పాలకుడు సకల జగతికి బాలకుడై యోగనిద్ర పడుకొని యుండెన్ మేలుగ ఓం తేజమ్ములుపాలన లాలన నుజేయు బాలకు నహహా !
ఓం నమశ్శివాయ:ఓం నమశ్శివాయ భవ్య యోగదాయకాయ తేనం నమశ్శివాయ దేవనాథ సంస్తుతాయ తేమం నమశ్శివాయ సర్వమంగళాన్వితాయ తేశిం నమశ్శివాయ శైల శృంగమందిరాయ తేవం నమశ్శివాయ లోక భద్ర కారణాయ తేయం నమశ్శివాయ సంతతాభయ ప్రదాయ తే నమోనమోనమశ్శివాయ నాదనందితాయ తేనమోనమోనమశ్శివాయ నాగభూషణాయ తేనమోనమోనమశ్శివాయ నందివాహనాయ తేనమోనమోనమశ్శివాయ నారదస్తుతాయ తేమహీధరేంద్ర రమ్య శృంగ మందిరాయ తేనమఃమహీధరేంద్రజాన్వితాయ మద్ధితాయ తేనమఃమహేశ్వరాయ దివ్యరూప మండితాయ తేనమఃమహాద్భుతార్థ దాయకాయ మంత్రమూర్తయే నమఃశివాయ సర్వలోకనాథ సేవితాయ తేనమఃశివాయ శీతశైల రాజ శృంగవాసినే నమః శివాయ చిత్ప్రభాకరాయ శ్రీకరాయ తేనమఃశివాయ శంకరాయ యోగ సిద్ధిదాయ తేనమఃవారిజాక్ష సేవితాయ భద్రమూర్తయే నమః వారిజాసనాది దేవ వందితాయ తేనమఃవాహినీ ధరాయ భక్త వత్సలాయ తేనమఃవాగ్విశేష సంస్తుతాయ భాగ్యదాయ తేనమఃయజ్ఞ పూరుషాయ పావనాలయాయ తేనమఃయక్షరాట్సఖాయ సంశ్రితార్తిహాయ తేనమఃయామినీశ శేఖరాయ హర్షదాయ తేనమఃయత్న సిద్ధిదాయ వాసవార్చితాయ తేనమః
బాలుని, విశ్వపాలకుని, పద్మభవాండము లెల్ల కుక్షిలోలీలగ సూక్ష్మరూపమున లీనముగాగ సుఖస్వరూపుడై చాల ప్రసన్నచిత్తుడయి శాంతవిభూషణుడై చెలంగు నాబాల శశాంక భూషణుని ప్రస్తుతి జేయుచు నంజలించెదన్
ఈశుని కొలిచే వారికినాశము లేదన్నమాట నమ్మితి, నన్నీయాశల సుడిగుండములోలేశము దయయైన జూపలేకను విడునా?
పాపలె యోంకారమునకుశ్రీపతి,పశుపతి,విరించి. చేతన యదియేకాపాడు దివిజుల మనుజులరూపాలేవైన తానె ప్రణవంబగుచున్!
శ్రీ సహదేవుడు గరూ! శుభాశీస్సులు.మీ పద్యము 3వ పాదములో గణములు సరిచేయండి. 4వ పాదములో యతి మైత్రి లేదు. స్వస్తి.
శ్రీ పండిత నేమాని,శ్రీ మురళీరవళి ప్రోత్సాహంతోచిరు ప్రయత్నం.సదాశివా! మహేశ్వరా! శశాంకధారి కావరా!సదా వశంకరా! నటేశ్వరా! శ్రితాభయంకరా!చిదాత్మ! పార్వతీపతే! శివా! భవా! వృషాపతే!ముదంబుతోశుభంబులిమ్ము”మోంనమశ్శివా” యనన్.
దృశ్యమునందు కాన్పించు వానితో చిన్న ప్రయత్నంగేయరూప శివస్తుతి.ఓంకార రూపం! సదా కైలాస వాసినం!వ్యాఘ్రాజినాంబరధరం!నాగాభరణ భూషితం!ఉత్తుంగతరంగిత గాంగ జటాధరం!త్రినేత్రం!చంద్ర చూడ మదనాంతకం! నందీశ్వరం!శూల పాణిం! లింగాకృతిం! చిన్ముద్రధారిం!యోగిపుంగవం! యోగనిద్రాత్మకం!వందే బాలం! శివం! శంకరం! నమామి.
