15, జనవరి 2013, మంగళవారం

పద్య రచన - 222

కవిమిత్రులకు కనుమ పండుగ శుభాకాంక్షలు
కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

14 కామెంట్‌లు:

  1. కనుమన రైతుల పండుగ
    కను పించవు వారి కనుల కాంతులు ప్రభుతా
    విను వారి గోడు నిప్పుడు
    కను మన రైతులకు మేలు గట్టిగ చేయన్.

    రిప్లయితొలగించండి
  2. కనుడిది చక్కని పండుగ
    "కనుమ" యనుచు బిలుతుమంచు కర్మఠులగుచున్
    మనకర్షకులొనరించెడి
    ఘనమగు పశుపూజ నిందు గాంచగ వచ్చున్.

    రిప్లయితొలగించండి
  3. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మమంగళవారం, జనవరి 15, 2013 9:01:00 AM

    కంటిమి యొకనాడు కర్షక జనులంత
    ధాన్య రాశులతోడ ధగ ధగ మన
    కంటిమి యొకనాడు క్రొత్త బట్టల ఠీవి
    ప్రతియింట ప్రత్యేక పల్లెలందు
    కంటిమి యొకనాడు యింటింట పలకరిం
    పుల పులకింతల పూలమాల
    కంటిమి యొకనాడు కనుమ పండుగ నాడు
    యడ్ల పందెపు జోరు నినుమ డింప
    కాల మహిమ గాగ కనలేము వినలేము
    పల్లె సొబగులెచట పశుపద ఘట్టనల్
    కనుమరుగగు చుండె కర్షక హర్షముల్
    ప్రభుత కాన రాదు వారిని కావగ.

    రిప్లయితొలగించండి
  4. శర్మ గారు,
    కంటిమి-క్రొత్త
    యడ్ల -నినుమ
    యతి సరిపోయిందంటారా?

    పాడి పశువుల, పొలమున పంటకొఱకు
    పాటు పడు పశువుల కెల్ల పరగ పూజ
    సలిపి సంతసింపగ భూరి జనులు జరుపు
    కొనెడు పండుగ- కనుమయె గొప్ప దినము.

    రిప్లయితొలగించండి
  5. శ్రీ తోపెల్ల శర్మ గారు క్రొత్త ఛందస్సులో తేటవెలదులు ఆటగీతులు వ్రాస్తూ యుంటారు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  6. కనుమన రైతుల పండుగ
    కనుముర జోడెడ్ల నచట కనులకు నింపౌన్
    వినయము తోడుత నుండెను
    మన రైతులు సేయు పూజ మానుట వరకున్ .

    రిప్లయితొలగించండి
  7. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  8. హలము మెడలపై దాలిచి యన్నదాత
    కనుగు బంటులై యోర్మితో నహరహమ్ము
    రత్నగర్భను డుల్చి సారమ్ము వెలికిఁ
    దీయు వృషభమ్ములనుఁ బ్రస్తుతింతు బేర్మి !


    నింగి గలట్టి సూర్యు డవనీతల మొక్కెడ దర్పణంబుగా
    బంగరు కాంతులీన గనుపట్టెను దా ప్రతిబింబ రూపియై
    రంగుల రంగవల్లుల - తిరంబుగ దివ్య రథంబుపైన గే
    హాంగణ సీమలందు కనుమా , కనుమన్ , విలసత్స్వరూపుడై !!!

    ( ధరణీ తలమంతా బంగారు కాంతులీనుతూ ఒక స్వచ్చమైన అద్దము వలె మారిపోగా , పైన నింగిలోని సూర్య బింబం , విలసత్స్వరూపుడై , ప్రతిబింబము వోలె - కనుమ నాడు ప్రతి ఇంటి ముందూ అందం గా రంగు రంగుల్లో తీర్చిదిద్దబడిన ముగ్గుల్లో కొలువై ఉన్నాడు కనుము !!! కనుము నాడు సూర్యుని రథం ముగ్గు వేయడం ఒక ఆచారం , అదే ఇక్కడ సూచించబడింది !!! )

    రిప్లయితొలగించండి
  9. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మమంగళవారం, జనవరి 15, 2013 12:58:00 PM

    శ్రీ పండితులవారికి, శ్రీమతి లక్ష్మీదేవిగారికి నమస్సులు.మతిమందగించి ఆట తేట ల పోటు తగులుచున్నది. దోషము తెల్పినందులకు ధన్యవాదములు. ఎడ్లు లోని ఎ నకు ఇనుమడించు లోని ఇ కి యతి సరిపోయినదని నాభావన. సవరణతో
    కంటిమి యొకనాడు కర్షక జనులంత
    ధాన్య రాశులతోడ ధగ ధగ మన
    కంటిమి యొకనాడు కాంతలకాంతులు
    ప్రతియింట ప్రత్యేక పల్లెలందు
    కంటిమి యొకనాడు యింటింట పలకరిం
    పుల పులకింతల పూలమాల
    కంటిమి యొకనాడు కనుమ పండుగ నాటి
    యడ్ల పందెపు జోరు నినుమ డింప

    కాల మహిమ గాగ కనుమ పర్వదినాన
    పల్లె సొబగు లెచట వరి పొలంబు
    కనుమ రుగగు చుండె కర్షక హర్షముల్
    ప్రభుత కాన రాదు వారిని కావగ.

    రిప్లయితొలగించండి
  10. యెద్దుల పండుగ యనుచును
    ముద్దుగ యా రైతు లంత ముచ్చట దీరన్ !
    నిద్దుర లేచిన వేకువ
    నుద్దీపింపగ పూజలు చేతు రొద్దీక మీరన్ !

    రిప్లయితొలగించండి
  11. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మమంగళవారం, జనవరి 15, 2013 10:03:00 PM

    నేదునూరి రాజేశ్వరిగారూ! నమస్తే. ఆఖరి పాదం గణాలు సరిచూడండి.

    రిప్లయితొలగించండి
  12. కనుమ పండుగ విశిష్టతను తెలుపుతూ చక్కని పద్యాలను రచించిన కవిమిత్రులు....
    గోలి హనమచ్ఛాస్త్రి గారికి,
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
    తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    సుబ్బారావు గారికి,
    డా. విష్ణునందన్ గారికి,
    రాజేశ్వరి అక్కయ్యకు
    అభినందనలు, ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  13. ఎద్దుల కాడిని వీడగ
    యిద్ధర ట్రాక్టరు పొలముల కేగుచు దున్నన్!
    యెద్దొద్దుయావె మేలని
    బుద్ధిఁదలఁచ లింగ బేధమున్నత మగునే?

    రిప్లయితొలగించండి
  14. ఎద్దుల కాడిని వీడగ
    యిద్ధర ట్రాక్టరు పొలముల కేగుచు దున్నన్!
    యెద్దొద్దుయావె మేలని
    బుద్ధిఁదలఁచ లింగ బేధమున్నత మగునే?

    రిప్లయితొలగించండి