14, ఏప్రిల్ 2013, ఆదివారం

సమస్యాపూరణం – 1023 (మారుతిని గొల్చువారల)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
మారుతిని గొల్చువారల మతులు చెడును.
ఈ సమస్యను సూచించిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదములు.

28 కామెంట్‌లు:

  1. పూజజేసెద నుపవాస ముందుననుచు
    గొప్ప బలుకుచు నేరికి చెప్పకుండ
    పూరి వడలును యిడ్లీలు పునుగుల పలు
    మారు తిని, గొల్చువారల మతులు చెడును.

    రిప్లయితొలగించండి
  2. కరము వికసించి నైర్మల్య మరయగలవు
    మారుతిని గొల్చువారల మతులు, చెడును
    హృదయమందున్న కలుషంబు, ముదము నిత్య
    మబ్బు ననుమాట నిక్కమీ యవనిలోన.

    రిప్లయితొలగించండి
  3. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ! అద్భుతం!

    రిప్లయితొలగించండి
  4. శ్రీ గోలి హనుమచ్ఛాస్త్రి గారికి
    నమస్కారములు!

    ఏమి మహాద్భుతమైన మ
    హామోఘమునైన విఱుపు! హనుమచ్ఛాస్త్రీ
    జీ! మీ కవితాకౌశలి
    కామోదం బాంధ్రజగతి యనుశాసించున్.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి

  5. సాంత్రో, ఇండికా హ్యుందాయి వచ్చే
    కారులు దేశమున మరిన్ని వెరయిటీ లు వచ్చే
    ఇంకను పాతకాలము వోలె దేహలీ సుజుకీ
    మారుతిని గొల్చువారల మతులు చెడును!!


    జిలేబి!

    రిప్లయితొలగించండి

  6. ఇవ్వాళ గోలీ వారు డబల్ సిక్సర్ కొట్టేరు!

    గోలీ వారి పూరీ 'సుపారీ' కి ఇక సాటి ఏదీ లేదు సుమీ !

    శేహబాష్ గోలీ వారు !


    జిలేబి.

    రిప్లయితొలగించండి
  7. హనుమచ్ఛాస్త్రి గారు,
    ఏమి ఊహ చేసినారండీ!! భలే!

    రామచంద్రు భక్తగణము రామదాసు
    మారుతిని గొల్చు; వారల మతులు చెడును
    చేరకుండగ కాపాడి సిద్ధి గలుగ
    జేయునాతడు నిజముగ చెంత నిలిచి.

    రిప్లయితొలగించండి
  8. బుద్ధి వికసించి పదునగు పూజ సేయ
    మారుతిని , గొల్చు వారల మతులు చెడును
    దుష్ట బుధ్ధుల నెయ్యము నిష్ట పడుచు
    దూ ర ముంచ వలయు గద దుష్టు నెపుడు .

    రిప్లయితొలగించండి
  9. "మారుతిని గొల్చు వారల మతులు చెడును"
    “పతిని సేవించు సతులకు గతులు లేవు"
    “రమను పూజించు వారికి రాదు ధనము"
    వ్యంగ్య భావములను జూపు వాక్కు లివియె

    రిప్లయితొలగించండి
  10. భీతినార్పును రాముండు,ప్రీతి తోడ
    మారుతిని గొల్చు వారల ,మతులు చెడును
    ధర్మ మార్గమ్ము దప్పునధర్మ పరుల
    తలలు పదియున్న ఫలము నిష్ఫలము సుమ్ము !!!

    రిప్లయితొలగించండి
  11. "రుతి" అనగా ధ్వని అని అర్థము.

    మధురమై శ్రుతిపేయమై మంగళమగు
    రుతిని సేవింప హాయిగా మతులు దనరు
    వెర్రి కూతలు రాగాలు వెలయు ఢమఢ
    మా రుతిని గొల్చు వారల మతులు చెడును

    రిప్లయితొలగించండి
  12. గోలి హనుమచ్ఛాస్త్రి గారు!
    మీ "పలుమారు తిని" ప్రయోగాన్ని పలువురికి పలుమారు వినిపించి ఆనందిస్తున్నాను. మీకు నా అభినందన!

    రిప్లయితొలగించండి
  13. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ఏల్చూరి వారు, మిగిలిన కవిమిత్రులు ప్రశంసించినట్లు నిజంగా అద్భుతమైన, అమోఘమైన విరుపు. మంచి పూరణ. అభినందనలు.
    ‘వడలును + ఇడ్లీలు’ అన్నప్పుడు యడాగమం రాదు. అందుకని ‘వడ లిడ్లి గారెలు...’ అందాం.
    *
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
    చక్కని విరుపుతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    జిలేబీ గారూ,
    మీ భావానికి నా పద్యరూపం......