మురువుగా విలసిల్లు భువన త్రయంబును మసిజేయ సమ్మతింపని కతమ్మొ ?యిరువురు భార్యల యీసడింపుల రోసి వైరాగ్యమొదవిన వైనమేమొ ?గణనాయకత్వమ్ముఁ గాంక్షించు తనయులు కలహమ్ములూనిన ఫలితమేమొ ?తాండవమ్మున మేను తత్తఱిల్లి యలసి విశ్రాంతిఁ గోరిన విధమొ యేమొ ?వెండికొండను వీడి సర్వేశ్వరుండుబాలకుండయి బ్రహ్మాండ పాలకుండు ఘన తరుచ్ఛాయ నునుపైన గద్దె పయిన బవ్వళించెను గనులకుఁ బండువు వలె !
శ్రీ తోపెల్ల...శర్మ గారి పంచచామరములో 3, 4 పాదములను ఇలాగ మార్చుదాము:మదిన్ నమశ్శివాయ యంచు మంత్రమున్ జపించెదన్ ముదమ్ముతో శుభమ్ము లిచ్చి బ్రోవుమా పరాత్పరా!స్వస్తి.
శ్రీ పండితులవారికి నమస్సులు. మీ సూచనానంతరంసదాశివా! మహేశ్వరా! శశాంకధారి కావరా!సదా వశంకరా! నటేశ్వరా! శ్రితాభయంకరా!మదిన్ నమశ్శివాయ యంచు మంత్రమున్ జపించెదన్ ముదమ్ముతో శుభమ్ము లిచ్చి బ్రోవుమా పరాత్పరా!
శ్రీ తోపెల్ల .... శర్మ గారికి శుభాశీస్సులుమీరు మంచి ప్రయత్నము చేసేరు. మీ పదములను ఛందోబద్ధము చేసి "అనుష్టుప్పులు" గా మార్చు చున్నాను:ఓంకార రూప మీశానంనాగాభరణ భూషితంవ్యాఘ్రాజినధరం దేవంగంగాధర ముమాపతించంద్రచూడం స్మరారాతింత్రినేత్రం నందివాహనంశూలాయుధధరం శర్వంశంభుం చిన్ముద్రధారిణంయోగేశ్వరేశ్వరం బాలంయోగానందఫలప్రదంభద్రరూపం మహాదేవంవందేహం భక్త చందనం
మిత్రులారా! అనుష్టుప్పు అనే సంస్కృత ఛందస్సు లక్షణములు (నాకు తెలిసిన రీతిలో) ఇలాగ ఉంటాయి:శ్లోకే షష్ఠం గురుం జ్ఞేయం (6వ అక్షరము గురువు)సర్వత్ర లఘు పంచమం (5వ అక్షరము లఘువు) ద్వి చతుః పాదయోర్ హ్రస్వందీర్ఘ మన్యత్ర సప్తమం (7వ అక్షరము 2, 4 పాదములలో హ్రస్వమును, 1,3 పాదములలో దీర్ఘమును ఉండును.) చూచేరు కదా. ప్రతి పాదములో 8 అక్షరములు ఉండును. ప్రతి పాదములో 5, 6, 7 అక్షరములకు మాత్రమే నియమములు ఈయబడినవి. ఇంకనూ అనేక విధములుగా నుండవచ్చును. స్వస్తి.
