రంగస్థల సినీ నటుడు, గాయకుడు, సహృదయుడు, అన్నదాత అయిన చిత్తూరు నాగయ్య గారిని గురించి మంచి పద్యాలు చెప్పిన కవిమిత్రులు.... లక్ష్మీదేవి గారికి, పండిత నేమాని వారికి, తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి, రాజేశ్వరి అక్కయ్య గారికి, గోలి హనుమచ్ఛాస్త్రి గారికి, సుబ్బారావు గారికి హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి, సహదేవుడు గారికి, అభినందనలు, ధన్యవాదములు...
పరమ భక్తియుతుల పరమార్థసాధన
రిప్లయితొలగించండిచలన చిత్రసీమ చక్కగాను
చూపియించి తనదు శోభ పెంచుకొనగ
తోడుపడిన వారు తొల్లి గలరు.
నాగయ్య నటించె బళా
రిప్లయితొలగించండిభాగవతోత్తమునిగ చాల పాత్రలలోనన్
యోగివరేణ్యసముండని
బాగుగ వినుతింతు వాని భవ్య చరిత్రన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅయ్య వేమయ్య త్యాగరాజయ్య భక్త
రిప్లయితొలగించండిరామ దాసయ్య పోతయ్య రంగు హంగు
చిత్ర రంగాన పాత్రలు చేసి చనిన
కీర్తి శేష నాగయ్యకు కేలు మోడ్తు.
చిత్ర సీమ యందు చిత్తూరు నాగయ్య
రిప్లయితొలగించండిభక్త పోత నంచు ముక్తి నొంది
భక్తి పాత్ర లందు బహు ప్రీతి పాత్రమై
భక్త జనుల మదిని రక్తి నొందె
పాత్రమెరుగుచు నటియించు పాత్రధారి
రిప్లయితొలగించండిగానమందున పేరున్న గాత్రధారి
భక్తి పాత్రల కతడేమొ బాగ పేరు
అవును చిత్తూరు నాగయ్య యతని పేరు
చిత్తూరు వంశ మండన !
రిప్లయితొలగించండిసత్తా జూపించి తీవు సరసపు నటనన్
చిత్రాల నటన తత్పర !
బత్తిని నాగయ్య ! నీకు బ్రణతు లొనర్తున్
నాడు యశమునందె నాగయ్య నటుడిందు
రిప్లయితొలగించండిసర్వజగతిలోన సములికెందు
కానరారు నిజము ఘనుడెన్నగా నందు
జనుల కతని నటన కనులవిందు.
భాగవత కర్త పోతన్నె భక్త రామ
రిప్లయితొలగించండిదాసు, కీర్తనలను పాడి త్యాగ రాజు
లవకుశులఁబెంచు వాల్మీకి రత్నమతడె
నటుడు నాగయ్య కేచెల్లు పటిమ మెరయ
భాగవత కర్త పోతన్నె భక్త రామ
రిప్లయితొలగించండిదాసు, కీర్తనలను పాడి త్యాగ రాజు
లవకుశులఁబెంచు వాల్మీకి రత్నమతడె
నటుడు నాగయ్య కేచెల్లు పటిమ మెరయ
రంగస్థల సినీ నటుడు, గాయకుడు, సహృదయుడు, అన్నదాత అయిన చిత్తూరు నాగయ్య గారిని గురించి మంచి పద్యాలు చెప్పిన కవిమిత్రులు....
రిప్లయితొలగించండిలక్ష్మీదేవి గారికి,
పండిత నేమాని వారికి,
తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి,
రాజేశ్వరి అక్కయ్య గారికి,
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
సుబ్బారావు గారికి
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
సహదేవుడు గారికి,
అభినందనలు, ధన్యవాదములు...
రిప్లయితొలగించండిభక్తి పాత్రల నద్భుత భంగి దాల్చు
ఆంధ్ర ''పాల్ముని ''యనుచు బ్రఖ్యాతిగాంచె
మధురగాయకుండును,సర్వమాన్య చరితు
డతడె చిత్తూరునాగయ్య యనగ బరగు.
కమనీయం గారూ,
రిప్లయితొలగించండినాగయ్య విశిష్టతను తెలుపుతున్న మీ పద్యం బాగుంది. అభినందనలు.