శ్రీ తోపెల్ల శర్మ గారూ! శుభాశీస్సులు. మీకు ప్రాస నియమము గురించి అవగాహన లేనట్టుంది. ఇచ్చిన సమస్యలో ప్రాస అక్షరమునకు ముందు దీర్ఘ అక్షరము ఉన్నది కాబట్టి అన్ని పాదములలో ప్రాసకు ముందు అక్షరము దీర్ఘమే అయి యుండవలెను. స్వస్తి.
శ్రీ తోపెల్ల శర్మ గారూ! శుభాశీస్సులు. రోషార్ణవ కీలలు అనే మీ ప్రయోగము బాగులేదు. అర్ణవము అంటే సముద్రము కదా. సముద్రములో కీలలు (మంటలు) అనుట ఉచితము కాదు అని నా భావము. బడబాగ్ని కూడా సముద్రము లోలోననే ఉంటుంది కానీ బయటకు మంటలుగా రాదు. స్వస్తి.
ఈనాటి సమస్యకు చక్కని పూరణలు చేసిన కవిమిత్రులు.... పండిత నేమాని వారికి, లక్ష్మీదేవి గారికి, తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి, మిస్సన్న గారికి, గన్నవరపు నరసింహ మూర్తి గారికి, సుబ్బారావు గారికి, సహదేవుడు గారికి, కమనీయం గారికి, నాగరాజు రవీందర్ గారికి, రామకృష్ణ గారికి, అభినందనలు, ధన్యవాదములు. * లక్ష్మీదేవి గారూ, ‘నీలపు కాయుడు’ కంటే ‘నీల శరీరుడు’ అంటే వినసొంపుగా ఉంటుందేమో! * తోపెల్ల వారూ, సవరించిన పూరణ బాగుంది. కానీ మొదటి పాదంలో గణదోషం... ‘వాలాయమ్ముగ’ అంటే సరి! * సహదేవుడు గారూ, ‘వేళ యిదే + అని’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. ‘కౌరవ కూళలు’ అనడం సరి! ‘కూళుడు’ అనే రూపమూ ఉంది. దాని బహువచన రూపం ‘కూళురు’ అవుతుంది. * రామకృష్ణ గారూ, మొదటి పాదాన్ని ‘మేలును కీడుల నెఱుగక’ అంటే బాగుంటుందేమో?
శైలసుతాత్మజుడు మహా
రిప్లయితొలగించండికాలప్రేరేపితుండు స్కందుడు బల్మిన్
కాలాగ్ని సన్నిభుండై
బాలుడు భండనమునందు వైరుల గూల్చెన్
నీలపు కాయుడు రాముఁడు
రిప్లయితొలగించండిలీలగ నెక్కుడు శరమ్ములేయుచు దానే
కాలుని వలె చెలరేగుచు
బాలుఁడు భండనమునందు వైరులఁ గూల్చెన్.
విలుకాడయి విశ్వామి
రిప్లయితొలగించండిత్రులయా గముగా వనేగి, రోషా ర్ణవకీ
లలజూచుచు రణ రాముడు
బాలుఁడు భండనమునందు వైరులఁ గూల్చెన్.
కాలికి తగులగ బొంగర-
రిప్లయితొలగించండిమాలేమకు, మందలింప, నంతను దీటై
వాలెను తండ్రికి తోడుగ
బాలుడు భండనమునందు వైరుల గూల్చెన్
(బాలచంద్రుడు)
శ్రీ తోపెల్ల శర్మ గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీకు ప్రాస నియమము గురించి అవగాహన లేనట్టుంది. ఇచ్చిన సమస్యలో ప్రాస అక్షరమునకు ముందు దీర్ఘ అక్షరము ఉన్నది కాబట్టి అన్ని పాదములలో ప్రాసకు ముందు అక్షరము దీర్ఘమే అయి యుండవలెను. స్వస్తి.
శ్రీ తోపెల్ల శర్మ గారూ!
రిప్లయితొలగించండిశుభాశీస్సులు.
రోషార్ణవ కీలలు అనే మీ ప్రయోగము బాగులేదు. అర్ణవము అంటే సముద్రము కదా. సముద్రములో కీలలు (మంటలు) అనుట ఉచితము కాదు అని నా భావము. బడబాగ్ని కూడా సముద్రము లోలోననే ఉంటుంది కానీ బయటకు మంటలుగా రాదు. స్వస్తి.
శ్రీపండితులవారికి నమస్సులు.ప్రాసపూర్వాక్షరము దీర్ఘమన్నది గమనించక పద్యంవ్రాయాలన్నతొందరలో జరిగిన తప్పు.మీ సూచనే సమంజసము. పునః ప్రయత్నము చేసెదను. దోషముతెల్పి, సూచనలిచ్చినందులకు శతథా ధన్యవాదములు.
రిప్లయితొలగించండిమాలిమి తనయుఁడు దశరథుఁ
రిప్లయితొలగించండిబాలిటి పెన్నిధిగ నలరు పాపఁడు , భళిరా!
లీలగ పదారు నిండని
బాలుఁడు భండనమునందు వైరులఁ గూల్చెన్.
తాలిమి తనువై వెలయగ
రిప్లయితొలగించండిపాలసులకు వెఱవడయ్యె ప్రహ్లాదుండున్
లాలిత గుణములు మెఱయగ
బాలుడు భండనమునందు వైరుల గూల్చెన్
( వైరులు = అరిషడ్వర్గము )
ఆలపు విద్యలు నేర్వగ
రిప్లయితొలగించండిబాలుడు శ్రీ రామ చంద్రు డాతత రక్తిన్
హేళన జేయగ కుమతులు
బాలుడు భండనము నందు వైరుల గూల్చెన్ .