శ్రీ నేమని గురువర్యులకు ప్రణామములు.తప్పులు తెలియజేసి నందులకు ధన్యవాదములు. సవరణలతో పద్యం:పాపలె యోంకారమునకుశ్రీపతి,పశుపతి,విరించి.చేతనమదియేకాపాడు జీవకోటుల,ప్రాపంచికమునకునెల్లప్రణవంబగుచున్
బాలశంకర! నీదు వదన బింబమ్ములోపదునారు కళలును బరగుచుండెనీ నేత్రములనుండి నిత్య ప్రవాహినికరుణా సుధాధార వరలుచుండెనీ మోము బింబమ్ములో మెల్ల మెల్లనదరహాస చంద్రికల్ తనరుచుండెనీ పాదముల నుండి నిఖిల మంగళములుప్రభవించు చుండెను ప్రభల తోడయోగ నిద్రలో నుంటివో? యోగిరాజ!శైశవానుభవంపు ప్రశస్తి నరయ దలచి యీ మూర్తి దాల్చితో? త్ర్యంబకేశ!వత్సలకు వత్సవగు నిన్ను బ్రస్తుతింతు
యోగ నిద్రను బొందిన యోగి వర్య !ముద్దు వచ్చెను నీ యొక్క మోము జూడపెట్టు కొందును ముద్దును పేర్మి తోడబాల శంకర ! రమ్ము నా భవన మునకు
చిత్రానికి డా॥విష్ణునందన్ గారి అన్వయము బాగా అలరించింది.వారికి నా అభినందనలు.
శ్రీ పండితార్యులకు నమస్సులు. మీత్రోవను పయనించు ప్రయత్నముగా వ్రాసితిని. వాటికొక చక్కని ఛందోరూపమిచ్చి నన్ను ధన్యుణ్ణి చేసినందులకు మిక్కిలి ధన్యవాదములు.
గంగను కాదని వచ్చితి భంగము లేదని ప్రియముగ పార్వతి చెంతన్ ! చంగున రుస రుస పార్వతి జంగమ దేవరవు నీవు చాలించు మికన్ !
ఉల్లమున కొలుతు నీశునిమల్లనగా వెలసినట్టి మంజుల హృదయున్చల్లని హిమనగము వదిలిమెల్లన నాహృదయమందు మెదలెడి వానిన్
పాలకుడు సకల జగతికి
రిప్లయితొలగించండిబాలకుడై యోగనిద్ర పడుకొని యుండెన్
మేలుగ ఓం తేజమ్ములు
పాలన లాలన నుజేయు బాలకు నహహా !
ఓం నమశ్శివాయ:
రిప్లయితొలగించండిఓం నమశ్శివాయ భవ్య యోగదాయకాయ తే
నం నమశ్శివాయ దేవనాథ సంస్తుతాయ తే
మం నమశ్శివాయ సర్వమంగళాన్వితాయ తే
శిం నమశ్శివాయ శైల శృంగమందిరాయ తే
వం నమశ్శివాయ లోక భద్ర కారణాయ తే
యం నమశ్శివాయ సంతతాభయ ప్రదాయ తే
నమోనమోనమశ్శివాయ నాదనందితాయ తే
నమోనమోనమశ్శివాయ నాగభూషణాయ తే
నమోనమోనమశ్శివాయ నందివాహనాయ తే
నమోనమోనమశ్శివాయ నారదస్తుతాయ తే
మహీధరేంద్ర రమ్య శృంగ మందిరాయ తేనమః
మహీధరేంద్రజాన్వితాయ మద్ధితాయ తేనమః
మహేశ్వరాయ దివ్యరూప మండితాయ తేనమః
మహాద్భుతార్థ దాయకాయ మంత్రమూర్తయే నమః
శివాయ సర్వలోకనాథ సేవితాయ తేనమః
శివాయ శీతశైల రాజ శృంగవాసినే నమః
శివాయ చిత్ప్రభాకరాయ శ్రీకరాయ తేనమః
శివాయ శంకరాయ యోగ సిద్ధిదాయ తేనమః
వారిజాక్ష సేవితాయ భద్రమూర్తయే నమః
వారిజాసనాది దేవ వందితాయ తేనమః
వాహినీ ధరాయ భక్త వత్సలాయ తేనమః
వాగ్విశేష సంస్తుతాయ భాగ్యదాయ తేనమః
యజ్ఞ పూరుషాయ పావనాలయాయ తేనమః
యక్షరాట్సఖాయ సంశ్రితార్తిహాయ తేనమః
యామినీశ శేఖరాయ హర్షదాయ తేనమః
యత్న సిద్ధిదాయ వాసవార్చితాయ తేనమః
బాలుని, విశ్వపాలకుని, పద్మభవాండము లెల్ల కుక్షిలో
రిప్లయితొలగించండిలీలగ సూక్ష్మరూపమున లీనముగాగ సుఖస్వరూపుడై
చాల ప్రసన్నచిత్తుడయి శాంతవిభూషణుడై చెలంగు నా
బాల శశాంక భూషణుని ప్రస్తుతి జేయుచు నంజలించెదన్
ఈశుని కొలిచే వారికి
రిప్లయితొలగించండినాశము లేదన్నమాట నమ్మితి, నన్నీ
యాశల సుడిగుండములో
లేశము దయయైన జూపలేకను విడునా?
