కవిమిత్రులారా, నమస్కృతులు. ఈరోజు లేచినప్పటినుండి ఇప్పటి వరకూ కరెంటు లేదు. సరె.... టాబ్లెట్ ద్వారా ఈనాటి సమస్యను ఇవ్వాలని ప్రయత్నించాను. కాని ఆ ప్రయత్నం సఫలం కాలేదు. కరెంటు రాగానే టపా పెడతాను. ఈరోజు ఇస్తున్న సమస్య....... "రంగులఁ బూజింతు కెళ్ళి ప్రాంతములందున్"
పండిత నేమాని వారూ, ధన్యవాదములు. * ఇప్పటికి కరెంటు వచ్చింది. బ్లాగులో టపా పెట్టగలిగాను. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, పెక్కు సమస్యలు దినదిన మొక్కుమ్మడి దాడి చేయ నొనరగ శాంతం బెక్కడ గానని జీవన మిక్కరణిం గడుపువార మేమందు నికన్. * లక్ష్మీదేవి గారూ, మొదటి పాదంలో గణదోషం... ‘లేనిది సమస్య’ అంటే సరిపోతుందనుకుంటాను.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, ఏరోజైనా సమస్యను ఇవ్వకపోయినా, లేక ఆలస్యమైనా ‘బడి ఎగగొట్టిన, లేదా బడికి ఆలస్యమైన పిల్లవాడిలా?" అపరాధభావాన్ని పొందుతాను. ఈమధ్య అన్ని విధాల కుటుంబ, ఆరోగ్య, (అన్నిటికీ మూలమైన) ఆర్థిక సమస్యలతో సతమతమౌతూ మనశ్శాంతికి దూరమయ్యాను. అందువల్ల కొంతకాలంగా మిత్రుల పూరణల, పద్యాల పరామర్శ సరిగా చేయలేకపోతున్నాను. ఏది ఏమైనా నాకు ‘ఆత్మానందాన్నీ, సంతృప్తినీ’ ఇచ్చేది శంకరాభరణం ఒక్కటే...
ఈనాటి సమస్యకు చక్కని పూరణలు అందజేసిన కవిమిత్రులు.... పండిత నేమాని వారికి, తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి, సుబ్బారావు గారికి, సహదేవుడు గారికి, నాగరాజు రవీందర్ గారికి, హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి, గోలి హనుమచ్ఛాస్త్రి గారికి అభినందనలు, ధన్యవాదములు. * సుబ్బారావు గారూ, గతంలో మిత్రులు పంపిన సమస్యలను ఒక ఫైల్‌లో సేవ్ చేసి ఉంచాను. ఆమధ్య మా అబ్బాయి నా సిస్టమ్‌ను ఫార్మాటింగ్ చేసినప్పుడు ఆ ఫైల్ పొరపాటున డిలేట్ అయింది. అందువల్ల సమస్యల నిర్మాణం నాకు సమస్య అయింది. మిత్రులు గుర్తున్నవి, లేదా క్రొత్తవి సిద్ధం చేసి కాని పంపవలసిందిగా విన్నపం. మీ పూరణలో ‘జేయా భంగిమ...’ ? * తోపెల్ల వారూ, మీ సౌహార్దానికి ధన్యవాదాలు. అవసరం పడితే తప్పకుండా మీ సహకారం స్వీకరిస్తాను. మీరు టైపింగ్‌కు ఏ లిపి (లేఖిని, బరహా మొ||) వాడుతున్నారో తెలిపితే అందులో అరసున్నా ఎలా టైప్ చేయాలో తెలుపుతాను. మీరు అర్ధానుస్వారానికి బదులు బ్రాకెట్‌ను టైప్ చేసారు.
