ఈ మార్గము చూడుడు కన గా మానవ జీవితమ్ముగా మలుపులెగాఏమాత్రము జారిపడక క్షేమంబుగ పైకి జేరు శ్రీశుని దలువన్.
మిత్రులందరకు శుభాశీస్సులు.మీ రచనలను అన్నింటినీ చూచు చున్నాను. అందరికి అభినందనలు. స్వస్తి.
హనుమచ్ఛాస్త్రి గారూ,మానవ జీవనంలోని మలుపులతో పోల్చిన మీ పద్యం బాగుంది. అభినందనలు...పైకి జేరు... 'పైకి జేర్చు'.... అయితే..?
మాస్టరు గారూ ! మీ సవరణ పయాన్ని ఇంకా 'పైకి జేర్చింది'.ధన్యవాదములు.సవరణతో...ఈ మార్గము చూడుడు కనగా మానవ జీవితమ్ముగా మలుపులెగాఏమాత్రము జారిపడకక్షేమంబుగ పైకి జేర్చు శ్రీశుని దలువన్.
పైన 'పయాన్ని' అను పదాన్ని' పద్యాన్ని' గా చదువుకొన వలెను.
మెలికలు తిరిగిన దారులుతలపించెను శేషురూపు , దాని పయిన దావెలసెను శ్రీ హరి శేషాచలమది జనులకు శుభములొసగుచుండు సదా!
దుర్గమ గిరులను జూడుముదుర్గమమే బైకి బోవ ధూర్జటి కైనన్దుర్గమ తల్లి గరుణనన నర్గళముగ నెక్క వచ్చు నగముల పైకిన్.
మలుపుల జీవిత మందునతలచిన తిరు వేంకటేశు తబ్బిబ్బవకన్నిలుపుచునుత్తమ గతిలోకలుపుకొనగ చేదు మనల గఘ్యము తానై!
పరమ సత్యమరయగాను పయన మవగపరమ పదమును చేరగ పరుగు లిడగపథము నందుండు నుత్థాన పతనములనుసద్గురు కృపను దాటగ సంభవమగు.
మెలికలు తిరుగుచు దారులెయలిపిరి నుండి తిరుమలకు ననువుగ జేర్చున్కలుగును భక్తులకు ముదము యిలవేలుపు వేంకటేశు నీక్షింపంగన్
వంకర టింకర దారులు శంకించక సాగి పొమ్ము శంకరు దరికిన్ ! సంకుచిత మైన మనసుల పంకిలము హరించ గలడు పరమాత్ముండే !
భక్తవత్సలుడగు భగవానుడు చేరదుర్గములను తురిమి పెద్దతోవ చేసెసులభమైన దారి నడచి సొచ్చుగానిజేరజాలని మనసును జేర్చుటెట్లు?
వంకరలు తీరి దుర్గమ వనములోన మరలి పైనకు బయనించు మార్గమిదియె భయములేక ముందుకు సాగి పథిక ,పొమ్ము వరదుడగు స్వామి దర్శన భాగ్య మొదవు.
డా. ప్రభల వారి పద్య పాదం "జేరజాలని మనసును జేర్చుటెట్లు?" బాగుంది.
ఘాట్‌రోడ్ (తెలుగులో ఏమంటారో!) చిత్రాన్ని చూచి స్పందించి చక్కని పద్యాలను రచించిన కవిమిత్రులు.....గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,లక్ష్మీదేవి గారికి,సుబ్బారావు గారికి,సహదేవుడు గారికి,తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి,నాగరాజు రవీందర్ గారికి,రాజేశ్వరి అక్కయ్య గారికి,డా. ప్రభల రామలక్ష్మి గారికి,కమనీయం గారికిఅభినందనలు... ధన్యవాదాలు.*సహదేవుడు గారూ,మీ పద్యంలో 'చేదు' అన్నది 'చేరు'కు టైపాటా?*డా. ప్రభల రామలక్ష్మి గారూ,మొదటి పాదంలో 'భగవానుడు చేర' అన్నచోట గణదోషం. 'భగవానుఁ జేర' అంటే సరి.
మాస్టరు గారూ ! ధన్యవాదములు.సవరణతో...భక్తవత్సలుడగు భగవానుడు జేరదుర్గములను తురిమి పెద్దతోవ చేసెసులభమైన దారి నడచి సొచ్చుగానిజేరజాలని మనసును జేర్చుటెట్లు?
మాస్టరు గారూ ! ధన్యవాదములు.సవరణతో...భక్తవత్సలుడగు భగవాను జేరదుర్గములను తురిమి పెద్దతోవ చేసెసులభమైన దారి నడచి సొచ్చుగానిజేరజాలని మనసును జేర్చుటెట్లు?
ఈ మార్గము చూడుడు కన
రిప్లయితొలగించండిగా మానవ జీవితమ్ముగా మలుపులెగా
ఏమాత్రము జారిపడక
క్షేమంబుగ పైకి జేరు శ్రీశుని దలువన్.
