7, జనవరి 2013, సోమవారం

పద్య రచన - 214

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

19 కామెంట్‌లు:

  1. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మసోమవారం, జనవరి 07, 2013 11:13:00 AM

    భావి భారత పౌరుల పాలి క్రూర
    బీదరికమునీ బాలలు బిచ్చమెత్త
    రాజ్య పాలక మండలి రక్ష చేయ
    ధాత(గోరెద చెప్ప విధాన మొకటి.

    రిప్లయితొలగించండి
  2. తనువొక యెముకల గూడును
    కనులన్ దైన్యమ్ము తిండి కరవగుచు కటా
    మనలేని స్థితులు మారుచు
    జనులకు నొనగూరు గాక శాంతి సుఖమ్ముల్

    రిప్లయితొలగించండి
  3. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మసోమవారం, జనవరి 07, 2013 5:35:00 PM

    మలిన మైపోవు చుండె సోమాలియాన
    బాల జీవిత కుసుమాలు బక్క చిక్కి
    పిడికెడంత యన్నము పుట్ట బేల చూచు
    వాని మోముగన మదిని బాధ గలిగె.

    రిప్లయితొలగించండి
  4. తల వ్రాత లెట్లు వ్రాసెనొ
    బలహీనపు కాయమందు ప్రక్కటెముకలే
    సెలవీయన్, విధి వంచిత
    విలపిత బాలలు తరించు పెన్నిధులెకడో!

    రిప్లయితొలగించండి
  5. ఎవరీ బాలకు నుద్ధరించగలరో? యేమాయెనో వీనికిన్?
    భవమే భారముగా దలంచి యితడున్ బల్మారు చేచాచుచున్
    భవతీ భిక్షమటంచు వేడుకొనినన్ పట్టించుకో రెవ్వ రీ
    యవనిన్ పేదరికమ్ము శాపముగదా! యన్యంబు లెన్నుండినన్.

    బక్క చిక్కి పోయె లెక్కకు నందుచు
    శల్యపంక్తి యునికి చాటుచుండె
    తనువు డస్సిపోయె దైన్యంబు పొడచూపె
    చేష్టలుడిగె యెడద చీకిపోయె.

    నోటినుండి యొక్క మాటైన బలుకగా
    శక్తి లేకపోయె, చావలేక
    బ్రతుకుచున్న వాని వంకకు జూచెడు
    ఘనుడొకండు కూడ కానరాడు.

    వేదభూమి యండ్రు, మోదదాయిని యండ్రు
    భరతఖండ మందు బడుగులపయి
    దయను జూపుచుండు ధర్మాత్ములెందరో
    సిద్ధ మన్యమింక చెప్పనేల?

    సర్వజనుల నెపుడు సమదృష్టితో జూచి
    కాచుచుండు నంచు గణుతికెక్కి
    జగతి నేల గూర్చె భగవాను డీరీతి
    పేద మరియు ధనిక భేదములను.

    రిప్లయితొలగించండి
  6. ఆర్యా!
    నా మొదటి పద్యంలోని నాల్గవపాదంలో చివర "అన్యంబు లందెన్నగా" అని చదువవలసినదిగా ప్రార్థన.

    రిప్లయితొలగించండి
  7. ఎముకలు వెలువడగ డొక్క లెండి పోయి
    కనుల నీరెండి కాంతులు కనుమరుగయి
    తినుటకును తిండియె కరవై దీను డగుచు
    చేయి చాపెడు బాలుని చిత్ర మిదియె

    రిప్లయితొలగించండి
  8. cheyi jaapi yaDuga chEyagaa saayammu
    cheyi radikEmi chEya galavu
    chokka jeerNamaaye Dokkalaaguna nEDu
    kaMTi baadha needu kaMTi lOna.

    రిప్లయితొలగించండి
  9. గోలి హనుమచ్ఛాస్త్రిసోమవారం, జనవరి 07, 2013 7:31:00 PM


    చేయి జాపి యడుగ చేయగా సాయమ్ము
    చేయి రాదికేమి చేయ గలవు
    చొక్క జీర్ణమాయె డొక్కలాగున నేడు
    కంటి బాధ నీదు కంటి లోన.

