సమస్త సన్మంగళాని భవంతు.
అమ్మ సరస్వతీ పద నవాంబుజ సేవల జేయుచుండి ని
త్యమ్మును సాహితీ సుమవనాంతర సీమలలోన కల్ప వృ
క్షమ్ముల ఛాయలందు విలసన్మతి రాజిలుచుండు నట్టి నే
స్తమ్ములు సత్కవీశ్వరులు, జ్ఞానధనాఢ్యులు, సద్గుణోన్నతుల్
సమ్మతి శంకరాభరణ సత్కవన స్థలి శంకరార్య సౌ
ధమ్మున రమ్య వేదిక సదా యలరారుచునుండు హృద్య భా
వమ్ముల వెల్వరింపగల పద్య వికాస విలాస సంపదల్
కమ్మని తెల్గు బాష నుడికారపు గౌరవ ముప్పతిల్ల భా
గ్యమ్ముగ నెంచి పండువుల నచ్చట ముచ్చట గొల్పు రీతి స్వ
ఛ్ఛమ్మగు చిత్త వృత్తి పద సంపద లింపులు సొంపు లీను చం
దమ్ముల పెక్కు ఛందముల తళ్కులు బెళ్కులు నొల్కు మంచి ప
ద్యమ్ముల హేల లందలర తద్దయు వేడుక తోడ రండు చి
త్తమ్ములు చిత్తముల్ కలిసి తన్మయమందుచు నూగ వచ్చు నం
దమ్మహితాత్ము శంకర మహాశయు సత్కృతులంద వచ్చు తే
జమ్మున నూత్న వత్సరము సర్వ సుఖప్రద యౌచు వచ్చె భ
ద్రమ్ముగ స్వాగతిమ్మడగ రండివె మీకు శుభాభినందనల్

స్వస్తి.
పండిత నేమాని రామజోగి సన్యాసి రావు
అవును నేమాని పండితార్యా ! అట్లేయగు గాక.
రిప్లయితొలగించండిగురువులకు, కవి మిత్రులకూ శుభాకాంక్షలు.
పూజ్యశ్రీ గురువులకు, మాన్యులు శ్రీ కంది శంకరయ్యగారికి,
రిప్లయితొలగించండివిద్వత్సుకవిమిత్రులందరికి
నూతన సంవత్సర శుభాకాంక్షలు. శ్రీ గురువుల అనర్ఘమైన ఆశీర్వాద పద్య ప్రసూనమాలిక సౌరభం ఈ వత్సరమంతా సహృదయుల గుండెలలో గుబాళించి "శంకరాభరణం" పద్యవిద్యానురక్తులకు దారిదీపమై క్రొత్త వెలుగులను ప్రసరింపజేయాలి!
శ్రీ శంకరార్యులకు, శ్రీ నేమాని వారికి, కవిమిత్రులందరకూ నూతన ఆంగ్ల వత్సర శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిఅందరికీ నూతనాంగ్లసంవత్సరాది శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిఆర్యా!
మీ నూతనసంవత్సరస్వాగతాహ్వానోత్పలపద్యమాలిక చాలా బాగున్నది.
ధన్యవాదములు.
మీరందించిన స్ఫూర్తితో నాలుగు వాక్యాలు వ్రాసేందుకు ప్రయత్నిస్తున్నాను. దోషసవరణం చేయవలసినదిగా ప్రార్థన.
నూతన వత్సరాదిని, మనోహర వేళను పండితార్యులి
ట్లాతత హృద్యఛందమున హాయనముం గని స్వాగతించ నా
చేతము సంతసించెను విశేషవచస్సులు పద్యపంక్తులై
భూతలికీ నవాబ్దమును భూరిసుఖంబుల నిచ్చి కావగా
జోతలు చేయబూనినవి "సుందరనూతనవర్షరాజమా!
ఖ్యాతులు సన్నగిల్లె, మరియాదయు మానసమందు లేదు, మా
నేతల కెల్ల వేళ నవినీతి విహారము దక్క వేరిలన్
రోతగ మారిపోయినది, రుగ్మత లట్టు లధర్మకృత్యముల్,
నీతివిహీనవర్తనలు నిత్యములై యబలాబలాత్కృతుల్,
హేతువులేని దౌష్ట్యములు, హింసలు వృద్ధిని బొందుచుండగా
రాతిరియున్, పవల్ గురుతరంబగు బాధలు కష్టనష్టముల్
భీతిని గూర్చుచుండి విలపింపగ జేయుచు విస్తరించ భూ
మాతకు శాంతిసౌఖ్యములు మచ్చునకైనను కానరాక యీ
భూతవిముక్తి గోరి తలపోయుచునున్నది కాచుదానవై
యో తరుణాబ్దమా! నిలిచి యుర్వికి మేలగు శాంతిసూత్రముల్
శీతలవాయువుల్ కలుగ జేయుము సౌఖ్యము గూర్చు మెల్లెడన్.
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండి‘విలసన్మతి రాజిలుచుండు నట్టి నేస్తమ్ములు సత్కవీశ్వరులు’ సౌజన్యంతో సంపూర్ణ సహకారాన్ని అందిస్తుండగా, మీ మార్గదర్శనం ఆలంబనగా ఈ బ్లాగు నిరాటకంగా కొనసాగగలదు. నేను కేవలం నిమిత్తమాత్రుణ్ణే!
ధన్యవాదాలు.
*
మిస్సన్న గారూ,
ఏల్చూరి మురళీధరరావు గారూ,
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
................... ధన్యవాదాలు.
అయ్యా! శ్రీ మూర్తి గారూ!
రిప్లయితొలగించండిమీకు ఉత్సాహము ఉరకలు వేస్తూ ఉంటే ఉత్పలమాలికలు ఒక లెక్కా! దంచీసేరు. స్వస్తి.
గురువులు శ్రీ పండితుల వారికి పాదాభి వందన ములు
రిప్లయితొలగించండిఅవును మూర్తిగారు నిజంగానే దంచేసేశారు. అభినందనలండీ.
రిప్లయితొలగించండి