గురువులకు ప్రణామములు. నేను GIST వాడుచున్నాను. బరహా గూడ యున్నది. 1983 లో ఆకాశవాణి విజయవాడ వారి సమస్యాపూరణం "అధి విన్నన్ గనినంత మండునొడలత్యంతాగ్రహోదగ్రతన్" అని ఇచ్చారు. పనికొస్తుందేమో చూడ ప్రార్థన. ఇంకా మంచి సమస్యలు మీకు పంపాలన్న నేనేమి చేయలో సెలవియ్యండి. సరస్వతీ సేవ చేసే భాగ్యం కల్గించ ప్రార్థన.
శర్మ గారూ, ఆకాశవాణి వారి సమస్యను సూచించినందుకు ధన్యవాదాలు. రేపు దీనినే ఇస్తాను. ఇలాగే మీకు తెలిసినవి, విన్నవీ తెలియజేయ వలసిందిగా మనవి. నాకు GIST గురించి తెలియదు... బరహాలో అయితే ~M టైప్ చేస్తే అరసున్నా వస్తుంది. (a~MTa = అఁట) లేఖినిలో అయితే @m టైప్ చేయాలి. (a@mTa = అఁట) * ఆకెళ్ళ రామకృష్ణ శాస్త్రి గారూ, ‘శంకరాభరణం’ బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది. మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
ఒక్క సమస్య యు లేనిచొ
రిప్లయితొలగించండిమిక్కుట మానందమగును మేదిని ప్రజకున్
ఒక్క సమస్యయు లేనిచొ
తిక్కగ మనసుండు గాదె మీకును మాకున్.
లేని సమస్యనూహించి లీలగాను
రిప్లయితొలగించండిపూరణమ్మును జేసెడు బుద్ధితోడ
లేని పదముల తో నేడు లెస్సగనిట
పూరణమ్మును జేయరె ముచ్చటగను?
కవిమిత్రులారా,
రిప్లయితొలగించండినమస్కృతులు.
ఈరోజు లేచినప్పటినుండి ఇప్పటి వరకూ కరెంటు లేదు.
సరె.... టాబ్లెట్ ద్వారా ఈనాటి సమస్యను ఇవ్వాలని ప్రయత్నించాను. కాని ఆ ప్రయత్నం సఫలం కాలేదు.
కరెంటు రాగానే టపా పెడతాను.
ఈరోజు ఇస్తున్న సమస్య.......
"రంగులఁ బూజింతు కెళ్ళి ప్రాంతములందున్"
"రంగులఁ బూజింతు కెళ్ళి ప్రాంతములందున్"
రిప్లయితొలగించండిమిత్రులారా! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిఈ రోజు సమస్యను ఈ విధముగా స్వీకరించుదాము:
"రంగుల బూజింతు రెల్ల ప్రాంతము లందున్"
స్వస్తి.
ఎన్నిసార్లు టైప్ చేసినా 'రకెళళి' అని వస్తున్నది. అది 'రెల్ల' (rella) అని గమనించ వలసిందిగా మనవి.
రిప్లయితొలగించండిరంగుల మార్చక మేలిమి
రిప్లయితొలగించండిబంగరు గుణవంతులైన బహువిద్యా పా
రంగుల సాదృతి పెక్కు తె
రంగుల బూజింతు రెల్ల ప్రాంతములందున్
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండిధన్యవాదములు.
*
ఇప్పటికి కరెంటు వచ్చింది. బ్లాగులో టపా పెట్టగలిగాను.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
పెక్కు సమస్యలు దినదిన
మొక్కుమ్మడి దాడి చేయ నొనరగ శాంతం
బెక్కడ గానని జీవన
మిక్కరణిం గడుపువార మేమందు నికన్.
*
లక్ష్మీదేవి గారూ,
మొదటి పాదంలో గణదోషం... ‘లేనిది సమస్య’ అంటే సరిపోతుందనుకుంటాను.
ఏమి యీ రోజు కరువాయె యేమి వింత ?
రిప్లయితొలగించండిఒక్క టిసమస్య కాన రాదొక్కొ నాకు
కంది గురువుల జాబితా యందు వెతుక
నేను బంపిన వింకను గాన నగును
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిఏరోజైనా సమస్యను ఇవ్వకపోయినా, లేక ఆలస్యమైనా ‘బడి ఎగగొట్టిన, లేదా బడికి ఆలస్యమైన పిల్లవాడిలా?" అపరాధభావాన్ని పొందుతాను.
