21, జనవరి 2013, సోమవారం

పద్య రచన - 228

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

13 కామెంట్‌లు:

  1. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మసోమవారం, జనవరి 21, 2013 8:39:00 AM

    కబడి కబడి కబడి యని కూతను కూయుచు
    చాక చక్యము తోనాట జరుగు చుండ
    చూడ ముచ్చట గొల్పును చూపరులకు
    పల్లె క్రీడగ ఖ్యాతిని పరచు కొనెను.

    రిప్లయితొలగించండి
  2. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారూ,
    వెంటనే స్పందించి చక్కని పద్యాన్ని ఇచ్చినందుకు అభినందనలు, ధన్యవాదాలు.
    మొదటి పాదంలో గణ, యతి దోషాలు...
    కబడి కబడి యనఁగఁ గూతగాఁ గొనుచును.... అంటే ఎలా ఉంటుందంటారు? లేదా మీరే సవరణ సూచించండి.

    రిప్లయితొలగించండి
  3. నిలబడి చూచెడి వారికి
    కలబడి నట్లుండు నిజము కబడీ యాటన్
    నిలబెట్టి కూత దిరుగుచు
    బలమున నోడించవచ్చు పదిమందైనన్

    రిప్లయితొలగించండి
  4. కబడి యాట జూడ కను విందు గావించు
    ఆడు కొలది మనకు నాయు వుయును
    బెరుగు , కల్ల కాదు పెద్దల వాక్కిది
    ఆడు కొంద మిపుడు రండి మీ రు .

    రిప్లయితొలగించండి
  5. దేహపు స్వస్థత కొఱకై
    యహరహమును బాలల తగు నాటల నాడిం
    చి హృదయముల సౌఖ్యంబుగ
    విహరింపగ జేయవలయు ; విన్నపమిదియే.

    రిప్లయితొలగించండి
  6. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మసోమవారం, జనవరి 21, 2013 11:08:00 AM

    గురువులకు నమస్సులు. గమనించలేదు. యతి స్థానంలో గూత, కూత రెండును కుదరవుగదా! దోషము తెల్పినందులకు ధన్యవాదములు. సవరణానంతరం

    కబడి కబడి కూత గైకొని కూయుచు
    చాక చక్యము తోనాట జరుగు చుండ
    చూడ ముచ్చట గొల్పును చూపరులకు
    పల్లె క్రీడగ ఖ్యాతిని పరచు కొనెను.

    రిప్లయితొలగించండి
  7. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మసోమవారం, జనవరి 21, 2013 12:57:00 PM

    గురువుగారూ! మరల తప్పు చేసాను. మీ సవరణే సరియైనది.
    కబడి కబడి యనఁగఁ గూతగాఁ గొనుచును
    చాక చక్యము తోనాట జరుగు చుండ
    చూడ ముచ్చట గొల్పును చూపరులకు
    పల్లె క్రీడగ ఖ్యాతిని పరచు కొనెను.

    రిప్లయితొలగించండి
  8. ‘ కబడి కబడి ' యనుచు కరములు సాచుచు
    నూపిరి బిగబట్టి యురుకు లిడుచు
    పట్టున బడకుండ ప్రత్యర్థులను దాకి
    గెంతి వచ్చు నతడె గెల్చువాడు

    రిప్లయితొలగించండి
  9. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    "పదిమందైనన్...." పదుగురినైనన్... అంటే బాగుంటుందేమో?
    *
    సుబ్బారావు గారూ,
    బాగుంది మీ పద్యం. అభనందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ ప్రయత్నం ప్రశంసనీయం. అభినందనలు.
    కానీ కందం మొదటి పాదాన్ని గురువుతో, మిగిలిన పాదాలను లఘువుతో ప్రారంభించారు....
    "రహియించు స్వస్థత కొఱకు" అందామా?
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. గురువు గారికి వందనములు ధన్యవాదములు. మీకు పూర్తిగా స్వస్థత చేకూరిందని భావిస్తాను.

    రిప్లయితొలగించండి
  11. డా.ప్రభల రామలక్ష్మి.సోమవారం, జనవరి 21, 2013 11:19:00 PM

    ఇట్టి ఆటలు పట్నాన ఎచటనుండు
    వీధి బాలలకెంతయొ వేడుకిచ్చు
    ఆడునట్టివారికిలను ఆయువిచ్చు
    పగతురతొపోర చక్కని ఫలితమిచ్చు.

    పగతురతొపోర = పోటీలొ

    రిప్లయితొలగించండి
  12. డా. ప్రభల రామలక్ష్మి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    'తో' ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు. అక్కడ 'పగరతో పోర' అందాం.

    రిప్లయితొలగించండి
  13. డా. ప్రభల రామలక్ష్మిమంగళవారం, జనవరి 22, 2013 8:24:00 PM

    జిమ్ములంట తిరిగి జబ్బలు కరిగించు
    వారికేమి తెలుసు బయటి ఆట
    బాడీకి తగినంత బరువుని"చ్చెడి" ఆట
    వీధి వేదికయగు వీధి ఆట
    కూతకూసుకొనుచు కోతి మాదిరిపోయి
    పగవాని పాగాను పట్టెడాట
    పామరులాటని పరిహిసింతురుగాని
    రాష్ట్రానికీయాట రాజు అయ్యె
    ఇట్టి ఆటలు పట్నాన ఎచటనుండు
    వీధి బాలలకెంతయొ వేడుకిచ్చు
    ఆడునట్టివారికిలను ఆయువిచ్చు
    పగఱతోపోర చక్కని ఫలితమిచ్చు

    రిప్లయితొలగించండి