11, జనవరి 2013, శుక్రవారం

సమస్యాపూరణం - 934 (భారతమున రావణుండు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
భారతమున రావణుండు ప్రౌఢిని జూపెన్.
డా. జొన్నలగడ్డ మృత్యుంజరావు గారి 'కచ్ఛపి' నుండి
సేకరించి పంపిన తోపెళ్ళ బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి ధన్యవాదాలు.

18 కామెంట్‌లు:

 1. వైరమయ భక్తితోనే
  శ్రీరమణీ విభుని వేగ చేరుదు ననుచున్
  వైరమయ భక్తిమఛ్ఛో
  భారతమున రావణుండు ప్రౌఢిమ జూపెన్

  రిప్లయితొలగించండి
 2. కోరుచు మునులను జంపగ
  మీరిన గర్వంబు తోడ మ్లేచ్ఛుల తోడన్
  చేరెను లంకాధీశుడు
  'భారతమున' రావణుండు ప్రౌఢిని జూపెన్.

  రిప్లయితొలగించండి
 3. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మశుక్రవారం, జనవరి 11, 2013 10:29:00 AM

  కౌరవులావహమందున
  భీరువులనగన్ కిరీటి; భీతావహులన్
  సౌరిక మందున జేయగ
  భారతమున, రావణుండు, ప్రౌఢిమ జూపెన్

  రిప్లయితొలగించండి
 4. మీరెను కీచకుడట పర
  దారఁ దలచి,రాము సీతఁదలచినశించెన్,
  మారీచుడుమోక్షముకై
  భారతమున,రావణుండు, ప్రౌఢిమ జూపెన్
  (క్రమాలంకారము)

  రిప్లయితొలగించండి
 5. శ్రీ సుబ్బా రావు గారూ! శుభాశీస్సులు.
  ప్రాస నియమమును మీరు ఎందుకు పాటించరో తెలియదు. మనము చాల పర్యాయములు ఈ విషయమును చర్చించు కొనినాము. మరియొక్క సారి చూచి మీరు ప్రాసను సవరించండి. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 6. శ్రీరామానందుని ఘన
  ధారావాహికనఁ బాత్రధరియించి రహిన్,
  బోరాడెన్నికలందునఁ
  భారతమున రావణుండు ప్రౌఢిమ జూపెన్.

  రిప్లయితొలగించండి
 7. శూరు డభిమన్యు డొకడె
  భారతమున, రావణుండు ప్రౌడిన్ జూపెన్
  శ్రీ రామాయణమున, గన
  వీరలిరువురున్ బహుబల వీరోత్తములే.

  రిప్లయితొలగించండి
 8. ఆరయ లంకా ధీ శుడు
  నేరుగ మఱి రాము జేర మోక్షము కొఱకున్
  వై రవ భావము గ లుగుచు
  భారతమున రావణుండు ప్రౌ డిని జూపెన్

  రిప్లయితొలగించండి
 9. శ్రీరామ బాణ తతికిన్
  వైరులు యమసదనమునకు బారులు తీరన్
  ధీరుడు ప్రబల రణ క్షో
  భారతమున రావణుండు ప్రౌఢిని జూపెన్

  ప్రబల రణ క్షోభా రతమున = గొప్ప అలజడితో కూడిన యుద్ధములో

  రిప్లయితొలగించండి
 10. వారిజ ముఖి మండోదరి
  కోరిక మీర సరసముగ కూడిన వేళన్
  మారుని వలె శోభన శో
  భా రతమున రావణుండు ప్రౌఢిని జూపెన్!!

  రిప్లయితొలగించండి
 11. కోరుటకు హరుని వరములు
  ఘోర తపంబు లొనరించి క్రూరాత్ముండై
  మీరుచు స్తోత్రముల వర వి
  భా రతమున రావణుండు ప్రౌఢిని జూపెన్

  రిప్లయితొలగించండి
 12. రామకృష్ణ గారూ,
  మూడవపాదంలో గణదోషం. "పోరాడె నెన్నికలలో" అంటే సరి.

  రిప్లయితొలగించండి
 13. ఆ రావణు సీతను గని
  కోరెను యెటు లైన పొందు గోరిక మీరన్ !
  పౌరుష మున కీచకు వలె
  భారత మున రావణుండు ప్రౌఢిమ జూపెన్ ! !

  రిప్లయితొలగించండి
 14. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మశుక్రవారం, జనవరి 11, 2013 8:14:00 PM

  అయ్యా! ఒక సందేహము. భారత గాధ కంటే రామాయణ గాధ బహు ప్రాచీనము. కనుక రామాయణ ఘట్టమును భారతంతో పోల్చవచ్చు గాని భారత ఘట్టాన్ని రామాయణంతో పోల్చదగునా!మహాకవి కాళిదాసుని షేక్ స్పియర్ తో పోల్చినట్లు.

  రిప్లయితొలగించండి


 15. వారిధిని దాటి ,ధరణిని
  వీరత్వమ్మున నరేంద్రవీరులనెల్లన్
  పోరాటమున జయించుచు
  భారతమున రావణుండు ప్రౌఢిమ జూపెన్.

  (రావణుడు భరతవర్షంలో రాజులెందరినో జయించాడు కదా.కార్తవీర్యుని తప్ప.)

  రిప్లయితొలగించండి
 16. వారిధిని దాటి ,ధరణిని
  వీరత్వమ్మున నరేంద్రవీరులనెల్లన్
  పోరాటమున జయించుచు
  భారతమున రావణుండు ప్రౌఢిమ జూపెన్.

  (రావణుడు భరతవర్షంలో రాజులెందరినో జయించాడు కదా.కార్తవీర్యుని తప్ప.)

  రిప్లయితొలగించండి
 17. శ్రీ రామాయణ మందున;
  ధారావాహికల దూర దర్శనమున నా
  ధీరులు భీష్ముడు కర్ణుడు
  భారతమున; రావణుండు ప్రౌఢిని జూపెన్

  రిప్లయితొలగించండి