ఈమధ్య అన్ని విధాల కుటుంబ, ఆరోగ్య, (అన్నిటికీ మూలమైన) ఆర్థిక సమస్యలతో సతమతమౌతూ మనశ్శాంతికి దూరమయ్యాను. అందువల్ల కొంతకాలంగా మిత్రుల పూరణల, పద్యాల పరామర్శ సరిగా చేయలేకపోతున్నాను.
ఏది ఏమైనా నాకు ‘ఆత్మానందాన్నీ, సంతృప్తినీ’ ఇచ్చేది శంకరాభరణం ఒక్కటే...
హంగుల బహుభంగిమలన్
రిప్లయితొలగించండిరంగుల గణపతిని హైదరాబాదీయుల్
రంగత్తరంగ పుబహుతె
రంగుల(బూజింతురెల్ల ప్రాంతములందున్.
శ్రీగోలి హనుమచ్ఛాస్త్రిగారూ!పద్యపూరణ సద్వ్యసనానికి బానిసకాబడిన నా మనస్థిని మీ పద్యంలో చాల బాగ చెప్పినారు. ధన్యవాదములు.
రిప్లయితొలగించండిఅంగ న్యాసాదులు మఱి
రిప్లయితొలగించండియంగములం గూడ దీ సి యర్చన జేయా
భంగిమ పోకడ పెక్కుతె
రంగుల బూజింతు రెల్ల ప్రాంతము లందున్
గురువులకు ప్రణామములు! మాయింట కరెంటు సమస్య లేదు. ఒక మిస్సుడు కాల్ ఇచ్చినచొ సమస్యను అంతర్జాలములో నుంచెదను. సేవచేసే భాగ్యం కల్గించండి.
రిప్లయితొలగించండినం.9346676049.
మంగళకర సంక్రాంతికి
రిప్లయితొలగించండినంగనలా పౌష్య లక్ష్మి నాధర మొప్పన్
ముంగిళ్ళ ముగ్గు లెట్టుచు
రంగులఁ బూజింతురెల్ల ప్రాంతములందున్!
లింగా ! యని మది దలచుచు
రిప్లయితొలగించండిరంగా ! యని కరములెత్తి ప్రాంజలు లిడుచున్
డింగరు లీశుని పెక్కు తె
రంగుల బూజింతు రెల్ల ప్రాంతము లందున్
రంగా! కరుణాసాగర!
రిప్లయితొలగించండిమంగేశ్వర! కావుమయ్య మమ్మెపుడని సా
ష్టాంగనతులతోడ పలుతె
రంగుల పూజింతు రెల్ల ప్రాంతము లందున్.
aMganalu GOmayaMbunu
రిప్లయితొలగించండిmuMgiTa gobbiLLu jEsi mruggula niDuchun
baMgaru vaakiLLa naladi
రంగులఁ బూజింతు రెల్ల ప్రాంతములందున్.
రిప్లయితొలగించండిఅంగనలు గోమయంబును
ముంగిట గొబ్బిళ్ళు జేసి మ్రుగ్గుల నిడుచున్
బంగరు వాకిళ్ళ నలది
రంగులఁ బూజింతు రెల్ల ప్రాంతములందున్.
ఈనాటి సమస్యకు చక్కని పూరణలు అందజేసిన కవిమిత్రులు....
రిప్లయితొలగించండిపండిత నేమాని వారికి,
తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి,
సుబ్బారావు గారికి,
సహదేవుడు గారికి,
నాగరాజు రవీందర్ గారికి,
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి
అభినందనలు, ధన్యవాదములు.
