29, జనవరి 2013, మంగళవారం

పద్య రచన – 236

కవిమిత్రులారా,   
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

18 కామెంట్‌లు:

  1. శ్రీ శ్రీరామచంద్రుడు గారికి శుభాశీస్సులు.
    మీరు మంచి భాషనే వాడుచున్నారు. వ్యావహారిక భాషను వచనములలో ప్రయోగించుట సమ్మతమే. పద్యములలో వ్యాకరణ శుద్ధమైన భాష అభిలషణీయము. పద్యములను పెద్ద పెద్ద సమాసములతో వ్రాయ నక్కరలేదు. సులభ సుందర శైలిని అందరూ ఆశ్వాదించగలరు. గ్రహించగలరు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  2. పాపపుణ్యములట లెక్క బరగ జేయు
    లెక్కజేయక పాపంబు లెన్నొ జేయ
    చిత్ర గుప్తుని చిట్టాన చెప్పినట్లు
    శిక్ష వేయును సమవర్తి చెపితి పినుము

    రిప్లయితొలగించండి
  3. సకల జీవులు భువి శాంతి సౌఖ్యములతో
    జీవింప వలెనంచు దేవుడిచ్చె
    సదుపాయములు చాల సద్ధర్మ రీతుల
    నాచరించుడటంచు నవ్విధమున
    నాచరించిన ధర్మ మాధర్మమే సర్వ
    జనుల రక్షించును సంతతంబు
    నా రీతిగా కాక స్వార్థమ్ముతో పాప
    భయము లేక చరించు వారలెల్ల
    నంత్యమున నరకమ్ము పాలగుచు నచట
    పొందెద రనేక శిక్ష లేమందు నకట!
    పాపు లేరీతి నరకాన బాధలెన్నొ
    యనుభవించుచు నుంటిరో కనుడు కనుడు

    రిప్లయితొలగించండి
  4. పాప తీవ్రత, శిక్షల పథము దెల్ప
    యముడు నరకాన జీవుల కట్లు గూర్చు
    నరకమున్నదో లేదో యనవసరంబు
    బ్రతుకు ముగియు లోపున శిక్ష పాపి చూచు
    సత్యమెందరో కనిరవసాన దశన

    రిప్లయితొలగించండి
  5. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మమంగళవారం, జనవరి 29, 2013 9:29:00 AM

    కర్మ ఫలము దొలగు కర్మ చేత ననెడి
    కర్మ మర్మ మెరిగి కర్మ చేయచలె, దు
    ష్కర్మ నాచరింప కనుము ఫలమిచట
    రౌర వాది నరక రాయిడులను.

    రిప్లయితొలగించండి
  6. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మమంగళవారం, జనవరి 29, 2013 9:58:00 AM

    గణ దోషములను సవరించుచూ
    కర్మ ఫలము తొలంగును కర్మ చేత
    కర్మ మర్మ మెరింగియు కర్మ చేయ
    దగును, దుష్కర్మ ఫలితము తథ్య మండ్రు
    రౌర వాదిన రకముల రాయిడులట.

    రిప్లయితొలగించండి
  7. చిత్ర గుప్తుని జూడుడు చిత్ర మందు
    పాప పుణ్యాల చిట్టాను బలుకు చుండ
    దాని నాధార ముగ జేసి ధర్మ జుండు
    ఆజ్ఞ యిచ్చును శిక్షింప యర్హు లకును

    రిప్లయితొలగించండి
  8. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    ఇవే రౌరవాది నరకములు :

    01)
    _______________________________

    ఒకరి గుఱ్ఱము జేయు - నొకరి గానుగ జేయు
    నొకరి శూలము లేపు - నొకరి వేపు !

    నొకరి ఱంపము జీల్చు - నొకరి కంపల గాల్చు
    నొకరి నాలుక గోయు - నొకరి గొట్టు !

    నొకరి ముక్కల జేయు - నొకరి చుక్కల జూపు
    నొకరి సుత్తుల బాదు - నొకరి మోదు !

    నొకరి నీటను ముంచు - నొకరి యొంటిని గాల్చు
    నొకరి సూదుల గుప్పు - నొకరి ద్రిప్పు !