పాపలె యోంకారమునకు
రిప్లయితొలగించండిశ్రీపతి,పశుపతి,విరించి. చేతన యదియే
కాపాడు దివిజుల మనుజుల
రూపాలేవైన తానె ప్రణవంబగుచున్!
శ్రీ సహదేవుడు గరూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ పద్యము 3వ పాదములో గణములు సరిచేయండి. 4వ పాదములో యతి మైత్రి లేదు. స్వస్తి.
శ్రీ పండిత నేమాని,శ్రీ మురళీరవళి ప్రోత్సాహంతో
రిప్లయితొలగించండిచిరు ప్రయత్నం.
సదాశివా! మహేశ్వరా! శశాంకధారి కావరా!
సదా వశంకరా! నటేశ్వరా! శ్రితాభయంకరా!
చిదాత్మ! పార్వతీపతే! శివా! భవా! వృషాపతే!
ముదంబుతోశుభంబులిమ్ము”మోంనమశ్శివా” యనన్.
దృశ్యమునందు కాన్పించు వానితో చిన్న ప్రయత్నం
రిప్లయితొలగించండిగేయరూప శివస్తుతి.
ఓంకార రూపం! సదా కైలాస వాసినం!
వ్యాఘ్రాజినాంబరధరం!నాగాభరణ భూషితం!
ఉత్తుంగతరంగిత గాంగ జటాధరం!త్రినేత్రం!
చంద్ర చూడ మదనాంతకం! నందీశ్వరం!
శూల పాణిం! లింగాకృతిం! చిన్ముద్రధారిం!
యోగిపుంగవం! యోగనిద్రాత్మకం!
వందే బాలం! శివం! శంకరం! నమామి.
మురువుగా విలసిల్లు భువన త్రయంబును
రిప్లయితొలగించండిమసిజేయ సమ్మతింపని కతమ్మొ ?
యిరువురు భార్యల యీసడింపుల రోసి
వైరాగ్యమొదవిన వైనమేమొ ?
గణనాయకత్వమ్ముఁ గాంక్షించు తనయులు
కలహమ్ములూనిన ఫలితమేమొ ?
తాండవమ్మున మేను తత్తఱిల్లి యలసి
విశ్రాంతిఁ గోరిన విధమొ యేమొ ?
వెండికొండను వీడి సర్వేశ్వరుండు
బాలకుండయి బ్రహ్మాండ పాలకుండు
ఘన తరుచ్ఛాయ నునుపైన గద్దె పయిన
బవ్వళించెను గనులకుఁ బండువు వలె !
శ్రీ తోపెల్ల...శర్మ గారి పంచచామరములో 3, 4 పాదములను ఇలాగ మార్చుదాము:
రిప్లయితొలగించండిమదిన్ నమశ్శివాయ యంచు మంత్రమున్ జపించెదన్
ముదమ్ముతో శుభమ్ము లిచ్చి బ్రోవుమా పరాత్పరా!
స్వస్తి.
శ్రీ పండితులవారికి నమస్సులు. మీ సూచనానంతరం
రిప్లయితొలగించండిసదాశివా! మహేశ్వరా! శశాంకధారి కావరా!
సదా వశంకరా! నటేశ్వరా! శ్రితాభయంకరా!
మదిన్ నమశ్శివాయ యంచు మంత్రమున్ జపించెదన్
ముదమ్ముతో శుభమ్ము లిచ్చి బ్రోవుమా పరాత్పరా!
