మిత్రులందరకు శుభాశీస్సులు.మీ రచనలను అన్నింటినీ చూచు చున్నాను. అందరికి అభినందనలు. స్వస్తి.
సంధిని గూర్చగ మునిజన బంధుడు కౌరవుల జేరి పలుకగ సూక్తుల్ అంధుని కొడుకుల చేతను బంధములను దొలఁచు విభుఁడు బంధింపబడెన్.
బంధించె తల్లి నీలపుకంధరదేహుని, గజేంద్రు గాచిన వానిన్.దంధనమౌ సంసారపుబంధములను దొలఁచు విభుఁడు బంధింపబడెన్. నీలపుకంధరదేహుడు= నీలిమబ్బు రంగు దేహుడుదంధనము = అశాశ్వతము
బంధమె సంసారము నిలబంధితులము మనము నిచట భవ బంధము చేన్బంధముల నూ డ్చ గోరగబంధములను దొలచు విభుడు బంధింప బడెన్
సందిటనొదగన్ రయముననందాలనుయారగించనాభరణములన్బొందెల లాగుచు పత్నికిబంధములను దొలఁచు విభుడు బంధింప బడెన్!(బంధింప బడెన్ = కౌగిట చిక్కెన్)భక్తి రసము పండిందని, పతి సతుల శృంగారాన్ని స్పృశించాను. అన్యదా భావించవలదు. స్వస్తి .
సంధింపకనే చక్రముసింధురమును గాచె వెడలి శ్రీహరి యటులన్బంధితు డయ్యెను భక్తికి బంధములను దొలఁచు విభుఁడు బంధింపబడెన్.
సందిట బందీ జేయుచు నందముగా ప్రేమ పంచు నల మేని దొరన్ ! బంధించె తల్లి రోటను బంధములను దొలఁ చు విభుఁ డు బంధింప బడెన్ !
బంధుజన, గోపికాసంబంధితుల, మురారినెడ నెపంబులు వినగన్ధూంధా మ్మని రోట నమచెబంధములను దొలఁచు విభుఁడు బంధింపబడెన్ !
సంధింప మేఘనాథుడు సింధురరాజమ్ము వంటి శ్రీరాముండున్ బంధుర నాగాస్త్రము చే బంధములను దొలచు విభుడు బంధింప బడెన్
నిన్నటి సమస్యకు చక్కని పూరణలను అందించిన కవిమిత్రులు.....గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,లక్ష్మీదేవి గారికి,సుబ్బారావు గారికి,నాగరాజు రవీందర్ గారికి,రాజేశ్వరి అక్కయ్య గారికి,తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి,కమనీయం గారికిఅభినందనలు... ధన్యవాదాలు.*లక్ష్మీదేవి గారూ,'నీలపు...' ను 'శ్యామల' అంటే?*సుబ్బారావు గారూ,సంసారము నిల, మనము నిచట.... ఇక్కడ నుగాగమం రాదు...బంధమె సంసార మ్మిలబంధితులము మన మిచటను.... అందాం.
గురువు గారు,చక్కని సవరణకు ధన్యవాదాలు.మీ ఆరోగ్యం చక్కబడినదనుకుంటాను.
అంధులలోనను జీవుల రంధులలో దేహపు నవ రంధ్రమ్ములలో సంధించి పొంచి చూచుచు బంధములను దొలఁచు విభుఁడు బంధింపబడెన్
"మన్మనా భవ మద్భక్తో..."బంధుల రిపులను జొచ్చుచు సంధిని జేయంగ లేక సంతాపమునన్ గంధము పూసిన భక్తుల బంధములను దొలఁచు విభుఁడు బంధింపబడెన్
బాంధవుడా మాధవునేసంధింపగ మన్మథుండు, సల్లాపములన్బంధింపంగను చెలులేబంధములను దొలఁచు విభుఁడు బంధింపబడెన్!జిలేబి
మిత్రులందరకు శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ రచనలను అన్నింటినీ చూచు చున్నాను. అందరికి అభినందనలు.
స్వస్తి.
