ఒక విధంగా చెప్పాలంటే ఈ సమస్యలో ‘సమస్య’ లేదేమో! కేవలం పాదపూరణ మాత్రమే. చక్కని పూరణలు చేసిన కవిమిత్రులు.... పండిత నేమాని వారికి, సహదేవుడు గారికి, గన్నవరపు నరసింహ మూర్తి గారికి, రాజేశ్వరి అక్కయ్య గారికి, లక్ష్మీదేవి గారికి, సుబ్బారావు గారికి, హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి, నాగరాజు రవీందర్ గారికి, తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి, కమనీయం గారికి, మిస్సన్న గారికి, అభినందనలు, ధన్యవాదములు. * రాజేశ్వరక్కయ్యా, పద్యాన్ని యడాగమంతోనే ప్రారంభించారే! * లక్ష్మీదేవి గారూ, ‘పొర’లో సాధురేఫమే. శకటరేఫం లేదు. * తోపెల్ల వారూ, ‘తత్త్వాన నున్నది’ అనవలసి ఉంటుంది కదా... అక్కడ ‘తత్త్వం బున్నది’ అన్నా సరిపోతున్నది.
గురువుగారూ! నమస్సులు.మొదటి సూచనలో " ‘తత్త్వాన నున్నది’ అనవలసి ఉంటుంది కదా... అక్కడ ‘తత్త్వం బున్నది’ అన్నా సరిపోతున్నది." అని చెప్పుటచే నేను పొరబడితిని. ఇతఃపూర్వం మీరు నుడివినట్లు ధన్యవాదములు తెల్పుచూ సవరించిన తరువాత
ఉన్నది యొకటే సర్వము
రిప్లయితొలగించండిసన్నయమున నొదవు నంట సాధన వలనన్
క్రన్నన నా కెరిగింపవె
ఉన్నది కన్పట్టునొక్కొ యోగివరేణ్యా!
కన్నయ్య 'గీత' చదివిన
రిప్లయితొలగించండిఛిన్నంబై సంశయాలు శ్రేయము గూర్చున్
పిన్నలు పెద్దలు తెలియగ
నున్నది కన్పట్టునొక్కొ యోగివరేణ్యా!
కన్నది కలవలె భ్రమ యని
రిప్లయితొలగించండివిన్నది నిజమైన నెడల, విన్నాణముతో
పన్నిన చిత్తము గురి నిడి
ఉన్నది కన్పట్టు నొక్కొ యోగివరేణ్యా !
యెన్నని తెలుపను నీకిక
రిప్లయితొలగించండిసన్నగ మదినెంతొ దొలిచి సౌవీర మవన్ !
కన్నుల కింపగు గారడి
ఉన్నది కన్పట్టు నొక్కొ యోగి వరేణ్యా !
సౌవీరము = పాషాణము
కన్నుల కమ్మిన పొఱలును,
రిప్లయితొలగించండిమిన్నును గానని పొగఱును,మీఱిన చేష్టల్
చిన్నగ తగ్గించుకొనగ
నున్నది కన్పట్టు నొక్కొ యోగివరేణ్యా!
ఉన్నది యొకటే జగమున
రిప్లయితొలగించండిమన్నున మఱి మిన్ను నందు మఱు గున నుండున్
పన్నుగ సాధన జేసిన
ఉన్నది కన్పట్టు నొక్కొ యోగి వరేణ్య !
మన్నించుము నా యజ్ఞత
రిప్లయితొలగించండినన్నింటను నీవె కలవు హరి! కావుమయా
నన్నంచు వేడుచుండిన
నున్నది కన్పట్టునొక్కొ యోగివరేణ్యా!
ఉన్నది యొకటే జగమున
రిప్లయితొలగించండిమన్నున మఱి మిన్ను నందు మఱు గున నుండున్
పన్నుగ సాధన జేసిన
ఉన్నది కన్పట్టు నొక్కొ యోగి వరేణ్యా !
ఉన్నది యొకటే బ్రహ్మము
రిప్లయితొలగించండికన్నుల కగపడదు కాంచ కర్మఫలమునన్
ఉన్నదిదె ‘నేతి నేతి ' గ
నున్నది కన్పట్టు నొక్కొ యోగివరేణ్యా !
ఉన్నది యన్నది సత్యము
రిప్లయితొలగించండివెన్నుని వేడగ నఘములు వీడున నుచునే
నెన్నగ నిశ్చల తత్త్వా
నున్నది కన్పట్టు నొక్కొ యోగివరేణ్యా!
