31, జనవరి 2013, గురువారం

సమస్యాపూరణం – 953 (కాలిన నా కలికి మోము)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
కాలిన నా కలికి మోము కళకళ లాడెన్.!
ఈ సమస్యను సూచించిన గోలి హనుమచ్ఛాస్త్రి గారికి ధన్యవాదములు.

21 కామెంట్‌లు:

  1. మేలగు సాధనమును బహు
    కాల మొనర్పగ వివేకఘన మను వహ్ని
    జ్వాలల కజ్ఞానచయము
    కాలిన నా కలికి మోము కళకళ లాడెన్

    రిప్లయితొలగించండి
  2. రాలిన స్వేదపు చుక్కల
    సోలిన యా వనిత సొగసు సోయగ మెంచన్ !
    గాలికి వేడగు నెండకు
    కాలిన నాకలికి మోము కళ కళ లాడెన్ !

    రిప్లయితొలగించండి
  3. వాలుగ చూచెను బావను
    ఆలిగ నే చేసుకొందు ననె నాతండా
    బేలకు తాపము జెందుచు
    కాలిన నా కలికి మోము కళకళ లాడెన్

    రిప్లయితొలగించండి
  4. మేలగు నా కవితలఁ గల
    బాలా వర్ణనకు కినియ, బాలా! నీవే
    బాల వనితి. సందేహము
    కాలిన, నా కలికి మోము కళకళ లాడెన్.

    రిప్లయితొలగించండి
  5. గురువు గారికి ధన్యవాదములు.గురుదేవులకు,శ్రీ నేమాని పండితులకు పాదాబివందనములతో
    =========*========
    బాలునికి రాజ్య భారము
    మేలగు భూ సంపదలను మెండుగ నివ్వన్
    పాలక , విపక్ష వాతకు
    కాలిన నా కలికి మోము కళకళ లాడెన్ |

    రిప్లయితొలగించండి
  6. ఒక విదేశీయుని గర్ల్ ఫ్రెండ్ పేరు Kolina Smith. ఆమెను చూడగానే అతని మదిలో మెదలిన భావాలను తెలుగులోకి అనువదిస్తే ఇలాగుంటుందేమో !

    తోలుచు కారును రయమున
    గాలికి కురు లెగురుచుండ కాలిన వచ్చెన్
    మేలిమి బంగరు రంగున
    కాలిన నా కలికి మోము కళకళ లాడెన్

    రిప్లయితొలగించండి
  7. డా. ప్రభల రామలక్ష్మిగురువారం, జనవరి 31, 2013 2:53:00 PM

    వాలము నిండుగ చుట్టిన
    చేలములకు మంటబెట్టి చేటుదలిర్పన్
    వాలపు ధాటికి గృహములు
    కాలిననాకలికి మోము కళకళలాడెన్

    రిప్లయితొలగించండి
  8. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    "అలిగితివా సఖీ ప్రియా అలుక మానవా "
    పాట తరువాత
    శ్రీకృష్ణుని మదిలో :

    01)
    _______________________________

    కాలంజరు డడ్డు పడిన
    కాలిడి వృక్షమును దెత్తు - కరుణించ మనన్
    కాలున తన్నిన పిదపే
    కాలిన నా కలికి మోము - కళ కళ లాడెన్ !
    _______________________________
    కాలంజరుడు = శివుడు
    కాలిడి = ప్రవేశించి(స్వర్గమున)
    కాలున = పాదముతో
    కాలిన = జ్వలించు

    రిప్లయితొలగించండి
  9. లీలనెడు నొక్క గేహిని
    వీలున దీపవళి నాడు వేడుక జరిపెన్
    ప్రేలిన మతాబు చురచుర
    కాలిన నా కలికి మోము కళకళ లాడెన్

    రిప్లయితొలగించండి
  10. కాలికి తొడిగిన చెప్పులు
    వేళకు తెగిపోయి యెండ వేడికి మాడన్
    తూలుతు నీడకుఁ జేరిన
    కాలిన నా కలికి మోము కళకళ లాడెన్!