    చిత్రగుప్తుడు దెలిపిన - చేత వలన
    ఎవరు జేసిన పాపమ్ము - లెంతొ దెలిసి
    వారి పాపమ్ము దగినట్లు - ఫల మొసంగు
    ధర్మ దేవత ధర్మము - తప్ప కుండ !
    _____________________________

    రిప్లయితొలగించండి
  9. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మమంగళవారం, జనవరి 29, 2013 5:16:00 PM

    పూజ్యులకు మిత్రులకు నమస్సులతో అష్టా వింశతి రౌరవాది నరక లోకములను,
    సప్త భయంకరాతి శీతల లోకాలను గణ, యతి, ప్రాస దోషాలు రాకుండగ రెండు మూడు చోటుల మధ్యాక్షరముల నుంచి ప్రయత్నించి వ్రాసినది. దోషములను మిత్రులు తెలుప మనవి.

    1 2 3
    అంధమిశ్రం, తమిశ్ర మ,సిత పత్ర వనం, సు
    4 5 6
    కర ముఖం, రౌరవం, కాల సూత్ర ,
    ౭ ౮ ౯
    మంధకూ ప మ,వీచి, దందశూకం,క్షర
    10 11 12
    కర్దమం, లాలభ క్షణమ,యోప
    13 14
    నం, (సదా) క్రిమిభోజ నం, తప్త శాల్మలి,
    15 16
    పూయోద కం, శూల ప్రోత, వాత
    17 18 19
    రోదము (జన) ప్రాణ రోధము, వైశాస
    20 21
    నం, సారమేయాదనం, మహరౌర
    22 23
    వమును, తప్తమూర్తి, పరియా(పర్యా) వర్తనకము,
    24 25 26
    వైతరిణి,(యు) రక్షోభక్ష, వజ్ర కంట
    27
    కశ(శా)లి, కుంభిపా కమునర కమను లోక
    28
    సూచి ముఖ, మిర్వు దెనిమిది సూచి తంబు.

    ఇవియుగాక
    1 2 3 4 5
    అర్బుదం, నిరర్బుద, పద్మ, హహవ, యెయెయె,
    6 7
    ఉత్పల,(ము) మహా పద్మ,ము,యొడలు గడ్డ
    కట్టు శీతన రకములు కనుచు జనులు
    మాన రండు దుష్ప్రవృత్తి మానసమున.

    రిప్లయితొలగించండి
  10. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మమంగళవారం, జనవరి 29, 2013 5:26:00 PM

    తే.గీ. 2 పాదాంత మధ్యమున " నొడలు" గా చూడ మనవి.

    రిప్లయితొలగించండి
  11. డా. ప్రభల రామలక్ష్మిమంగళవారం, జనవరి 29, 2013 6:21:00 PM

    మంచి పనులు చేయి మర్యాద కాపాడు
    అనుచు అమ్మచెప్పె అనునయాన
    కాని పనులు చేయ కాల్చును కాలుండు
    చిత్రమందు చూడు శిక్షలెన్నొ

    రిప్లయితొలగించండి
  12. డా. ప్రభల రామలక్ష్మిమంగళవారం, జనవరి 29, 2013 6:38:00 PM

    సాహితీ మిత్రులకు,
    పూరణలు అన్ని బాగున్నాయి. అభినందనలు,

    రిప్లయితొలగించండి
  13. మానవ జన్మము ఘనమని
    దానవ కృత్యములు మాని ధన్యత నొందన్ !
    కానని కామక్రోధము
    లా నరకము నందు మునుగు యాతన కంటెన్ !

    రిప్లయితొలగించండి
  14. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  15. స్వర్గ నరకములను స్థలము లుండెనొ లేవొ !
    పాప పుణ్యములకు పద్దు గలదొ !
    కర్మఫలిత మనెడు మర్మమేమియొ గాని
    శిక్ష భయము చేత చెడడు నరుడు