సంధిని గూర్చగ మునిజన
రిప్లయితొలగించండిబంధుడు కౌరవుల జేరి పలుకగ సూక్తుల్
అంధుని కొడుకుల చేతను
బంధములను దొలఁచు విభుఁడు బంధింపబడెన్.
బంధించె తల్లి నీలపు
రిప్లయితొలగించండికంధరదేహుని, గజేంద్రు గాచిన వానిన్.
దంధనమౌ సంసారపు
బంధములను దొలఁచు విభుఁడు బంధింపబడెన్.
నీలపుకంధరదేహుడు= నీలిమబ్బు రంగు దేహుడు
దంధనము = అశాశ్వతము
బంధమె సంసారము నిల
రిప్లయితొలగించండిబంధితులము మనము నిచట భవ బంధము చేన్
బంధముల నూ డ్చ గోరగ
బంధములను దొలచు విభుడు బంధింప బడెన్
సందిటనొదగన్ రయమున
రిప్లయితొలగించండినందాలనుయారగించనాభరణములన్
బొందెల లాగుచు పత్నికి
బంధములను దొలఁచు విభుడు బంధింప బడెన్!
(బంధింప బడెన్ = కౌగిట చిక్కెన్)
భక్తి రసము పండిందని, పతి సతుల శృంగారాన్ని స్పృశించాను. అన్యదా భావించవలదు. స్వస్తి .
సంధింపకనే చక్రము
రిప్లయితొలగించండిసింధురమును గాచె వెడలి శ్రీహరి యటులన్
బంధితు డయ్యెను భక్తికి
బంధములను దొలఁచు విభుఁడు బంధింపబడెన్.
సందిట బందీ జేయుచు
రిప్లయితొలగించండినందముగా ప్రేమ పంచు నల మేని దొరన్ !
బంధించె తల్లి రోటను
బంధములను దొలఁ చు విభుఁ డు బంధింప బడెన్ !
బంధుజన, గోపికాసం
రిప్లయితొలగించండిబంధితుల, మురారినెడ నెపంబులు వినగన్
ధూంధా మ్మని రోట నమచె
బంధములను దొలఁచు విభుఁడు బంధింపబడెన్ !
రిప్లయితొలగించండిసంధింప మేఘనాథుడు
సింధురరాజమ్ము వంటి శ్రీరాముండున్
బంధుర నాగాస్త్రము చే
బంధములను దొలచు విభుడు బంధింప బడెన్
నిన్నటి సమస్యకు చక్కని పూరణలను అందించిన కవిమిత్రులు.....
రిప్లయితొలగించండిగోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
లక్ష్మీదేవి గారికి,
సుబ్బారావు గారికి,
నాగరాజు రవీందర్ గారికి,
రాజేశ్వరి అక్కయ్య గారికి,
తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి,
కమనీయం గారికి
అభినందనలు... ధన్యవాదాలు.
*
లక్ష్మీదేవి గారూ,
'నీలపు...' ను 'శ్యామల' అంటే?
*
సుబ్బారావు గారూ,
సంసారము నిల, మనము నిచట.... ఇక్కడ నుగాగమం రాదు...
బంధమె సంసార మ్మిల
బంధితులము మన మిచటను.... అందాం.
గురువు గారు,
రిప్లయితొలగించండిచక్కని సవరణకు ధన్యవాదాలు.
మీ ఆరోగ్యం చక్కబడినదనుకుంటాను.
అంధులలోనను జీవుల
రిప్లయితొలగించండిరంధులలో దేహపు నవ రంధ్రమ్ములలో
సంధించి పొంచి చూచుచు
బంధములను దొలఁచు విభుఁడు బంధింపబడెన్
"మన్మనా భవ మద్భక్తో..."
రిప్లయితొలగించండిబంధుల రిపులను జొచ్చుచు
సంధిని జేయంగ లేక సంతాపమునన్
గంధము పూసిన భక్తుల
బంధములను దొలఁచు విభుఁడు బంధింపబడెన్
రిప్లయితొలగించండిబాంధవుడా మాధవునే
సంధింపగ మన్మథుండు, సల్లాపములన్
బంధింపంగను చెలులే
బంధములను దొలఁచు విభుఁడు బంధింపబడెన్!
జిలేబి