    రిప్లయితొలగించండి
  11. చాలా గారెలు తినగను
    బాలునకరగక నజీర్తి పాలయి వడలెన్,
    నాలుగు పూటలు నకనక
    కాలిననాకలికి మోము కళకళలాడెన్

    శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ

    రిప్లయితొలగించండి
  12. ఈనాటి సమస్యకు చక్కని పూరణలు చెప్పిన కవిమిత్రులు..
    పండిత నేమాని వారికి,
    రాజేశ్వరి అక్కయ్యకు,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    చింతా రామ కృష్ణారావు గారికి,
    వరప్రసాద్ గారికి,
    నాగరాజు రవీందర్ గారికి,
    డా. ప్రభల రామలక్ష్మి గారికి,
    వసంత కిశోర్ గారికి,
    సహదేవుడు గారికి,
    శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారికి,
    అభినందనలు, ధన్యవాదాలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    'వేడి + అగు =వేడియగు' అవుతుంది. అక్కడ సంధి లేదు.
    *
    గోలి వారూ,
    'బావను + ఆలిగ' అన్నప్పుడు సంధి కావాలి. వాక్య, పాద ప్రారంభం కనుక అచ్చుతో మొదలుపెట్టనచ్చు నంటారు కొందరు... నా సవరణ...
    వాలుగ బావను చూచిన
    నాలిగ....
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    'లీల + అనెడు' అన్నప్పుడు సంధి లేదు, యడాగమం వస్తుంది. 'లీల యను' అందాం. 'దీపవళి' అనరాదు కదా... దీపాళి.. అందాం.
    *
    శ్రీ ఆదిభట్ల వారూ,
    'అఱుగక' అనేది కళయే. కావున 'అఱుగక యజీర్తి' అంటే సరి!

    రిప్లయితొలగించండి

  13. గురువు గారూ ! మీ సూచన ప్రకారం పద్యాన్ని సవరిస్తున్నాను :

    లీల యను నొక్క గేహిని
    వీలున దీపాళి నాడు వేడుక జరిపెన్
    ప్రేలిన మతాబు చురచుర
    కాలిన నా కలికి మోము కళకళ లాడెన్

    రిప్లయితొలగించండి
  14. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మగురువారం, జనవరి 31, 2013 10:06:00 PM

    ఆలిని వదలిన నలుడట
    శైలములందున తిరుగుచు సంకట పడగన్,
    కాలంబటులన్ ఖర్మన
    కాలిన నా ' కలి ' కి మోము కళకళలాడెన్.

    రిప్లయితొలగించండి
  15. ఏలిక రాముని తలపుల
    వ్రేలుచు విడచెను తినుటయు రేబవలనగా
    బేలయు శుచిస్మిత కడుపు
    కాలిన నా కలికి మోము కళకళ లాడెన్.
    (కాలినను, ఆ కలికి మోము కళకళలాడెన్)

    రిప్లయితొలగించండి
  16. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారూ,
    'కలి పురుషుడు విషయంగా మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    చంద్రశేఖర్ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. డా. ప్రభల రామలక్ష్మిశుక్రవారం, ఫిబ్రవరి 01, 2013 8:03:00 PM

    కాలిని కడుగని నలుడిల
    ఆలికి దూరంగ పోయి అగచాట్లొందెన్
    చేలము చాలక కడుపుం
    గాలిన నాకలికి మోము కళకళలాడెన్

    రిప్లయితొలగించండి
  18. డా. ప్రభల రామలక్ష్మి గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  19. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మశుక్రవారం, ఫిబ్రవరి 01, 2013 11:06:00 PM

    పండితుల వారికి నమస్సులు,
    మీరు సూచించిన విథంగా సవరణ చేసి....

    ఆలిని వదలిన నలుడట
    శైలములందున తిరుగుచు సంకట పడగన్,
    కాలంబటులన్ 'కర్మము
    కాలిన నా ' కలి ' కి మోము కళకళలాడెన్.

    రిప్లయితొలగించండి
  20. హాలేండున పుట్టి పెరిగి
    పోలేండున మెట్టి నట్టి బోలెడు మొటిమల్
    పీలేరు మండుటెండకు
    కాలిన నా కలికి మోము కళకళ లాడెన్.!

    రిప్లయితొలగించండి
  21. రైలు ప్రయాణము నందున
    సూలూర్ పేటను మగండు స్రుక్కక తేగా
    నాలుగు దోసెలు మగువకు
    కాలిన నాకలికి మోము కళకళ లాడెన్ 😊

    రిప్లయితొలగించండి