    రిప్లయితొలగించండి
  16. నరకబాధలపై చక్కని పద్యాలను రచించిన కవిమిత్రులు....
    పండిత నేమాని వారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    సహదేవుడు గారికి,
    తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి,
    సుబ్బారావు గారికి,
    వసంత కిశోర్ గారికి,
    డా. ప్రభల రామలక్ష్మి గారికి,
    రాజేశ్వరి అక్కయ్య గారికి,
    నాగరాజు రవీందర్ గారికి
    అభినందనలు, ధన్యవాదాలు.
    *
    తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారూ,
    తేటగీతికలో రౌరవాది నరకాలను తెలిపే మీ ప్రయత్నం అభినందనీయం. గణ, యతి, ప్రాస దోషాలు రాకుండ... అన్నారు కాని, అవే ఎక్కునగా ఉన్నవి. సమయాభావం, అనారోగ్యం వల్ల వివరంగా ఇప్పుడు చెప్పలేను కాని వీలును బట్టి తెలియజేస్తాను.
    *
    సుబ్బారావు గారూ,
    శిక్షింప నర్హు లకును .... అనండి.

    రిప్లయితొలగించండి
  17. శ్రీరామచంద్రుడు.బుధవారం, జనవరి 30, 2013 12:21:00 AM

    పూజనీయులైన, పండిత శ్రీ ఎన్. ఆర్. ఎస్. రావు గార్కి, విషయము గ్రహించితిని. అనుసరించి కృతకృత్యుడను కాగలనని భావిస్తున్నాను. (భావిస్తున్నాను అని ఎందుకు అన్నానంటే, ఉదా||కు ఇదే విషయాన్ని తీసుకొని వ్యవహారికంలో వ్రాస్తే, " మీ సూచన బావుంది. ఈ పైన అలాగే రాస్తాను " అని కదా వ్రాయవలసి వస్తోంది. ఇది కొంచెం అమర్యాదకరంగా, పెద్దల ఎడల వినయరాహిత్యాన్ని ప్రదర్శిస్తున్నట్లుగా, కొంచెం జంకుగా ఉంది. అయిననూ మీ సూచనను అనుసరించియే తీరుతాను.) మీతో సంభాషణ (వాగ్రూపం కాకపొయినప్పటికి) మనోహ్లాదముగా ఉంటుంది. అందుకే నా భావాలను తెలియజేస్తున్నను. అన్యథా భావించవలదు. తమ ఆశీర్వచనాభిలాషి....శ్రీరామచంద్రుడు.

    శ్రీ నాగరాజు రవీందర్ గార్కి,
    మీ పద్య భావంతో నూటికి నూరుపాళ్ళు ఏకీభవిస్తున్నాను. అట్టి భయభక్తులు లేకే నేటి సమాజమీదుఃస్థితికి లోనయ్యింది. చాలా మంచి రచన చేశారు.

    డా. ప్రభల రామలక్ష్మి గారి పద్యంలో వలె ప్రతీ స్త్రీ తన బిడ్డలను భయభక్తులు తెలియచేస్తూ పెంచగలదని ఆశిద్దాం.
    గురువుగారికి ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  18. శ్రీరామచంద్రుడుగురువారం, జనవరి 31, 2013 9:23:00 AM

    అంధమిశ్రం, తమిశ్ర మసిత పత్ర వనం, సు
    కర ముఖం, రౌరవం, కాల సూత్ర
    మంధకూపమవీచి, దందశూకం,క్షర
    కర్దమం, లాలభక్షణమ,యోప
    నం, (సదా) క్రిమిభోజనం, తప్త శాల్మలి,
    పూయోదకం, శూల ప్రోత, వాత
    రోదము (జన) ప్రాణ రోధము, వైశాస
    నం, సారమేయాదనం, మహరౌర
    వమును, తప్తమూర్తి, పరియా(పర్యా) వర్తనకము,
    వైతరిణి,(యు) రక్షోభక్ష, వజ్ర కంట
    కశ(శా)లి, కుంభిపాకము నరకమను లోక
    సూచి ముఖమిర్వుదెనిమిది సూచి తంబు.
    ఇవియుగాక
    అర్బుదం, నిరర్బుద, పద్మ, హహవ, యెయెయె,
    ఉత్పల(ము) మహా పద్మ,ము,నొడలు గడ్డ
    కట్టు శీతనరకములు కనుచు జనులు
    మాన రండు దుష్ప్రవృత్తి మానసమున.





    రిప్లయితొలగించండి