18, జనవరి 2013, శుక్రవారం

పద్య రచన - 225

నేడు నందమూరి తారక రామారావు వర్ధంతి
కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

9 కామెంట్‌లు:

  1. నట సార్వభౌముడీతడు
    పటుతర ప్రజ్ఞను గలిగిన పద్మశ్రీయౌ
    నట,'తెలుగు దేశమును' భూ
    పటమున వెగించినట్టి భాస్కరు డితడే.

    రిప్లయితొలగించండి
  2. తెలుగు దేశము పార్టీని దెచ్చి భువికి
    ముఖ్య మంత్రిగ రాష్ట్రాన్ని ముందు నడిపి
    తెలుగు భాషకు వన్నెను దెచ్చి నట్టి
    నంద మూరి రాముడ ! నీ కు వందనములు .

    రిప్లయితొలగించండి
  3. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మశుక్రవారం, జనవరి 18, 2013 10:26:00 AM

    “కమ్మ” విల్తుని రూపసాకారమగుచు
    నటననుసరిసాటియులేని నటుడనుచును
    రాజకీయరంగమున రారాజుయగుచు
    భువిని తనముద్ర వేయుచు దివికినరిగె.

    రిప్లయితొలగించండి




  4. అతడె తెలుగుల కారాధ్యుడైన నటుడు
    పాత్ర సాక్షాత్కరించిన భంగి హావ
    భావ సాత్వికాహార్య వైభవములలర
    అమరు డార్జించిన మహా యశము చేత.

    రిప్లయితొలగించండి
  5. రామా రావన్నను
    సామాన్యపు నటుడు గాదు సౌం దర్యమునం !
    దేమాత్రము చలియించని
    శ్రీ మంతు డనగ యతడు సీమను వెలిగెన్ !

    రిప్లయితొలగించండి

  6. తెలుగు తెరను మించు వెలుగైన నటుడయి
    తెలుగు దేశమునకు దెచ్చె ఖ్యాతి
    నందమూరి నంద నందను డీతడు
    తెలుగు వారి మదుల తీపి గురుతు

    రిప్లయితొలగించండి
  7. విశ్వవిఖ్యాత నటసార్వభౌముని గురించి చక్కని పద్యాలను రచించిన కవిమిత్రులు....
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    సుబ్బారావు గారికి,
    తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి,
    కమనీయం గారికి,
    రాజేశ్వరి అక్కయ్య గారికి,
    మిస్సన్న గారికి,
    అభినందనలు... ధన్యవాదాలు....

    రిప్లయితొలగించండి
  8. నందమూరి రామరావు నటనమందు రత్నమే!
    నందనందనుండె పుట్టె నందమూరి యింటిలో!
    చిందు లేయు చిత్రమందు చిన్నదాని మించుచున్!
    పొందె తాను ప్రజలు మెచ్చ ముఖ్యమంత్రి పీఠమే!

    రిప్లయితొలగించండి
  9. కం: శ్రీవేంకటేశు, బ్రహ్మయ,
    రావణు, రాజీవనేత్రు, రవిసుతు, రామా
    రావు నటనలో గాంచిరి
    దైవముగా నాంధ్రులెల్లఁ దలచిరి ప్రేమన్

    ఆ.వె. నందమూరియింట నటసింహమాతండు
    ప్రజలు నమ్మినట్టి పాలకుండు
    సుపరిపాల ననగఁజూపించిన ఘనుడు
    చిత్ర సీమయందు సింహమతడు

    రిప్లయితొలగించండి