17, జనవరి 2013, గురువారం

పద్య రచన - 224

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

10 కామెంట్‌లు:

 1. పాకీ సైనిక ముష్కర
  మూకా మా వారి జంపి మురియుచు నుంటే
  మాకగు తెగువను జూపుచు
  మైకము దించేము, భరత మాతా జై! జై!

  రిప్లయితొలగించండి
 2. పాకీ సైనిక ముష్కర
  మూకా! మా వారి జంపి మురియుచు నుంటే!
  మాకగు తెగువను జూపుచు
  మైకము దించేము, భరత మాతా జై! జై!

  రిప్లయితొలగించండి
 3. ప్రాణ ధార వోసి భారత మాతకు
  చీర చెరగు కూడ చెదర నీరు!
  రేబవళ్లు కన్ను రెప్పలు మూయరు!
  వీర సైనికాళి! వేల నుతులు.

  రిప్లయితొలగించండి
 4. శూరుల గన్న భారతము సుందరమైనది నాదు దేశమీ
  వీరుల మ్రొక్కి,సంపదలు వేయి శుభమ్ములు వారి పుత్రులన్
  జేరగ నీయమంచు జలజేక్షుని పాదము బట్టి వేడెదన్.
  వారల నమ్మి యుందుమిక భద్రముగా నిట దేశమందునన్.

  రిప్లయితొలగించండి
 5. మూడు రంగుల జెండాను ముచ్చ ట గను
  చేత బూనుచు పది మంది సైనికు లట
  జయము బలుకుచు జెండాను చాపి మనకు
  సంత సంబును బంచిరి చమువు గణము .

  రిప్లయితొలగించండి
 6. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మగురువారం, జనవరి 17, 2013 7:13:00 PM

  శ్రీ గోలి శాస్త్రిగారి పూరణాప్రేరణతో
  అలుగు టయే యె రుంగని మహామ హిమాత్ము లజాత శత్రువుల్
  లలుబ హదూరు శాస్త్రియు బలాధి క లేమ ప్రధాని యిందిరా
  నలము ల పీకె పాకియు లు హార కులై ప రిగొన్న పీకలన్
  తులువ ల తాట దీసెద ము తోడు గ నెంద రియండ యుండగన్.

  రిప్లయితొలగించండి
 7. ఆంధ్రదేశంలో మరుగుదొడ్లను శుభ్రపరిచేవారిని పాకీవారనడం వాడుకలొ ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు ఆ పదం వీరి పరమైంది ! ! !

  రిప్లయితొలగించండి
 8. ఆంధ్రదేశంలో మరుగుదొడ్లను శుభ్రపరిచేవారిని పాకీవారనడం వాడుకలొ ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు ఆ పదం వీరి పరమైంది ! ! !

  రిప్లయితొలగించండి
 9. కాంచుడీ మన పతాకమ్ము నెగురవేయ
  మువ్వన్నెలనుగూడి ముచ్చటగును
  ధర్మనిరతిజాటు ధర్మచక్రమ్ముతో
  దేశీయులకును సందేశమిచ్చు
  జాతిగర్వమ్మును జాటిచెప్పుచునుండె
  పులకించి హృదయముప్పొంగుచుండ
  నరివీరులకు గుండెలదరగొట్టంగ నా
  గగనాన రెపరెప యెగురుచుండె

  నేడు శాంతికి ,సంధికి నెలవు లేదు
  దుష్టవైరి సైన్యమ్ముల దురమునందు
  తరిమికొట్టంగ నీ నాడు తరుణమాయె
  దేశభక్తులు బారులు తీర్చి రండు.

  రిప్లయితొలగించండి