మిత్రులు రవీందర్ గారు చాల బాగ సెలవిచ్చారు బ్రహ్మ పదార్థమును. అభినందనలు.
రిప్లయితొలగించండిధన్యవాదములు శర్మ గారూ !
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమిస్సన్న గారూ! నమస్తే! 2పాదాంత గణం చూడండి. అది సగణం గాని, గా గాని కావలె గదా? 3 పా. గణాలు సరిపోతే ప్రాస దెబ్బతిన్నది. పరిశీలించ గోరెదను.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిఉన్నదొ లేదో యనుచును ,
నన్ననుమానమ్ము పీడనమ్మొనరింపన్
బన్నుగ ధ్యానము చేసిన
నున్నది కనుపట్టునొక్కొ యోగివరేణ్యా.
తోపెల్ల సుబ్రహ్మణ్య శర్మగారూ అవును నా పూరణలో దోషం ఉన్నది. చెప్పినందుకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిఅన్నారావనె యతితో
రిప్లయితొలగించండికన్నుల కీ లేపనంబు గమ్మున పూయన్
చిన్నన్న యింటిలో ధన-
మున్నది కన్పట్టునొక్కొ యోగివరేణ్యా?
ఒక విధంగా చెప్పాలంటే ఈ సమస్యలో ‘సమస్య’ లేదేమో! కేవలం పాదపూరణ మాత్రమే. చక్కని పూరణలు చేసిన కవిమిత్రులు....
రిప్లయితొలగించండిపండిత నేమాని వారికి,
సహదేవుడు గారికి,
గన్నవరపు నరసింహ మూర్తి గారికి,
రాజేశ్వరి అక్కయ్య గారికి,
లక్ష్మీదేవి గారికి,
సుబ్బారావు గారికి,
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
నాగరాజు రవీందర్ గారికి,
తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి,
కమనీయం గారికి,
మిస్సన్న గారికి,
అభినందనలు, ధన్యవాదములు.
*
రాజేశ్వరక్కయ్యా,
పద్యాన్ని యడాగమంతోనే ప్రారంభించారే!
*
లక్ష్మీదేవి గారూ,
‘పొర’లో సాధురేఫమే. శకటరేఫం లేదు.
*
తోపెల్ల వారూ,
‘తత్త్వాన నున్నది’ అనవలసి ఉంటుంది కదా... అక్కడ ‘తత్త్వం బున్నది’ అన్నా సరిపోతున్నది.
గురువులకు నమస్సులు.పదము కుదరలేదుమీ సూచనకు ధన్యవాదములు. సవరించిన తరువాత
రిప్లయితొలగించండిఉన్నది యన్నది సత్యము
వెన్నుని వేడగ నఘములు వీడున నుచునే
నెన్నగ నిశ్చల తత్త్వాన
నున్నది కన్పట్టు నొక్కొ యోగివరేణ్యా!
తోపెల్ల వారూ,
రిప్లయితొలగించండిమూడవ పాదంలో ‘తత్త్వాన’ అంటే గణదోషం.. తత్త్వము శబ్దానికి పురులు అనే పర్యాయపదం ఉంది. ‘పురులం దున్నది.." అందామా?
గురువుగారూ!తత్త్వం బున్నది అన్నా గా కనుక అన్వవమేమైనా కుదరదా! సందేహము తీర్పగలరు.
రిప్లయితొలగించండిశర్మ గారూ,
రిప్లయితొలగించండిముందు ‘తత్త్వానున్నది’ అన్నారు. తరువాత ‘తత్త్వాన నున్నది’ అని సవరించారు. ‘తత్త్వంబున్నది’ అనలేదే...
గురువుగారూ! నమస్సులు.మొదటి సూచనలో "
రిప్లయితొలగించండి‘తత్త్వాన నున్నది’ అనవలసి ఉంటుంది కదా... అక్కడ ‘తత్త్వం బున్నది’ అన్నా సరిపోతున్నది."
అని చెప్పుటచే నేను పొరబడితిని. ఇతఃపూర్వం మీరు నుడివినట్లు ధన్యవాదములు తెల్పుచూ
సవరించిన తరువాత
ఉన్నది యన్నది సత్యము
వెన్నుని వేడగ నఘములు వీడున నుచునే
నెన్నగ నిశ్చల పురులం
దున్నది కన్పట్టు నొక్కొ యోగివరేణ్యా!
ఉన్నది, లేదని, మనసున
రిప్లయితొలగించండినున్నది దైవంబు కనగ నొక సందేహం
బున్నది మీపై నమ్మక
మున్నది కన్పట్టు నొక్కొ యోగివరేణ్యా!