అయ్యా! శ్రీ చంద్రశేఖర్ గారూ! శుభాశీస్సులు. మీరు తేటగీతి సమస్యను పూరించ బూని ఆటవెలదిని తీసుకొనినట్లు కనుబడుచున్నది. మీ పద్య పాదములను మరొక మారి సరిజూచుకొనండి. స్వస్తి.
లక్ష్మీదేవి గారూ, పాప ఉంగరం బొమ్మకు ఒడ్డాణమయిందన్న మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు. * నాగరాజు రవీందర్ గారూ, పూతన ఉంగరాన్ని గొల్లభామకు ఒడ్డాణంగా చేసిన మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు. * హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ, విరహభయంతో కృశించిన నాయిక గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు. * చంద్రశేఖర్ గారూ, ఉంగరమిచ్చి ఒడ్డాణం పొందాడంటారు.... బాగుంది. మంచి పూరణ. అభినందనలు. మూడవపాదం చివర రవీందర్ గారు సూచించినట్లు ‘భళిర’ అనండి... గణదోషం తొలగిపోతుంది. * పండిత నేమాని వారూ, మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు. రవీందర్ గారి పూరణలో ఒకరి ఉంగరం మరొకరికి ఒడ్డాణం కాగా, మీ పూరణలో అది ఒకే వ్యక్తికి అన్వయించింది. * సుబ్బారావు గారూ, మీరు లక్ష్మీదేవి గారి మార్గం పట్టారు. చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు. * డా. మాడుగుల అనిల్ కుమార్ గారూ, విరహార్తిని చిక్కిన శకుంతలపై మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు. * తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారూ, ‘ఈగ’ చలనచిత్రం విషయంగా మీ పూరణ బాగుంది. అభినందనలు.
చిట్టి బొమ్మను చేయుచు చిన్నిపాప
రిప్లయితొలగించండినగలతోడ నద్దానిని నాణ్యమలర
ననువు గానలంకారమ్ములలదె; తనదు
యుంగరమ్మె యొడ్డాణమై యొప్పెనుగద!
శౌరి రాక్షసి పూతనన్ సంహరింప
రిప్లయితొలగించండివేడుకగ వ్రేత యొక్కతె వేలికున్న
నంగుళిని బీకి ధరియింప నడుము చుట్టు
యుంగరమ్మెయొడ్డాణమై యొప్పెను గద!
స్వామికార్యార్థమై కొంతసమయ మపుడు
రిప్లయితొలగించండిప్రియుడు దేశాంతరంబేగు విధము తెలిసి
కలుగబోయెడి విరహంబు దలచు సతికి
నుంగరమ్మె యొడ్డాణమై యొప్పెనుగద.
గుప్పెడు యటుకులను గురితో సమర్పించి
రిప్లయితొలగించండితనదు గుణము చాటు మనము తెల్పె
చిన్ని భక్తి కాన్క సిరు లిచ్చెనేమో, భళీ
ఉంగరమ్మె యొడ్డాణమై యొప్పెనుగద!
అయ్యా! శ్రీ చంద్రశేఖర్ గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీరు తేటగీతి సమస్యను పూరించ బూని ఆటవెలదిని తీసుకొనినట్లు కనుబడుచున్నది. మీ పద్య పాదములను మరొక మారి సరిజూచుకొనండి. స్వస్తి.
అసురకాంత హిడింబి మాయలను బూని
రిప్లయితొలగించండితాల్చె సూక్షరూపమ్ము నా తరుణమందు
ముచ్చటగ జూడ తన పూర్వ భూషణముల
నుంగరమ్మె యొడ్డాణమై యొప్పెను గద
శ్రీనేమానివారికి ధన్యవాదములతో:
రిప్లయితొలగించండితే.గీ. గుప్పెడటుకులన్ కన్నయ్య కప్పగించి
తనదు గుణము చాటు మనము తరిచి చూపె
చిన్ని భక్తి కాన్క సిరులిచ్చెనట, భళి
ఉంగరమ్మె యొడ్డాణమై యొప్పెనుగద!
మిత్రులు శ్రీ చంద్రశేఖర్ గారూ ! నమస్తే ! భళిర అనండి.
రిప్లయితొలగించండిచిన్ని బొమ్మను గొని దెచ్చి చెలువు మీర
రిప్లయితొలగించండిభూ ష ణం బులు బెట్టుచు బుడుత యొకతె
తనది యగు నుంగ రంబును దనర బెట్ట
ఉంగరమ్మె యొ డ్డాణ మై యొప్పెను గద !
కణ్వపుత్రి శకుంతల కాంచెనచట
రిప్లయితొలగించండిహస్తినాధిపు దుష్యంతు నంత పుష్ప
బాణ నిహతయై మిక్కిలి పరితపించ
ఉంగరమ్మె యొడ్డాణమై యొప్పెనుగద !