*
సుబ్బారావు గారూ,
గతంలో మిత్రులు పంపిన సమస్యలను ఒక ఫైల్‌లో సేవ్ చేసి ఉంచాను. ఆమధ్య మా అబ్బాయి నా సిస్టమ్‌ను ఫార్మాటింగ్ చేసినప్పుడు ఆ ఫైల్ పొరపాటున డిలేట్ అయింది. అందువల్ల సమస్యల నిర్మాణం నాకు సమస్య అయింది. మిత్రులు గుర్తున్నవి, లేదా క్రొత్తవి సిద్ధం చేసి కాని పంపవలసిందిగా విన్నపం.
మీ పూరణలో ‘జేయా భంగిమ...’ ?
*
తోపెల్ల వారూ,
మీ సౌహార్దానికి ధన్యవాదాలు. అవసరం పడితే తప్పకుండా మీ సహకారం స్వీకరిస్తాను.
మీరు టైపింగ్‌కు ఏ లిపి (లేఖిని, బరహా మొ||) వాడుతున్నారో తెలిపితే అందులో అరసున్నా ఎలా టైప్ చేయాలో తెలుపుతాను. మీరు అర్ధానుస్వారానికి బదులు బ్రాకెట్‌ను టైప్ చేసారు.
గురువులకు ప్రణామములు. నేను GIST వాడుచున్నాను. బరహా గూడ యున్నది. 1983 లో ఆకాశవాణి విజయవాడ వారి సమస్యాపూరణం "అధి విన్నన్ గనినంత మండునొడలత్యంతాగ్రహోదగ్రతన్" అని ఇచ్చారు. పనికొస్తుందేమో చూడ ప్రార్థన. ఇంకా మంచి సమస్యలు మీకు పంపాలన్న నేనేమి చేయలో సెలవియ్యండి. సరస్వతీ సేవ చేసే భాగ్యం కల్గించ ప్రార్థన.
రిప్లయితొలగించండిబంగరు పాలకు డగురా
రిప్లయితొలగించండిట్పుంగవు బొగడ నిజజనులు మురియుచు, మనసు
ప్పొంగగ సద్విద్యాపా
రంగుల బూజింతు రెల్ల ప్రాంతములందున్
శర్మ గారూ,
రిప్లయితొలగించండిఆకాశవాణి వారి సమస్యను సూచించినందుకు ధన్యవాదాలు. రేపు దీనినే ఇస్తాను. ఇలాగే మీకు తెలిసినవి, విన్నవీ తెలియజేయ వలసిందిగా మనవి.
నాకు GIST గురించి తెలియదు...
బరహాలో అయితే ~M టైప్ చేస్తే అరసున్నా వస్తుంది.
(a~MTa = అఁట)
లేఖినిలో అయితే @m టైప్ చేయాలి. (a@mTa = అఁట)
*
ఆకెళ్ళ రామకృష్ణ శాస్త్రి గారూ,
‘శంకరాభరణం’ బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
రిప్లయితొలగించండిచెంగలువలు, మందారము
లంగనలు కొని గుడిలోన నాడుచు నెన్నో
భంగిమల ,మురారి బలు తె
రంగుల బూజింతు రెల్ల ప్రాంతములందున్.
కమనీయం గారూ,
రిప్లయితొలగించండిచక్కని పూరణ నిచ్చారు. అభినందనలు.
గురువుగారూ! నమస్సులు.సమస్యలు బ్లాగులో పెట్టాలా? లేక మీ ఇ మెఇల్ ఇచ్చినచో మెయిల్ చేయమందురా.
రిప్లయితొలగించండిజంగలులో పంకములో
రిప్లయితొలగించండిసంగర మందున నెడారి
సంఘర్షణలో
గొంగళి పురుగుల ట్యాంకు ఫి
రంగులఁ బూజింతు రెల్ల ప్రాంతములందున్
గొంగళి పురుగుల ట్యాంకు = caterpillar battle tank
వంగల దేశము నందున
రిప్లయితొలగించండిభంగును త్రాగుచును హోలి పండుగ దినమున్
హంగుల తోడుత నొసటిని
రంగులఁ బూజింతు రెల్ల ప్రాంతములందున్