5, జనవరి 2013, శనివారం

పద్య రచన - 212

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

16 కామెంట్‌లు:

 1. మునివర్యా! గురువర్య! గాధితనయా! పోద్రోచె నింద్రుండు నన్
  గనుమా కావుమటంచు వేడగ వినెన్ గాధేయు డొక్కుమ్మడిన్
  గని సృష్టించె త్రిశంకు పేరిటను స్వర్గం బొండు నభ్రంబునన్
  ఘన సంపద్ విభవాభిరామముగ నా క్ష్మానాథు వాసమ్ముగా

  రిప్లయితొలగించండి
 2. పెద్దల హితవునుఁ బెడచెవిఁ
  నిద్దరు బెట్టగ వెలసిన దీ స్వర్గమదే
  ముద్దును దీర్చినదో మఱి?
  హద్దులు లేకను త్రిశంకు వల్లాడంగన్.

  రిప్లయితొలగించండి
 3. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మశనివారం, జనవరి 05, 2013 7:51:00 AM

  జనుల సంరక్షణార్థము సల్పు యాగ
  మసుర సంఘ విఘాతమునంద, కుపిత
  కౌశికుండంత శపియించె కఠిన రీతి
  “రాక్షసాధమా! చత్తువు రాము చేత”.

  రిప్లయితొలగించండి
 4. గాధి తనయుడు సృష్టించె గగన మందు
  సకల భోగముల్ గలిగించు స్వర్గ మొకటి
  రాజు త్రిశంకు కొఱ కునై రమ్య ముగను
  కుపితు డ గుటను నృ పతి పై కౌశి కుండు

  రిప్లయితొలగించండి

 5. దేవేంద్రుండిట నుండరాదనుచు నన్ దివ్యమ్మునందుండి ,యే
  తావేలేదిట నీకు బొమ్మనుచు గ్రిందంద్రోసె ,హా!
  నీవేదిక్కని రాజు వేడవిని ,నేనిన్ బ్రోతు నంచాతనిన్
  గావన్ ,రెండవ స్వర్గమున్ సృజనమున్ గావించె గాధేయుడున్.

  రిప్లయితొలగించండి

 6. దేవేంద్రుండిట నుండరాదనుచు నన్ దివ్యమ్మునందుండి ,యే
  తావేలేదిట నీకు బొమ్మనుచు గ్రిందంద్రోసె ,హా!
  నీవేదిక్కని రాజు వేడవిని ,నేనిన్ బ్రోతు నంచాతనిన్
  గావన్ ,రెండవ స్వర్గమున్ సృజనమున్ గావించె గాధేయుడున్.

  రిప్లయితొలగించండి
 7. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 8. నాడు సృజియించె గాధి తనయుడు తనదు
  గరిమ చేత త్రిశంకు స్వర్గమ్ము నొకటి
  పైకి పోలేక క్రింద రాలేక నుండె
  సతతము త్రిశంకు డంతరిక్షమ్ము నందు

  రిప్లయితొలగించండి
 9. ప్రతి సృష్టిఁ జేసె శౌనకు
  డతిశయముగ నా త్రిశంకు కభయము నీయన్
  గతిఁదప్పి నడుము నిలువన్
  వెతలందున, నానుడౌచు విలసిల్లెనదే!

  రిప్లయితొలగించండి
 10. త్రిశంకుని పరంగా మనోహరంగా పద్యాలు చెప్పిన కవిమిత్రులు...
  పండిత నేమాని వారికి,
  లక్ష్మీదేవి గారికి,
  తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి, (వీరి భావం వైవిధ్యంగా ఉంది)
  సుబ్బారావు గారికి,
  కమనీయం గారికి,
  నాగరాజు రవీందర్ గారికి,
  సహదేవుడు గారికి,
  అభినందనలు, ధన్యవాదములు.
  *
  సుబ్బారావు గారూ,
  మూడవ పాదంలో గణదోషం... ‘రాజగు త్రిశంకు...’ అంటే సరి!
  *
  కమనీయం గారూ,
  రెండవ పాదాంతంలో మూడక్షరాలు తప్పిపోయాయి.... అక్కడ ‘కౌశికా’ అందామా?
  *
  సహదేవుడు గారూ,
  పొరపాటున ‘శౌనకుడు’ అన్నారు.... అక్కడ ‘కౌశికుడు’ అనండి.

  రిప్లయితొలగించండి
 11. గాధి తనయుడు సృష్టించె గగన మందు
  సకల భోగముల్ గలిగించు స్వర్గ మొకటి
  రాజగు త్రిశంకు కొఱ కునై రమ్య ముగను
  కుపితు డ గుటను నృ పతి పై కౌశి కుండు

  రిప్లయితొలగించండి
 12. శ్రీగురుభ్యోనమః
  పొరబాటు తెలియజేసినందులకు గురువుగారికి కృతజ్ఞతలు.పేపరు మీద సరిగానే వ్రాసుకున్నాను,టైపులో తప్పు జరిగింది.సవరణతో నా పద్యం:
  ప్రతి సృష్టిఁజేసె కౌశికు
  డతిశయముగ నా త్రిశంకు కభయము నీయన్
  గతిఁదప్పి నడుమ నిలువన్
  వెతలందున, నానుడౌచు విలసిల్లెనదే!
  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 13. మునియగు విశ్వామిత్రుని
  యనుకంప ద్రిశంకు డప్పుడద్భుతరీతిన్
  తనకోసమె సృష్టించిన
  ఘనమౌ స్వర్గంబునందు క్రమముగ జేరెన్.

  రిప్లయితొలగించండి
 14. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
  చక్కగా ఉంది మీ పద్యం... అభినందనలు.

  రిప్లయితొలగించండి
 15. సృష్టికి ప్రతిసృష్టి నిడిన
  స్రష్టను వేడను త్రిశంకు స్వర్గము చేరన్
  కష్ష్ట తరమైన యొక పర
  మేష్టిని చేయించి పంపె నింపుగ నతనిన్.

  ఉగ్రంబౌ నా యజ్ఞా-
  నుగ్రహమున జేరబోవ నుద్ధతి నా రా-
  జాగ్రణి స్వర్గము సుర రా-
  జాగ్రహమున ద్రోచి వైచె నంతను వానిన్.

  కని విశ్వామిత్రుండది
  కనులెర్రగ జేసి పల్కె కనుమిది రాజా
  ఘనమౌ మరియొక స్వర్గము
  వినువీధిని జేతునీకు వేల్పుల దేలా?

  తల క్రిందై పడు రాజున
  కిల జేరక మున్నె నమరె నింపౌ స్వర్గం
  బలరారె త్రిశంకు దివిగా
  తల క్రిందులె సర్వమచట తాపసి మహిమన్.  రిప్లయితొలగించండి
 16. మిస్సన్న గారూ,
  మీ ‘త్రిశంకు స్వర్గం’ ఖండకృతి మనోహరంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి