12, జనవరి 2013, శనివారం

సమస్యాపూరణం - 935 (మూడు పూవులు, నారు కాయలు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
మూడు పూవులు, నాఱు కాయలు, ముప్పదాగు ముచ్చటల్.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

14 కామెంట్‌లు:

 1. కవిమిత్రులకు నమస్కృతులు.
  అసలే జ్వరం, కీళ్ళనొప్పులతో బాధ... ఆపై నిన్నటినుండి కిడ్నీలోని రాయివల్ల భరించలేని వేదన... అందువల్ల పూరణలపై, పద్యాలపై స్పందంచలేక పోతున్నాను... దయచేసి పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి.

  రిప్లయితొలగించండి
 2. వేడుచుంటిని సాదరమ్ముగ ప్రేమరూపిణి వాణి నీ
  నీడ జేరుచు వాక్పటుత్వము స్నిగ్ధ భావములీయ నీ
  వాడ నను గృప జూచుచో నికపైని నా కవితా వనిన్
  మూడు పూవులు నారు కాయలు ముప్పదారగు ముచ్చటల్

  రిప్లయితొలగించండి
 3. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మశనివారం, జనవరి 12, 2013 10:36:00 AM

  మూడు మర్డరు లారురేపులు ముప్పదారుగ కేసులున్
  మూడు సైటులారు మందికి మోసపుచ్చుచు నమ్మగన్
  కీడు బాపెడు రేడు లేడిట కీచకాధము ద్రుంచగన్
  మూడు పూవులు, నాఱు కాయలు, ముప్పదాఱగు ముచ్చటల్

  రిప్లయితొలగించండి
 4. వాడవాడల హర్షదీప్తియు, వైభవంబులు కూర్చుచున్
  వాడు వీడను భేదముంచక భాగ్యరేఖలు పంచి కా
  పాడు వాడయి వేంకటేశుడు వాసముండగ నెల్లెడన్
  మూడుపూవులు నారుకాయలు ముప్పదారగు ముచ్చటల్.

  రిప్లయితొలగించండి
 5. నేడు భారతదేశ సంపద నేతలున్ అధికారులున్
  కూడ బెట్టిరి దోసి మిక్కిలి కోట్లు కోట్లవి నీతితో
  నాడు క్షేమము గోరి యందరు న్యాయవర్తనులైనచో
  మూడు పువ్వులు, నారు కాయలు ,ముప్పదారగు ముచ్చటన్.

  రిప్లయితొలగించండి 6. అయ్యా,శంకరయ్యగారూ,ఈసారి సమస్యాపూరణగాక,మీ ఆరోగ్యసమస్యగురించిరాస్తున్నాను. గాంధీహాస్పటల్ లో మంచి కిడ్నీ స్పెషలిస్టు ఉన్నారు.మా అబ్బాయికి మిత్రుడు.మీకు మంచి చికిత్స జరగగలదు.మా అబ్బాయి ప్రస్తుతం గాంధీ హాస్పటల్ కి దగ్గరలో ఉన్నాడు.అతనితోమాట్లాడాను.కిడ్నీస్పెషలిస్టు ద్వారా ట్రేట్మెంట్ తీసుకోవచ్చును.
  మా అబ్బాయి పేరు డాక్టర్ యం.సురేంద్ర నెహ్రూ. M.D. CELL.PH.NO.9963721999. మీరు పైనంబర్ లో అతనిని కాంటాక్టు చేసి నా పేరు ,మీ పేరు చెప్పితే మీకు సాయం చేయగలడు.మిగతా వివరాలు అతనిద్వారా తెలుసుకొనవచ్చును.
  గవర్నమెంట్ హాస్పటల్ అని చిన్న చూపు అవసరం లేదు.నేను గవర్నమెంట్ డాక్టర్గా ఎంతోమందికి నా స్పెషాలిటీ లో బాగు చేసాను.గాంధీహాస్పటల్, (సికింద్రాబాద్) లో మంచి facilities ఉన్నవి.ఈరోజే మా అబ్బాయికి ఫోన్ చేసి కనుక్కొండి.అలా అయితే మీకు ఉచితంగా గాని .తక్కువలోగాని చికిత్స లభిస్తుంది.corporate Hospital కే వెళ్ళనవసరం లేదు.మీకు ఆరోగ్యశ్రీ కూడా ఉన్నదనుకొంటాను.నా ఫొన్ నంబర్లు దిగువ ఇస్తున్నాను.