    రిప్లయితొలగించండి
  10. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారూ,
    మీ రెండు పద్యాలూ బాగున్నవి. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    జనులకు శాంతి సుఖాలు ఒనగూరాలని ఆకాంక్షిస్తున్న మీ పద్యం చాలా బాగున్నది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    విధివంచిత బాలల గురించిన మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘ఎకడో’ అనకుండా ‘పెన్నిధు లెటనో/ లేవో’ అందాం.
    *
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
    ఈనాటి పద్యరచన శీర్షికకు మీ ఖండిక తలమానికమై విలసిల్లుతున్నది. అభినందనలు, ధన్యవాదములు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    చిత్రాన్ని స్వభావోక్తితో చక్కగా వర్ణించారు. బాగుంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. భావి భారత పౌరుడు బక్క చిక్కి
    చదువ వలసిన బాల్యంబు చంక నాకి
    చేయి చాపుచు యాచన చేయు చుండె
    బ్రహ్మ లిఖితము గాదన వశమె మనకు ?

    రిప్లయితొలగించండి
  12. ఆకెళ్ళ రామకృష్ణ శాస్త్రిసోమవారం, జనవరి 07, 2013 8:15:00 PM

    తల్లిదండ్రి లేక తల్లడిల్లగనేల
    కన్న తీపి లేని కాంత తల్లి యగునె
    కడుపు కింత కూడు కలుగ జేయు జననియె నాకు
    కన్న తల్లి యౌను గాదె తరచి చూడ.

    రిప్లయితొలగించండి
  13. సుబ్బారావు గారూ,
    మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
    *
    ఆకెళ్ళ రామకృష్ణ శాస్త్రి గారూ,
    మంచి ప్రయత్నం. అభినందనలు.
    మొదటి పాదం తప్ప మిగిలిన పాదాల్లో గణదోషం... మీ పద్యానికి నా సవరణ....
    తల్లిదండ్రి లేక తల్లడిల్లగనేల,
    కన్న తీపి లేని కాంత తల్లి
    యగునె, కడుపు కింత యన్నంబు పెట్టిన
    కన్న తల్లి యౌను గాదె చూడ.

    రిప్లయితొలగించండి
  14. దారి ప్రక్కన నిలుచున్న దైన్యమూర్తి
    అస్థిపంజరమును బోలి యడుగుకొనుచు
    నున్న బాలుని చూపులోనున్నదేమి ?
    క్షేమరాజ్యమా,లేకున్న క్షామ రాజ్య
    మా యటంచు ప్రశ్నించునమాయకతయొ?

    రిప్లయితొలగించండి
  15. కమనీయం గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ సహజ కవి, వారి చదువు ఆంగ్లము, వారి మనఃస్థితి తెలుగు పరిమళింపు గుబాళింపు. ఆఫీసు గుమాస్తాగా ఉద్యోగ జీవిత ప్రారంభం, తెలుగు కవిగా జీవితప్రస్థానం. ఇది వార్ని గూర్చి నాకు తెలిసున్నంతవరకు క్లుప్త వివరణ. పండితలోకం ఈ చిరుతను ఆశీర్వదించు గాత.

    రిప్లయితొలగించండి
  17. అజ్ఞాత గారూ,
    తోపెళ్ళ బాల సుబ్రహ్మణ్య శర్మ గారి గురించి పరిచయ వాక్యాలను వ్రాసినందుకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  18. గురువుగారికి ధన్యవాదములు.తమరి సూచిత సవరణతో నా పద్యం:

    తల వ్రాత లెట్లు వ్రాసెనొ
    బలహీనపు కాయమందు ప్రక్కటెముకలే
    సెలవీయన్, విధి వంచిత
    విలపిత బాలలు తరించు పెన్నిధు లెటనో!
    స్వస్తి .

    రిప్లయితొలగించండి
  19. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మసోమవారం, జనవరి 07, 2013 10:38:00 PM

    అజ్ఞాత గారికి ధన్యవాదములు. మాతృభాషపై మమకారమే పద్యరచనకు ప్రేరణ.తెలుగు సంస్కృతము నేర్చుకునే అవకాశం దొరకలేదు.జీవితం పశ్చిమప్రొద్దుకు పయనిస్తొంది. భగవదేచ్చ.

    రిప్లయితొలగించండి