గోలి హనువచ్ఛాస్త్రి గారూ, శివుని పూజించినా విధివంచితుడై కాటికాపరి యైన హరిశ్చంద్రుని చూడండని మీరు చేసిన పూరణ బాగుంది. అభినందనలు. * పండిత నేమాని వారూ, దుష్టశక్తుల పూజ కాటికి జేర్చిందన్న మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
అయ్యా! కంది శంకరయ్య గారూ! శుభాశీస్సులు. మీ సవరణకి ఎంతో సంతోషము. అసలు ఈ నాటి సమస్యను చూడగనే నాకు పూరించాలి అనిపించ లేదు. మనస్సు ఒకవైపు పూరణ మరొక వైపుగా జరిగినది. అందుకే నా పూరణ కూడా దానికి తగినట్లు భిన్న చండస్సులతో వచ్చినది. స్వస్తి.
శ్రీ గండూరి లక్ష్మీనారYఅణ గారూ! శుభాశీస్సులు. శ్రీ తోపెల్ల శర్మ గారి పద్యమునకు మీరు సూచించిన సవరణ (గురువుల యెడ) సరియైనదే. యడాగమమే లెస్స - నుగాగమము సరికాదు. స్వస్తి.
పూజ్యశ్రీ నేమాని పండితులవారికి, శ్రీ గండూరి లక్ష్మీ నారాయణ మహోదయులకు ప్రణామములు. మాతాపితరులన్న ద్వంద్వసమాసమే సరియైనది.ప్రాథమిక దశావిద్యార్థిని.దయతో మీవంటి పెద్దల గుణదోష విమర్శ నాకు మిక్కిలి కావలెను. మీవంటివారు లభించుటయే ఒక అదృష్టము. చిత్ర పద్యముపై గూడ విమర్శ చేయ ప్రార్థనా పూర్వక ధన్యవాదములతో మీ సూచనలను గ్రహించి సవరించి రచించిన మునుపు గురువులయెడ పూజ్యులయందున కనగ తలిదండ్రులనగ మిగుల వినతి తోడ పూజ వెలయించి రెందరో కనుమ నాటి పూజ కాటి జేర్చె.
విశ్వనాథు గొల్చి వీధుల దిరిగెను
రిప్లయితొలగించండిమాట నిలుపు కొరకు మగువ నమ్మె
విధికి జాలి లేదు విను హరిశ్చంద్రుని
కనుమ, నాటి పూజ కాటిఁ జేర్చె.
దుష్ట శక్తుల బూజించు ధూర్తు డొకడు
రిప్లయితొలగించండిశక్తి నంపె నొకానొక సాధువుపయి
హనుమ యా దుష్టుని వధించె నవ్విధమును
కనుమ నాటి పూజ కాటి జేర్చె
శ్రీ నేమాని గారు సమస్య ఆటవెలది అయితే తేటగీతిలో పూరించినారు.
రిప్లయితొలగించండిగోలి హనువచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిశివుని పూజించినా విధివంచితుడై కాటికాపరి యైన హరిశ్చంద్రుని చూడండని మీరు చేసిన పూరణ బాగుంది. అభినందనలు.
*
పండిత నేమాని వారూ,
దుష్టశక్తుల పూజ కాటికి జేర్చిందన్న మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
అయ్యా శంకరయ్యగారూ నేమాని గారి ఛందస్సు గమనించారా? గమనించియే ఆ మాట చెప్పుచున్నారా?
రిప్లయితొలగించండిఅజ్ఞాత గారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు. మీ వ్యాఖ్య చూసేవరకు నేనూ గమనించలేదు...
ఆ పద్యాన్ని ఇలా సవరించవచ్చేమో (నేమాని వారిని క్షమించమని కోరుతూ...)
దుష్ట శక్తి గొల్చు ధూర్తు డొక్కం డొక్క
శక్తి నంపె నొక్క సాధువుపయి
హనుమ యా తులువను హతమార్చె నవ్విధి
కనుమ నాటి పూజ కాటి జేర్చె
శంకరార్యులకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండిఅయ్యా! కంది శంకరయ్య గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ సవరణకి ఎంతో సంతోషము. అసలు ఈ నాటి సమస్యను చూడగనే నాకు పూరించాలి అనిపించ లేదు. మనస్సు ఒకవైపు పూరణ మరొక వైపుగా జరిగినది. అందుకే నా పూరణ కూడా దానికి తగినట్లు భిన్న చండస్సులతో వచ్చినది. స్వస్తి.
ఈమధ్య తేటవెలదులు , ఆటగీతులు అందరికీ అలవాటయినట్టున్నవి . కానిండు .
రిప్లయితొలగించండికనుమ నాటి పూజ కాటి జేర్చె ననుట
రిప్లయితొలగించండిసరియ కాదు వినుము సామి ! నిజము
పూజ దినము దినము పూల తోడన జేయ
పుణ్య మబ్బు సుమ్ము! పుణ్య పురుష !
పశుగణముల నెల్ల పాటించి చేయుము
రిప్లయితొలగించండికనుమ నాటి పూజ; కాటిఁ జేర్చె
డు తఱి మనల గాచెడు నివియె; నీ సాటి
జీవములవి, చూడు చెలిమి తోడ.
