ఆరోజు విజయవాడలో ఆఫీసర్ల క్లబ్ వార్షికోత్సవం. ఊళ్ళో ఉన్న పెద్ద పెద్ద ఆఫీసర్లు భార్యలతో సహా వచ్చారు. సాహిత్యం మీద ఇష్టాగోష్ఠి. స్టేజీమీద రైల్వే డి.ఆర్.ఎం గారు ముఖ్య అతిథిగా ఆసీనులయ్యారు. ఆ క్లబ్బుకి వారి సతీమణి కార్యదర్శి. ముఖ్యాంశం శ్రీనాథుని కవితా వైభవం.
శ్రీనాథుని కవిత్వం గురించి సీస పద్యాలు ఉదహరిస్తూ ఒకరు మాట్లాడారు. ఆయన ప్రసంగం అవగానే అందరూ చప్పట్లు కొట్టారు. డి.ఆర్.ఎం గారు క్లబ్ చేస్తున్న కార్యక్రమాలను ప్రశంసించారు.
చివర వందన సమర్పణ చేస్తూ డి.ఆర్.ఎం గారి సతీమణి "శ్రీనాథుని కవిత్వం గురించి ఎన్నో చక్కని విషయాలు చెప్పారు. ధన్యవాదాలు. ఆ శ్రీనాథుని ఒక వారం రోజుల క్రితమే నేను తమిళ్‌నాడు ఎక్స్‌ప్రెస్ రైల్లో చూసాను. ఆయన ఫలానావారు అని తెలిసేలోగానే వారు రాజమండ్రిలో రైలు దిగి వెళ్ళిపోయారు. అలాంటి మహాకవిని కలిసి మాట్లాడలేకపోవడం నా దురదృష్టం" అని విచారంగా చెప్పింది.
సభలో అంతా అవాక్కయ్యారు. ఆ నిశ్శబ్దానికి కారణం తెలియక భర్త వైపు చూసింది. డి.ఆర్.ఎం గారు భార్యకేసి కోపంగా చూసారు.
సరే కార్యక్రమం పూర్తి అయింది. డి.ఆర్.ఎం గారు సతీమణితో కార్లో ఇంటికి వెళ్తున్నారు.
మౌనంగా వున్న భర్తతో "ఏమండీ! నేనేమన్నా తప్పుగా మాట్లాడానా, నాకేసి కోపంగా చూసారు?" అని అడిగింది.
"నీకు బుద్ధిలేదు. ఏం వాగావో తెలుసా?"
"నేనేమన్నానండి?" అంది భయంభయంగా.
"తమిళ్‌నాడు ఎక్స్‌ప్రెస్ రాజమండ్రి మీదుగా వెళ్తుందా? ఆ మాత్రం ఇంగితఙ్ఞానం లేకుండా మాట్లాడితే నలుగురూ నవ్వరూ? చూసావా అందరు విస్తుపోయి నీకేసి ఎలా చూసారో?"
"అవునండి. అది హౌరా మెయిల్ అనబోయి తమళ్‌నాడు అన్నా" అంది ఖిన్నురాలై.
- ఫేస్‌బుక్ నుండి ‘జాజిశర్మ’గారికి ధన్యవాదాలతో....

హహహహ...దొందూ దొందే....బాగుంది.
రిప్లయితొలగించండిఔను ఔను బాగున్నది బాగున్నది
రిప్లయితొలగించండిగంతకి తగిన బొంత వలె కదా!!!
ప్చ్ ప్చ్ ....
ఇదంతా విన్న డ్రైవరు “ అయ్యగారూ! వారం క్రితం నీలం తుఫాను వల్ల ౩ రోజులు రైళ్ళే తిరగలేదుకదండీ “ అన్నాట్ట.
రిప్లయితొలగించండితోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారూ,
రిప్లయితొలగించండిమీ ‘ఫినిషింగ్ టచ్’ నన్ను బాగా నవ్వించింది. ధన్యవాదాలు.
చాలా బాగుంది .అందరికీ నూతన సంవత్సర శుభా కాంక్షలు
రిప్లయితొలగించండిశంకరార్యకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండిచెణుకు చాలా బాగుందండీ.
రిప్లయితొలగించండి