శ్రీ పండితులవార్కి నమస్సులతో పునః ప్రయత్నముగా
రిప్లయితొలగించండివాలాయముగ యాగపు
శాలల సురులాక్రమింప సంరక్షకుడై
కోలన్ క్రోధజ్వాలన్
బాలుడు భండనమునందు వైరుల గూల్చెన్
వేళయిదేనని కౌరవ
రిప్లయితొలగించండిగూళులు వ్యూహంబుఁబన్న కూన కుపితుడై
కాలయముండభిమన్యుడు
బాలుడు భండనము నందు వైరులఁ గూల్చెన్!
రిప్లయితొలగించండిఅభిమన్యుని సందర్భంలో -
కాలుండని భయపడగా
నేలా ,మనమెల్లకూడి యీతని జంపన్
జాలుదుమని యెదురుకొనన్
బాలుడు భండనమునందు వైరుల గూల్చెన్.
బాలచంద్రునిసందర్భముగా-
ఆ లలన మేలమాడగ
తాలిమిగోల్పోయి,రోషతాపమున జనె
న్నాలమునకు రుద్రునివలె
బాలుడు భండనమునందు వైరుల గూల్చెన్.
ఆలమున బాలచంద్రుడు
రిప్లయితొలగించండిఫాలాక్షుని భంగి మెరిసె పల్నాటి దెసన్
శూలము కరవాలము గొని
బాలుడు భండనమునందు వైరుల గూల్చెన్
ఈ రోజుల్లో పిల్లలకు కంప్యూటర్లు, మొబైళ్లు, టాబ్లెట్లలో ఆటలు - అందునా - యుద్ధపుటాటలు, తుపాకులు బాక్సింగ్ వగైరాలు కాబట్టి:
రిప్లయితొలగించండిమేలును కీడెరుగకనున్
గాలక్షేపమునుకోరి కైయంత్రమునన్
దేలని "గేముల" దేలుచు
బాలుడు భండనమునందు వైరుల గూల్చెన్
[ ఆ ఆటలు ఎంతకీ తేలేవు - ఒక అంచె ఐతే మరో అంచె అది ఐతే మరోటి ]
కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు ధర్మరాజుతో పలికే పలుకులు :
రిప్లయితొలగించండి“ఆలము నాపుద మదె నెల
బాలుడు ; భండనమునందు వైరుల గూల్చెన్
చాల కిరీటియె ధర్మజ !
కాలము దాటె రణమునకు కాంచగ నేడున్"
ఈనాటి సమస్యకు చక్కని పూరణలు చేసిన కవిమిత్రులు....
రిప్లయితొలగించండిపండిత నేమాని వారికి,
లక్ష్మీదేవి గారికి,
తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి,
మిస్సన్న గారికి,
గన్నవరపు నరసింహ మూర్తి గారికి,
సుబ్బారావు గారికి,
సహదేవుడు గారికి,
కమనీయం గారికి,
నాగరాజు రవీందర్ గారికి,
రామకృష్ణ గారికి,
అభినందనలు, ధన్యవాదములు.
*
లక్ష్మీదేవి గారూ,
‘నీలపు కాయుడు’ కంటే ‘నీల శరీరుడు’ అంటే వినసొంపుగా ఉంటుందేమో!
*
తోపెల్ల వారూ,
సవరించిన పూరణ బాగుంది. కానీ మొదటి పాదంలో గణదోషం... ‘వాలాయమ్ముగ’ అంటే సరి!
*
సహదేవుడు గారూ,
‘వేళ యిదే + అని’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. ‘కౌరవ కూళలు’ అనడం సరి! ‘కూళుడు’ అనే రూపమూ ఉంది. దాని బహువచన రూపం ‘కూళురు’ అవుతుంది.
*
రామకృష్ణ గారూ,
మొదటి పాదాన్ని ‘మేలును కీడుల నెఱుగక’ అంటే బాగుంటుందేమో?
గురువులకు నమస్సులు. నిజమే.నగము మాత్రమే ఉన్నది మీసవరణకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండివాలాయమ్ముగ యాగపు
రిప్లయితొలగించండిశాలల సురులాక్రమింప సంరక్షకుడై
కోలన్ క్రోధజ్వాలన్
బాలుడు భండనమునందు వైరుల గూల్చెన్
కాలుండై విల్లందుచు
రిప్లయితొలగించండినాలస్యము చేయకుండ నసురాంతకుడై
లీలన్ గిరిజాతనయుడు
బాలుడు భండనమునందు వైరుల గూల్చెన్.
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
శ్రీ గురుభ్యోనమః
రిప్లయితొలగించండిగురువుగారి సూచిత సవరణలతో నాపద్యం:
వేళయిదేయని కౌరవ
కూళలు వ్యూహంబుఁబన్న కూన కుపితుఁడై
కాలయముండభిమన్యుఁడు
బాలుడు భండనమునందు వైరుల గూల్చెన్!
మేలగు 'వీడియొ గేమ్సట'
రిప్లయితొలగించండిబాలకుడే యాడుచుండె పరి పరి విధముల్
'కీ' లను పడి పడి నొక్కుచు
బాలుఁడు భండనమునందు వైరులఁ గూల్చెన్.
గోలగ నోడెను రాహుల
రిప్లయితొలగించండిబాలుఁడు భండనమునందు;
వైరులఁ గూల్చెన్
మేలుగ నరేంద్ర మోడియె
నాలుగు మూలల జయించి నాగం భొట్లూ!
మేలగు రీతిని కలలో
రిప్లయితొలగించండివాలము ఝాడించి మేటి వైవిధ్యమునన్
గోలగ రోమను సోనియ
బాలుఁడు భండనమునందు వైరులఁ గూల్చెన్