మత్సరంబున చంపగ మక్షికమయి
రిప్లయితొలగించండినాయ కుండు ముదముతోడ నడచి చెలియ
గదిని కాంచె తానిచ్చిన కనక దుర్గ
యుంగరమ్మె యొడ్డాణమై యొప్పెనుగద!
( ఈగ చలన చిత్ర దృశ్యము)
కాస్త అన్వయ క్లేశం ఉన్నట్టనిపించి నా పూరణను సవరించడ మైనది :
రిప్లయితొలగించండిశౌరి రాక్షసి పూతనన్ సంహరింప
వేడుక నొక వ్రేతయె దాని వేలికున్న
నంగుళిని బీకి ధరియింప నడుము చుట్టు
యుంగరమ్మెయొడ్డాణమై యొప్పెను గద!
రవీందర్ గారూ! మీ పూరణ ఒక్కసారిగా"ఆహా ఎంత బాగున్నది" అనిపించింది.అభినందనలు.
రిప్లయితొలగించండిలక్ష్మీదేవి గారూ,
రిప్లయితొలగించండిపాప ఉంగరం బొమ్మకు ఒడ్డాణమయిందన్న మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
*
నాగరాజు రవీందర్ గారూ,
పూతన ఉంగరాన్ని గొల్లభామకు ఒడ్డాణంగా చేసిన మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
*
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
విరహభయంతో కృశించిన నాయిక గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
చంద్రశేఖర్ గారూ,
ఉంగరమిచ్చి ఒడ్డాణం పొందాడంటారు.... బాగుంది. మంచి పూరణ. అభినందనలు.
మూడవపాదం చివర రవీందర్ గారు సూచించినట్లు ‘భళిర’ అనండి... గణదోషం తొలగిపోతుంది.
*
పండిత నేమాని వారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
రవీందర్ గారి పూరణలో ఒకరి ఉంగరం మరొకరికి ఒడ్డాణం కాగా, మీ పూరణలో అది ఒకే వ్యక్తికి అన్వయించింది.
*
సుబ్బారావు గారూ,
మీరు లక్ష్మీదేవి గారి మార్గం పట్టారు. చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
*
డా. మాడుగుల అనిల్ కుమార్ గారూ,
విరహార్తిని చిక్కిన శకుంతలపై మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
*
తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారూ,
‘ఈగ’ చలనచిత్రం విషయంగా మీ పూరణ బాగుంది. అభినందనలు.
కాల్వ త్రవ్వకాల యుగాల గట్టి నిథిని
రిప్లయితొలగించండిపెళ్ళగించగ కార్మికుడుళ్ళమలర
అమ్మహాకాయులాభరణమ్ము లేమొ
మురిసి పోయిన కార్మిక ముదిత దాల్చ
నుంగరమ్మెయొడ్డాణమై యొప్పెను గద!
రిప్లయితొలగించండిలక్ష్మీదేవిగారు,హం.వే.స.న.మూర్తిగారు ,చేసిన పూరణలు రెండూ బాగా అలరిస్తున్నవి.అంతకన్న బాగా రాసేందుకేముంది?వారికి నా అభినందనలు.
శర్మ గారూ ! నా పూరణ మీకు నచ్చినందులకు ధన్యవాదాలు. ఈగ చిత్రం నేను కూడ చూశాను. దాని పరంగా మీరు పూరించిన వైనం బాగుంది. అభినందనలు.
రిప్లయితొలగించండిసహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
ఉల్లమును ‘ఉళ్ళ’మన్నారు...!
శ్రీగురుభ్యోనమః
రిప్లయితొలగించండిగురువర్యులకు ధన్యవాదములు. తప్పును సవరిస్తూ పద్యం:
కాల్వ త్రవ్వకాల యుగాల గట్టి నిధిని
పెళ్ళ గించగ కార్మికుడుల్లమలర
అమ్మహాకాయులాభరణమ్ము లేమొ
మురిసి పోయిన కార్మిక ముదిత దాల్చ
నుంగరమ్మె యొడ్డాణమైయొప్పెను గద!
గురువుగారు,
రిప్లయితొలగించండికమనీయం గారు,
ధన్యవాదాలండి.
అంగుళీయకమును బట్టి యాక సాన
రిప్లయితొలగించండినరుగు హనుమది విగ్రహ మరువదడుగు
యెక్కి దూరగ నొక పిల్ల చక్కగాను
ఉంగరమ్మె యొడ్డాణమై యొప్పెనుగద!
అంగుళీయకమును బట్టి యరుగుచున్న
రిప్లయితొలగించండిఅరువదడుగుల విగ్రహమాంజనేయు
నెక్కి దూరగ నొక పిల్ల చక్కగాను
ఉంగరమ్మె యొడ్డాణమై యొప్పెనుగద.