శ్రీ తోపెల్ల .... శర్మ గారికి శుభాశీస్సులుమీరు మంచి ప్రయత్నము చేసేరు. మీ పదములను ఛందోబద్ధము చేసి "అనుష్టుప్పులు" గా మార్చు చున్నాను:
రిప్లయితొలగించండిఓంకార రూప మీశానం
నాగాభరణ భూషితం
వ్యాఘ్రాజినధరం దేవం
గంగాధర ముమాపతిం
చంద్రచూడం స్మరారాతిం
త్రినేత్రం నందివాహనం
శూలాయుధధరం శర్వం
శంభుం చిన్ముద్రధారిణం
యోగేశ్వరేశ్వరం బాలం
యోగానందఫలప్రదం
భద్రరూపం మహాదేవం
వందేహం భక్త చందనం
మిత్రులారా!
రిప్లయితొలగించండిఅనుష్టుప్పు అనే సంస్కృత ఛందస్సు లక్షణములు (నాకు తెలిసిన రీతిలో) ఇలాగ
ఉంటాయి:
శ్లోకే షష్ఠం గురుం జ్ఞేయం (6వ అక్షరము గురువు)
సర్వత్ర లఘు పంచమం (5వ అక్షరము లఘువు)
ద్వి చతుః పాదయోర్ హ్రస్వం
దీర్ఘ మన్యత్ర సప్తమం (7వ అక్షరము 2, 4 పాదములలో హ్రస్వమును, 1,3 పాదములలో దీర్ఘమును ఉండును.)
చూచేరు కదా. ప్రతి పాదములో 8 అక్షరములు ఉండును. ప్రతి పాదములో 5, 6, 7 అక్షరములకు మాత్రమే నియమములు ఈయబడినవి. ఇంకనూ అనేక విధములుగా నుండవచ్చును.
స్వస్తి.
శ్రీ నేమని గురువర్యులకు ప్రణామములు.తప్పులు తెలియజేసి నందులకు ధన్యవాదములు. సవరణలతో పద్యం:
రిప్లయితొలగించండిపాపలె యోంకారమునకు
శ్రీపతి,పశుపతి,విరించి.చేతనమదియే
కాపాడు జీవకోటుల,
ప్రాపంచికమునకునెల్లప్రణవంబగుచున్
బాలశంకర! నీదు వదన బింబమ్ములో
రిప్లయితొలగించండిపదునారు కళలును బరగుచుండె
నీ నేత్రములనుండి నిత్య ప్రవాహిని
కరుణా సుధాధార వరలుచుండె
నీ మోము బింబమ్ములో మెల్ల మెల్లన
దరహాస చంద్రికల్ తనరుచుండె
నీ పాదముల నుండి నిఖిల మంగళములు
ప్రభవించు చుండెను ప్రభల తోడ
యోగ నిద్రలో నుంటివో? యోగిరాజ!
శైశవానుభవంపు ప్రశస్తి నరయ
దలచి యీ మూర్తి దాల్చితో? త్ర్యంబకేశ!
వత్సలకు వత్సవగు నిన్ను బ్రస్తుతింతు
యోగ నిద్రను బొందిన యోగి వర్య !
రిప్లయితొలగించండిముద్దు వచ్చెను నీ యొక్క మోము జూడ
పెట్టు కొందును ముద్దును పేర్మి తోడ
బాల శంకర ! రమ్ము నా భవన మునకు
చిత్రానికి డా॥విష్ణునందన్ గారి అన్వయము బాగా అలరించింది.వారికి నా అభినందనలు.
రిప్లయితొలగించండిచిత్రానికి డా॥విష్ణునందన్ గారి అన్వయము బాగా అలరించింది.వారికి నా అభినందనలు.
రిప్లయితొలగించండిశ్రీ పండితార్యులకు నమస్సులు. మీత్రోవను పయనించు ప్రయత్నముగా వ్రాసితిని. వాటికొక చక్కని ఛందోరూపమిచ్చి నన్ను ధన్యుణ్ణి చేసినందులకు మిక్కిలి ధన్యవాదములు.
రిప్లయితొలగించండిగంగను కాదని వచ్చితి
రిప్లయితొలగించండిభంగము లేదని ప్రియముగ పార్వతి చెంతన్ !
చంగున రుస రుస పార్వతి
జంగమ దేవరవు నీవు చాలించు మికన్ !
ఉల్లమున కొలుతు నీశుని
రిప్లయితొలగించండిమల్లనగా వెలసినట్టి మంజుల హృదయున్
చల్లని హిమనగము వదిలి
మెల్లన నాహృదయమందు మెదలెడి వానిన్