  Dr.M.V.Ramanarao.
  Land no.(08942) 229839
  mobile.no. 9849696511
  namastea, kamaneeyam.

  రిప్లయితొలగించండి
 7. నేడు చూడుడు సెల్లు ఫోనుల నెందఱో కొనుచుండగన్
  వాడకమ్ములు హెచ్చె గావున వర్తకమ్ములె పెర్గె గా !
  చూడు మంతట షాపులే గద ! సోని నోకియ ఫోనులే !
  మూడు పూవులు నారు కాయలు ముప్పదారగు ముచ్చటల్

  రిప్లయితొలగించండి
 8. గురువు గారికి వందనములు. టైపాటును గమనించ ప్రార్థన.
  ..... వాడ నన్ గృప...

  శర్మ గారూ ! మీ పద్యం రెండవ పాదమును మరొక్క సారి సరిచూసుకొనమని మనవి.

  రిప్లయితొలగించండి
 9. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మశనివారం, జనవరి 12, 2013 9:14:00 PM

  మిత్రులు రవీందర్ గార్కి గణపాటు తెల్పినందులకు ధన్యవాదములు. సవరణానంతరం
  మూడు మర్డరు లారురేపులు ముప్పదారుగ కేసులున్
  మూడు సైటులనారు మందికి మోసపుచ్చుచు నమ్మగన్
  కీడు బాపెడు రేడు లేడిట కీచకాధము ద్రుంచగన్
  మూడు పూవులు, నాఱు కాయలు, ముప్పదాఱగు ముచ్చటల్

  రిప్లయితొలగించండి
 10. ఈడు జోడుగ నున్న భామిని కింటి బాధ్యత నీయగా
  కీడు లేకను పెంచి పిల్లల కీడు వచ్చిన వెంటనే
  కూడి పెండిలి జేసి యొక్కట కూర్మి ప్రేమగ నుండగా
  మూడు పూవులు, నాఱు కాయలు, ముప్పదాఱగు ముచ్చటల్.

  రిప్లయితొలగించండి
 11. కవిమిత్రులకు నమస్కృతులు.
  నా ఆరోగ్య పరిస్థితిలో మార్పు లేదు.
  నా మనవిని మన్నించి మిత్రులు పరస్పర గుణదోష విచారణ చేస్తున్నందుకు ధన్యవాదాలు.
  చక్కని పూరణలు అందించిన కవిమిత్రులు...
  పండిత నేమాని వారికి,
  తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి,
  హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
  గండూరి లక్ష్మినారాయణ గారికి,
  నాగరాజు రవీందర్ గారికి,
  గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
  అభినందనలు... ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 12. కమనీయం గారూ,
  మీకెలా ధన్యవాదాలు తెలపాలో తెలియడం లేదు.. మీ వ్యాఖ్యను ఇంతకు ముందే చూసాను. మీ అబ్బాయిని తప్పకుండా సంప్రదిస్తాను...
  కృతజ్ఞుడను...

  రిప్లయితొలగించండి
 13. ఏడుకొండల వేంకటేశుడు యెల్ల వారిని బ్రోవగన్
  మోడువారిన జీవితాలకు మోసు లెత్తును యాశలే
  బీడు భూముల నీరు పారగ పేద రైతుకు పండుగై
  మూడు పూవులు నారు కాయలు ముప్పదాఱగు ముచ్చటల్!

  రిప్లయితొలగించండి
 14. వేడుకల్ కడు మీరగానహ వేంకటేశుని సన్నిధిన్
  చూడ ముచ్చటి చీరలందున చూపుకందని టెక్కునన్
  ఆడువారలు కూడగా కడు హాయితోడను గాంచుమా
  మూడు పూవులు, నాఱు కాయలు, ముప్పదాఱగు ముచ్చటల్

  రిప్లయితొలగించండి