మిత్రులందరకు శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ రచనలను అన్నింటినీ చూచు చున్నాను. అందరికి అభినందనలు.
స్వస్తి.
హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమానవ జీవనంలోని మలుపులతో పోల్చిన మీ పద్యం బాగుంది. అభినందనలు...
పైకి జేరు... 'పైకి జేర్చు'.... అయితే..?
మాస్టరు గారూ ! మీ సవరణ పయాన్ని ఇంకా 'పైకి జేర్చింది'.ధన్యవాదములు.
రిప్లయితొలగించండిసవరణతో...
ఈ మార్గము చూడుడు కన
గా మానవ జీవితమ్ముగా మలుపులెగా
ఏమాత్రము జారిపడక
క్షేమంబుగ పైకి జేర్చు శ్రీశుని దలువన్.
పైన 'పయాన్ని' అను పదాన్ని' పద్యాన్ని' గా చదువుకొన వలెను.
రిప్లయితొలగించండిమెలికలు తిరిగిన దారులు
రిప్లయితొలగించండితలపించెను శేషురూపు , దాని పయిన దా
వెలసెను శ్రీ హరి శేషా
చలమది జనులకు శుభములొసగుచుండు సదా!
దుర్గమ గిరులను జూడుము
రిప్లయితొలగించండిదుర్గమమే బైకి బోవ ధూర్జటి కైనన్
దుర్గమ తల్లి గరుణనన
నర్గళముగ నెక్క వచ్చు నగముల పైకిన్.
మలుపుల జీవిత మందున
రిప్లయితొలగించండితలచిన తిరు వేంకటేశు తబ్బిబ్బవకన్
నిలుపుచునుత్తమ గతిలో
కలుపుకొనగ చేదు మనల గఘ్యము తానై!
పరమ సత్యమరయగాను పయన మవగ
రిప్లయితొలగించండిపరమ పదమును చేరగ పరుగు లిడగ
పథము నందుండు నుత్థాన పతనములను
సద్గురు కృపను దాటగ సంభవమగు.
మెలికలు తిరుగుచు దారులె
రిప్లయితొలగించండియలిపిరి నుండి తిరుమలకు ననువుగ జేర్చున్
కలుగును భక్తులకు ముదము
యిలవేలుపు వేంకటేశు నీక్షింపంగన్
వంకర టింకర దారులు
రిప్లయితొలగించండిశంకించక సాగి పొమ్ము శంకరు దరికిన్ !
సంకుచిత మైన మనసుల
పంకిలము హరించ గలడు పరమాత్ముండే !
భక్తవత్సలుడగు భగవానుడు చేర
రిప్లయితొలగించండిదుర్గములను తురిమి పెద్దతోవ చేసె
సులభమైన దారి నడచి సొచ్చుగాని
జేరజాలని మనసును జేర్చుటెట్లు?
రిప్లయితొలగించండివంకరలు తీరి దుర్గమ వనములోన
మరలి పైనకు బయనించు మార్గమిదియె
భయములేక ముందుకు సాగి పథిక ,పొమ్ము
వరదుడగు స్వామి దర్శన భాగ్య మొదవు.
డా. ప్రభల వారి పద్య పాదం "జేరజాలని మనసును జేర్చుటెట్లు?" బాగుంది.
రిప్లయితొలగించండిఘాట్రోడ్ (తెలుగులో ఏమంటారో!) చిత్రాన్ని చూచి స్పందించి చక్కని పద్యాలను రచించిన కవిమిత్రులు.....
రిప్లయితొలగించండిగోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
లక్ష్మీదేవి గారికి,
సుబ్బారావు గారికి,
సహదేవుడు గారికి,
తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి,
నాగరాజు రవీందర్ గారికి,
రాజేశ్వరి అక్కయ్య గారికి,
డా. ప్రభల రామలక్ష్మి గారికి,
కమనీయం గారికి
అభినందనలు... ధన్యవాదాలు.
*
సహదేవుడు గారూ,
మీ పద్యంలో 'చేదు' అన్నది 'చేరు'కు టైపాటా?
*
డా. ప్రభల రామలక్ష్మి గారూ,
మొదటి పాదంలో 'భగవానుడు చేర' అన్నచోట గణదోషం. 'భగవానుఁ జేర' అంటే సరి.
మాస్టరు గారూ ! ధన్యవాదములు.
రిప్లయితొలగించండిసవరణతో...
భక్తవత్సలుడగు భగవానుడు జేర
దుర్గములను తురిమి పెద్దతోవ చేసె
సులభమైన దారి నడచి సొచ్చుగాని
జేరజాలని మనసును జేర్చుటెట్లు?
మాస్టరు గారూ ! ధన్యవాదములు.
రిప్లయితొలగించండిసవరణతో...
భక్తవత్సలుడగు భగవాను జేర
దుర్గములను తురిమి పెద్దతోవ చేసె
సులభమైన దారి నడచి సొచ్చుగాని
జేరజాలని మనసును జేర్చుటెట్లు?