    సాంత్రొ, యిండికా, హ్యుందాయి సార్థకములు
    రకరకములైన కారులు రాజ్యమేల
    నౌర యీ పాతకాలపువైన సుజుకి
    మారుతిని గొల్చువారల మతులు చెడును!
    *
    లక్ష్మీదేవి గారూ,
    సమస్యను విరిచి మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీరూ విరుపునే ఆశ్రయించి చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ వ్యంగ్యవాక్కుల(తో కిట్టించిన) పూరణ బాగుంది. అభినందనలు.
    *
    మంద పీతాంబర్ గారూ,
    ‘తలలు పదియున్న ఫలము నిష్ఫలము సుమ్ము’ అని చెప్పిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    మీ ‘ఢమఢమా రుతి’ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
    *
    డా. ఆచార్య ఫణీంద్ర గారూ,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  14. గోలి వారి పూరణ అదుర్స్! వారికి అభినందనలు.
    ** ** **
    దుష్ట శక్తుల నొందగ త్రుళ్ళి పడుచు
    పుడమి సైతాను ప్రేతాత్మ పూజ చేసి
    వీడి ధైర్య సాహసమిచ్చు విమల వీర
    మారుతిని , గొల్చు వారల మతులు చెడును

    రిప్లయితొలగించండి
  15. కదన మందునీ రారాజు గదను బట్ట
    నిలువ గలడె నా యెదుట యనిలసుతుండు
    స్తుతికిఁ దగునె? యుధిష్టరా! అతి బలుడని
    మారుతిని గొల్చువారల మతులు చెడును

    రిప్లయితొలగించండి
  16. శ్రీయుతులు శంకరార్యులకు,ఏల్చూరి వారికి, ఆచార్య ఫణీంద్ర గారికి,మిస్సన్నగారికి,జిగురు వారికి, సహదేవ్ గారికి మరియు లక్ష్మీ దేవి గారికి, జిలేబి గారికి కవిమిత్రులందరకు ధన్యవాదములు. అంతా మీసాహచర్య పలితమే..
    మాస్టరు గారూ ! చక్కని సవరణ జేసినమీకు కృతజ్ఞతలు.


    పలు మార్లు అనాలేమో ననే అనుమానంతో ఒక మారు మాత్రమే తినిపించుదామని చిన్న సవరణ తో..

    పూజజేసెద నుపవాస ముందుననుచు
    గొప్ప బలుకుచు నేరికి జెప్పకుండ
    పూరి వడలను, బోండాలు పునుగుల నొక
    మారు తిని, గొల్చువారల మతులు చెడును.

    రిప్లయితొలగించండి
  17. జిగురు వారి మరొక మారుతి చాలా బాగున్నాడు.

    రిప్లయితొలగించండి
  18. యశము ధైర్యమ్ము బుద్దియు నాయువులును
    పెరుగు నిజముగ నరులకు వికసితమగు
    మారుతిని గొల్చువారల మతులు, చెడును
    కోతినేమిటి నేనిట్లు గొలుచుటనిన.

    రిప్లయితొలగించండి
  19. ఆత్మ శుద్ధితో నుపవాస ముండి దైవ
    పూజ నొనరించినను బహు పుణ్య మబ్బు
    క్షుత్తు కోర్వక నిండుగా కూడును బలు
    మారు తిని గొల్చు వారల మతులు చెడును.

    రిప్లయితొలగించండి
  20. నమస్కారములు
    శ్రె గోలివారి బోణీ చదివాక ఇక ఏ బాణీ రాసినా దండగే

    రిప్లయితొలగించండి
  21. ఆరు నెలల సావాసము వారు వీరు
    కోరి చేయగ చేష్టలు కోతి వలెను
    మంచి చెడులన్ని మలుగుట కంచు తలచి
    మారుతిని గొల్చు వారల మతులు చెడును

    రిప్లయితొలగించండి
  22. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ ! చక్కని విరుపుతో పూరణ చేశారు. అభినందనలు. ఇన్ని ఆహారపదార్థాలు ఒకేసారి తింటే జీర్ణ వ్యవస్థ కూడ చెడుతుందేమో నని ( సరదాకి) నా అనుమానం.

    రిప్లయితొలగించండి
  23. సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    జిగురు సత్యనారాయణ గారూ,
    మీ పూరణ వైవిధ్యంగా ప్రశంసనీయంగా ఉంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ రెండవ పూరణ కూడా బాగుంది. అభినందనలు.
    మీ మొదటి పూరణ ఇందరి ప్రశంసలు పొందినందుకు ఆనందంగా ఉంది.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
    మొదటి పాదంలో యతి తప్పింది. "ఆత్మ శుద్ధితో నుపవాస మందు నుండి" అందామా?
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  24. ఏమిది పికప్పు! ఏమి మైలేజి! రంగు!
    ఏమి గేరులు! ఏమిది ఏరుకూలు!
    ఏమి కార్బురేటరు! ఏమి ఎంజినోహొ!
    మారుతిని గొల్చువారల మతులు చెడును!!!

    మారుతి = Maruti 800 car
    కొల్చు = Estimate

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. ఏమిది యేమిది యనుచున్
      మా మారుతిని యడుగంగ మాస్టారూ తా
      నేమయ్య జెప్పును సుమీ !
      భీమా వుంటే జిలేబి బిరబిర బోవున్ :)

      జిలేబి

      తొలగించండి