మీ పూరణలోని ఉదాత్తమైన భావం అలరిస్తున్నది. అభినందనలు.
    *
    కమనీయం గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  20. రయమున బాలబాలికలు రంజిలు నాట్యము జేయుచుండ వి
    స్మయమును గొల్పునట్టి మన సైన్యము వింతలు సల్పుచుండగా
    భయమును గొల్పు చల్లనగు వాయువు వీచును, శీతకాలమే
    అయినను పోయి చూడవలె హస్తినలోగణతంత్ర పర్వమున్

    రిప్లయితొలగించండి
  21. రయమున స్కూటరెక్కుచును రంగుల టీవిని మార్కెటందునన్
    భయమును వీడి గైకొనుచు భామకు తోడుత మంచమెక్కుచున్
    నయమున చూడ వచ్చుగద నందము మీర పకోడి మేయుచున్...
    అయినను పోయి చూడవలె హస్తినలో గణతంత్ర పర్వమున్
    ప్రియముగ నేడిపించగను పిండిని రుబ్బెడి నత్తగారినిన్

    రిప్లయితొలగించండి