పశుగణముల నెల్ల పాటించి చేయుము
రిప్లయితొలగించండికనుమ నాటి పూజ; కాటిఁ జేర్చె
డు తఱి మనల గాచెడు నిదియె- నీ సాటి
జీవములవి, చూడు చెలిమి తోడ.
మునుపు గురువులనెడ పూజ్యులయందున
రిప్లయితొలగించండికనగ మాతపితరులనన్అత్తమామలన్
వినతి తోడ పూజ వెలయించి రెందరో
కనుమ నాటి పూజ కాటి జేర్చె.
(పూజ= సపర్య,సంసేవ, ఆరాధన)
క్షమించాలి.ద్వితీయపాదం తప్పింది. సవరించుచూ
రిప్లయితొలగించండిమునుపు గురువులనెడ పూజ్యులయందున
కనగ మాతపితరులనగ మిగుల
వినతి తోడ పూజ వెలయించి రెందరో
కనుమ నాటి పూజ కాటి జేర్చె.
(పూజ= సపర్య,సంసేవ, ఆరాధన)
మిన్నకుండె కుక్క కన్నము వేసెడు
రిప్లయితొలగించండిమ్రుచ్చు గనుచు తాను మొరగకుండ
బడితపూజ నందె స్వామిచే గాడిద
కనుమ ! నాటి పూజ కాటి జేర్చె
చేరి యొక్కచోట స్నేహితులిద్దరు
రిప్లయితొలగించండిబొంకుచుండి యొకడు పూజలన్న
మరణతుల్యమనగ మరియొక డిట్లనె
కనుమనాటి పూజ కాటి జేర్చె.
నయము భయములేక నాస్తికు డొక్కండు
పలుకుచుండె నిట్లు పాపమొదవు
దైవపూజవలన తథ్యంబు ప్రజలార!
కనుమనాటిపూజ కాటి జేర్చె
క్రొత్త బైకును గొని కోవెలలో పూజ
రిప్లయితొలగించండిజరిపి తిరిగి వచ్చు సమయమందు
బస్సు వెనుకనుండి బలముగా డీకొట్టె
గనుమ! నాటి పూజ కాటి జేర్చె.
శ్రీ నేమాని పండితారధ్యులకు
రిప్లయితొలగించండిగండూరి లక్ష్మీనారాయణ
నమస్కారములు.
శ్రీ తోపెల్ల సుబ్రమణ్యం గారి పూరణములో సవరణ ఇలా ఉంటె
బాగుంటుందేమో.
గురువులనెడ బదులు గురువుల యెడ
మాతాపితరులనవల్సియుండును కాని గణభంగ మౌతుంది.
తల్లి దండ్రులనగ సరిపోతుందని నా అభిప్రాయము .
శ్రీ గండూరి లక్ష్మీనారYఅణ గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిశ్రీ తోపెల్ల శర్మ గారి పద్యమునకు మీరు సూచించిన సవరణ (గురువుల యెడ) సరియైనదే. యడాగమమే లెస్స - నుగాగమము సరికాదు. స్వస్తి.
శ్రీ గండూరి లక్ష్మీనారయణ గారూ!
రిప్లయితొలగించండిమీరు సూచించిన 2వ సవరణ కూడా బాగుగనే యున్నది. తల్లిదండ్రులు అనే సమాసమే బాగుంటుంది. స్వస్తి.
పూజ్యశ్రీ నేమాని పండితులవారికి, శ్రీ గండూరి లక్ష్మీ నారాయణ మహోదయులకు ప్రణామములు. మాతాపితరులన్న ద్వంద్వసమాసమే సరియైనది.ప్రాథమిక దశావిద్యార్థిని.దయతో మీవంటి పెద్దల గుణదోష విమర్శ నాకు మిక్కిలి కావలెను. మీవంటివారు లభించుటయే ఒక అదృష్టము. చిత్ర పద్యముపై గూడ విమర్శ చేయ ప్రార్థనా పూర్వక ధన్యవాదములతో మీ సూచనలను గ్రహించి సవరించి రచించిన
రిప్లయితొలగించండిమునుపు గురువులయెడ పూజ్యులయందున
కనగ తలిదండ్రులనగ మిగుల
వినతి తోడ పూజ వెలయించి రెందరో
కనుమ నాటి పూజ కాటి జేర్చె.
వేద వ్యాసు గొలిచె విశ్వనాధుని మెండు
రిప్లయితొలగించండితిండి లేక దిరిగె మండి పడుచు
నీర శించి యతడు భీరువై శపియింప
కనుమ నాటి పూజ కాటి జేర్చె !
ఈనాటి సమస్యకు వైవిధ్యంగా చక్కని పూరణలు చెప్పివ కవిమిత్రులు....
రిప్లయితొలగించండిగోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
పండిత నేమాని గారికి,
సుబ్బారావు గారికి,
లక్ష్మీదేవి గారికి,
తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి,
నాగరాజు రవీందర్ గారికి,
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
గండూరి లక్ష్మినారాయణ గారికి,
రాజేశ్వరి అక్కయ్య గారికి,
అభినందనలు, ధన్యవాదాలు.